ADVERTISEMENT
home / Celebrity Weddings
“పెళ్లి పుస్తకం” హీరోయిన్ నితి టేలర్.. ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలు అదుర్స్..!

“పెళ్లి పుస్తకం” హీరోయిన్ నితి టేలర్.. ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలు అదుర్స్..!

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలోనూ ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఇందుకు సెలబ్రిటీలు, సినీతారలు సైతం అతీతులు ఏమీ కారు. అందుకే వారు కూడా తమ పెళ్లిని భిన్నంగా, అందరికీ గుర్తుండిపోయే రీతిలో జరుపుకోవాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు పెళ్లి వేడుకల్లో విభిన్నమైన రీతులను అనుసరిస్తూ అందరిలోనూ భిన్నంగా నిలుస్తుంటారు. ప్రముఖ టీవీ తార, నటి నీతీ టేలర్ (Niti taylor) కూడా ఇదే కోవకు చెందుతుంది. ఇంతకీ అంత భిన్నంగా ఈ అమ్మడు ఏం చేసిందనేగా మీ సందేహం.. అక్కడికే వస్తున్నాం..

తెలుగులో 2012లో విడుదలైన ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన అందాల భామ నీతీ టేలర్. ఆ తర్వాత ‘పెళ్లి పుస్తకం’, ‘లవ్ డాట్ కమ్’ అనే చిత్రాల్లో నటించినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ చిన్నది కేవలం వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా హిందీ ధారావాహికలైన ‘కైసీ యే యారియాన్’, ‘ఘులామ్’, ‘ఇష్క్ బాజ్’.. వంటి వాటి ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

ఈ అమ్మడు తాజాగా తన చిన్ననాటి స్నేహితుడిని వివాహమాడుతున్నానని.. ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగిందని ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అందరితోనూ పంచుకుంది. ఈ క్రమంలోనే తన ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు సైతం.. అందరితోనూ షేర్ చేసుకుంది. ఇప్పుడు ఇవే ఆమెను వార్తల్లో నిలబెడుతున్నాయి.

అవునండీ.. సాధారణంగా ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ అంటే.. కాబోయే భర్త లేదా బ్రెయిడ్ మెయిడ్స్‌తో కలిసి చాలా స్పెషల్‌గా షూట్ చేయించుకుంటారు. కానీ నీతీ టేలర్ మాత్రం అందరి కంటే భిన్నంగా తన తల్లి చెరిల్ టేలర్, సోదరి అదితీ ప్రభులతో కలిసి ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లో పాల్గొంది.

ADVERTISEMENT

వివిధ యాంగిల్స్‌లో తీసిన ఈ స్టిల్స్‌ను అభిమానులందరితోనూ షేర్ చేసుకుంటూ- ‘నా మనసంతా వారే.. నా జీవితంలో నాకు లభించిన ది బెస్ట్.. నా సంతోషానికి కారణం.. అంతా మా అమ్మ, నా సోదరి. అందుకే మీరే నా ప్రపంచం..’ అంటూ తన మనసులోని మాటలకు అక్షరరూపం ఇచ్చింది నీతి.

ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యాల్లో వైరల్‌గా మారాయి. చాలామంది ఇది చాలా భిన్నమైన ఆలోచన అని, స్పెషల్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ అని.. రకరకాలుగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూనే ఆమె ఐడియాను తెగ మెచ్చుకుంటున్నారు.

ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం..

ఆగస్టు 13న తన చిన్ననాటి మిత్రుడు పరీక్షిత్ బవతో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న నితి.. ఆ తర్వాత ఓ వార్తాపత్రికతో తన ప్రేమ బంధం, పెళ్లి.. వంటి వాటి గురించి మాట్లాడింది. ‘నాకు పరీక్షిత్ స్కూల్లో చదువుకునే రోజుల నుంచే తెలుసు. మేమిద్దరం మంచి స్నేహితులం కూడా. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. మళ్లీ ఈ మధ్యే మేమిద్దరం ఇన్‌స్టాగ్రాం ద్వారా మళ్లీ కలుసుకున్నాం. ఒకరి గురించి మరొకరం పూర్తిగా తెలుసుకున్నాం. ఈ క్రమంలోనే ఆయన చాలా మంచి వ్యక్తి అని నాకు అర్థమైంది. ఆయన్ని నేను తొలిసారి దిల్లీలో కలుసుకున్నా. నేనే కాదు.. నా తల్లిదండ్రులు కూడా వారిని కలుసుకున్నారు.

పరీక్షిత్ వారికి బాగా నచ్చారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే- మా ఇద్దరిలోనూ చాలా లక్షణాలు కామన్‌గా ఉన్నాయి. అందుకే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. పెద్దలు కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేయడంతో మెహెందీ, ఎంగేజ్ మెంట్ చకచకా జరిగిపాయాయి. అయితే పెళ్లి మాత్రం ఈ ఏడాదిలో కాకుండా వచ్చే సంవత్సరం చేసుకొందామని అనుకుంటున్నాం. నా భర్త ఉద్యోగ రీత్యా పలు ప్రదేశాలను చుట్టి రావాల్సి ఉంటుంది. కానీ నేను మాత్రం ముంబయిలోనే ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించాలి. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదని నేను ముందే నిర్ణయించుకున్నా.

ADVERTISEMENT

నేను అనుకున్నట్లుగానే షో బిజ్‌కు చెందిన వారు కాకుండా.. నా చిన్నప్పటి స్నేహితుడే జీవిత భాగస్వామి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు, నా తల్లిదండ్రులకు నచ్చిన వ్యక్తినే పెళ్లాడనున్నానని తలుచుకుంటేనే ఆనందం పట్టలేకపోతున్నా..’ అంటూ తన ప్రేమ, పెళ్లి గురించి తన మనసులోని మాటలను బయటపెట్టిందీ సుందరి.

Featured Image: Instagram.com/Niti Taylor

ఇవి కూడా చదవండి

“వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే” సందర్భంగా.. ఈ తెలుగు సినిమాలు తప్పక చూడండి..!

ADVERTISEMENT

“సైరా” టీజర్‌లో .. టాప్ 10 ఆసక్తికర విశేషాలు ఇవే..!

అనుష్కతో ప్రేమ, పెళ్లి మొదలైన విషయాలపై.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

ADVERTISEMENT

 

22 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT