ADVERTISEMENT
home / Celebrity Life
‘గీత గోవిందం’ హీరోయిన్ రష్మిక మంధాన.. డైట్ సీక్రెట్స్ ఇవే

‘గీత గోవిందం’ హీరోయిన్ రష్మిక మంధాన.. డైట్ సీక్రెట్స్ ఇవే

(Diet Secrets of Actress Rashmika Mandanna)

‘గీతగోవిందం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కొద్ది రోజులకే.. వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మంధాన. డియర్ కామ్రేడ్, దేవదాస్ చిత్రాలతో అలరించిన ఈమె..  ఇటీవలే మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కూడా తనదైన శైలిలో నటించి.. విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ‘భీష్మ’ చిత్రంతో పాటు ‘పొగరు’ అనే కన్నడ చిత్రంలో కూడా నటిస్తోంది రష్మిక. అలాగే సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రానికి కూడా సైన్ చేసింది. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. తన ఆరోగ్య విషయంలో కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటానని ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది రష్మిక. 

‘రష్మిక’ అవకాశాలు వదులుకోవడానికి కారణం.. రెమ్యునరేషనా…?

చిత్రమేంటంటే.. ఒకప్పుడు మాంసాహార ప్రియురాలైన రష్మిక.. ఇటీవలే వెజిటేరియన్‌గా మారిందట. అలాగే ఈ సంవత్సరం నుండి ప్రతీ రోజూ ఓ లీటరు నీళ్లు కచ్చితంగా తాగాలని.. కొత్త రిజల్యూషన్ తీసుకుందట. అలాగే ఈమెకు కూరగాయలు అనేవి అసలు పడవట. ముఖ్యంగా టమోటోలు, బంగాళాదుంపలు తనకు అసలు ఇష్టం ఉండేవి కాదట. అయితే వెజిటేరియన్‌గా మారాక నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నానని తెలిపిందామె. అయితే ఇందులో కూడా తనకు నచ్చని కాయగూరలను పక్కన పెడితే.. చిలకడదుంపలు మొదలైన వాటికే తొలి ప్రాధాన్యాన్ని ఇస్తుందట. 

ADVERTISEMENT

మహేష్ బాబు vs అక్కినేని అఖిల్.. ఈ ఇద్దరిలో రష్మిక ఓటు ఎవరికి?

అలాగే షూటింగ్ సమయాలలో బిజీగా ఉండడం వల్ల.. అప్పుడప్పుడు ప్లాన్ ప్రకారం వెళ్లాల్సి ఉంటుందని కూడా తెలిపింది రష్మిక. అందుకే అన్నిసార్లూ సాయంత్రం పూటే వర్కవుట్లు చేయడం కుదరదని.. అప్పుడప్పుడు ఉదయం పూట కూడా ఎక్సర్‌సైజులు చేస్తానని తెలిపింది రష్మిక. అలాగే వర్కవుట్స్ పూర్తయ్యాక.. కోడిగుడ్లను లేదా కోడిగుడ్లతో చేసిన ఆహారాన్ని తీసుకుంటానని తెలిపింది రష్మిక. అందరూ ఆరోగ్యం విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకోవాలని.. అదే ఎవరికైనా శ్రీరామరక్ష అని సలహా కూడా ఇచ్చేస్తోంది ఈ నవతరపు కథానాయిక. 

రష్మిక తాను గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా.. ఇలాంటి విషయాలను చాలా ప్రస్తావించింది. ముఖ్యంగా ధూమపానం చేసే వ్యక్తులంటే రష్మికకు అసలు ఇష్టం ఉండదట. “సిగరెట్ తాగేవాళ్లు నా చుట్టూ ఉండడం కూడా నేను ఇష్టపడను. ఆ వాసనే నేను భరించలేను. అప్పుడప్పుడూ ఆల్కహాల్ తీసుకునేవాళ్లైతే ఫర్వాలేదు. కానీ ఆల్కహాలిజం (ఎక్కువగా తాగడం) నాకు ఇష్టం ఉండదు. మన ఆరోగ్యాన్ని ఎందుకు చెడగొట్టుకోవాలి.  నాకు కాబోయే భర్తకు ఈ అలవాట్లు ఉండకూడదు” అంటూ తన మనసులోని మాటలను బయటపెట్టింది. 

Images: Instagram.com/Rashmika Mandanna

ADVERTISEMENT

ఈ ముద్దుకు… కథకు సంబంధముంది: ‘డియర్ కామ్రేడ్’ కథానాయిక రష్మిక

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి… అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి                                                                                                                                                                                                                                                                                                        

13 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT