ADVERTISEMENT
home / Celebrity gossip
గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్‌కి ప‌రిచ‌య‌మైన‌ప్పుడు.. ఈ అందాల రాశులు ఎలా ఉన్నారంటే..!

గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్‌కి ప‌రిచ‌య‌మైన‌ప్పుడు.. ఈ అందాల రాశులు ఎలా ఉన్నారంటే..!

సినిమా రంగం.. గ్లామ‌ర్‌తో కూడుకున్న‌ది. ఇలాంటి గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్‌ (Glamour world)లో అడుగుపెట్టాలంటే అందాల రాశులై ఉండాల్సిందే. అయితే చాలామంది క‌థానాయిక‌లు(Heroines) సినిమా రంగంలో అడుగుపెట్టిన‌ప్పుడు ఒక‌లా ఉంటే.. ఆ త‌ర్వాత మ‌రింత అందం కోసం వివిధ ట్రీట్‌మెంట్లు, స‌ర్జ‌రీలు చేయించుకొని కొత్త‌గా ర‌డీ అవుతారు.

అయితే స‌హ‌జ‌త్వంలోని కిక్కే వేరు. ఆ స‌హ‌జ‌మైన అందం ఎప్ప‌టికీ చెరిగిపోనిది. కొన్ని రోజులు పోతే స‌ర్జ‌రీలు చేయించుకోక‌పోయినా కొంద‌రు క‌థానాయిక‌లు కొత్త‌గా తయార‌వుతారు..

aish

తాజాగా ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ టీనేజీలో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటున్న‌ప్ప‌టి ఫొటో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. ఐశ్వ‌ర్య సినిమాల‌కు ముందు మోడ‌ల్‌గా ప‌నిచేసి.. ఆ తర్వాత మిస్ ఇండియా, మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాతే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అందాల తార‌గా బాలీవుడ్‌ని ఏలింది ఐశ్వ‌ర్యారాయ్. కొన్నాళ్ల‌కు అభిషేక్ బ‌చ్చ‌న్‌ని వివాహ‌మాడి ఆరాధ్య‌కు జ‌న్మ‌నిచ్చింది.

ADVERTISEMENT

మ‌ధ్య‌లో కొన్నేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉన్నా.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతోందీ ముద్దుల గుమ్మ. మిస్ ఇండియా నాటి ఫొటోలో ఐశ్వ‌ర్య‌కి.. ఇప్ప‌టి ఐశ్వ‌ర్య‌కి ఎంతో తేడా ఉన్నా.. ఆమె ముఖంలోని మెరుపు, అమాయ‌క‌త్వం అలాగే ఉన్నాయ‌ని అభిమానులు కామెంట్ చేయ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో  ఐశ్వ‌ర్యారాయ్‌లా మ‌రికొంద‌రు క‌థానాయిక‌లు త‌మ కెరీర్ ప్రారంభించిన‌ప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకుందాం రండి..

trisha

1. త్రిష‌

త‌మిళ అందం త్రిష మ‌న తెలుగు సినిమా “నీ మ‌న‌సు నాకు తెలుసు” ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌య‌మైంద‌ని చాలామంది భావిస్తారు. మ‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఆమె ఆ చిత్రంతోనే పరిచయమైనా.. అంతకుముందే ఫల్గుణీ పాఠ‌క్ ఆల్బంలో న‌టించిందీ అందా రాశి. మేరీ చూన‌ర్ ఉడ్ ఉడ్ జాయే.. అనే పాట‌లో వ‌న‌క‌న్య‌గా న‌టించింది త్రిష‌.

shreya

ADVERTISEMENT

2. శ్రియ‌

త్రిష మొద‌టి సినిమా “నీ మ‌న‌సు నాకు తెలుసు”లో న‌టించిన.. ఆమె స్నేహితురాలు శ్రియ తెలుగుతెర‌కు “ఇష్టం” అనే సినిమా ద్వారా ప‌రిచ‌యమైంది. అంత‌కుముందు ఆమె కొన్ని ప్ర‌క‌ట‌న‌ల్లో కనిపించింది.

tapsee

3. తాప్సీ

“ఝుమ్మంది నాదం” సినిమాలో మ‌నోజ్‌కి జంట‌గా న‌టించి తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన తాప్సీ.. వెండితెర‌కు అదే మొద‌టిసారి అయినా..దానికి ముందే ఎన్నో ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించింది. మిస్ ఇండియా 2008 పోటీల్లోనూ పాల్గొంది. ఆ పోటీల్లో మిస్ ఫ్రెష్ ఫేస్‌గా కూడా ఎంపికైంది.

kajal

ADVERTISEMENT

4. కాజ‌ల్‌

తేజ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన “ల‌క్ష్మీ క‌ల్యాణం”తో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది కాజల్. కానీ అంత‌కు కొన్ని సంవ‌త్స‌రాల ముందే బాలీవుడ్‌లో ఐశ్వ‌ర్యారాయ్ న‌టించిన “క్యూ హో గ‌యా నా”.. అనే చిత్రంలో ఆమె స్నేహితురాలి పాత్ర‌లో న‌టించింది కాజ‌ల్.

samantha-akkineni

5. స‌మంత‌

“ఏం మాయ చేశావే” చిత్రంతో అంద‌రినీ మాయ చేసి ప‌డేసింది స‌మంత‌. అయితే ఆమెకు ఈ అవ‌కాశం ద‌క్కేందుకు అంత‌కుముందు ఆమె న‌టించిన ఓ ప్ర‌క‌ట‌న కార‌ణం. ఓ బంగారం దుకాణం కోసం త‌మిళంలో ఆమె చేసిన ఈ ప్ర‌క‌ట‌న చూసిన గౌత‌మ్ మీన‌న్ ఆమెకు “ఏం మాయ చేశావే” చిత్రంలో అవ‌కాశాన్ని అందించార‌ట‌. అప్ప‌టికి, ఇప్ప‌టికి స‌మంత‌లో ఎంత మార్పు వ‌చ్చిందో చూడండి..

hansika

ADVERTISEMENT

6. హ‌న్సిక‌

బాల న‌టిగా హృతిక్ రోష‌న్ న‌టించిన “కోయీ మిల్ గ‌యా” చిత్రంలో క‌నిపించిన హ‌న్సిక పెద్ద‌య్యాక.. క‌థానాయిక‌గా దేశ‌ముదురు సినిమాలో క‌నిపించింది. ఈ బ్యూటీ అప్ప‌టికీ ఇప్ప‌టికీ పెద్ద‌గా మార‌లేద‌నే చెప్పుకోవాలి.

ShrutiHaasan

7. శృతి హాస‌న్‌

“హే రామ్” చిత్రంతో బాల న‌టిగా మారిన శృతి హాస‌న్.. ఆ త‌ర్వాత “ల‌క్” సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి త‌న ల‌క్  కోసం ప్రయత్నించింది. కానీ ఆ చిత్ర‌మే కాదు.. ఆ త‌ర్వాత న‌టించిన మ‌రికొన్ని సినిమాలు కూడా ప‌రాజ‌యం పాల‌య్యాయి. దాంతో ఆమెను ఐర‌న్ లెగ్‌తో పోల్చారు చాలామంది. ప‌వ‌న్‌తో ఆమె క‌లిసి న‌టించిన “గ‌బ్బ‌ర్‌సింగ్” విజ‌య‌వంత‌మ‌య్యాకే ఆమె పాపుల‌ర్ హీరోయిన్‌గా మారింది. మ‌రి, ల‌క్ సినిమాలో శృతి ఎలా ఉందో చూడండి..

anushka 3577517

ADVERTISEMENT

8. అనుష్క‌

నాగార్జున‌, సోనూ సూద్ క‌లిసి న‌టించిన “సూప‌ర్” చిత్రంతో అనుష్క తెలుగు తెర‌కు పరిచ‌య‌మైంది. యోగా మాస్ట‌ర్ అయిన అనుష్క అప్ప‌టికీ ఇప్ప‌టికీ పెద్ద‌గా మార‌లేదు.. కానీ త‌న అంద‌మే మ‌రింత పెరిగింద‌ని చెప్పుకోవాలి.

rakul

9. ర‌కుల్ ప్రీత్ సింగ్‌

ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలుగులో “వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్” చిత్రంతో అడుగుపెట్టింది. అయితే అంత‌కుముందే క‌న్న‌డంలో “7/ జి బృందావ‌న్ కాల‌నీ” రీమేక్ “గిల్లి” చిత్రంలో న‌టించింది. ఆపై మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొంది. టైటిల్‌కి కేవ‌లం రెండ‌డుగుల దూరంలో.. ఐదో స్థానంలో నిలిచిందీ అమ్మ‌డు. అయితేనేం త‌న అందంతో మిస్ ఇండియా విన్న‌ర్ల కంటే ఎక్కువ ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించి సినిమాల్లో అద‌ర‌గొట్టంది.

ఇవి కూడా చ‌ద‌వండి.

ADVERTISEMENT

దీపిక అంద‌మైన‌ మైన‌పుబొమ్మ‌ను చూసి.. ర‌ణ్‌వీర్ ఏమ‌న్నాడో తెలుసా?

సెలబ్రిటీ టాక్: ప్రేమబంధం కలకాలం.. నిలవాలంటే ఏం చేయాలి ..?

అతిలోక సుంద‌రి శ్రీదేవి.. అరుదైన చిత్రాల‌ను మీరూ చూస్తారా?

22 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT