ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ప్రేమ వివాహం.. పెద్దలు కుదిర్చిన వివాహం.. సెక్స్ విషయంలో  ఏది బెటర్?

ప్రేమ వివాహం.. పెద్దలు కుదిర్చిన వివాహం.. సెక్స్ విషయంలో ఏది బెటర్?

సెక్స్ (sex).. దీని గురించి తెలుసుకోవాలని ఇష్టపడని వ్యక్తులు చాలా తక్కువ మందే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా సెక్స్ లో పాల్గొనని వాళ్లు, పెళ్లి కాని వారు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారంటే అతిశయోక్తి కాదు. అనుభవం వల్ల సెక్స్ గురించి అంతా తెలుస్తుందంటే అది అస్సలు నిజం కాదు. అరవై సంవత్సరాలు వచ్చినా సెక్స్ గురించి కొత్తగా తెలుసుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుందని చెప్పవచ్చు. అయితే సెక్స్ విషయంలో పెళ్లికి ఎంత ప్రాముఖ్యం ఉంటుంది? పెద్దలు కుదిర్చిన వివాహం (arranged marriage), ప్రేమ వివాహం (love marriage) ఈ రెండింటి మధ్య సెక్స్ విషయంలో ఏ మార్పులు కనిపిస్తాయి. దీని గురించి ఎంతో మంది అమ్మాయిల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు తెలిశాయి. ఆ విశేషాలు. మీకోసం..

దానిపై ఇష్టంతోనే..

సెక్స్ లో ఆనందంగా పాల్గొనడానికి అది ప్రేమ వివాహం లేదా పెద్దలు కుదిర్చిన వివాహం ఏదైనా ఫర్వాలేదు కానీ ఇద్దరికీ సెక్స్ పట్ల ఆసక్తి ఉంటే చాలు అని నిధి చెప్పుకొచ్చారు. సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండడం.. తమ సెక్స్ ని ఆనందంగా ఎంజాయ్ చేయగలగడం వంటివి తప్ప పెళ్లి ఎలా జరిగిందన్న దానిపై సెక్స్ లో ఆనందం ఆధారపడి ఉండదు.

కెమిస్ట్రీ ఉంటే చాలు..

ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే అమ్మాయి ప్రేమ పెళ్లి తో పోల్చితే పెద్దలు కుదిర్చిన పెళ్లి లో సెక్స్ చాలా గాఢంగా.. ఆనందంగా ఉంటుందని వెల్లడించింది. దానికి వ్యతిరేకంగా కూడా అయి ఉండొచ్చు. అయితే అది ఇద్దరు వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. ఇద్దరు వ్యక్తుల మధ్య మంచి కెమిస్ట్రీ ఉండి ఇద్దరూ మానసికంగా దగ్గరైతే శారీరకంగా దగ్గరైనప్పుడు ఆనందం సొంతం అవుతుందని చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT

నెమ్మదిగా పెరుగుతుంది..

పీజీ విద్యార్థిని లీనా అభిప్రాయం ప్రకారం ప్రేమ వివాహం లో మీకు , మీ భాగస్వామి కి ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిసే వీలుంటుంది. అంతేకాదు.. పెళ్లి కి ముందు సెక్స్ కూడా ప్రయత్నించి ఉంటారు. అదే పెద్దలు కుదిర్చిన వివాహంలో ఒకరి గురించి మరొకరికి పెద్దగా తెలీదు. పెళ్లి అయిన తర్వాత కొద్దిగా ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటూ ఉంటారు. సెక్స్ విషయంలోనూ మొదట చాలా నెమ్మదిగా సాగినా నెమ్మదిగా ఇద్దరూ దగ్గరవుతారు కాబట్టి సెక్స్ జీవితం కూడా అద్భుతంగా సాగుతుంది.

అర్థం చేసుకోవడం ముఖ్యం.

ప్రీతి విజయ్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ సెక్స్ అనేది సెక్స్ లాగే ఉంటుంది. అది ప్రేమ వివాహం లేదా పెద్దలు కుదిర్చిన వివాహం అనే తేడా దానికి ఉండదు. అయితే ఒకరినొకరు అర్థం చేసుకోవడం.. ఒకరి శరీరాన్ని ఒకరు అర్థం చేసుకోవడం.. వారి ఫీలింగ్స్ ని వారి అవసరాలను గుర్తించడం వంటివి అవసరం అని చెప్పుకొచ్చింది.

ఇవే కాదు.. చాలామంది అమ్మాయిలతో మాట్లాడిన తర్వాత పెద్దలు కుదిర్చిన వివాహం, ప్రేమ వివాహం మధ్య సెక్స్ విషయంలో ఉండే మార్పులు కొన్ని మేం గుర్తించాం. అవేంటంటే..

ADVERTISEMENT

ప్రేమ వివాహంలో సెక్స్

1. పెళ్లికి ముందే సెక్స్ ప్రయత్నించి ఉంటారు కాబట్టి ఫన్ గా అనిపించినా ప్రొటెక్షన్ తప్పక వాడతారు.
2. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు కాబట్టి మూడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
3. ఒకరు సెక్స్ కోరుకుంటున్నారని ఎదుటివారికి తెలిసిపోతుంది.
4. పెద్దలు కుదిర్చిన వివాహం కంటే సెక్స్ విషయంలో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
5. ఇష్టం లేనప్పుడు అమ్మాయిలు స్వేచ్ఛగా నో చెప్పగలరు.
6. సెక్స్ గురించి ఇద్దరూ కలిసి చాలా ఓపెన్ గా మాట్లాడుకోగలరు.
7. అడ్వెంచర్ సెక్స్ కూడా జరుగుతుంది.
8. పెళ్లికి ముందే సెక్స్ జరిగినా సమాజం దాన్ని ఒప్పుకోదు కాబట్టి రహస్యంగా జరుపుకోవడానికి ఆసక్తి చూపుతారు.

పెద్దలు కుదిర్చిన వివాహం లో సెక్స్

1. కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు.. ఒకరి అవసరాలు మరొకరు గుర్తించి దాన్ని తీర్చాల్సిన బాధ్యతతో చేయడం జరుగుతుంది.
2. కౌగిలింతలు ఫోర్ ప్లే, అర్థ రాత్రి వరకూ భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం వంటివి ముందు ఎక్కువగా జరుగుతాయి. ఆర్గాజమ్ కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత అందుతుంది.
3. ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే బంధం అన్ని వేళలా సమస్యలాగే అనిపిస్తుంది.
4. సెక్స్ రహస్యంగా జరిగినా.. అది రహస్యం కాదు కాబట్టి కండోమ్ ఉపయోగించకపోయినా ఫర్వాలేదు.
5. సెక్స్ గురించి కొన్ని నెలలు పూర్తయ్యే వరకూ ఇద్దరూ అంత ఫ్రీగా మాట్లాడుకోలేరు.
6. ఒక్కోసారి ఇష్టం లేకపోయినా ఎదుటివాళ్ల ఆనందం కోసం సరే అనాల్సి రావచ్చు.
7. అరేంజ్డ్ మ్యారేజ్ మొదట్లో భర్త కు ఎక్కువ పవర్ ఉంటుంది. అయితే అది కొన్ని రోజులు మాత్రమే.
8. ఇద్దరి మధ్య ప్రేమ మాత్రమే ఉంటుంది కాబట్టి కొత్తగా ప్రయత్నించడానికి కొన్ని నెలలు పడుతుంది.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

31 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT