ADVERTISEMENT
home / Bollywood
‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ ఎదుర్కొన్న.. #MeToo అనుభవం గురించి మీరు విన్నారా??

‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ ఎదుర్కొన్న.. #MeToo అనుభవం గురించి మీరు విన్నారా??

‘జెర్సీ’ చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన ముద్దుగుమ్మ శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha srinath). తొలిచిత్రంలోనే ఇటు గ్లామరస్‌గా కనిపిస్తూనే.. అటు గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించే పాత్రలో ఒదిగిపోయింది. అంతేనా.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంలో బాగానే సఫలమైందని చెప్పచ్చు. తద్వారా ప్రస్తుతం యావత్ తెలుగు సినీపరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకుందీ సుందరి.

ఈ క్రమంలో ప్రస్తుతం మీడియా అంతా ఆమె మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఆమెకు సంబంధించి ఏ చిన్న వార్త వెలుగులోకి వచ్చినా అది క్షణాల్లో వైరల్‌గా మారిపోతుందంటే.. ఆమెకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో మీరే అర్థం చేసుకోండి. అయితే శ్రద్ధ శ్రీనాథ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన జీవితంలో ఎదుర్కొన్న #MeToo అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఇంతకీ శ్రద్ధకి ఎదురైన ఆ భయంకరమైన సంఘటన ఏంటంటే-

19 ఏళ్ల వయసులో ఓసారి తన సొంత పని మీద బెంగళూరు నుంచి కొచ్చికి ప్రయాణమైందట శ్రద్ధ. అది రాత్రి పూట కావడంతో ప్రయాణం మొదలైన కాసేపటికే ఆమె నిద్రలోకి జారుకుంది. కాసేపటికి శ్రద్ధ శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎవరో తాకుతున్నట్లుగా అనిపించి కళ్లు తెరచి చూసింది. తీరా చూసేసరికి తన పక్క సీటులో కూర్చొన్న వ్యక్తి చేతులు ఆమెను తడుముతున్నాయని అర్థమై షాక్ తింది. పైగా అది రాత్రి సమయం కావడంతో బస్సులో ఉన్నవారంతా నిద్రపోతుండడంతో.. ఆ కంగారులో ఏం చేయాలో తెలియక అతన్ని పక్కకి తోసేసి మిన్నకుండిపోయిందట శ్రద్ధ. అంతేకాదు.. ఆ రాత్రంతా నిద్రపోకుండా భయంభయంగానే ప్రయాణాన్ని కొనసాగించానని చెప్పుకొచ్చింది.

 

ADVERTISEMENT

ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే వెంటనే బస్సులో ఉన్నవారిని నిద్ర లేపి జరిగింది చెప్పాల్సిందని, లేదా బస్సుని వెంటనే ఆపించి దగ్గర్లోని పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందని.. ఇలా రకరకాలుగా చాలామంది ఈ అమ్మడికి సలహాలు ఇచ్చారట. “కానీ అప్పటికి నా వయసు 19 ఏళ్లే కావడం, అలాంటి అనుకోని ఘటన ఎదురైనప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండడంతో తానేమీ చేయలేకపోయా” అంటూ అప్పట్లో తాను ఎదుర్కొన్న ఒత్తిడి గురించి కూడా వివరించింది ఆమె.

అయితే జరిగిన ఈ సంఘటన గురించి ట్విట్టర్ వేదికగా అందరితోనూ పంచుకున్న సమయంలో నెటిజన్ల నుంచి ఆమెకి విమర్శలు కూడా ఎదురయ్యాయట. అసలు మీరు చేస్తున్న ఆరోపణలు నిజమే అనడానికి రుజువేంటి? పబ్లిసిటీ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ శ్రద్ధని విమర్శించారు. అయితే వాటికి ఏమాత్రం బెదరకుండా దీటుగా బదులిచ్చింది శ్రద్ధ. రుజువులంటే- “అతను నా పైన చేయి వేస్తున్న సమయంలో సెల్ఫీ తీసి అది చూపెట్టాలా?” అంటూ ఘాటుగా ప్రశ్నించిన శ్రద్ధ; పబ్లిసిటీ కోసం తనకు ఇలా పోస్ట్ చేయాల్సిన అవసరం లేదని దీటుగానే బదులిచ్చింది. ఒక కథానాయికగా నాకు ఇప్పటికే ఎంతో కొంత పబ్లిసిటీ ఉంది. అలాంటప్పుడు ఈ విధమైన కామెంట్స్ చేయడం ద్వారా పబ్లిసిటీ చేసుకోవాల్సిన ఖర్మ నాకేం పట్టలేదు.. అని సమాధానమిచ్చింది.

మనసులో ఏం అనుకుంటే అది నిర్మొహమాటంగా వ్యక్తీకరించే నేను ఎప్పుడూ ఎవ్వరినీ టార్గెట్ చేసి మాట్లాడను. అది నా నైజం కాదంటూ సూటిగా తన గురించి చెప్పుకొచ్చింది శ్రద్ధ శ్రీనాథ్. ఇక ప్రస్తుతం తెలుగులో ఆమెకు వస్తున్న అవకాశాల గురించి మాట్లాడుతూ- ఇప్పటికే తాను అంగీకరించిన రెండు తెలుగు చిత్రాలు పూర్తి చేశానని, జెర్సీ అందించిన విజయం తర్వాత ఎలాంటి అవకాశాలు వస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

మరి, అందంతో పాటు చక్కని నటప్రతిభ కూడా ఉన్న ఈ సుందరికి తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు, పాత్రలు రావాలని, ఆమె మనల్ని మరిన్ని మంచి చిత్రాలతో అలరించాలని మనమంతా కూడా ఆశిద్దాం..

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి

‘జెర్సీ’ చిత్రంలో మనల్ని కన్నీళ్లు పెట్టించే.. టాప్ 6 సన్నివేశాలు ఇవే..!

‘జెర్సీ’ తో నానీ సిక్స్ (సక్సెస్) కొట్టాడా లేదా? – మూవీ రివ్యూ

కొడుకు కోసం.. మళ్లీ క్రికెటర్‌గా మారే తండ్రి కథ “జెర్సీ”..!

ADVERTISEMENT
24 Apr 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT