ADVERTISEMENT
home / Education
ఉపాధ్యాయుల గొప్పతనాన్ని తెలియజేసే 85 టీచర్స్ డే కొటేషన్లు (Teacher’s Day Quotes In Telugu)

ఉపాధ్యాయుల గొప్పతనాన్ని తెలియజేసే 85 టీచర్స్ డే కొటేషన్లు (Teacher’s Day Quotes In Telugu)

భారతీయ సంప్రదాయంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత పూజనీయంగా భావించే వ్యక్తి గురువు. ‘ఆచార్యదేవోభవ’ అంటూ విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కీర్తిస్తాం. నిజం చెప్పుకోవాలంటే.. మన తల్లిదండ్రుల కంటే గురువులకే మన గురించి ఎక్కువ తెలుసనడంలో ఎలాంటి సందేహం లేదు. మన తెలివితేటలు, ఆలోచనల గురించి వారికి పూర్తిగా తెలుసు. ‘నీకు ఈ సబ్జెక్టుపై మంచి పట్టుంది. నువ్వు ఫలానా కోర్సు చెయ్యి నీ భవిష్యత్తు బాగుంటుంది’ అని వారే మనకు సూచిస్తుంటారు. మనల్ని మంచి దారిలో నడిపించే విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎప్పుడైనా చదువు మీద శ్రద్ధ తగ్గినట్టనిపించినా, మనసు పక్కదారి పట్టినట్టు గుర్తించినా దండిస్తారు. అలా దండించైనా సరే మళ్లీ మనల్ని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకే గురువును మించిన దైవం లేదని అంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే మనల్ని అత్యున్నత స్థానంలో చూడాలని ఉపాధ్యాయుడు కోరుకుంటారు. తన శిష్యుడు సాధించిన విజయాన్ని తన విజయంగా భావించి గర్వంతో ఉప్పొంగిపోతారు.

గౌరవనీయమైన వృత్తిలో ఉంటూ ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దుతోన్న ఉపాధ్యాయులను గౌరవించేందుకే మనం ఏటా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది, భారత రాష్ట్రపతిగా అత్యున్నత స్థానానికి చేరుకున్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా (Teacher’s day) జరుపుకుంటున్నాం. ఏటా సెప్టెంబర్ 5 (September 5) న దేశవ్యాప్తంగా  టీచర్స్ డే జరుపుకుంటాం. ఈ రోజు తమకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులను సత్కరిస్తూ వారిపై తమకున్న గౌరవాన్ని తెలియజేస్తుంటారు.

అయితే ప్రస్తుతం మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఏ చిన్న సందర్భం వచ్చినా దాని గురించి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెడుతున్నాం. టీచర్స్ డే రోజు కూడా ఉపాధ్యాయుడిపై తమకున్న భక్తిని, గౌరవాన్ని తెలియజేయడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నాం. టీచర్స్ డే రోజు ఉపాధ్యాయుల విలువ చెప్పే కొటేషన్లు పోస్ట్ చేస్తుంటారు. కొందరైతే వాట్సాప్ మెసేజ్ల ద్వారా తమ గురువుకు ధన్యవాదాలు చెబుతారు. దాని కోసమే ఈ టీచర్స్ డే కొటేషన్లు, టీచర్స్ డే మెసేజెస్.

Also Read: 55+ Amazing Teacher’s Day Quotes & Wishes (In English)

ADVERTISEMENT

Shutterstock

ఫేస్ బుక్ పోస్ట్ చేయదగిన టీచర్స్ డే కొటేషన్స్ (Happy Teacher’s Day Quotes In Telugu)

 1. మీ నుంచి నేర్చుకున్నాం. మీ మాటలు విన్నాం. మిమ్మల్ని చూస్తూ పెరిగాం. మీరు తీర్చిదిద్దిన ప్రతి విద్యార్థి జీవితంలో మీరే హీరోలు. మీరే వారిని నడిపించే లీడర్లు.
 2. అ, ఆ లనుంచి గుణింతాల వరకు, అంకెల నుంచి లెక్కల వరకు, పిల్లల పాటల నుంచి చరిత్ర వరకు, ఆటల నుంచి సైన్స్ వరకు అన్నీ దండించైనా దగ్గరుండి నేర్పించిన ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
 3. ఉపాధ్యాయులు లేని జీవితం ఊహించలేనిది. వారి ప్రభావం అనునిత్యం మనపై కనిపిస్తూనే ఉంటుంది. వారు వెలిగించిన జ్ఞానమనే దీపం ఎప్పుడూ మనకు దారి చూపుతూనే ఉంటుంది. ఈ దీపం మరింత మందికి వెలుగు పంచాలని కోరుకుంటున్నాను.
 4. దారి చూపే జ్ఞాన దేవత. తండ్రి తర్వాత మరో రోల్ మోడల్. విద్యార్థి కష్టం తనదిగా భావించే గొప్ప మనిషి. విద్యార్థిని పైకి తీసుకొచ్చేందుకు 100కి 110 శాతం కష్టపడే వ్యక్తి ఉపాధ్యాయుడు.
 5. మనలోని శక్తిని చూసేది, దానికి సానబట్టేది, అందమైన భవిష్యత్తు దిశగా నడిపించేది ఉపాధ్యాయుడే. గురువు అనే నిచ్చెనతోనే మనం ఉన్నత స్థాయికి చేరుకుంటాం.
 6. ఈ స్థాయికి నేను చేరుకున్నానంటే దానికి కారణం నా గురువులే. సాధిస్తాననే నమ్మకం నాకు లేకపోయినా.. సాధించాలనే ఆసక్తి లేకపోయినా.. ములుగర్రలా నన్ను పొడుస్తూ ముందుకు నడిపించారు. నా గమ్యం నాకు చూపించారు. దాన్ని చేరుకునేలా చేశారు. నా జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించి నన్ను ఉన్నత స్థానంలో నిల్చోబెట్టిన గురువులందరికీ నా శిరసాభివందనం.
 7. ప్రతి ఉపాధ్యాయుడు తన జీవితంలో కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతారు. కొందరి విషయంలో చాలా కఠినంగానే ఉన్నా అది వారిని సరైన మార్గంలో నడిపించి ప్రయోజకులను చేయడానికే. తన దగ్గర చదువుకున్నవారు ఉన్నతస్థానానికి చేరుకోవాలని కోరుకోవడం మినహా తన శిష్యుల నుంచి ఏమీ ఆశించరు.
 8. ఈ ప్రపంచంలో ఓ రాయిని వజ్రంలా మార్చగలిగే శక్తి ఉన్న ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు.
 9. నా పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నానంటే దానికి కారణం నా గురువులే. నాకు చదువు, విచక్షణ నేర్పించి ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించిన వారికి నా వందనం.
 10. సైలెన్స్. పుస్తకాలు తీసి బుద్ధిగా చదువుకోండి. హ్యాపీ టీచర్స్ డే.
 11. ప్రతిఒక్కరి జీవితంలో టీచర్ ఓ సూపర్ హీరో పాత్ర పోషిస్తారు. కానీ ఆ సూపర్ హీరో ఇచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ మనల్ని ముందుకు నడిపస్తూనే ఉంటుంది.
 12. విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో వెలకట్టలేని త్యాగాలు చేసిన ఉపాధ్యాయులందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు.
 13. గొప్ప విజయాలు సాధించడానికి పట్టుదల ఎంత అవసరమో.. లక్ష్యాన్ని చేరుకునే మార్గం నుంచి పక్కదారి పట్టకుండా చూసే గురువు కూడా అంతే అవసరం.
 14. వాస్తవానికి తల్లిదండ్రులకంటే గురువులు మరింత పూజనీయులు. ఎందుకంటే అమ్మానాన్న మనకు జన్మనిస్తే.. ఉపాధ్యాయుడు ఆ జన్మకు సార్థకత చేకూరుస్తారు.
 15. మీ టీచర్ మీ పట్ల చాలా కఠినంగా ఉన్నట్టనిపిస్తున్నారా? అయితే బాస్ వచ్చేదాకా ఆగండి. టీచర్ ఎంత సౌమ్యంగా ఉంటారో తెలుస్తుంది.
 16. రైతు, జవాన్ తర్వాత దేశానికి నిజమైన సేవ చేసేది ఉపాధ్యాయులే. ఎందుకంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దేది.. దేశాన్ని అభివృద్ధి బాట పట్టించేది వారే.
 17. గురువు విద్యతో పాటు విచక్షణ కూడా నేర్పిస్తాడు. ఆ విచక్షణే మనల్ని మంచి వైపు నడిపిస్తుంది. ఈ విచక్షణ పాఠ్యపుస్తకాల్లో ఉండదు. ఉపాధ్యాయుడి గుండెల్లో ఉంటుంది. మన:పూర్వకంగా పాఠాలు చెప్పే ప్రతి ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
 18. మంచి టీచర్లు విద్యార్థులకు విద్యను బోధిస్తే.. ఉత్తమ ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులకు విద్యతో పాటు మంచి గుణం అలవడేలా చూస్తారు.
 19. మంచి ఉపాధ్యాయుడు తన శిష్యులందరూ జ్ఞానవంతులయ్యేలా శ్రమించడంతో పాటు.. వారికేదైనా సమస్య వస్తే.. వారి వెన్నుతట్టి ముందుకు నడిపిస్తారు.
 20. మనమేంటో మనకే తెలియని క్షణంలోనూ మన భవిష్యత్తును అంచనా వేయగలిగే శక్తి ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంది.

ఇంతే అద్భుతంగా మీ ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా చెప్పండి.

ADVERTISEMENT

Shutterstock

ఉపాధ్యాయుడికి ధన్యవాదాలు చెబుతూ పంపే మెసేజ్ లు (Thank You Teacher Messages)

 1. మీరు చేసిన మార్గనిర్దేశం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీ వల్లే నా కలలను నిజం చేసుకోగలిగాను. ఈ విషయంలో మీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నా జీవితాన్ని అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు. హ్యపీ టీచర్స్ డే.
 2. మీ శక్తిని, సమయాన్ని మా కోసం ఖర్చు చేసినందుకు, మమ్మల్ని తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు. హ్యపీ టీచర్స్ డే.
 3. గౌరవనీయులైన ఉపాధ్యాయుడికి, మీరు నా కోసం చేసిన కృషికి ధన్యవాదాలు. నన్ను మనిషిలా మార్చినందుకు, నా కెరీర్‌ను తీర్చిదిద్దినందుకు మన:పూర్వక ధన్యవాదాలు. మీకివే నా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రేమతో మీరు తీర్చిదిద్దిన విద్యార్థి.
 4. మేడమ్.. మీరు చాలా గొప్ప టీచర్. చదువు మీద ఆసక్తి పెంచుకొనేలా నన్ను ప్రోత్సహించారు. నా భవిష్యత్తును ముందే ఊహించి నాకు మార్గదర్శిగా నిలిచారు. అనునిత్యం నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. మీకు ధన్యవాదాలు చెప్పడం తప్ప మరేమీ చేయలేకపోతున్నా. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
 5. డియర్ టీచర్ మీరు నాకు పాఠాలు మాత్రమే చెప్పలేదు. నా కాళ్ల మీద నేను నిలబడేలా చేశారు. నన్ను వ్యక్తిగా తీర్చిదిద్దారు. దానికి మీకెప్పటికీ రుణపడే ఉంటాను. థాంక్యూ టీచర్.
 6. టీచర్.. మీ స్ఫూర్తిదాయకమైన మాటలే నా జీవితాన్ని మార్చేశాయి. నన్ను అనునిత్యం ఇన్స్పైర్ చేస్తూనే ఉంటున్నందుకు థ్యాంక్స్.
 7. మీరు మా జీవితాలను తీర్చిదిద్దడానికి చేసిన త్యాగాలకు థ్యాంక్స్ ఒక్కటీ చెబితే సరిపోదు. మరేం చెప్పాలి? యు ఆర్ ది బెస్ట్ టీచర్. హ్యాపీ టీచర్స్ డే.
 8. నన్ను నేను ఉత్తమంగా మార్చుకునేలా చేయడం కోసం మీరు నాతో ఓ ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్‌లో నేను గెలిచినప్పటికీ అంతిమ విజయం మాత్రం మీదే. థ్యాంక్యూ సో మచ్. హ్యాపీ టీచర్స్ డే.
 9. స్థిరత్వం లేని నిలకడ లేని నా ఆలోచనలకు ఓ రూపాన్ని కల్పించి నా గమ్యాన్ని నేను గుర్తించేలా చేసి.. దాన్ని చేరుకునేలా ప్రోత్సహించిన నా గురువుకు ధన్యవాదాలతో పాటు టీచర్స్ డే శుభాకాంక్షలు.
 10. ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ టీచర్… ఈ నాలుగు కలసి ఒక్కటిగా మారితే అది మీరు. మీరు అందించిన సాయానికి నేనెప్పుడు కృతజ్ఞుడినై/కృతజ్ఞురాలినై ఉంటాను.
 11. పుస్తకాల్లో ఉన్న పాఠాలతో పాటు జీవితానికి అవసరమైన పాఠాలు కూడా మీరు నేర్పించారు. బహుశా ఉపాధ్యాయుడికి సంతృప్తినిచ్చే విషయం అదేనేమో. మీరు నేర్పించిన క్రమశిక్షణ, సమయపాలన ఇప్పటికీ మీరు నా వెన్నంటి నడిపిస్తున్నారేమో అనే భావన కలిగిస్తున్నాయి. నన్ను సరైన మార్గంలో పెట్టిన మీకు ధన్యవాదాలు.
 12. నచ్చిన టీచర్ మనకు పాఠాలు చెబుతుంటే.. క్లాస్ రూం ఇల్లుగా మారిపోతుందట. ఆ ఇంటిని నేను ఇప్పుడు మిస్సవుతున్నాను. థ్యాంక్యూ మాస్టారు.
 13. మీ నుంచి నేర్చుకున్నాం. మీరు చెప్పినవి విన్నాం. మిమ్మల్ని చూస్తూ పెరిగాం. అప్పుడప్పుడూ మిమ్మల్ని చూసి నవ్వాం. మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందాం. మా జీవితంలో మీ కంటే పెద్ద హీరో మరెవ్వరూ లేరు. మీ శక్తిని మాకు ధారపోసి మమ్మల్ని తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు.
 14. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎంత రుణపడి ఉన్నానో.. ఆ జన్మను సార్థకం చేసుకునేలా నన్ను తీర్చిదిద్దిన మీకు కూడా అంతే రుణపడి ఉన్నాను. అలెగ్జాండర్ ది గ్రేట్ చెప్పిన ఈ మాట నేను మీకు చెబుతున్నాను. హ్యాపీ టీచర్స్ డే.
 15. నిస్వార్థమైన మీ మనసుకి, విద్యార్థులను గొప్పవారిగా తీర్చిదిద్దాలనే మీ తపనకు సదా కృతజ్ఞులై ఉంటాం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

 

ఇంతే అద్భుతంగా మీ ప్రియమైన వారికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పండి.

ఉపాధ్యాయుల విలువను చెప్పే కొటేషన్లు (Teachers Day Messages)

  1. గురువు కొవ్వొత్తి లాంటి వారు. తను కాలిపోతున్నా సరే.. ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతూనే ఉంటారు.
  2. ఉపాధ్యాయుడు నాటిన జ్ఞానమనే విత్తనాలు ఎన్నేళ్లయినా ఫలాలు ఇస్తూనే ఉంటాయి.
  3. విద్యార్థిలో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి అందమైన జీవితానికి వెలుగు బాట చూపించేవాడే ఉపాధ్యాయుడు.
  4. ‘చిన్న విజయానికే సంతృప్తి పడిపోవద్దు. నువ్వు సాధించాల్సిన లక్ష్యం చాలా పెద్దది.’ ఉపాధ్యాయుడు చెప్పే ఈ మాట మనల్ని ఎప్పుడూ ఉన్నత లక్ష్యాల దిశగా నడిపిస్తుంది.
  5. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమమైన దారి చూపిస్తారు. ఆ దారిలో తన శిష్యులను నడిపించడం కోసం తిడతారు. మరీ మొండికేస్తే కొడతారు. అది తన దగ్గర చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు కోసమే.
  6. మీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి మీకు ఏదో ఒక పాఠం నేర్పించి వెళతారు. వారు కూడా టీచర్లే. అలాంటి టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
  7. ఈ ప్రపంచంలో మనకి మొదటి గురువులు తల్లిదండ్రులే. వారే మనల్ని తీసుకెళ్లి ఉపాధ్యాయుడి చేతిలో పెడతారు. కాబట్టి టీచర్లతో పాటు తల్లిదండ్రులకు కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్పడం మరిచిపోవద్దు.
  8. ఈ ప్రపంచం ఓ విశ్వవిద్యాలయం. ఇందులో మనకు తారసపడే ప్రతి వ్యక్తి మనకు ఓ ఉపాధ్యాయుడే. కాబట్టి మీరు ప్రతి రోజూ చదువుకోవడానికి వెళుతున్నామనే విషయం మాత్రం మరచిపోవద్ధు.
  9. ఉత్తమ ఉపాధ్యాయుడు గతాన్ని మనముందుంచుతారు. ప్రస్తుతాన్ని విడమరచి చెబుతారు. భవిష్యత్తునే ఎలా తీర్చిదిద్దుకోవాలో నేర్పిస్తారు.
  10. అతిగా మాట్లాడేవారిని చూసి మౌనంగా ఉండటం నేర్చుకున్నా. జాలి లేని వారిని చూసి దయతో ఉండటం నేర్చుకున్నా. బాధపడేవారిని చూసి బాధపడకుండా ఉండటం నేర్చుకున్నా. ధైర్యంగా, స్థిరంగా ఉండటం నేర్పిన వీరందరూ నాకు టీచర్లే.
  11. మీ లక్ష్యాన్ని మీరే ఎంచుకునేలా చేయడంతో పాటు.. ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో మిమ్మల్ని నడిపించేవారే గొప్ప టీచర్.
  12. గొప్ప ఉపాధ్యాయులు ఎలా ఉంటారంటే.. పిల్లలందరితోనూ కలసిపోతారు. వారిని గౌరవిస్తారు. ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉందని నమ్ముతారు. ఆ ప్రత్యేకతను బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. ప్రోత్సహిస్తారు. నేర్పిస్తారు. కొన్ని సార్లు ప్రేమగా, మరికొన్నిసార్లు కఠినంగా ఉంటారు. ఇదంతా తన శిష్యులు గెలుపు గుర్రమెక్కడానికే చేస్తారు.
  13. ఉపాధ్యాయుడు తన విద్యార్థి విషయంలో సంతృప్తిగా ఉండేదెప్పుడో తెలుసా? జీవితంలో ముందుకు వెళ్లే విషయంలో తన శిష్యుడికి తన అవసరం ఇక లేదనుకున్నప్పుడు.
  14. ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పదంటే.. ఏ రంగానికి చెందిన నిపుణులైనా సరే ఉపాధ్యాయుల దగ్గరే తమ నైపుణ్యాలకు సానపెట్టుకుని రావాలి.
  15. విద్యార్థులపై టీచర్ల ప్రభావం ఎంత కాలం వరకు ఉంటుంది. వారికి చదువు చెప్పినంత కాలమా? వారిని గుర్తుంచుకున్నంత కాలమా? ఈ రెండూ కాదు. జీవిత కాలం ఉంటుంది.
  16. ఏదైనా సాధించాలనే తపన ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? మిమ్మల్ని మీ తల్లిదండ్రులు తీసుకెళ్లి టీచర్ చేతిలో పెట్టినప్పుడు. ఆ క్షణం నుంచే మీ లక్ష్యం దిశగా అడుగులు వేయడం ప్రారంభిస్తాం.
  17. తరగతిలో ఉన్న విద్యార్థిని మీ టీచర్ గురించి కథ రాయమని చెబితే.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా రాస్తారు. ఆ కథలో హీరో మాత్రం ఉపాధ్యాయుడే.
  18. మన జీవితంలో కీలకమైన పాత్ర పోషించేది ఉపాధ్యాయులే. వారిపై జోకులు వేయద్దు.
  19. ప్రతి ఏడాది టీచర్స్ డే వచ్చేసరికి నా టీచర్లందరి దగ్గరకు వెళ్లాలనిపిస్తుంది. మళ్లీ చదువుకోవాలనిపిస్తుంది. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.
  20. గురువు అనే వ్యక్తే లేకపోతే.. ఈ ప్రపంచం అంతా అంధకారంలోనే మునిగిపోయి ఉండేదేమో. జ్ఞానమనే జ్యోతిని వెలిగించి ఈ ప్రపంచానికి వెలుగు ప్రసాదించింది ఉపాధ్యాయుడే. అలాంటి గొప్ప గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

Also Read : నేను నా డాటర్ కోట్లను ప్రేమిస్తున్నాను

ADVERTISEMENT

Shutterstock

వాట్సాప్ స్టేటస్ గా టీచర్స్ డే శుభాకాంక్షలు (Teachers Day Wishes)

 1. ఉపాధ్యాయుడంటే.. మీ మీద నమ్మకముంచేవాడు. మిమ్మల్ని నడిపించేవాడు. మిమ్మల్ని ఆణిముత్యంగా భావించేవాడు. నాకు విద్య నేర్పి నన్ను ముందుకు నడిపించిన టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
 2. టీచర్ లేకుండా ఉన్నత స్థానానికి చేరుకోవడం అసాధ్యం. తమ స్వార్థం చూసుకోకుండా.. విద్యార్థులను అందలం ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.
 3. మంచి ఉపాధ్యాయుడు మాత్రమే తన విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరిస్తారు. వారి ఆశలని, కలలను నిజం చేసుకునే శక్తిని వారికిస్తారు. అలాంటి గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
 4. టీచర్ ఒకేసారి రెండు పనులు చేస్తారు. తన శిష్యుల్లో తెలివితేటలు పెంచడంతో పాటు.. వాటిని సరైన దిశలో ఉపయోగించుకునేందుకు మార్గం చూపే కంపాస్‌లా వ్యవహరిస్తారు.
 5. మనం ఎదుర్కునే సమస్యలన్నింటినీ తన తెలివితేటలతో పరిష్కరించి మిమ్మల్ని సరైన దారిలో పెట్టే ప్రతిఒక్కరూ మనకు జీవిత పాఠాలను బోధించే ఉపాధ్యాయులే.
 6. ఉపాధ్యాయుడు ఓ జ్ఞాననిధి లాంటివాడు. ఆ నిధి ఎంతమందికి పంచిపెట్టినా తరగదు.
 7. ప్రతి విద్యార్థి జీవితంలో టీచర్ ఓ ఇంధనం లాంటి వాడు. ఆ ఇంధనం మన జీవితాన్ని ముందుకు నడిపి.స్తూనే ఉంటుంది.
 8. టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చినా ఓ విషయంపై సంపూర్ణ అవగాహన రావాలంటే.. ఉపాధ్యాయుడి అవసరం ఎంతో ఉంది.
 9. వ్యక్తిలో దాగున్న ప్రతిభను వెలికితీయడంలో గురువును మించినవారు మరొకరు ఉండరు.
 10. టీచర్ లేకుండా మనం ఏదైనా నేర్చుకోగలమేమో కానీ దానిలో ప్రజ్ఞ సాధించాలంటే మాత్రం గురువు కావాల్సిందే.
 11. గొప్ప నాయకులంతా గురువులే. వారి నుంచి మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు.
 12. మంచి ఉపాధ్యాయుడు మంచి ఎంటర్టైనర్ కూడా. మొదట విద్యార్థుల నాడిని పట్టుకొని ఆ తర్వాత బోధించడం మొదలుపెడతారు.
 13. చదువుకునే సమయంలో టీచర్ల విలువ మనకు తెలీదు. వయసు పెరిగే కొద్దీ వారి గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది.
 14. సంక్లిష్టమైన విషయాన్ని సైతం సరళంగా చెప్పడంలోనే టీచర్ గొప్పదనం దాగుంది.
 15. ప్రశ్నలు వేసి విద్యార్థి నుంచి సమాధానాలు రాబట్టే టీచర్ కంటే.. తను కూడా సమాధానం చెప్పలేని ప్రశ్నలు తన విద్యార్థులు వేయాలని భావించేవారే ఉత్తమమైన ఉపాధ్యాయుడు.
 16. మనల్ని ఎప్పటికీ గుర్తుంచుకునేవారు లెక్క పెట్టడం మొదలు పెడితే ఓ పదిమందో పదిహేను మందో ఉంటారు. కానీ ఓ టీచర్‌ని గుర్తు పెట్టుకునే వారు మాత్రం వేలల్లో ఉంటారు.
 17. అన్నింటికంటే ఉన్నతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఎందుకంటే ఇంజనీర్‌కు ముందు ఓ టీచర్ ఉంటారు. డాక్టర్ ముందు ఓ టీచర్ ఉంటారు. ఇలా ఎవరిని చూసినా వారిని తీర్చిదిద్దింది కచ్చితంగా ఉపాధ్యాయుడే అయి ఉంటారు.
 18. గురువులు మూడు విషయాలను బాగా ప్రేమిస్తారు. నేర్చుకోవడాన్ని, నేర్చుకునేవారిని, ఈ రెండూ ఒక్క చోట చేరితే వచ్చే సంతోషాన్ని.
 19. అధికారాన్ని అనుభవించడం కంటే ఒకరిని విద్యావంతులను చేయడంలోనే ఎక్కువ సంతోషం దాగి ఉంటుంది. ఆ సంతోషంలోనే ఉపాధ్యాయుడు నిత్యం మునిగి తేలుతుంటారు.
 20. ప్రతిఫలాపేక్ష లేకుండా తన విద్యార్థులను మానసికంగా, శారీరకంగా, సామాజికంగా శ్రద్ధగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు దేవుడితో సమానం.

Shutterstock

ADVERTISEMENT

సంక్షిప్త సందేశంగా మీ ఉపాధ్యాయుడికి పంపించదగిన మెసేజెస్ (Teachers Day Messages To Send To Your Teacher)

 1. మీలాంటి గొప్ప టీచర్ చెప్పిన పాఠాలు వినే అదృష్టం నాకు దక్కడం చాలా గొప్పగా అనిపిస్తుంటుంది. మీరు చెప్పే పాఠాలు ఇప్పుడు నేను చాలా మిస్సవుతున్నాను. మళ్లీ ఆ అవకాశం నాకు ఇంకోసారి ఇస్తారా మేష్టారూ? ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
 2. నాలాంటి ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శిగా ఉన్న మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
 3. మ్యాథమాటిక్స్ నాకు చాలా బోరింగ్ సబ్జెక్ట్. కానీ మీరు దాన్ని బోధించిన విధానం వల్ల గణితం మీద ఇష్టం పెరిగింది. అసలు మీ క్లాస్ ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురుచూడటం నాకు ఓ అలవాటుగా మారిపోయింది. మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
 4. మీరే మాకు స్ఫూర్తి ప్రదాత. మీరిలాగే ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
 5. నా టీచర్, నా ఇన్స్పిరేషన్, నా మెంటార్, నా మోటివేటర్ అయిన మీకు టీచర్స్ డే శుభాకాంక్షలు
 6. మీరు పాఠం చెప్పే విధానం, విద్యార్థులకు పంచే జ్ఞానం, వారిపై మీరు కనబరిచే శ్రద్ధ, కురిపించే ప్రేమ అన్నీ కలసి మిమ్మల్ని బెస్ట్ టీచర్ అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. హ్యాపీ టీచర్స్ డే.
 7. నేను ఎప్పుడైనా అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కళ్లు మూసుకుని మీరు చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటా. ఆ సమయంలో మీ మాటలే నాకు దారి చూపిస్తుంటాయి. హ్యపీ టీచర్స్ డే.
 8. లక్ష్యసాధన దిశలో ఎప్పుడైనా కాస్త బద్ధకం ప్రదర్శిస్తే.. మీరు తిట్టిన తిట్లు, మీ చేతిలో తిన్న దెబ్బలు గుర్తు చేసుకుంటా. నాకు తెలియకుండానే నా బద్ధకం వదిలిపోతుంది. నా వేగం పెరిగిపోతుంది.
 9. ఉన్నతమైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర. వారి కష్టం అమూల్యం. అలాంటి టీచర్లను గౌరవించడం మన బాధ్యత. ఈ బాధ్యతను మాత్రం ఎవరూ మరచిపోవద్దు.
 10. ఒక వ్యక్తిలో దాగి ఉన్న శక్తిని వెలికి తీయడం గురువుకు మాత్రమే సాధ్యమైన పని.

Feature Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

12 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT