అనుష్కతో ప్రేమ, పెళ్లి మొదలైన విషయాలపై.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

అనుష్కతో ప్రేమ, పెళ్లి మొదలైన విషయాలపై.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

టాలీవుడ్ పాపులర్ జోడి ప్రభాస్ (Prabhas), అనుష్క ప్రేమలో పడ్డారని.. వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే వీరు యూఎస్ వెళ్లారని.. అక్కడ ఇల్లు కూడా కొనబోతున్నారని మొన్నటి వరకూ కొన్ని గాసిప్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. ఇదే విషయంపై ఇటీవలి కాలంలో ఓ ఆంగ్ల మీడియా ప్రభాస్‌ను ప్రశ్నించగా.. ఆయన అనేక విషయాల గురించి క్లారిటీ ఇచ్చారు. అనుష్క తనకు మంచి స్నేహితురాలని తెలిపారు.

"అనుష్క నాకు మంచి స్నేహితురాలు. మా మధ్య ఇంకా ఏదైనా బంధం ఉంటే.. ఆ పరిస్థితులు వేరేలా ఉండేవి. ఒకవేళ మీరు ఊహించిందే నిజమైతే.. ఈ రెండేళ్ల కాలంలో మేమిద్దరం కలిసి మీకు ఎప్పుడైనా కనిపించి ఉండాలి కదా. కరణ్ జోహార్ షోలో కూడా నన్ను ఇదే ప్రశ్న అడిగారు. దానికి రానా, రాజమౌళి ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చారు. నేను వాళ్లతో ఆ సమాధానం చెప్పించలేదు" అని ప్రభాస్ తెలిపారు. దీంతో ప్రభాస్ ఎప్పటి నుంచో సర్క్యులేట్ అవుతున్న ఈ అంశంపై ఓ క్లారిటీ ఇచ్చిన్నట్లు అయ్యింది. 

నిజం చెప్పాలంటే.. ప్రభాస్, అనుష్కల (Anushka) జోడికి బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. బాహుబలి (Bahubali) చిత్రం విడుదలయ్యాక.. వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. వారు పెళ్లి చేసుకుంటారని కూడా పుకార్లు వచ్చాయి. ఇక "సాహో" విడుదల అవుతున్న సందర్భంగా.. ఈ పుకార్లు మరిన్ని ఎక్కువ అయ్యాయి. ఇండియా టుడే లాంటి పత్రికలలో కూడా అనుష్క, ప్రభాస్‌ల రిలేషన్ షిప్ అంశంపై వార్తలు రావడం గమనార్హం. అయితే అనుష్క‌తో తను ప్రేమలో ఉన్నానన్న విషయం అవాస్తవమని చెబుతూ.. కుండ బద్దలు కొట్టేశారు ప్రభాస్.

ప్రభాస్ కోసం.. హైదరాబాద్‌కి తరలి వస్తున్న రోమ్ నగరం..!

 

అయితే మరో ఇంటర్వ్యూలో ప్రభాస్ తన పెళ్లి గురించి మరో ఆసక్తికరమైన విషయం పంచుకోవడం విశేషం. "నా పెళ్లి జరగాల్సిన సమయంలో జరుగుతుంది. అది  లవ్ మ్యారేజ్ కూడా కావచ్చు" అని ఆయన తెలిపారు. దీంతో ఆయన లవ్‌లో పడ్డారా..? అయితే ఆ అమ్మాయి ఎవరు అనే అంశంపై కూడా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడస్తోంది. సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ ఎవరై ఉంటారన్న విషయం మీద  రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అరుదైన ఫోటోలు (ఫ్యాన్స్‌కు ప్రత్యేకం)

ప్రస్తుతం ప్రభాస్ నటించిన "సాహో" చిత్రం.. విడుదలకు సిద్ధమైంది. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు రూ.300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అరుణ్ విజయ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, లాల్ మొదలైన వారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిన్నే ‘సాహో’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఎంతో వైభవంగా ప్రారంభమైంది. 

ప్రభాస్ 'సాహో' టీజర్‌లో.. మీరు చూడాలనుకునే '7' అంశాలు ఇవేనా!                                                     

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.