ADVERTISEMENT
home / Diet
పొట్ట దగ్గర కొవ్వు మటుమాయం కావాలా?? అయితే ఈ ఆహారం తినాల్సిందే..!

పొట్ట దగ్గర కొవ్వు మటుమాయం కావాలా?? అయితే ఈ ఆహారం తినాల్సిందే..!

ప్రస్తుతం జీవితంలో మనందరికీ ఉన్న ఏకైక శత్రువు కొవ్వు (Fat). అదీ పొట్ట దగ్గర కనిపిస్తే మరీ ఇబ్బందిగా ఉంటుంది. అందుకే  కొవ్వు పదార్థాలను సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవాలనే ఆలోచనతో.. జిహ్వ చాపల్యాన్ని సైతం పక్కన పెట్టి..  రుచీపచీ లేని ఆహారంతో రోజులు గడిపేస్తుంటాం. అందుకే మన జీవితం ఇటు కొవ్వును తగ్గించడమెలాగో తెలియక, అటు నాలుకపై ఉండే రుచి కళికలను సంతృప్తి పరచడమెలాగో తెలియక.. ఈ రెండింటి మధ్య  ఊగిసలాడుతూ ఉంటుంది.

కొవ్వు కనిపించకుండా.. ఫ్లాట్‌గా ఉండే పొట్ట (tummy) కావాలని చాలా రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాం. అయితే ఈ వ్యాయామాలతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను (Diet) తీసుకుంటూ ఉంటే.. దీర్ఘకాలంలో మీ పొట్ట దగ్గర కొవ్వు చేరకుండా ఉంటుంది.

1. పీచు మంచిదే..

మీ రోజువారి ఆహారానికి తగినంత పీచు చేరిస్తే పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు మాయమైపోతుంది. దీని కోసం కీరా, ముడి ధాన్యాలు వంటివి తీసుకోవడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇది మీ ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేయడంతో పాటు బెల్లీ ఫ్యాట్‌ని కరిగించడం.. మీ బరువును తగ్గించడం వంటి మంచి ఫలితాలను అందిస్తుంది.

belly2

2. అరటితో మేలెంతో..

సాధారణంగా చాలామంది “అరటి పండ్లు తింటే కొవ్వు పెరుగుతుంది. లావుగా తయారవుతాం” అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. అరటి పండ్లు, బంగాళాదుంపల్లాంటి పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు మన శరీరంలో ఎక్కువగా ఉన్న ద్రవాలను బయటకు పంపించేస్తాయి. తద్వారా పొట్టను స్లిమ్‌గా కనిపించేలా చేస్తాయి. బరువును కూడా తగ్గిస్తాయి.

ADVERTISEMENT

3. ఆలివ్ ఆయిల్‌కి మారితే..

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగాలంటే.. వంట కోసం మామూలు నూనెకు బదులుగా ఆలివ్ నూనెను ఉపయోగించాలి. ఇది కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. మనం తీసుకునే క్యాలరీలను కూడా తగ్గిస్తుంది. సూపర్ ఫుడ్ కదా.. అందుకే ప్రయత్నించి చూడండి.

belly4

4. నీళ్లతో కరుగుతుంది..

మీరు రోజంతా ఎక్కువ మోతాదులో నీళ్లు తీసుకోవడం వల్ల మీ శరీరంలో ద్రవాలు నిల్వ ఉండవు. దీని వల్ల పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు దూరమవడమే కాదు.. టాక్సిన్లు కూడా బయటకు వెళ్లిపోతాయి. నీళ్లతో పాటు కొన్ని కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి కూడా తాగుతూ ఉండడం వల్ల బోర్ కొట్టకుండా ఉంటుంది. అంతేకాదు.. మీ శరీరానికి పోషకాలు కూడా అందుతాయి. అయితే లిక్విడ్స్ తాగాలి కదా.. అని కోలాలు, ఆల్కహాల్ వంటివి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

5. నట్స్ తినండి..

బాదం పప్పులు ప్రొటీన్, ఫైబర్‌లతో పాటు పోషకాలకు నిలయాలని ఎన్నో పరిశోధనల్లో తేలింది. అందుకే వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది. అంతేకాదు.. తక్కువ క్యాలరీల్లోనే ఎక్కువ పోషకాలు అందుతాయి. ఇవి కొవ్వు పేరుకుపోవడాన్ని ఆపి దాన్ని శరీరం బయటకు వెళ్లిపోయేలా చేస్తాయట. అందుకే వీటిని తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది. పొట్ట స్లిమ్‌గా, ఫ్లాట్‌గా కనిపిస్తుంది.

belly6

6. యాపిల్ ఓ మంచి పిల్..

“యాపిల్ ఎ డే.. కీప్స్ డాక్టర్ అవే” అనేది ఓ ఇంగ్లిష్ సామెత. కానీ నిజంగానే యాపిల్ మంచి పిల్ లాంటిది. ఇది పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించి దాన్ని స్లిమ్‌గా.. ఫ్లాట్ గా కనిపించేలా చేస్తుంది. యాపిల్ తీసుకోవడం వల్ల మన పొట్ట నిండినట్లు అనిపించడంతో.. అందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కొవ్వు కరుగుతుంది. యాపిల్ ద్వారా అందే క్యాలరీల కంటే.. దాన్ని అరిగించడానికి మన శరీరానికి అవసరమయ్యే క్యాలరీలు ఎక్కువ. అంటే దీన్ని తినడం కూడా ఓ వ్యాయామం లాంటిదే అన్నమాట.

ADVERTISEMENT

7. ఆకుతో కొవ్వు దూరం..

ఆకుకూరల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పాలకూర, బచ్చలి, బ్రొకోలీ వంటి పచ్చని ఆకుకూరలు తీసుకోవడం వల్ల కార్బొహైడ్రేట్లు, పీచు పదార్థం వంటివి మన శరీరానికి అందుతాయి. అవి  బరువును అదుపులో ఉంచడానికి దోహదపడతాయి. దీని వల్ల పొట్ట చుట్టూ కొవ్వు కూడా పేరుకుపోకుండా ఉంటుంది. కాబట్టి ఆకుకూరల సలాడ్‌ని మీ భోజనంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది.

belly8

8. గ్రీన్ టీతో..

గ్రీన్ టీ తాగడం వల్ల మన శరీరపు మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. బరువు తగ్గడాన్ని ఇది వేగవంతం చేస్తుంది. అంతేకాదు.. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మన శరీరం కొవ్వును పీల్చుకోవడాన్ని అడ్డుకునేటట్లు చేస్తయట. అంతేకాదు.. ఇది మెరిసే చర్మాన్ని కూడా అందిస్తుంది. అందుకే గ్రీన్ టీని తాగాలి. దీన్ని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు సైతం మనకు అందుతాయి.

9. సాల్మన్ కొవ్వుకు సొల్యూషన్

మీ శరీరంలోని కొవ్వును వదిలించుకోవడాని..కి మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి సాల్మన్ చేపని డైట్‌లో చేర్చుకోండి. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఫ్యాటీ ఫిష్‌ని తినడం వల్ల కొవ్వు పెరగదు సరికదా.. శరీరంలో ఉన్న కొవ్వుని ఇది ఇట్టే కరిగిస్తుంది. అందుకే మన ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవడం చాలా మంచిది.

belly 10

10. వెరీ గుడ్డు..

ఫ్లాట్‌గా ఉండే పొట్ట కావాలంటే.. మన ఆహారంలో కార్బొహైడ్రేట్లను తక్కువ చేసి ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్లను అందించేందుకు గుడ్డు చాలా ముఖ్యమైంది. వీటిని తినడం వల్ల కొన్ని గంటల పాటు ఆకలి వేయదు. కాబట్టి బరువు కూడా తగ్గే వీలుంటుందట. కడుపు నిండుగా ఉన్నప్పుడు.. కొవ్వును పెంచే ఆహారం తినాలనిపించదు. అందుకే గుడ్డును మీ ఆహారంలో భాగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి.

ఈసారి ఎవ‌రైనా బ‌రువు పెరిగావ‌ని చెబితే.. వారికి ధీటుగా బ‌దులివ్వండిలా..!

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెరగాలంటే.. ఇలా ప్ర‌య‌త్నించి చూడండి.. !

ప్ర‌పంచ సుంద‌రి ఫిట్‌నెస్ రహస్యాలేమిటో మీకు తెలుసా?

ADVERTISEMENT
24 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT