ADVERTISEMENT
home / Astrology
28 ఆగస్టు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

28 ఆగస్టు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 28, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంది. అలాగే స్థిరాస్థులు కొనడానికి కూడా ఈ రోజు చాలా మంచిది. అలాగే ఆఫీసులో ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. అదేవిధంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ కూడదు. ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కోర్టు లావాదేవీలు లేదా ఆస్తి తగదాలు వేగంగా పరిష్కరించబడతాయి. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు రోజువారీ పనిలో నిర్లక్ష్యాన్ని వీడితే మంచిది. అలాగే ఆఫీసులో ఉద్యోగులు ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తారు. ఇలాంటి సమయాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక వ్యాపారస్తులకు ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే మీరు విపత్కర పరిస్థితులలో.. మీ భాగస్వామి సలహాలను పాటించడం శ్రేయస్కరం

మిథునం (Gemini) –  ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగులు ఆఫీసులో పెండింగ్ పనులను పూర్తి చేయడం మంచిది. అదేవిధంగా విద్యార్థులకు క్రీడలు లేదా ప్రత్యమ్నాయ కోర్సుల వైపు ఆసక్తి పెరుగుతుంది. వివాహితులకు తమ ఆర్థిక ఇబ్బందుల నుండి క్రమంగా ఉపశమనం లభిస్తుంది.  సృజనాత్మక కళలు, సినిమా రంగంలోని వ్యక్తులకు కూడా..  ఈ రోజు బాగా కలిసొస్తుంది. 

ADVERTISEMENT

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – ఈ రోజు వ్యాపారస్తులు.. తమ భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆఫీసులో ఉద్యోగులు తమ సామర్థ్యం లేదా నైపుణ్యాలకు పదును పెట్టాలి. మీ క్రియేటివిటీ సత్తా ఏమిటో అధికారులకు చూపించగలగాలి. ఇక ఈ రాశి వ్యక్తులు ఈ రోజు పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే కుటుంబీకులకు సంబంధించి కూడా.. పలు శుభవార్తలు వింటారు. 

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కళలపై అమితమైన ఆసక్తి పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా తమ భాగస్వాములతో ప్రణాళికబద్ధంగా కొన్ని పనులను పూర్తి చేస్తారు. ఆఫీసులో ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులు కూడా పలు శుభవార్తలు వింటారు. 

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు  డబ్బు విషయంలో.. కాస్త నిర్లక్ష్యాన్ని వీడాలి. లేదా  ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే దుబారా ఖర్చులను మానుకోవడం మంచిది. అలాగే ప్రేమికులు అనుకోని చిక్కుల్లో పడే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా చదువు విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాలి. నిరుద్యోగులు ప్రయత్నం చేయకుండా.. ఫలితాలు దక్కవనే సత్యాన్ని నమ్మాలి. 

ADVERTISEMENT

తుల (Libra) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు తమ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీలైనంత ఎక్కువ సేపు కుటుంబంతో గడిపేందుకు ప్రయత్నించాలి. ఆఫీసులో ఉద్యోగులు కొన్ని విషయాలలో లౌక్యంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఇక సృజనాత్మక, సినిమా రంగానికి చెందిన వ్యక్తులకు తమ పనులలో పురోగతి కనిపిస్తుంది. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీ  స్నేహితుల వైఖరి మీకు విచారాన్ని కలిగించవచ్చు. అలాగే మీ బంధువులతో మీకు మనస్పర్థలు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కొత్త పథకాలలో పెట్టుబడి పెట్టే సమయంలో.. నిపుణుల సలహాలు తీసుకోండి. అలాగే వివాహితులు కొన్ని సందర్భాలలో.. తమ భాగస్వామి భావాలను అర్థం చేసుకోండి. అలాగే చట్టపరమైన వివాదాలకు దూరంగా ఉండండి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శారీరక అలసట మిమ్మల్ని కాస్త చికాకుకి గురిచేయవచ్చు. అలాగే గృహ మరమ్మతులు చేయించాలని భావిస్తే.. అందుకు ఇదే సరైన సమయం. ఇక వ్యాపారస్తులు కొత్త ఆదాయ వనరుల గురించి ఆలోచిస్తారు. అలాగే విద్యార్థులకు, నిరుద్యోగులకు తమ తల్లిదండ్రుల నుండి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. 

ADVERTISEMENT

మకరం (Capricorn) –  ఈ రోజు ఈ రాశివ్యక్తులు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తులు కొనడం లేదా విక్రయించే అవకాశం కూడా ఉంది. అలాగే వ్యాపారస్తులు కొత్త బిజినెస్ ప్రణాళికలను రచిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు తమ ఆఫీసులో.. సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి.  వివాహితులు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) – ఈ రోజు ఈ రాశివ్యక్తులకు తమ వివాహానికి సంబంధించిన అవరోధాలు తొలగిపోతాయి. అలాగే ఆఫీసులో ఉద్యోగులకు అధిక ఒత్తిడి ఉంటుంది.  రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు.  పలు వివాదాలు కూడా పరిష్కార దశకు వస్తాయి.  వివాహితులు పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉంటుంది. అదేవిధంగా ఆస్తి లావాదేవీలకు సంబంధించి ఈ రోజు కొన్ని కీలక చర్చలు జరుగుతాయి. రాజకీయ రంగంలోని వ్యక్తులు కూడా ఈ రోజు కొన్ని అనుకోని బాధ్యతలు స్వీకరిస్తారు.అలాగే సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. 

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

27 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT