కల .. అది అందమైనదైతే ఎంతో ఆనందాన్నిస్తుంది. అదే భయంకరమైనదైతే మళ్లీ నిద్రపోవాలంటే కూడా భయపెట్టేస్తుంది. అయితే కలలు (Dreams) ఎలాంటివైనా సరే.. అవి మన మెదడు మనకు చెప్పాలనుకునే మాటలకు వారధులు. కొన్నిసార్లు కలలు మనల్ని ఆలోచనలో పడేస్తాయి. అసలు ఈ కలకు అర్థం ఏంటి? అదెందుకు వచ్చింది? అంటూ ఆలోచిస్తూ ఉంటాం. అయితే ప్రతి కల వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది. ఈ క్రమంలో మనం కూడా.. సాధారణంగా ఎక్కువ మందికి వచ్చే కొన్ని కలల వెనకున్న పరమార్థాలు తెలుసుకుందాం..
1. కలలో చనిపోవడం..
సాధారణంగా కలలో మనం చనిపోయినట్లుగా కనిపిస్తే.. దాన్ని మనం పీడకలగా భావిస్తాం. అయితే అది మరీ అంత పీడకలేమీ కాదట. మన జీవితంలో పాత స్టేజ్ పూర్తయిపోయి.. కొత్త స్టేజ్ మొదలవుతోందన్నదానికి అర్థంగా ఈ కలను చెప్పుకోవచ్చు. కానీ మీ కలలో ఎవరినైనా చంపినట్లే వస్తే.. వారిపై మీకు తెలియకుండా లేదా తెలిసి మీ మనసులో ద్వేషం దాగి ఉందని అర్థం. దాన్ని ఎంత త్వరగా బయటకు తొలగిస్తే అంత మంచిది.
ఫ్లైట్‌లో నిద్రపోయి ఒంటరిగా నిద్రలేస్తే? ఇది భయపెట్టే కల అసలే కాదు..!
2. పరిగెత్తడం లేదా ఎవరైనా వెంటబడడం
ఈ తరహా కల వస్తే దాన్ని మనం సొంతంగానే అర్థం చేసుకోవచ్చు. కలలో మనం పరిగెడుతున్నాం అంటే జీవితంలో ఏదో ఒక అంశాన్ని కావాలనే దూరం పెడుతున్నాం. దాని నుంచి దూరంగా వెళ్లాలనుకుంటున్నాం అని అర్థం. అదే ఎవరో మిమ్మల్ని తరుముతున్నట్లుగా కల వస్తే ఆ వ్యక్తిని మీరు దూరం పెడుతున్నట్లు లెక్క.
3. కింద పడిపోవడం..
మీ కలలో బిల్డింగ్ పై నుంచి కింద పడడం కానీ, కాలు జారి పడడం కానీ, నీళ్లలో పడిపోవడం కానీ వస్తే.. దానికి అర్థం మీ జీవితం మీ చేతుల్లో లేదని మీరు బాధపడుతున్నట్లు అర్థం. మీ జీవితంలో ఏదో ఒక విషయం మీ కంట్రోల్ తప్పి పోతోంది అని అర్థం. దాన్ని త్వరగా కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలని ఈ కల చెబుతుంది.
4. పళ్లు రాలిపోవడం
ఇది చాలా ఎక్కువమందికి ఎదురయ్యే కల. ఇది ఒత్తిడి వల్ల వస్తుంటుంది. కలలో మీ పన్ను వూడిపోవడం అంటే ..ఏదో ఒక విషయం మీ చేతుల్లో ఉన్నా.. మీరేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని అర్థం. ఆ పరిస్థితి వీలైనంత త్వరగా మార్చుకోవాల్సిందే.
5. మీ భాగస్వామి మోసం చేస్తున్నట్లు..
మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నట్లు మీకు కల వస్తే.. అది వారి తప్పు కాకపోవచ్చు. మీ మనసులో ఉన్న అపోహలు, అనుమానాలు, భయాలు దీనికి కారణం. ఇవన్నీ తొలగించుకొని మీ బంధాన్ని బలంగా మార్చుకోవాలి. ఒకవేళ మీ కలలో మీరే మీ భాగస్వామిని మోసం చేస్తున్నట్లు వస్తే.. మీరు చేసిన ఏదైనా ఓ తప్పు మీ బంధాన్ని దెబ్బతీస్తుందేమోనని మీరు మనసులో బాధపడుతున్నట్లుగా అనుకోవచ్చు.
భాగస్వామి ఫోన్ మనం చెక్ చేయడం.. సరైన పనేనా?
6. గాల్లో ఎగరడం..
సాధారణంగా రెండు కాళ్లు నేలపై ఆనకుండా నిలబడడం కష్టమే. కానీ కలలో మాత్రం అలా ఉండచ్చు. అంతేకాదు గాల్లో తేలుతున్నట్లుగా కూడా కల కనొచ్చు. మీ కలలో భూమి నుంచి చాలా ఎత్తులో లేదా ఆకాశంలో ఎగురుతున్నట్లుగా అనిపిస్తే అది మీ జీవితంలోని ఉత్సాహవంతమైన, సంతోషకరమైన ఫేజ్‌ని సూచిస్తుంది. కానీ ఒకవేళ మీరు భూమి నుంచి కొద్ది ఎత్తులో మాత్రమే ఎగురుతుంటే.. మీ జీవితంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటున్నారని అర్థం. మీ ఆత్మవిశ్వాసం మీరు పూర్తిగా ఎగిరేందుకు సరిపోవట్లేదని అర్థం.
7. నగ్నంగా కనిపించడం..
సాధారణంగా ఎక్కువ మందికి తాము నలుగురి మధ్యలో నగ్నంగా తిరుగుతున్నట్లు కల వస్తుంటుంది. దీనికి అర్థం మీరు మీ జీవితంలో చాలా ఎమోషనల్‌గా ఫీలవుతున్నారు లేదా మీలోనే కొన్ని భావాలను దాచి పెట్టుకున్నారని అర్థం. వాటిని బయట పెట్టాల్సిన అవసరం ఉందని ఈ కల చెబుతుంది.
ఇక్కడ సెక్స్ బహిరంగంగానే జరుగుతుంది. ఆ నగరాలేవో మీకు తెలుసా?
8. ఆహారం గురించి కల
కొందరికి ఎక్కువగా ఆహారం గురించి కలలు వస్తుంటాయి. అయితే దీనికి అర్థం మీకు ఆహారం అంటే ఇష్టమని కాదు. మీకు ఏదో ఒక విషయం మీద విపరీతమైన ఆసక్తి, ప్రేమ ఉందని ఈ కల చెబుతుంది. అది మీ కొత్త జీవితం గురించి అయినా కావచ్చు. డబ్బు, చదువు ఇలా.. దేనిమీదనైనా ఒక గాఢమైన ప్రేమ ఉండడాన్ని ఇది చాటుతుంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.