ADVERTISEMENT
home / Bollywood
రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ & ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ??

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ & ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ??

టైటిల్ చ‌ద‌వ‌గానే ఈ వార్త ఏ సినిమాకు సంబంధించిన‌దో మీకు ఇట్టే అర్థ‌మైపోయుంటుందిగా! మీ ఊహ నిజ‌మే.. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి చెక్కుతోన్న మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్ర‌మైన #RRR గురించే ఈ వార్త‌. ఈ సినిమాకు సంబంధించి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌తి చిన్న వార్త ఎంతో ప్రాధాన్యాన్ని సంపాదించుకుంటోంది. ఇందులో భాగంగానే రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ న‌టించ‌నుందంటూ మునుపు వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. తాజాగా ఇప్పుడు మ‌రొక వార్త చిత్ర‌సీమ‌లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. అది కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన వార్త కావ‌డంతో.. కాస్త స‌మ‌యంలోనే అది వైర‌ల్‌గా మారిపోయింది. ఇంత‌కీ ఆ వార్త ఏంటంటే..

#RRR చిత్రంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌న నటించేందుకు ఇప్ప‌టికే బాలీవుడ్ బ్యూటీల‌ను సంప్ర‌దిస్తున్నార‌ని వార్త‌లు రాగా; ఇదే సినిమాలో యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించేందుకు హాలీవుడ్ బ్యూటీ (Hollywood Heroine) అయితే బాగుంటుంద‌ని అనుకుంటున్నార‌ట ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. అంతేకాదు.. అనుకున్న‌దే త‌డ‌వుగా కొంత‌మంది న‌టీమ‌ణుల పోర్ట్ ఫోలియోలు కూడా చెక్ చేసి, క‌థ‌కు స‌రిపోతార‌ని అనిపించిన ముద్దుగుమ్మ‌ల‌తో సంప్ర‌దింపులు కూడా జ‌రిపారట‌! అయితే ఆ భామామ‌ణి ఎవ‌ర‌న్న‌ది మాత్రం ఇంకా తేల‌లేద‌ట‌! కానీ ఈ వార్త ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు. మునుపు వ‌చ్చిన వార్త‌ల‌పైనే ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించని రాజ‌మౌళి చిత్ర‌బృందం మ‌రి, ఈ వార్త‌ల‌పై ఎప్పుడు స్ప‌ష్ట‌త ఇస్తారో చూడాలి.

 

ఒక‌వేళ ఈ వార్త నిజ‌మై ఎన్టీఆర్ స‌ర‌స‌న విదేశానికి చెందిన చిన్న‌ది జ‌త క‌ట్టినా తెలుగు చిత్రాల్లో న‌టించిన తొలి విదేశీ న‌టీమ‌ణి కాలేదు. ఎందుకంటే ఇప్ప‌టికే ఈ జాబితాలో చాలామంది ముద్దుగుమ్మ‌లు ఉన్నారు. తీన్ మార్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టించిన డానా మార్క్స్ (Dana Marks), సాయి ధరమ్ తేజ్ హీరోగా న‌టించిన తిక్కలో హీరోయిన్ గా న‌టించిన లారిస్సా బోనేస్సి (Larissa Bonessi).. త‌దిత‌రులు ఈ కోవ‌కే చెందుతారు. ఇప్పుడు “ఆర్ ఆర్ ఆర్” చిత్రం గురించి వినిపిస్తోన్న ఈ వార్త నిజ‌మే అయితే ఈ జాబితాలో మ‌రో ముద్దుగుమ్మ చేర‌నుందంతే..!

ADVERTISEMENT

“ఆర్ ఆర్ ఆర్” చిత్రం ప్రారంభోత్స‌వం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకు సంబంధించిన ఎలాంటి స‌మాచారం బ‌య‌ట‌కు పొక్క‌నీయ‌కుండా క‌ట్టుదిట్టంగానే భ‌ద్ర‌తాచ‌ర్య‌లు పాటిస్తున్నారు జ‌క్క‌న్న‌. ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి సైతం మీడియాను అనుమ‌తించ‌లేదంటే ఇక సినిమాకు సంబంధించిన వార్త‌లు, విశేషాలు.. వంటి వ్య‌వ‌హారాల్లో ఇంకెంత క‌ట్టుదిట్టంగా వ్య‌వ‌హ‌రిస్తారో మ‌న‌కు ఇట్టే అర్థ‌మైపోతోంది.

 

రెండు రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం అయిన‌ట్లు సంగీత ద‌ర్శ‌కుడు ఎమ్.ఎమ్. కీర‌వాణి (MM Keeravani) ట్విట్ట‌ర్ ద్వారా అంద‌రితో పంచుకోవ‌డంతో ఆ ఒక్క వార్త అధికారికంగా వెలువ‌డిన‌ట్లైంది. ఈ చిత్రానికి రాజ‌మౌళి ఆస్థాన కెమెరామెన్‌గా సుప‌రిచితుడైన సెంథిల్ కుమార్ (Senthil Kumar) ఛాయాగ్రాహ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుండ‌గా, రాజ‌మౌళి స‌తీమ‌ణి ర‌మా రాజ‌మౌళి, వ‌దిన శ్రీ‌వ‌ల్లి ప్రొడ‌క్ష‌న్ బాధ్య‌త‌లు చూసుకుంటున్నారు. డీవీవీ దాన‌య్య ఈ సినిమాను త‌న నిర్మాణ సంస్థ‌పై అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోన్న విష‌యం మ‌న‌కు విదిత‌మే.

అయితే ఇందులో న‌టిస్తోన్న న‌టీన‌టుల వివ‌రాలు మాత్రం ఇంకా పూర్తిగా బ‌య‌ట‌కు రాలేదు. ఈ వార్త‌ల‌పై స్ప‌ష్ట‌తతో పాటు ఈ వివ‌రాలు కూడా ఎప్పుడు ప్ర‌క‌టిస్తారా అని అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కానీ జ‌క్క‌న్న సినిమా అంటేనే ఒక అంద‌మైన శిల్పం లాంటిది. మ‌రి, దానిని చెక్కేందుకు స‌మ‌యం ప‌డుతుంది క‌దా! కాబ‌ట్టి అభిమానులు ఇంకొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు..! అయితే రాజ‌మౌళి త్వ‌ర‌లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ వార్త‌లు, ఇందులో న‌టిస్తోన్న న‌టీన‌టుల వివ‌రాల‌పై ఒక స్ప‌ష్ట‌త‌నివ్వ‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ADVERTISEMENT

ఇవి కూడా చ‌ద‌వండి

అమీర్ ఖాన్ “దంగల్” సినిమా.. హాలీవుడ్‌లో విల్ స్మిత్ చిత్రానికి ప్రేరణ..?

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో.. మరో కొత్త చిత్రం..!

“సైరా” చిత్రంలో.. కథను మలుపు తిప్పే మెగా డాటర్..?

ADVERTISEMENT
11 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT