ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
అతనితో గడిపిన ఆ రాత్రి.. నేను ఎప్పటికీ మర్చిపోలేను..  ఎందుకంటే..?

అతనితో గడిపిన ఆ రాత్రి.. నేను ఎప్పటికీ మర్చిపోలేను.. ఎందుకంటే..?

Breakup Stories

ప్రతి అమ్మాయి జీవితంలోనూ ప్రేమ అనేది అనివార్యం. కొందరికి తొలి ప్రేమ జీవితాంతం నిలిస్తే.. మరికొందరి విషయంలో మాత్రం వివిధ సమస్యల కారణంగా ఆ బంధం మధ్యలోనే తెగిపోతుంది. అలా విడిపోయిన ఇద్దరు వ్యక్తులు మళ్లీ తిరిగి కలిస్తే? మనసులో ఏదో అలజడిగా అనిపిస్తుంది కదూ. అవును.. బంధాన్ని తెంచుకున్న ఆ వ్యక్తిని మళ్లీ కలిశాక.. అతనితో తన ఆలోచనలను పంచుకోవడం మాత్రమే కాకుండా.. ఒక రాత్రంతా తనతో గడిపితే ఎలా ఉంటుందో తెలుసా? అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న ఓ అమ్మాయి మదిలోని భావాలివి.

అతనితో నేను అనుకోకుండా ప్రేమలో పడ్డాను. కానీ మా మధ్య అభిప్రాయ భేదాలు పదే పదే వచ్చేవి. దీంతో నేను తనని వదిలేశాను. అయితే ఇంత జరిగినా తన గురించి నా మనసులో ఎందుకో మంచి అభిప్రాయమే ఉండేది. మేం విడిపోయినా సరే.. మళ్లీ కలిసి జీవిస్తే బాగుంటుందని అనిపించేది.

ఇది అవివేకమైన ఆలోచనే కావచ్చు. కానీ తన కోసం చాలా రాత్రుళ్లు మెలకువగా ఉండి వేచి చూసేదాన్ని. గుండె పగిలేలా ఏడ్చేదాన్ని. తనని కాలేజీలో లేదా బయట ఎక్కడ చూసినా నా మనసు చివుక్కుమనేది. ఇక సోషల్ మీడియా  నా సమస్యను మరింత పెంచేది. నన్ను మర్చిపోయి తను మరో అమ్మాయిని ప్రేమించాడు. వాళ్లిద్దరి ఫొటోలు చూసి నాకు చాలా బాధనిపించేది. నన్ను మర్చిపోవడానికి ఆ అమ్మాయికి దగ్గరయ్యాడేమో అని కూడా అనిపించేది. కానీ ఆ తర్వాత మూడేళ్లకు వాళ్లిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అది చూసి నేను కూడా ఇక జీవితంలో ముందుకెళ్లడం మంచిదని నిర్ణయించుకున్నా.

ADVERTISEMENT

హైదరాబాద్‌లో నేనుండే ప్రదేశంలోనే తను కూడా అద్దెకు దిగడంతో.. నాకు ఊపిరి ఆడనట్లుగా అనిపించేది. తను ఎక్కడ కనిపిస్తాడో అని భయమేసేది. అందుకే సిటీ నుంచి దూరంగా వెళ్లిపోవాలని భావించాను. అందుకే మా ఊరికి వెళ్లిపోయాను. మా అమ్మా, నాన్నలతో సమయం గడుపుతూ.. తనని మర్చిపోయే ప్రయత్నం చేశాను. దాదాపు ఆరు నెలల పాటు అలా ఉండిపోయాను. అలాగే ఈ రోజులన్నీ సోషల్ మీడియాకి దూరమయ్యా.

ఆరు నెలల తర్వాత తనని పూర్తిగా మర్చిపోయానని అనిపించాక తిరిగొచ్చాను. ఉద్యోగం కోసం ఓ సాఫ్ట్‌వేర్ కోర్సులో చేరాను. అక్కడే నేను రాహుల్ అనే వ్యక్తిని కలిశాను. మేమిద్దరం మొదట మంచి స్నేహితులమయ్యాం. మా ఇద్దరి మధ్య ఏవైనా గొడవలు జరిగితే వెంటనే మాట్లాడుకొని పరిష్కరించుకునేవాళ్లం. తన పరిచయం తర్వాత.. నేను నా బాధల నుంచి బయట పడ్డా. తను నాకు ప్రేమించడం నేర్పాడు.

ఒక రకంగా నేను కొత్త జీవితాన్నే మొదలుపెట్టాను. కానీ ఓ రోజు అనుకోని సంఘటన జరిగింది. మా కాలేజీ రీ యూనియన్ ఏర్పాటైంది. నా స్నేహితురాలు పార్టీ ఇస్తూ.. అందరినీ పిలవడంతో నేను కూడా అక్కడికి వెళ్లాను. అప్పుడే నాకు నా జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన వ్యక్తి మళ్లీ గుర్తుకొచ్చాడు. కానీ మరో వ్యక్తితో ఆనందంగా ఉన్నా కాబట్టి.. తన గురించి ఆలోచించలేదు. అందుకే ధైర్యంగా పార్టీకి వెళ్లాను.  కానీ మనం అనుకున్నవన్నీ జరిగితే.. అది జీవితం ఎందుకవుతుంది? పార్టీకి అతను వచ్చాడు. అతన్ని నేను చూశాను. అతను కూడా నన్ను చూశాడు.

ADVERTISEMENT

నేను తనని మర్చిపోయి మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నానని నాకు తెలుసు. కానీ మళ్లీ అతన్ని చూడగానే నాకు పాత రోజులన్నీ గుర్తుకువచ్చాయి. అతనితో గడిపిన క్షణాలు గుర్తుకువచ్చి ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఆ రాత్రి పార్టీలో డ్రింక్ తాగిన తర్వాత నాకెందుకో తన చేతులు పట్టుకొని ఏడ్వాలనిపించింది. అయినా సరే.. గతం గుర్తుకువచ్చి.. అతని దగ్గరికి వెళ్లకూడదని భావించాను. కానీ అప్రయత్నంగానే నా కాళ్లు.. నన్ను అతని టేబుల్ వద్దకు తీసుకెళ్లాయి. మద్యం మత్తులో తనకు నేను ముద్దు పెట్టేశాను. అతను కొద్ది నిమిషాలు నన్ను ఆశ్చర్యంగా చూశాడు. ఆ తర్వాత అతను కూడా నాకు ముద్దు పెట్టాడు. ఆ ముద్దు ఎంతో ‘స్పెషల్’ అని మేం ఫీలయ్యాం. 

ఆ రాత్రి తను లైట్లన్నీ స్విచ్ఛాఫ్ చేసి తన చేతులను నా మీదుగా పోనిచ్చాడు. నా ఒంటినంతా తాకాడు.  ముద్దుల వర్షం కురిపించాడు. ఆ తర్వాత మేమిద్దరం శారీకరంగా కలిశాం. ఆ సమయంలో అతనికి నా మీద ఉన్న కోపం, కోరిక రెండూ కనిపించాయి. ఆ రాత్రి మేం గతానంతా మర్చిపోయి.. స్వేచ్ఛగా జీవించామని చెప్పవచ్చు.

ఉదయం లేచే సరికి బెడ్ పై అతను ఓ నోట్ పెట్టి  వెళ్లిపోయాడు. ‘నన్ను క్షమించు.. రాత్రి జరిగింది చాలా పెద్ద తప్పు. అది నేను కావాలని చేసింది కాదు. నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా’ అని ఆ నోట్ పై రాసి ఉంది. ఆ తర్వాత అతను ఓ నెలకే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడాడు. కానీ నేను మాత్రం ఈ నిజాన్ని దాచిపెట్టలేకపోయాను.

ADVERTISEMENT

ఆ రోజు రాత్రి జరిగిందంతా నేను నా ఆఫీసు కొలీగ్‌కి (నన్ను ప్రేమిస్తున్న వ్యక్తికి) చెప్పేశా. తను ఆలోచించుకోవడానికి కాస్త సమయం కావాలని చెప్పాడు. అతనికి నేను చెప్పింది జీర్ణించుకోవడం కాస్త కష్టమే. అందుకే తనను కొన్ని రోజులు ఒంటరిగా వదిలేయాలనుకుంటున్నా. నేను తప్పు చేశాను. దాన్ని ఒప్పుకున్నా. రాసి పెట్టి ఉంటే.. మేం మళ్లీ కలుస్తాం. కానీ నేను మాత్రం అబద్ధాలతో నా బంధాన్ని కొనసాగించాలనుకోలేదు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

14 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT