ADVERTISEMENT
home / Astrology
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

జీవితంలో డబ్బుతోనే ప్రతి ఒక్కటి కొనేయలేమని చాలామంది అంటారు. కానీ ఆనందంగా జీవించాలంటే డబ్బే ప్రధానం. అలాగని డబ్బుంటేనే ఆనందం ఉంటుందని కాదు. కానీ మనకు సంతోషాన్ని కలిగించే కొన్ని వస్తువులను కొనాలంటే.. డబ్బు అవసరమెంతైనా ఉంటుంది. డబ్బు సంపాదించడం కాస్త కష్టమే కావచ్చు. కానీ అసాధ్యం కాదు.

కానీ కొన్ని రాశుల (zodiac signs) వారికి మాత్రం ఎప్పుడూ డబ్బుకి లోటుండదట. ఇందులో కొందరు పుట్టుకతోనే ధనవంతులైతే (richest).. మరికొందరు తామే కష్టపడి ధనవంతులుగా మారతారట. జీవితంలో ఏ సందర్భంలోనూ ధనానికి లోటు లేకుండా జీవించే ఆ రాశులవారు ఎవరో తెలుసుకుందాం రండి.      

సింహ రాశి ( 23 జులై నుంచి 22 ఆగస్ట్ )

ఈ రాశివారికి సూర్యుడు అధిపతి. నవగ్రహాల్లో సూర్యుడు చాలా ముఖ్యమైన గ్రహాధిపతి. దీని ప్రకారం చూస్తే సూర్యుడు అధిపతి కాబట్టి ఈ రాశి వారు కూడా ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉండాలని భావిస్తారట. వీరి దగ్గర అవసరాన్ని మించి ధనం ఉంటుందట. వీటితో తాము ఏవి కావాలంటే అవి కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతుంటారు.  వీరికి పుట్టుక నుంచి మరణం వరకూ ధనానికి లోటు ఉండదు.

కానీ దీని అర్థం.. వారు ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుంటారని మాత్రం కాదు. వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయట. అందుకే వీళ్లు చిన్న వయసులోనే తమ కంటే పెద్దవారికి పై అధికారిగా పని చేస్తారు. మొత్తంగా చెప్పాలంటే వీరు తమ జీవితంలో అనుకున్న దానికంటే ఎక్కువ ధనాన్ని సంపాదించడంతో పాటు పొదుపు కూడా చేస్తారట.

ADVERTISEMENT

వృషభ రాశి ( ఏప్రిల్ 22 నుంచి మే 20)

ఈ రాశిలో పుట్టినవారికి తమ దర్పం చూపించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. వీరి దగ్గర ప్రతివీ బ్రాండెడ్, ఖరీదైన వస్తువులు ఉంటాయి. ఎందుకంటే వీరు వస్తువుల నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడరు. ఈ రాశివారికి ఆస్తులు వారసత్వంగా వచ్చి ఉంటాయి. అయితే వీరి తెలివితేటలతో వీళ్లు కూడా ఆ ఆస్తులను మరింత పెంచే ప్రయత్నం చేస్తారు.

వీరికి బయట తిరగడం, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. వీటి కోసమే ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. వీరు ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకూ వదిలిపెట్టరు. దాని కోసం ఏం చేసైనా సరే సాధించి తీరుతారు.

ADVERTISEMENT

కర్కాటక రాశి (22 జూన్ నుంచి 22 జులై)

ఈ రాశి వారు చాలా భావోద్వేగాలు కలిగి ఉంటారు. వీళ్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఆనందంగా ఖర్చు చేస్తారు. వీరి విషయంలో డబ్బు కేవలం ఆనందాన్ని అందించేందుకు ఒక సాధనం మాత్రమే. వీరికి జీవితంలో ఏ స్థితిలోనూ డబ్బుకు లోటు ఉండదు. వీరు తమ కాళ్లపై తాము నిలబడతారు. పెద్దలు ఇచ్చిన ఆస్తితో కాకుండా తమ తెలివితేటలతో డబ్బు సంపాదించుకుంటారు. వీళ్లు ధనవంతులు అవ్వడానికి చాలా చిన్నతనం నుంచే సంకేతాలు కనిపిస్తుంటాయి.

అయితే వీళ్లు డబ్బు దాచిపెట్టుకునే వాళ్లు మాత్రం కాదు. తమ సంతోషాలు, తమ కుటుంబ సభ్యుల సంతోషాల కోసం వీళ్లు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తుంటారు. డబ్బుతో వచ్చే లగ్జరీ లైఫ్‌ని తాము జీవిస్తూ.. తమ కుటుంబ సభ్యులకు ఆ జీవితాన్ని అందిస్తూ వీరు ఆనందాన్ని సొంతం చేసుకుంటారు.

వృశ్చిక రాశి (23 అక్టోబర్ నుంచి 21 నవంబర్)

ఈ రాశి వారికి కూడా లగ్జరీ వస్తువులంటే చాలా ఇష్టం. ఇతరుల కంటే తాము ధనవంతులం.. లగ్జరీ జీవితాన్ని జీవిస్తున్నాం.. అని చూపించుకోవడానికి వీరు చాలా డబ్బు ఖర్చు చేస్తుంటారు. ఈ రాశిలో జన్మించిన చాలామందికి తాము ఆర్జించిన దాని కంటే వారసత్వంగా వచ్చిన ఆస్తి ఎక్కువగా ఉంటుంది.

ADVERTISEMENT

అందుకే వీళ్లు డబ్బు ఖర్చు చేయడానికి ముందూ వెనక ఆలోచించరు. ఖర్చు చేసే సమయంలోనూ వీరికి ఏ ఆలోచనా రాదు. ఇంత డబ్బు ఉన్న ఈ రాశి వారు డబ్బు పోతే మాత్రం తక్కువ ఖర్చు పెట్టుకుంటూ జీవించలేరు. ప్రతి విషయంలోనూ తాము రాయల్‌గా ఉండాలనుకుంటారు. వీరి రాజసం గురించి వీరి ఖర్చుల గురించి ప్రతిఒక్కరూ చర్చిస్తూ ఉంటారు.

ఇవి కూడా చదవండి.

మరో ఘనత సాధించిన తాజ్ మహల్.. అదేంటో మీకు తెలుసా??

ఈ లక్షణాలుంటే మీ బాయ్ ఫ్రెండ్.. మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లే..!

ADVERTISEMENT

ఇలా చేస్తే మీ ఫోన్.. చాలా తొందరగా ఛార్జింగ్ అవుతుంది..!

13 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT