ADVERTISEMENT
home / ఫ్యాషన్
బెనారసీ చీర గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?

బెనారసీ చీర గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?

మన దేశంలో అత్యద్భుతమైన చీర(saree)ల గురించి చెప్పాలంటే వాటిలో ముందుగా గుర్తొచ్చేవి పట్టు చీరలే.. పట్టు చీరల్లోనూ బాగా పేరుగాంచిన బెనారస్, కంచి, ధర్మవరం చీరలంటే మహిళలకు చాలా ఇష్టం. అందులోనూ బెనారస్ (banarasi) చీరలు.. ఎక్కడో ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో పుట్టిన ఈ చీర దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచంలో చాలామంది మనసులను దోచేసుకుంది. అయితే ఈ చీర మన దేశంలో పుట్టింది కాదట.. అటు మొఘలుల సంస్కృతికి మన దేశ సంస్కృతిని జోడించి తయారుచేసిన చీరలివి.. ఈ చీర గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి..

పెళ్లి కూతురుని మరింత.. అందంగా మార్చే పెళ్లి పట్టుచీరలు..!

Instagram

ADVERTISEMENT

మన దేశంలో అద్భుతమైన చేనేత కళకు చిత్ర రూపం ఈ బెనారసీ చీరలు. ఈ చీరలు పురాతన కాలం నుంచి ఉన్నట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న బెనారసీ చీరలు మాత్రం ఇండో మొఘల్ సంస్కృతుల సంగమంగా తయారైన చీరలు. మన దేశంలో చీరల పుట్టుక నుంచే వారణాసిలో చీరలు తయారవుతున్నట్లుగా ఆధారాలున్నాయి. పట్టు చీరను హిరణ్య అంటారు. అంటే బంగారం నుంచి తయారైంది అని అర్థం. ఇది దేవతల వస్త్రధారణలో భాగం అని వేదాలు వెల్లడిస్తున్నాయి. అప్పటి నుంచి కొనసాగుతున్న కళ కాబట్టే అద్భుతమైన జరీ వర్క్‌తో పాటు అటు సంప్రదాయాన్ని, ఇటు ఆధునికతను చాటే డిజైన్లతో ఈ చీరలు సిద్ధమవుతున్నాయి.

వివిధ శరీర ఆకృతుల కోసం చీర కుచు డిజైన్

Instagram

ADVERTISEMENT

ఎప్పటి నుంచో ఉన్నా మొఘల్ రాజులు ముఖ్యంగా అక్బర్ పరిపాలన సమయంలో బెనారసీ సిల్క్‌లో చాలా మార్పులు జరిగాయట. అక్బర్ కి జరీ వర్క్ అన్నా, ఖరీదైన డిజైన్లతో ఉన్న పట్టు చీరలన్నా ఎంతో ఆసక్తి ఉండేదట. తన కిరీటంలో వాటిని ఉపయోగించడంతో పాటు తన భార్యలకు కూడా బహుమతులుగా ఇచ్చేవాడట. అంతేకాదు.. అక్బర్ ప్యాలెస్‌లో పరదాల నుంచి కార్పెట్ల వరకూ ప్రతిఒక్కటీ బెనారసీ సిల్క్‌తో, జరీ వర్క్‌తో చేయించేవారట. వారి సంస్కృతికి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసి దీన్ని నేత నేసిన పనివారు దాన్నే కొనసాగిస్తూ వచ్చారు. అందుకే ఇందులో కాస్త ఆ ఛాయలు కూడా కనిపిస్తాయని చెబుతారు. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వారు కూడా ఈ డిజైన్లన్నింటినీ చూసి ఇష్టపడడంతో దేశదేశాలకు దీని ఖ్యాతి వ్యాపించింది.

Instagram

తెలుగు రాష్ట్రాలకు చెందిన.. ఈ అద్బుతమైన చేనేత చీరల గురించి మీకు తెలుసా?

ADVERTISEMENT

గతంలో ఈ చీరలను నేయడానికి పట్టు దారాన్ని చైనా నుంచి తెప్పించుకునేవారట. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పట్టు దారాలు తయారవుతుండడంతో ఇక్కడి నుంచి వారణాసికి దారాలను తరలించి చీరలు నేస్తున్నారు. ఇప్పటికీ సంప్రదాయబద్ధమైన జరీ వర్క్ ఈ చీరల్లో కనిపిస్తుంది. అయితే ఒకప్పుడు బంగారం, వెండిలను కరిగించి ఆ దారాలను జరీలో ఉపయోగించేవారు. ఇప్పుడు బంగారం లేదా వెండి రంగుల కోటింగ్ వేసిన దారాలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. తద్వారా ఖర్చును తగ్గించి తక్కువ ధరకు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు.

Instagram

చేనేత ద్వారా ఈ చీరలను తయారుచేయడానికి కనీసం ముగ్గురు వ్యక్తులు అవసరమవుతారు. ఇందులో ఒకరు దారాల కండెలను సిద్ధం చేయడానికి.. మరొకరు నేయడానికి అవసరమవగా.. మరొకరు మాత్రం గ్రాఫ్ పేపర్ సాయంతో పంచ్ కార్డులను, డిజైన్లను సిద్ధం చేస్తారు. చీరపై ఉన్న డిజైన్ ఆధారంగా దాన్ని తయారుచేయడానికి పదిహేను రోజుల నుంచి ఆరునెలల వరకూ సమయం పడుతుంది. అరుదుగా ఆర్డర్ ఇచ్చి నేయించుకునే చీరలకు సంవత్సరం కూడా సమయం పడుతుంది.

ADVERTISEMENT

 

మొదటిసారి చీర కట్టుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే..

ప్రస్తుతం బెనారస్ చీరల్లో నాలుగు రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది బెనారసీ పట్టు చీరలు.. అవి కాకుండా.. ఆర్గాంజా, కోరా, జరీ చీరలు ఉంటాయి. ఇవి కాక డిజైన్ల బట్టి ఈ చీరలను జంగ్లా, తనచోయ్, బుటీదార్, టిష్యూ, కట్ వర్క్, వస్కత్, జాందానీ రకాలు కూడా ఉన్నాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

22 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT
good points logo

good points text