టీవీ9 జాఫర్ "బిగ్‌బాస్ హౌస్"లోకి.. మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వనున్నారా ?

టీవీ9 జాఫర్ "బిగ్‌బాస్ హౌస్"లోకి.. మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వనున్నారా ?

టీవీ9 ఛానల్‌‌లో ముఖాముఖీ ప్రోగ్రాం ద్వారా ప్రజల్లో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు జాఫర్ (Jaffar). ఆయనకి ప్రజల్లో ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 (Bigg Boss Telugu) నిర్వాహకులు కూడా ఆయనని ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా తీసుకోవడం జరిగింది. ఇక ఆయన బిగ్‌బాస్ హౌస్‌లో రెండు వారాలు గడిపి నిన్ననే ఎలిమినేట్ అవ్వడం జరిగింది.

బిగ్ బాస్ తెలుగు : ఇంటి సభ్యులని ఏడిపించిన రవికృష్ణ, బాబా భాస్కర్, శ్రీముఖి & మహేష్ విట్టా

కాకపోతే ఆయన బిగ్‌బాస్ హౌస్‌లో తొలి రోజుల్లో కాస్త ఇమడలేకపోయారనే చెప్పాలి. దానికి కారణం ఆయన బయట చేసే ఉద్యోగానికి.. ఇక్కడ చేసే పనులలో చాలా వ్యత్యాసం ఉండడమే. ఆయన ఎందుకో ఈ ప్రోగ్రాంకి తాను సెట్ అవ్వను అనే ఒక నిర్ణయానికి వచ్చి.. ఇంటిలో నుండి తనని ఎలిమినేట్ చేసేందుకు నామినేట్ చేయమని ఇంటి సభ్యులని కోరారు. ఈ ఘట్టాన్ని మనం కూడా చూసాం. కానీ క్రమక్రమంగా ఇంటి వాతావరణానికి అలవాటుపడడమే కాకుండా.. ఇంటి సభ్యులతో సన్నిహితంగా మెలగడం మొదలయ్యాక .. ఆయన బిగ్ బాస్ హౌస్ పై ఇష్టాన్ని పెంచుకోసాగారు.

అందులో భాగంగానే ఇంటి సభ్యులైన బాబా భాస్కర్‌తో ఒక ప్రత్యేకమైన స్నేహ బంధం ఏర్పరచుకున్నారు.  ఎప్పుడు చూసినా సరే.. ఈ ఇద్దరు కలిసి ఉండడం, కలిసి డ్యాన్సులు వేయడం వంటివి చేస్తుండేవారు. అలాగే శ్రీముఖితో కూడా ఆయన చాలా స్నేహంగా మెలగడం మొదలుపెట్టారు. అందుకనే ఆయన నిన్న ఎలిమినేట్ అయ్యి.. ఇంటిని విడిచి వెళ్లే సమయంలో.. దాదాపు మెజారిటీ ఇంటి సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. మొన్నటిదాకా.. "నాకు నా భార్య గుర్తుకు వస్తుంది. ఇంటికి వెళ్లిపోవాలని ఉంది" అని అన్న జాఫర్... ఇంటిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మాత్రం తన బాధని అణుచుకోలేక ఏడ్చేశారు.

ఇక ఎలిమినేట్  అయ్యి బయటకి వచ్చాక.. నాగార్జునతో కలిసి స్టేజ్ పై తన భావాలను పంచుకున్నారు జాఫర్. "బిగ్‌బాస్ మీకు ఇంకొకసారి ఇంటిలోకి వెళ్లేందుకు అవకాశం ఇస్తే.. మీరు వెళతారా అని ప్రశ్నిస్తే?" తప్పకుండా వెళతానని సమాధానమిచ్చాడు జాఫర్. దీనితో గత సీజన్ కంటెస్టెంట్స్ మాదిరిగా.. జాఫర్ కూడా ఒకసారి ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యి.. మరలా ఇంటిలోకి వచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి గత సీజన్‌లో యాంకర్ శ్యామల, నూతన్ నాయుడులు ఎలిమినేట్ అయిన తరువాత కూడా.. మళ్లీ బిగ్‌బాస్ ఇంటికి రావడం జరిగింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రివ్యూ.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?

నిన్న జరిగిన పరిణామాలు...

చిత్రమేంటంటే.. నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులలో ఎక్కువమంది.. జాఫర్‌ని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి పంపకూడదనే తెలిపారు. ఈ క్రమంలో గత సీజన్ మాదిరిగానే.. జాఫర్ మరలా వైల్డ్ కార్డ్ రూపంలో బిగ్‌బాస్ హౌస్‌కి  తిరిగి వస్తారనే టాక్ మొదలైంది. అదే గనుక జరిగితే, "బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3"లో పెద్ద ట్విస్ట్ ఇదే అని చెప్పవచ్చు. 

అలాగే నిన్న బిగ్‌బాస్‌లో జరిగిన "ఫ్రెండ్ షిప్ డే" ముచ్చట్లు ఆసక్తికరంగా సాగాయి. తమతో ఫ్రెండ్లీగా ఉన్న వ్యక్తులను గురించి పంచుకోమనగా.. కంటెస్టెంట్స్ ఆ వివరాలు పంచుకున్నారు. 

ఇదిలావుండగా నిన్నటి ఎపిసోడ్లో సండే ఎట్రాక్షన్ పేరిట ఇస్మార్ట్ శంకర్ టీం - హీరో రామ్, హీరోయిన్ నిధి అగర్వాల్‌లు అతిథులుగా బిగ్‌బాస్ షోకి రావడం జరిగింది. అయితే వీరిరువురు బిగ్‌బాస్ హౌస్‌లోకి మాత్రం వెళ్ళలేదు.

ఇక వీరిద్దరి చేత ఇంటిలోని సభ్యులకి సరిపోయే సినిమా టైటిల్స్‌ని ఇచ్చే గేమ్ ఆడించడం జరిగింది. అలాగే ఎపిసోడ్ చివరన కొసమెరుపులా సాగిన ఈ గేమ్‌లో ఇంటి సభ్యులు, ఇస్మార్ట్ శంకర్ హీరో-హీరోయిన్‌లు డ్యాన్స్ చేసి అందరిని అలరించారు.

ఆఖరుగా... ఈ సీజన్‌లో రెండు వారాలు పూర్తయిన తరువాత.. 15 మంది ఇంటి సభ్యులలో 14 మంది మిగిలారు. రాబోయే వారాల్లో మరింత ఆసక్తిగా ఈ సీజన్ ఉండబోతుంది అని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే బిగ్‌బాస్ షో అంటేనే ఎంటర్టైన్మెంట్‌తో పాటుగా.. కాస్త మసాలా కూడా ఉంటుంది.

రాక్షసుడు మూవీ రివ్యూ - థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వారి కోసం..