ADVERTISEMENT
home / సౌందర్యం
స్ట్రెయిటెనింగ్‌, స్మూతెనింగ్‌తో.. జుట్టును స్టైలిష్‌గా మార్చుకుందాం.. (Hair Straightening And Smoothening In Telugu)

స్ట్రెయిటెనింగ్‌, స్మూతెనింగ్‌తో.. జుట్టును స్టైలిష్‌గా మార్చుకుందాం.. (Hair Straightening And Smoothening In Telugu)

మీ జుట్టు చిక్కులు లేకుండా.. అందంగా ఉండాలంటే.. అది మృదువుగా, మానేజ్‌ చేయ‌గ‌లిగేలా ఉండాల్సిందే. ఇందుకోసం ఉప‌యోగ‌ప‌డేదే స్ట్రెయిటెనింగ్‌(Hair straightening).. 1950ల్లో పాపుల‌ర్ అయిన ఈ ట్రెండ్ ఇప్ప‌టికీ చాలామందికి న‌చ్చిన స్టైల్‌గా చెప్పుకోవ‌చ్చు. దీన్ని చేయ‌డానికి హాట్ కోంబ్‌, హెయిర్ ఐర‌న్‌, కెమిక‌ల్ రిలాక్స‌ర్స్‌, బ్లో డ్ర‌య‌ర్ స్టైలింగ్‌, రోల‌ర్ సెట్‌, బ్రెజిలియ‌న్ హెయిర్ స్ట్రెయిటెనింగ్ వంటి ప‌ద్ద‌తులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని రకాల షాంపూలు, కండిష‌న‌ర్స్‌, హెయిర్ జెల్స్‌, సీర‌మ్స్ వంటివి కూడా జుట్టును తాత్కాలికంగా స్ట్రెయిటెనింగ్ చేసేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

జుట్టును తాత్కాలికంగా స్ట్రెయిటెన్ చేసేందుకు పద్ధ‌తులు 

జుట్టుకు మృదుత్వం అందించేందుకు.. 

మీ కోసం మంచి హెయిర్ ప్రొటెక్టింగ్ స్ప్రే 

ADVERTISEMENT

హెయిర్ స్మూతెనింగ్‌ 

కెరాటిన్ ట్రీట్‌మెంట్‌ 

బ్రెజిలియ‌న్ హెయిర్ ట్రీట్‌మెంట్‌ 

 

straight2

జుట్టును తాత్కాలికంగా స్ట్రెయిటెన్ చేసేందుకు పద్ధ‌తులు (Methods for Temporarily Straight Hair)

మీరు ఉంటున్న ప్ర‌దేశంలో వాతావ‌ర‌ణంలో తేమ శాతం ఎక్కువ‌గా ఉంటుందా? లేదా మీ జుట్టు ఎప్పుడూ పొడిగా, చిక్కులు ప‌డి.. దువ్వినా.. లేక‌పోయినా ఒకే ర‌కంగా ఉంటుందా? త‌ల‌స్నానం చేసిన త‌ర్వాత ఒక రోజు లేదా కొన్ని గంట‌ల పాటు జుట్టు చ‌క్క‌గా, మృదువుగా ఉన్నా.. ఆ త‌ర్వాత తిరిగి య‌థావిధిగా మారిపోతోందా?

ADVERTISEMENT

అయితే మీరు మీ జుట్టును స్ట్రెయిటెన్ చేసుకొని కాస్త అందంగా త‌యారవ్వ‌చ్చు. అలాగ‌ని స్ట్రెయిటెనింగ్ కోసం హీటింగ్ టూల్స్ ఉప‌యోగిస్తే మాత్రం మీ జుట్టు మరింత దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంది. దీర్ఘ‌కాలంలో మ‌రింత పొడిగా, జీవం లేన‌ట్లుగా తయార‌వుతుంది. అందుకే హెయిర్ స్ట్రెయిటెనింగ్ షాంపూలు దీనికి స‌రైన ఎంపిక‌.

మీకోసం మేం ఎంపిక చేసిన అద్భుత‌మైన హెయిర్ స్ట్రెయిటెనింగ్ షాంపూలు ఇవి.. (Hair Straightning Shampoo)

ట్రెసెమే కెరాటిన్ స్మూత్ విత్ ఆర్గాన్ ఆయిల్ షాంపూ (రూ.410)
సెలూన్ ట్రీట్‌మెంట్ త‌ర్వాత జుట్టుకు ల‌భించే మృదుత్వం, స్ట్రెయిట్ నెస్ పొందేలా చ‌క్క‌గా రూపొందిందీ షాంపూ. ఇందులో స‌ల్ఫైట్లు చాలా తక్కువ‌గా ఉంటాయి. అంతేకాదు.. ఇందులోని కెరాటిన్ జుట్టు ప్ర‌తి వెంట్రుక‌ను ఆరోగ్యంగా మారుస్తుంది. పొడిబారిపోతున్న జుట్టును తిరిగి ఆరోగ్యంగా మార్చి, స్ట్రెయిట్‌గా మారుస్తుంది. దీనివ‌ల్ల ఏ స్టైలింగ్ చేసినా జుట్టు అందంగా క‌నిపిస్తుంది.

ట్రెసెమే స్మూత్ విత్ ఆర్గాన్ ఆయిల్ కండిష‌న‌ర్ (రూ. 220)
ట్రెసెమే కెరాటిన్ స్మూత్ విత్ ఆర్గాన్ ఆయిల్ షాంపూతో పాటు ఉప‌యోగించేందుకు ఇది చ‌క్క‌టి ఎంపిక‌. ఈ రెండింటిని క‌లిపి వాడితే చాలు.. పార్ల‌ర్ ట్రీట్మెంట్ తీసుకున్న‌ట్లుగా జుట్టు సిల్కీగా మారుతుంది.

straight3

హెయిర్ స్ట్రెయిటెనింగ్ క్రీమ్‌ (Hair Straightening Cream)

స్ట్రెయిట్ అండ్ స్మూత్ హెయిర్ కావాల‌నుకున్నా.. ఫ్లాట్ ఐర‌న్ వ‌ల్ల వేడితో జుట్టును పాడుచేసుకోవ‌డం ఇష్టం లేని వారికి చ‌క్క‌టి ఎంపిక ఈ హెయిర్ స్ట్రెయిటెనింగ్ క్రీమ్‌లు. వీటివ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు ఉండ‌వు. అంతేకాదు దీన్ని ఉప‌యోగించ‌డం కూడా చాలా సులువు. ఎలా ఉప‌యోగించాలో మీకు తెలియ‌క‌పోతే ఓసారి ఉప‌యోగించే ప‌ద్ధ‌తిని చూసేయండి.

ADVERTISEMENT

1. మొద‌ట్లో చాలా త‌క్కువ మోతాదులో ఈ క్రీమ్ ని తీసుకొని ఉప‌యోగిస్తున్న కొద్దీ మోతాదును పెంచుకోవ‌చ్చు.
2. జుట్టు కుదుళ్ల నుంచి ప్రారంభించి మ‌ధ్య‌లో వేళ్లు పోనిస్తూ అంచుల వ‌ర‌కూ క్రీమ్‌ని అప్లై చేసుకోవాలి. మీ జుట్టు లావుగా ఉంటే రెండు, మూడు పాయ‌లుగా విడ‌దీసి విడివిడిగా పెట్టుకోవ‌డం మంచిది.
3. ఆ త‌ర్వాత వెడ‌ల్పాటి ప‌ళ్లున్న దువ్వెన‌తో జుట్టును నెమ్మ‌దిగా దువ్వుకోవాలి. దీనివ‌ల్ల క్రీమ్ జుట్టు మొత్తానికి అంటుకుంటుంది.
4. ఇప్పుడు జుట్టును నాలుగైదు భాగాలుగా చేసి పెట్టుకోవాలి. ఒక్కోభాగాన్ని రౌండ్ బ్ర‌ష్ సాయంతో దువ్వుకుంటూ హెయిర్ డ్ర‌య‌ర్ అప్లై చేయాలి. ఈ క్రీమ్ కొద్దిగా వేడి త‌గ‌ల‌గానే యాక్టివేట్ అవుతుంది కాబ‌ట్టి కొద్దిగా దువ్వ‌గానే జుట్టు స్ట్రెయిట్‌గా తయార‌వుతుంది. ఇలా చిక్కులు లేకుండా జుట్టు మొత్తం మృదువుగా మారే వ‌ర‌కూ చేసుకుంటే స‌రి.

మీ కోసం చ‌క్క‌టి స్ట్రెయిటెనింగ్ క్రీమ్స్‌ (Hair Straightening creams)

మ్యాట్రిక్స్ ఆప్టి స్ట్రెయిట్ (రూ.1250)
ఇది మార్కెట్లోని అత్యుత్త‌మ స్ట్రెయిటెనింగ్ క్రీమ్స్‌లో ఒక‌టి. ఇది జుట్టుకి మంచి షైనింగ్‌ని అందించ‌డంతో పాటు స‌హ‌జ‌సిద్ధ‌మైన నూనెల‌ను ఏమాత్రం తొల‌గించ‌దు. దీనివ‌ల్ల మీరు గ్లామ‌ర‌స్‌గా క‌నిపించ‌డ‌మే కాదు.. అద్భుతంగా మెరుస్తారు కూడా. పైగా ఇందులో ప‌రిమ‌ళం కూడా ఉంటుంది కాబ‌ట్టి డ్ర‌య‌ర్ వ‌ల్ల జుట్టు వేడై విడుద‌ల‌య్యే వాస‌న‌ను కూడా జుట్టుకు దూరంగా ఉంచుతుంది.

లోరియాల్ ప్యారిస్ స్టూడియో లైన్ హాట్ & స్ట్రెయిట్ క్రీమ్‌(రూ. 950)
ఇది కూడా జుట్టును మృదువుగా ప‌ట్టులా మార్చ‌డంతో పాటు స్ట్రెయిటెన్ చేస్తుంది. అయితే మీకు కెమిక‌ల్స్ ఉన్న క్రీమ్‌లు వాడ‌డం కూడా ఇష్టం లేక‌పోతే ఇంట్లో ల‌భించే ఉత్ప‌త్తుల‌తోనే జుట్టును స్ట్రెయిటెన్ చేసుకోవ‌డం ఎలాగో తెలుసుకుందాం.

జుట్టుకు మృదుత్వం అందించేందుకు.. (Hair Smoothening)

ముందుగా రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ‌ర‌సం, మూడు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ క‌లుపుకోవాలి. ఆపై ఒక ప్యాన్‌లో ఆలివ్ నూనె, కొబ్బ‌రిపాలు పోసి క‌లుపుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మ‌ర‌సం మిశ్ర‌మాన్ని కూడా దీనికి క‌లుపుకొని పేస్ట్‌లా త‌యారుచేసుకోవాలి. మంచి స్ట్రెయిటెనింగ్ షాంపూ ఉప‌యోగించి త‌ల‌స్నానం చేసి.. ఆపై జుట్టు ఆరిన తర్వాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు ప‌ట్టించాలి. జుట్టుకు ష‌వ‌ర్ క్యాప్ పెట్టి రెండు గంట‌ల పాటు అలాగే ఉంచుకోవాలి.

ADVERTISEMENT

ఆపై తిరిగి మంచి స్ట్రెయిటెనింగ్ షాంపూతో త‌ల‌స్నానం చేసి కండిష‌న‌ర్ అప్లై చేసుకోవాలి. మీ జుట్టు సిల్కీగా మార‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. మంచి ఫ‌లితాల కోసం ఈ మిశ్ర‌మాన్ని వారానికి రెండుసార్లు జుట్టుకు అప్లై చేయండి. కొన్ని రోజుల్లోనే స్ట్రెయిట్ అండ్ సిల్కీ జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు.

జుట్టు రాల‌డాన్నీ అరిక‌ట్టేలా.. (For avoiding Hair Loss)

స్ట్రెయిటెనింగ్‌తో పాటు జుట్టు రాలే స‌మ‌స్య‌ను కూడా అరిక‌ట్టాలంటే ఈ వంటింటి చిట్కాను పాటించాల్సిందే. దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల కొబ్బ‌రి నూనె, క‌ప్పు కొబ్బ‌రి పాలు క‌లిపి పెట్టుకోవాలి. మ‌రో బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల చొప్పున జెలాటిన్ పౌడ‌ర్‌, కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఈ ప‌దార్థాల‌న్నింటినీ క‌లుపుకోవాలి. మిశ్ర‌మం చిక్క‌బ‌డేవ‌ర‌కూ వేడిచేయాలి. చిక్క‌బ‌డ్డాక కింద‌కు దింపి రెండు టీస్పూన్ల చొప్పున నిమ్మ‌ర‌సం, తేనె అందులో క‌లుపుకోవాలి. ఇప్పుడు జుట్టును నాలుగైదు భాగాలుగా చేసుకొని ఈ మిశ్ర‌మాన్ని అప్లై చేసుకోవాలి.

అప్లై చేస్తూ జుట్టును కాస్త లాగుతూ ఉండ‌డం వ‌ల్ల అవి స్ట్రెయిట్‌గా త‌యార‌య్యే అవ‌కాశం ఉంటుంది. ఆ త‌ర్వాత అర‌గంట పాటు అలాగే ఉంచుకొని చ‌ల్ల‌ని నీటితో క‌డిగేసుకోవాలి. షాంపూ పెట్ట‌కూడ‌దు కానీ నీటితో క‌డిగిన త‌ర్వాత కండిష‌న‌ర్ అప్లై చేసుకోవాలి. కండిష‌న‌ర్ అప్లై చేసిన ఐదు నుంచి ప‌ది నిమిషాల త‌ర్వాత జుట్టును తిరిగి చ‌న్నీళ్ల‌తో క‌డిగేయాలి. ఆపై జుట్టును స‌హ‌జంగా ఆర‌నివ్వాలి. వారంలో ఇలా రెండు మూడుసార్లు చేయ‌డం వ‌ల్ల ఈ మిశ్ర‌మం జుట్టులోకి బాగా వెళ్తుంది. అయితే ఇలా చేస్తున్న‌ప్పుడు షాంపూ మాత్రం ఉప‌యోగించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాల్సి ఉంటుంది.

straight4

బ్లో డ్ర‌య‌ర్‌ (Blow Drier)

మీకు సిల్కీ స్ట్రెయిట్ జుట్టు ఇష్ట‌మైనా.. దాని వల్ల మీ జుట్టు స‌న్న‌గా మారుతుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నారా? అయితే మీరు బ్లో డ్ర‌య‌ర్ వాడాల్సిందే. ఇది జుట్టును ఒత్తుగా క‌నిపించేలా చేస్తుంది. అయితే దీనికి కాస్త ఎక్కువ స‌మ‌యం పడుతుంది. అంతేకాదు.. బ్లో డ్ర‌యర్‌ని ఎలా ప‌ట్టుకోవాలి. ఎలా బ్లో డ్రై చేయాల‌న్నది కాస్త ప్రాక్టీస్‌తోనే సాధ్య‌మ‌వుతుంది.

ADVERTISEMENT

ఇది మీ జుట్టులో మ‌రింత జీవాన్ని పెంచుతుంది కాబట్టి ఐర‌నింగ్ చేసిన‌ట్లు కాకుండా జుట్టు స‌హ‌జంగానే స్ట్రెయిట్‌గా క‌నిపిస్తుంది. స్ట్రెయిటెనింగ్ షాంపూతో త‌ల‌స్నానం చేసిన త‌ర్వాత దీన్ని ఉపయోగిస్తే మ‌రీ మంచిది.

మీకోసం చ‌క్క‌టి బ్లో డ్ర‌యర్స్‌ (Best Blow Dryers)

వెగా ప్రో ట‌చ్ వీహెచ్‌డీపీ- 02 హెయిర్ డ్ర‌య‌ర్ (రూ.2499)
రోజూ సెలూన్‌లాంటి ఫినిషింగ్ కావాలంటే ఈ హెయిర్ డ్ర‌య‌ర్‌ని ఇంటికి తెచ్చుకోవాల్సిందే. ఈ ప్ర‌త్యేక నాజిల్ మీ జుట్టును స్ట్రెయిటెన్ చేయ‌డానికి తోడ్ప‌డుతుంది. చ‌క్క‌గా ఒక డైరెక్ష‌న్‌లో దువ్వితే స‌రి. బాగా వేడెక్కితే ఇది ఆటోమెటిక్‌గా ఆఫ్ అయిపోతుంది.

ఫిలిప్స్ హెచ్‌పీ8100/46 హెయిర్ డ్ర‌య‌ర్ (రూ.799)
మీరు బ‌డ్జెట్‌లో మంచి హెయిర్ డ్ర‌య‌ర్ కావాల‌నుకుంటే ఇది మీకు చ‌క్క‌టి ఎంపిక‌. ఫిలిప్స్ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీలో ఉత్త‌మ‌మైన బ్రాండ్ కాబ‌ట్టి ఈ డ్ర‌య‌ర్ ఉత్త‌మ‌మైన‌ద‌ని చెప్పుకోవ‌చ్చు. ఇది 1.5 మీట‌ర్ల వైర్‌తో రావ‌డం వ‌ల్ల ప్ల‌గ్ సాకెట్ దూరంగా ఉన్నా ఉప‌యోగించ‌వ‌చ్చు. దీనికి రెండు సంవ‌త్స‌రాల వారంటీ కూడా ఉంది కాబ‌ట్టి మీ డ‌బ్బు గురించి మ‌ళ్లీ ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

straight5

స్ట్రెయిటెనింగ్ ఐర‌న్‌ (Straightening Iron)

ఫ్లాట్ ఐర‌న్ మీ జుట్టును స్ట్రెయిట్‌గా చేస్తుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇంత‌కు ముందు ఇవి మెట‌ల్ ప్లేట్స్‌తో తయార‌య్యేవి కాబ‌ట్టి వాటివ‌ల్ల జుట్టు పాడ‌య్యేది. కానీ ఇప్పుడు టైటానియం, సెరామిక్, టౌర్మ‌లిన్ తో త‌యారైన ప్లేట్ల వ‌ల్ల జుట్టు ఏమాత్రం పాడ‌వ్వ‌ట్లేదు స‌రిక‌దా.. అందులో తేమ కూడా ఏమాత్రం త‌గ్గ‌ట్లేదు.

ADVERTISEMENT

ఐర‌న్ చేయ‌డం వ‌ల్ల జుట్టు పాడ‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉన్నా.. అలా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే స‌రిపోతుంది. మీ జుట్టు ఎంత రింగులుగా ఉన్నా స‌రే.. ఈ ఐర‌నింగ్ వ‌ల్ల అవి స్ట్రెయిట్ అండ్ సిల్కీగా త‌యార‌వుతాయి. మ‌ళ్లీ త‌ల‌స్నానం చేసే వ‌ర‌కూ అలాగే ఉంటాయి. మీరు జుట్టు స‌న్న‌గా క‌నిపించ‌కూడ‌దు అనుకుంటే పాయ‌లుగా చేసుకొని ఐర‌నింగ్ చేసుకోవాలి. స్ట్రెయిటెనింగ్ షాంపూ, కండిష‌న‌ర్‌తో పాటు దీన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌రింత మంచి ఫ‌లితాన్ని పొంద‌వ‌చ్చు.

మీకోసం మంచి హెయిర్ స్ట్రెయిటెనర్స్‌ (Good Hair Straighteners)

కొరియోలిస్ స్కిన్ బేర్ హెయిర్ స్ట్రెయిటెన‌ర్ (రూ.5999)
ఇది అన్నింటికంటే అద్భుత‌మైన స్ట్రెయిటెన‌ర్‌. వివిధ ఉష్ణోగ్ర‌త‌ల‌ను అడ్జ‌స్ట్ చేయ‌డానికి వీలు క‌ల్పిస్తూ మీరు అందంగా సిద్ధ‌మ‌య్యేందుకు తోడ్ప‌డుతుంది.

straight6

హెయిర్ స్ట్రెయిటెనింగ్ బ్ర‌ష్‌ (Hair Straightening Brush)

ఇది కూడా అచ్చం స్ట్రెయిటెన‌ర్‌లాగే ప‌నిచేస్తుంది. మీ జుట్టును చ‌క్క‌గా మారుస్తుంది. అయితే ఇది సాధార‌ణ‌ స్ట్రెయిటెనర్ కంటే సులువుగా ప‌నిచేస్తుంది. చిక్కుల జుట్టు ఉన్న‌ప్పుడు అటు దువ్వెన‌తో పాటు ఇటు స్ట్రెయిటెన‌ర్ ప‌ట్టుకొని జుట్టును స్ట్రెయిటెన్ చేసుకోవ‌డం చాలా క‌ష్టంగా ఉంటుంది అలాంటివారికి ఇది చ‌క్క‌టి ఎంపిక‌. రెండింటి ప‌నిని ఇదొక్క‌టే చేసేస్తుంది.

మీకోసం మంచి స్ట్రెయిటెనింగ్ బ్ర‌ష్‌ (Straightening Brush For You)

కొరియోల‌స్ ట్రావెల్ హాట్ బ్ర‌ష్ – బ్లాక్ (రూ.1999)
స్ట్రెయిటెనింగ్ ఉత్ప‌త్తుల‌ను అత్యుత్త‌మంగా త‌యారుచేసే సంస్థ కొరియోలిస్‌. ఈ దువ్వెన చిన్న‌గా ఉండ‌డంతో పాటు ఉష్ణోగ్ర‌త‌ను సెట్ చేసుకునే వీలుండ‌డంతో ఎక్క‌డికి వెళ్లినా దీన్ని బ్యాగ్‌లో వేసుకుంటే చాలు.. చ‌క్క‌టి హెయిర్‌స్టైల్ సొంతం అవుతుంది. దీని హీట్ ప్రొటెక్టింగ్ బ్రిజిల్స్ వ‌ల్ల జుట్టు ఎక్కువ‌గా డ్యామేజ్‌ కాకుండా ఉంటుంది.

ADVERTISEMENT

అయితే బ్లో డ్ర‌యర్‌, స్ట్రెయిటెనింగ్ బ్ర‌ష్‌, లేదా స్ట్రెయిటెన‌ర్‌.. ఇలా ఏది ఉప‌యోగించినా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మీ జుట్టు కాస్త త‌డిగా ఉన్న‌ప్పుడే హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే కొట్టుకోవ‌డం మర్చిపోవ‌ద్దు. ఇది మీ జుట్టును డ్యామేజ్ నుంచి కాపాడుతుంది.

మీ కోసం మంచి హెయిర్ ప్రొటెక్టింగ్ స్ప్రే (Hair Protecting Spray)

టోనీ&గ‌య్ హీట్ ప్రొటెక్ష‌న్ మిస్ట్ – హై టెంప‌రేచ‌ర్ ప్రొటెక్ష‌న్‌
త‌ల‌స్నానం చేసిన త‌ర్వాత ట‌వ‌ల్‌తో జుట్టును బాగా తుడుచుకొని ఈ స్ప్రేని ఉప‌యోగించాలి. ఆ త‌ర్వాత జుట్టును వేళ్లు లేదా వెడ‌ల్పాటి ప‌ళ్లున్న దువ్వెన‌తో దువ్వుకోవ‌డం వ‌ల్ల జుట్టును వేడి నుంచి ర‌క్షించుకోవ‌డానికి వీలుంటుంది.

Best heat protection spray

straight7

శాశ్వ‌తంగా నిలిచే హెయిర్ స్ట్రెయిటెనింగ్, రీబాండింగ్ చేయ‌డం ఎలా? (How To Rebond Your Hair)

ఇది కెమిక‌ల్స్ ఉపయోగించి మీ జుట్టును స్ట్రెయిటెనింగ్ చేసే ప‌ద్ద‌తి. ఇది శాశ్వ‌తం అని చెబుతారు కానీ పూర్తిగా శాశ్వ‌తం కాదు. మీ జుట్టు పూర్తిగా పెరిగే వ‌ర‌కూ మాత్ర‌మే ఉంటుంది. కాబ‌ట్టి ఇది ఎక్కువ కాలం ఉండే స్ట్రెయిటెనింగ్ అని చెప్పుకోవ‌చ్చు.

ADVERTISEMENT

అయితే ఇలా కెమిక‌ల్స్ ఉప‌యోగించ‌డం వ‌ల్ల మీ జుట్టు కొంత‌కాలానికే చిక్కులు ప‌డి పొడిగా, జీవం లేన‌ట్లుగా మారి తెగిపోయే ప్ర‌మాదం ఉంటుంది. ఇది జుట్టులోని స‌హ‌జ బంధాల‌ను నాశ‌నం చేస్తుంది. దీనివ‌ల్ల‌ జుట్టు పూర్తిగా స్ట్రెయిట్‌గా తయారైనా చూడ‌డానికి మాత్రం కృత్రిమంగానే క‌నిపిస్తుంది. అయినా మీకు ఇదే కావాల‌నుకుంటే ఉప‌యోగించ‌వ‌చ్చు. అయితే ఇలా స్ట్రెయిటెన్ చేసిన జుట్టుకు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

ఉప‌యోగాలు (Pros)
– మీ జుట్టు స్ట్రెయిట్‌గా త‌యార‌వుతుంది. రోజూ మీరు స్టైలింగ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.
– పొడిబారిన‌ట్లుగా కనిపించ‌దు. ఏ నిమిషంలో అయినా మీరు అందంగానే క‌నిపిస్తారు.

న‌ష్టాలు (Cons)
– మీ జుట్టు కృత్రిమంగా అతికించిన‌ట్లుగా కనిపిస్తుంది.
– మాటిమాటికి ట‌చ‌ప్ కోసం పార్ల‌ర్‌కి వెళ్లాల్సి వ‌స్తుంది. ఎందుకంటే జుట్టు పెరుగుతున్న కొద్దీ కుదుళ్ల వ‌ద్ద రింగుల తిరిగి ఉంటే అంచులు మాత్రం స్ట్రెయిట్‌గా ఉంటాయి.
– మీ జుట్టు పొడుగును బ‌ట్టి ఈ ప్ర‌క్రియ పూర్తి కావ‌డానికి నాలుగు నుంచి ఎనిమిది గంట‌లు ప‌డుతుంది.
– మీ జుట్టు చాలా సన్న‌గా క‌నిపిస్తుంది.

స్మూతెనింగ్ కూడా జుట్టుకు లాభం చేకూరుస్తుంది. దాన్ని ఎలా చేయాలంటే..

ADVERTISEMENT

హెయిర్ స్మూతెనింగ్‌ (Hair Smoothing)

స్మూతెనింగ్ మీ జుట్టు స‌హ‌జంగా ఉన్న విధానాన్ని మార్చ‌దు. అయితే దాన్ని కాస్త మృదువుగా, ప‌ట్టులా మెరిసేలా త‌యారుచేస్తుంది. డ‌ల్‌గా, చిట్లిపోయిన జుట్టు, చిక్కులు ప‌డి పొడిబారిపోయిన జుట్టుకి కాస్త జీవం పోయ‌డానికి ఇది ప‌నిచేస్తుంది. ఇందులోనూ కెమికల్స్‌ని ఉప‌యోగిస్తారు. అయితే ఇది రీబాండింగ్ కంటే మంచిద‌ని చెప్పుకోవ‌చ్చు. స్మూతెనింగ్ ట్రీట్‌మెంట్ త‌ర్వాత మీరు ఎన్నిసార్లు త‌ల‌స్నానం చేస్తారు అన్న‌దానిపై ఆధార‌ప‌డి క‌నీసం ఆరు నుంచి ఎనిమిది నెల‌ల వ‌ర‌కూ జుట్టు మృదువుగా ఉంటుంది.

straight8

కెరాటిన్ ట్రీట్‌మెంట్‌ (Keratin Treatment)

కెరాటిన్ అనేది మ‌న జుట్టు, ప‌ళ్లు, గోళ్ల‌లో సహ‌జంగానే ఉన్న ఓ ప్రొటీన్‌. ఇది ఆయా శ‌రీర భాగాల‌కు మెరిసే గుణాన్ని అందిస్తుంది. అయితే కాలుష్యం, కెమిక‌ల్స్ వంటి వాటి ప్ర‌భావంతో పాటు వ‌య‌సు పెర‌గ‌డం వ‌ల్ల ఈ ప్రొటీన్ త‌గ్గి మెరుపు త‌గ్గిపోతూ వ‌స్తుంది. దీనివ‌ల్ల జుట్టు ర‌ఫ్‌గా త‌యార‌వుతుంది. కెరాటిన్ ట్రీట్‌మెంట్ మీ జుట్టు కోల్పోయిన కెరాటిన్‌ని అందిస్తుంది. జుట్టును మెత్త‌గా ప‌ట్టులా మారుస్తుంది.

ఇది మ‌రీ స్ట్రెయిట్‌గా క‌నిపించ‌దు కానీ ఇప్పుడే పార్ల‌ర్‌లో బ్లో డ్రై చేయించుకున్న‌ట్లుగా తయార‌వుతుంది. అయితే ఇది కేవ‌లం ఆరు నెల‌లు మాత్ర‌మే ఉంటుంది. ప్ర‌తి త‌ల‌స్నానం త‌ర్వాత కొంత ప్ర‌భావం త‌గ్గుతూ వ‌స్తుంది. మీరు దీనికోసం ప్ర‌త్యేక‌మైన షాంపూ, కండిష‌న‌ర్‌లు వాడాల్సి ఉంటుంది. త‌క్కువ హెయిర్ డ్యామేజ్‌తో పూర్త‌య్యే ఈ ట్రీట్‌మెంట్ మీకు ఎల్ల‌ప్పుడూ చ‌క్క‌టి లుక్‌ని అందిస్తుంది.

మీకు న‌చ్చే కొన్ని కెరాటిన్ ట్రీట్‌మెంట్స్‌ (keratin Treatments)

ఓజీఎక్స్ బ్రెజిలియ‌న్ కెరాటిన్ థెర‌పీ షాంపూ
ఇది యాంటీ ఆక్సిడెంట్లు నిండిన కొబ్బ‌రినూనె, కెరాటిన్ ప్రొటీన్‌, అవ‌కాడో ఆయిల్‌, కొకొవా బ‌ట‌ర్ ల‌ను క‌లిపి చేసిన షాంపూ. ఇది మీ జుట్టును మ‌రింత మృదువుగా, ప‌ట్టులా మెరిసేలా త‌యారుచేస్తుంది.

ADVERTISEMENT

ఉప‌యోగాలు (Pros)
– పొడిద‌నాన్ని దూరం చేసి ప్ర‌తి వెంట్రుక‌ను మృదువుగా మారుస్తుంది.
– జుట్టు సులువుగా మ్యానేజ్ చేసుకునేలా త‌యార‌వుతుంది. ఏ హెయిర్‌స్టైల్ అయినా సులువుగా వేసుకోవ‌డానికి వీలుంటుంది.
– మీ జుట్టు ఎలాంటిదైనా స‌రే ఈ ట్రీట్‌మెంట్ చేయించుకోవ‌చ్చు. ఎందుకంటే ఇది స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్రొటీన్‌తో చేసే ట్రీట్‌మెంట్.
– ఇది రీబాండింగ్‌లా క‌ఠిన‌మైన‌ది కాదు. జుట్టును ఎంతో మృదువుగా మారుస్తుంది.
– మీ జుట్టు చాలా స‌హ‌జంగా, ఒత్తుగా క‌నిపిస్తుంది.

న‌ష్టాలు (Cons)
– ఇందులోని కెమిక‌ల్స్ చ‌ర్మంపై రాషెస్‌, క‌ళ్ల‌మంట పుట్టించ‌వ‌చ్చు.
– ఇందులో ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. ఇది మ‌న శ‌రీరంపై ప్ర‌భావం చూపి వివిధ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు దారితీసే ప్ర‌మాదం ఉంటుంది.
– ఈ ట్రీట్‌మెంట్ చాలా ఖ‌రీదైన‌ది. దీంతో పాటు చికిత్స త‌ర్వాత ఉప‌యోగించాల్సిన స‌ల్ఫేట్ ఫ్రీ, సోడియం క్లోరైడ్ ఫ్రీ షాంపూలు కూడా చాలా ఖ‌రీదైన‌వి.

straight9

బ్రెజిలియ‌న్ హెయిర్ ట్రీట్‌మెంట్‌ (Brazilian Hair Treatment)

మీ జుట్టు చాలా పొడిగా, రింగులుగా ఉంటే ఈ ట్రీట్‌మెంట్‌ని ఎంచుకోవ‌చ్చు. సిస్టీన్ అనేది మ‌న వెంట్రుక‌ల్లో ఉండే అమైనో యాసిడ్‌. ఇది మ‌న వెంట్రుక‌ల‌కు సాగే గుణాన్ని అందిస్తుంది. దాన్ని ఉప‌యోగించి చేసే ఈ ట్రీట్‌మెంట్ పొడిగా, దువ్వినా చెదిరిపోయే జుట్టును స‌రిచేస్తుంది. ఇందులో ఎలాంటి హానికార‌క కెమిక‌ల్స్ ఉప‌యోగించ‌రు కాబ‌ట్టి ఇది జుట్టుకి మంచిది.

ఈ ట్రీట్‌మెంట్ మొత్తం స‌హ‌జ‌సిద్ధ‌మైన ఉత్ప‌త్తులు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లను ఉప‌యోగించి చేస్తారు కాబ‌ట్టి ఇవి జుట్టులో జీవాన్ని పెంచి అందంగా క‌నిపించేలా చేస్తాయి.

ADVERTISEMENT

ఉప‌యోగాలు (Pros) 
– ఇందులో ఫార్మాల్డిహైడ్ లాంటి క‌ఠిన‌మైన కెమిక‌ల్స్ ఉండ‌వు.
– మీ జుట్టు అందంగా, మృదువుగా, మెరుస్తూ క‌నిపిస్తుంది.
– ఇది మీ జుట్టును కుదుళ్ల నుంచి అంచుల వ‌ర‌కూ మాయిశ్చ‌రైజ్ చేస్తుంది.
– రీబాండింగ్‌లా కాకుండా ఇది ఎక్కువ‌ కాలం ఉంటుంది. కొత్త‌గా వ‌చ్చిన జుట్టుకు ట్రీట్‌మెంట్ చేసిన జుట్టు భాగానికి ఏమాత్రం తేడా కనిపించ‌దు.

న‌ష్టాలు (Cons)
– ఈ ట్రీట్‌మెంట్ కూడా ఎక్కువ కాలం ఉండ‌దు. 12 నుంచి 14 నెల‌లు మాత్ర‌మే ఉంటుంది.
– ఇది చాలా ఖ‌రీదైన‌ది.

జుట్టును స్ట్రెయిట్‌గా, స్మూత్‌గా మార్చుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డే మార్గాల‌న్నింటి గురించి మీకు వివ‌రించి చెప్పాం. ఇందులో ఏ మార్గం ఎంచుకుంటారో మీ ఇష్టం. మీకు న‌చ్చిన మార్గం ఎంచుకొని, జుట్టును అందంగా క‌నిపించేలా తయారుచేసుకోండి.

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

మంచి హెయిర్ స్ట్రెయిటనింగ్ కోసం ఆరాటపడుతున్నారా? అయితే ఈ బ్రష్‌లు మీకోసమే..!

చిట్కాలు చిన్నవే.. కానీ జుట్టు పొడవుగా అయ్యేలా చేస్తాయి..

చర్మ, కేశ సంరక్షణ కోసం వాడాల్సిన.. పారాబెన్, సల్ఫేట్ రహిత ఉత్పత్తులివే..!

Images: Shutterstock 

ADVERTISEMENT
25 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT