ADVERTISEMENT
home / Bigg Boss
బిగ్ బాస్ తెలుగు: హిమజ, అలీ గొడవతో మొదలై… రవికృష్ణ చేతికైన గాయంతో ముగిసింది

బిగ్ బాస్ తెలుగు: హిమజ, అలీ గొడవతో మొదలై… రవికృష్ణ చేతికైన గాయంతో ముగిసింది

‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే కెప్టెన్సీ టాస్క్‌తో  ప్రారంభమైన ఎపిసోడ్‌లో వాగ్వాదాలు, మనస్పర్థలు,  కొట్లాటలు మనకి కనిపించాయి. అదేంటి! బిగ్‌బాస్ హౌస్ అంటేనే అవన్నీ ఉంటాయి కదా! మీరు కొత్తగా చెప్పేదేముంది అని అనుకుంటున్నారా?

బిగ్‌బాస్ తెలుగు యాంకర్ నాగార్జున చేతిలో ఉన్న.. పండు (కోతి) బొమ్మ మీకు కావాలా?

అలా కాదు.. నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులు ప్రవర్తించిన తీరుని గమనిస్తే, ఎవరు ఎవరి వల్ల ప్రభావితం అవుతున్నారు? ఇంటిలో తెలివిగా గేమ్‌ని ఆడుతోంది ఎవరు? గుడ్డిగా పక్క వాళ్ళు చెప్పింది చేస్తుంది ఎవరు? లాంటి అంశాలపై మనకి ఒక అవగాహన వస్తుంది. ముందుగా హిమజ, అలీ రెజాల మధ్య జరిగిన వాదనను గమనిస్తే.. “తాను చేసింది తప్పు కాదు” అనే భావనతోనే హిమజ ఉన్నట్టుగా స్పష్టమవుతోంది.

అదే సమయంలో అలీ (Ali Reza) స్వభావం కూడా అలాగే ఉంది. అయితే తను పాటిస్తున్న ఒక మంచి పద్ధతి ఏంటంటే – ఎవరితో గొడవ జరిగితే.. వారితోనే మాట్లాడి, ఇంకొక వ్యక్తి ప్రమేయం లేకుండా ఆ సమస్యని పరిష్కరించుకోవడం. అయితే హిమజ ఒక్కసారిగా “నన్ను క్షమించు” అంటూ అలీ కాళ్ళ పైన పడడంతో… ఈ అంశం తనకి నెగిటివ్‌గా మారుతుందేమో అన్న భయం అలీకి పట్టుకుంది. వెంటనే, హిమజతో.. (Himaja) మాట్లాడి తమ మధ్య జరిగిన అంశానికి ఫుల్ స్టాప్ పెట్టేసాడు.

ADVERTISEMENT

శ్రీముఖి విషయానికి వస్తే, తనకిచ్చిన టాస్క్‌లో గెలవడానికి ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో వేరే వాళ్ళు చెప్పే మాటలకి కూడా.. కాస్తో కూస్తో అప్పుడప్పుడు ప్రభావితం అవుతున్నట్టుగా అర్ధమవుతుంది. ఉదాహరణకి, టాస్క్‌లో ఖజానా ఉంచిన గాజు బాక్స్‌ని పగలగొడితే తప్ప.. గేమ్ ముందుకి సాగదు అని మహేష్ విట్టా చెప్పిన తరువాత.. గాజు బాక్స్‌ని పగులగొట్టడానికి సిద్ధమైంది.

ఇక ఈ గేమ్‌లో ఏమాత్రం కూడా ఆలోచించకుండా.. పక్క వారు చెప్పిన దానికి ‘ఓకె’ అంటూ ముందుకి సాగుతున్న వ్యక్తి రవికృష్ణ (Ravikrishna). టాస్క్ సమయంలో “గాజు బాక్స్‌ని పగలగొట్టు” అని శ్రీముఖి అనగానే.. వెంటనే ఆలోచించకుండా ఆ బాక్స్‌ని తెరిచేందుకు ప్రయత్నించగా.. చేతికి గాయమైంది.

బిగ్‌బాస్ హౌస్‌లో పక్క వారు చెప్పిన మాటలకి ప్రభావితం కాకపోవడం ఎంత సరైనదో.. అదే విధంగా అసలు ఏమాత్రం ఆలోచించకుండా ముందుకి దూకడం కూడా సమంజసం కాదు. ఇక చేతికైన గాయం పెద్దది కాదు, త్వరగానే నయం అయిపోతుందని డాక్టర్ చెప్పడంతో.. రవికృష్ణతో పాటుగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

బిగ్ బాస్ తెలుగు: రవికృష్ణని టార్గెట్ చేసిన తమన్నా

ADVERTISEMENT

నిన్నటి ఎపిసోడ్‌లో, శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్‌ల మధ్య కూడా ఏదో ఇబ్బందికర వాతావరణం ఉందనే భావన ప్రేక్షకులకు కలిగింది. టాస్క్ ఎలా చేయాలన్న విషయంలో మాట్లాడుకుంటుండగా – ఈ ఇరువురి మధ్య వాగ్వాదం జరగడం.. గాజు బాక్స్ పగలగొట్టమని రవికృష్ణ‌ని ఫోర్స్ చేయడంతో  అతనికి గాయమైందని … దానికి పూర్తి కారణం శ్రీముఖి అని రాహుల్ ఆరోపించాడు. దీనికి వితిక, వరుణ్, పునర్నవిలు కూడా మద్దతు పలకడం, గాజు ఖజానాలో ఉన్న నగలు & డబ్బు కూడా తమకు వద్దంటూ ఇచ్చేయడం జరిగింది.

మిగిలిన ఇంటి సభ్యులని ఒకసారి పరిశీలిస్తే.. అత్యధికులు ఎదుటి వారిని చూసి ప్రభావితమవ్వడం అనేది బిగ్ బాస్ సీజన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. 

ఇప్పటివరకు దాదాపు 20 రోజుల పాటు జరిగిన బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) “సీజన్ 3″లో ఒక్క సభ్యుడు కూడా.. ఈ గేమ్‌ని సరిగ్గా ఆడుతున్నట్టుగా కనిపించడం లేదు. మేము గ్రూప్‌గా లేము అంటూనే.. గ్రూపులు కట్టడం.. అదే సమయంలో ఒక గ్రూపు వ్యక్తుల.. మరో గ్రూపు వ్యక్తులపై నమ్మకం చూపించకపోవడం అనేది ప్రధాన సమస్య. ఇక ఈ 20 రోజుల గడిచాక.. ఇంటి సభ్యుల పరిస్థితిని చూస్తుంటే వారంతా కన్ఫ్యూజన్‌లో ఉండి.. షో చూస్తున్న ప్రేక్షకులని కూడా కన్ఫ్యూజన్‌లోకి నెట్టేస్తున్నారు.

ఇదిలావుండగా… ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో, పునర్నవి, అలీలకి బిగ్‌బాస్ ఒక సీక్రెట్ టాస్క్‌ని ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

ADVERTISEMENT

టీవీ9 జాఫర్ “బిగ్‌బాస్ హౌస్”లోకి.. మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వనున్నారా?

07 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT