అనుబంధం పదికాలాల పాటు పదిలంగా ఉండడానికి నమ్మకమనే గట్టి పునాది చాలా అవసరం. ఇద్దరు వ్యక్తులు కలసి ఒక్కటిగా ఆనందంగా జీవించడానికి నమ్మకమే ఇంధనంగా పనిచేస్తుంది. ఇదే లేకపోతే.. వ్యక్తులుగా మనం ఎంత ఉత్తములమే అయినా.. బంధాలను నిలుపుకోలేం. భార్యాభర్తలైనా.. ప్రేయసీప్రియులైనా ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకొంటే సరిపోదు. అందులో నిజాయతీ కూడా ఉండాలి. మరి ఆ లక్షణం మీ భాగస్వామిలో ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వారిని కొన్ని ప్రశ్నలు అడగాలి. అప్పుడే వారి మనసులో ఏముందో మనం తెలుసుకోగలుగుతాం. చాలామంది తమ భాగస్వామిని ప్రశ్నించడానికి ఇష్టపడరు. మనసులో సందేహాలున్నా వాటిని తొలగించుకొనే ప్రయత్నం చేయరు.
డేటింగ్‌కి వెళుతున్నారా? మీరడగాల్సిన 20 ప్రశ్నలివే
అతని అంతరంగాన్ని తెలుసుకొనేందుకు అడగాల్సిన ప్రశ్నలు
ఫన్నీ ఫన్నీగా ఈ ప్రశ్నలు కూడా అడిగేస్తారా
సెక్సీగా ఈ ప్రశ్నలు కూడా అడిగేయండి
‘నేను ప్రశ్నిస్తే తప్పుగా అనుకొంటారేమో? మా మధ్య పొరపొచ్చాలు వస్తాయేమో?’ అని సందేహిస్తారు. దీనిలోనూ వాస్తవం లేకపోలేదు. బహుశా మనం ప్రశ్న అడిగే విధానం కూడా వారి మనసుని గాయపరిచే విధంగా ఉండటం దీనికి కారణం కావచ్చు. అందుకే ఎదుటివారు నొచ్చుకోకుండా.. సంతోషంగా సమాధానం చెప్పేలా ప్రశ్నలు ఎలా అడగాలో నేను చెప్తాను. ఏ సందర్భంలో ఎలాంటి ప్రశ్నఅడగాలో కూడా చెబుతా. వాటిని సమయం, సందర్భం రెండూ చూసుకొని మీ భాగస్వామిని అడగండి. కచ్చితంగా వారు మీకు సమాధానం చెప్తారు. అప్పుడు మీరు అతన్ని మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు.
డేటింగ్‌కి వెళుతున్నారా? మీరడగాల్సిన 20 ప్రశ్నలివే.. (20 Questions To Ask On Date)
కొత్తగా ఎవరితోనైనా పరిచయం మొదలైనప్పుడు వారి గురించి మనకు ఎలాంటి విషయాలు తెలియవు. కానీ వారి వ్యక్తిత్వం మనల్ని ఆకర్షిస్తుంది. తొలుత వారితో మాట్లాడటానికి తటపటాయిస్తారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాగే మాటల ప్రవాహానికి అడ్డుండదు. అలా వారి పట్ల ఇష్టం మొదలవుతుంది. అప్పుడే వారి ఇష్టాయిష్టాలు, ఆసక్తుల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. అప్పుడే ఇద్దరూ ఎన్నో విషయాలు ఒకరితో ఒకరు పంచుకొంటారు. ఇలాంటి సందర్భంలోనే మీ బాయ్ ఫ్రెండ్‌ని (boy friend) ఈ 20 ప్రశ్నలు అడగండి.
- నీకు బాగా గుర్తున్న, ఇష్టమైన పుట్టిన రోజు ఏది?
- నీకు బాగా ఇష్టమైన, ఎప్పుడూ చేయాలనుకొంటూనే.. చేయలేకపోతున్న పనేంటి?
- బాధగా ఉన్నప్పుడు లేదా ఒత్తిడిగా అనిపించినప్పుడు నువ్వు తినడానికి ఇష్టపడే ఆహారం ఏంటి?
- వీకెండ్స్ ఎలా గడుపుతావు?
- నిన్ను ఆనందపరిచే విషయం ఏంటి?
- నీకు ఇష్టమైన సోషల్ మీడియా ప్రొఫైల్ ఏంటి?
- నీ బ్యాడ్ డేని బెటర్ డేగా మార్చే పాట?
- నీకు పెంపుడు జంతువులున్నాయా?
- నువ్వు ఉదయాన్నే నిద్ర లేస్తావా? లేకపోతే.. రాత్రి ఆలస్యంగా పడుకుంటావా?
- మీకు అన్నదమ్మలు, అక్కచెల్లెల్లు ఎంతమంది ఉన్నారు?
- మీ కుటుంబం గురించి ఏదైనా చెప్పండి?
- ఈ నెలలో నీకు జరిగిన మంచి విషయం గురించి చెప్పు?
- నీ ఫస్ట్ డేట్ ఎలా ఉండాలనుకొంటున్నావు?
- నీ ఫోన్‌లో నీకు బాగా ఇష్టమైన యాప్ ఏది?
- నువ్వు భయపడే వాటిలో నీకు సిల్లీగా అనిపించేదేంటి?
- నిజమైన టాలెంట్ అని నువ్వు భావించే విషయం ఏంటి?
- నువ్వు ఎప్పుడూ సందర్శించాలనుకొనే దేశం ఏది?
- నిన్ను ప్రశాంతంగా ఉంచేదేంటి?
- నీకిష్టమైన నటుడు/నటి/సినిమా/పుస్తకం/టీవీషో
- ఈ మధ్య కాలంలో జీవితంలో మీరు మొట్ట మొదటిసారి చేసిన పని ఏదైనా ఉందా?
అతని అంతరంగాన్ని తెలుసుకొనేందుకు అడగాల్సిన ప్రశ్నలు (Questions For Interpretaion)
డేటింగ్ తర్వాత మీ మధ్య కాస్త సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒకరి గురించి మరొకరు మరింత లోతుగా అర్థంచేసుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఈ సమయంలో ఈ 20 ప్రశ్నలు అడిగితే.. మీ ఇద్దరి మధ్య మరింత స్నేహం పెరుగుతుంది. వీటిలో మీరు తొలిసారిగా కలుసుకొన్న సందర్భం, మొదటిసారి మీరు డేట్‌కి వెళ్లినప్పుడు మీరు మాట్లాడుకొన్న విషయాల గురించి కూడా మధ్యలో చర్చించండి.
- నువ్వు నాలో మొదటిసారిగా గుర్తించిన విషయం ఏంటి?
- మన ఫస్ట్ డేట్ గురించి నీ అభిప్రాయం ఏంటి?
- నాతో డేట్ చేయాలని నువ్వు ఎప్పుడు నిర్ణయించుకొన్నావు?
- నువ్వు ఇంతకు ముందెప్పుడైనా ప్రేమలో పడ్డావా?
- గతంలో ఎవరి చేతిలోనైనా మోసపోయారా?
- నీ గత రిలేషన్ షిప్స్ గురించి చెప్పు?
- ప్రేమను నువ్వెలా నిర్వచిస్తావు?
- మిమ్మల్ని మీరు ఎప్పటికీ క్షమించుకోలేనంత పొరపాటు ఏదైనా మీరు చేశారా?
- కావాలని ఇంతకు ముందెన్నడైనా ఎవరినైనా బాధించారా?
- ఇంతకు ముందు నేను ఏ విషయంలోనైనా నాకు తెలియకుండా నిన్ను ఏమైనా బాధించానా?
- నాలో నీకు బాగా నచ్చిన విషయమేది?
- నాలో నచ్చని అంశం ఏది?
- నాతో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీలవుతుంటారు?
- మీలో ఏ పార్శ్వాన్ని మీరు దాచుకొంటూ ఉంటారు? అనుబంధం విషయంలో మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంశమేంటి?
- మీకు బాగా తెలిసిన దయాగుణం కలిగిన వ్యక్తి ఎవరు?
- ఎలాంటి సందర్భాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి? మీకు ఇప్పటి వరకు బాగా సంతోషంగా అనిపించిన సంఘటన ఏది?
- అనుబంధం పది కాలాల పాటు పదిలంగా నిలబడాలంటే ఉండాల్సిన లక్షణమేంటి?
- నీ దృష్టిలో పర్ఫెక్ట్ రిలేషన్ షిప్ అంటే ఏంటి?
- నీ భాగస్వామిపై నీ ప్రేమను ఎలా చూపిస్తావు?
- మనిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని పెరగకుండా చేసే అంశాన్ని నువ్వేమైనా గమనించావా?
ఎక్కడికి వెళుతున్నాం? అంటూ అడిగే ప్రశ్నలు (“Where This Relations Is Going” Questions)
‘మనం ఎక్కడికి వెళుతున్నాం?’ ఇది రిలేషన్ షిప్‌లో ఉన్నవారి మధ్య తరచూ తలెత్తే ప్రశ్న. ఈ ప్రశ్న మీరు సరిగ్గా అడిగినట్లయితే.. మీ అనుబంధంలో ఉన్న సమస్యలను సరిచేసుకోవచ్చు. అంతేకాదు మీ భవిష్యత్తును కూడా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. మరి దానికోసం ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలుసా?
- వచ్చే ఐదేళ్లలో మనల్ని ఏ స్థానంలో చూడాలనుకొంటున్నావు?
- నాతో అందమైన భవిష్యత్తుని ఊహిస్తున్నావా?
- భవిష్యత్తులో మనిద్దరి మధ్య పెద్ద సమస్యగా మారొచ్చని నువ్వు భావిస్తున్న విషయం ఏంటి?
- ఇతర జంటల నుంచి మనల్ని వేరు చేసి ప్రత్యేకంగా చూపించే అంశమేంటి?
- మన బంధాన్ని కాపాడుకోవడానికి మనం ఎప్పటికీ చేయకూడని పనేంటి?
- నా అలవాట్లు ఏమైనా నీకు ఇబ్బంది కలిగిస్తున్నాయా?
- మన అనుబంధంలో ఏదైనా తక్షణమే మార్చుకోవాల్సిన విషయం ఏదైనా ఉందా? అదేంటి?
- దీర్ఘకాలిక అనుబంధాలపై నీకు నమ్మకం ఉందా?
- మన అనుబంధం నీకు ఎంత ముఖ్యం?
- ఉద్యోగ పరమైన కారణాల వల్ల కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాల్సి వస్తే ఏం చేద్దాం?
- మన బెస్ట్ డేట్ ఏది?
- మన వరస్ట్ డేట్ ఏది?
- నాలో నీకు చిరాకు తెప్పించే విషయం ఏది?
- నా స్నేహితుల్లో నీకు నచ్చనివారు ఎవరైనా ఉన్నారా?
- మనిద్దరి అనుబంధంలో నీకు ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి గుర్తు ఏది?
- ఏ సినిమా చూస్తున్నప్పుడు ఇది మన కథ అని నీకు అనిపించింది?
- అన్యోన్య దంపతుల మధ్య కచ్చితంగా ఉండాల్సిన లక్షణం ఏంటి?
- ప్రేమికులుగా మనం చేరుకోవాల్సిన మైలురాళ్లేమైనా ఉన్నాయా?
- రోజులో నా గురించి ఎన్నిసార్లు తలచుకొంటావు?
- ఒకరోజు పాటు మనిద్దరం కలిసి ఉంటే ఎలా ఉంటుంది?
ఫన్నీ ఫన్నీగా ఈ ప్రశ్నలు కూడా అడిగేస్తారా? (Funny Questions To Ask)
మీ సెకెండ్ డేట్‌లో మీ బంధం మరింతగా బలపడాలంటే.. కాస్త సరదా సరదాగా సమయం గడిపేందుకు ప్రయత్నించండి. అంతే కాదండోయ్.. మీ బాయ్ ఫ్రెండ్‌లోని హాస్యచతురతను కూడా మీ ప్రశ్నలతో బయటకు తీసుకురండి. మరి దానికోసం ఎలాంటి ప్రశ్నలు సంధించాలంటే..
- మీకు బాగా గుర్తున్న మీ చిన్నతనంలోని అల్లరి సంఘటన గురించి చెప్పు..
- నీకు ఏ క్రీడ అంటే ఇష్టం?
- పని తప్పించుకోవడానికి మీరు చెప్పిన అతి చెత్త కారణం ఏదైనా ఉందా?
- సిల్లీ రీజన్ చెప్పి ఏ అమ్మాయితోనైనా డేట్ నుంచి తప్పించుకొన్నావా?
- నన్ను అనుకరించాలనుకొంటే.. ఎలా ఇమిటేట్ చేస్తారు?
- నేను ఏ పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం నువ్వు గమనించావు?
- భవిష్యత్తులో మీ పిల్లలతో సెక్స్ గురించి మాట్లాడాల్సి వస్తే.. ఆ సమయంలో ఎలా వ్యవహరిస్తారు?
- ఓ జోక్ చెప్పొచ్చుగా..
- మిమ్మల్ని తిరస్కరించేందుకు ఎవరైనా చెప్పిన కారణం మీకు నవ్వు తెప్పించిందా?
- మీరు పేరు మార్చుకోవాలనుకొంటే.. ఏ పేరు పెట్టుకొంటారు?
- మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సందర్భం గురించి చెప్పండి?
- మీ కథతో ఏదైనా టీవీలో రియాల్టీ షో వస్తే..దానికి టైటిల్ ఏం పెడతారు?
- సినిమాలో మాదిరిగా మీ లైఫ్‌లో ఏమైనా జరిగాయా?
- మీకు ఇష్టమైన మొబైల్ బ్రాండ్ ఏది?
- మీకు సూటయ్యే కార్టూన్ క్యారెక్టర్ ఏంటి?
- చట్ట విరుద్ధమైనప్పటికీ మీ దగ్గర ఉండాలని కోరుకొంటున్న వస్తువేదైనా ఉందా?
- చిన్నతనంలో మీరు విన్న ఫన్నీ స్టోరీ ఏంటి?
- ఎవరైనా పెయింటర్ మీ చిత్రం గీస్తానంటే.. మీరు ఏ పోజ్ ఇస్తారు?
- మీరు డీజే అయితే ఏం పేరు పెట్టుకొంటారు?
పెళ్లి చేసుకోవాలనుకొంటే ఈ ప్రశ్నలడగాలి (Questions To Ask If You Want To Get Married)
మీరు ప్రేమిస్తున్నవ్యక్తితో మీ బంధాన్ని మరో మెట్టు పైకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తుంటే.. అతనితో మూడు ముళ్లు వేయించుకొనే సమయం ఆసన్నమయితే.. అంతకు మించిన ఆనందం ఏముంటుంది? కానీ పెళ్లి ప్రతిపాదనకు ఒప్పుకొనే ముందే మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి మీరు చేసుకోబోతున్న వ్యక్తి ఎప్పడూ పనిలోనే నిమగ్నమై ఉంటే.. మీతో సమయాన్ని ఎలా గడుపుతాడు? మీకు ఎంత ప్రాధాన్యమిస్తాడనే విషయాలు ముందుగానే తెలుసుకోవాలి కదా..! మరి దానికోసం ఎలాంటి ప్రశ్నలు సంధించాలి?
- నువ్వు ఖాళీగా ఉన్న సమయాన్ని ఎలా గడుపుతావు?
- తరచూ బంధువులను, స్నేహితులను కలుసుకుంటావా?
- ఎప్పుడైనా ఎంత మంది పిల్లలను కనాలని ఆలోచించావా?
- మనకి లాంగ్ టర్మ్ మ్యారేజ్ గోల్స్ ఉంటే బాగుంటుందని భావించావా?
- ఆర్థికపరమైన అంశాల్లో ప్రణాళికాబద్ధంగానే ఉంటావా?
- మీ రోజువారీ జీవితం ఎలా ఉంటుంది?
- ఎక్కువ సమయం పనిచేస్తూనే ఉంటావా? ఇతర పనులకు కూడా టైం కేటాయిస్తావా?
- స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లేమైనా ఉన్నాయా?
- పని నుంచి విరామం తీసుకోవడానికి సెలవులేమైనా తీసుకొంటావా?
- మన విద్యా వ్యవస్థ సరైనదేనని నువ్వు అనుకొంటున్నావా? మన పిల్లల చదువుల గురించి ఇప్పటి నుంచే ఆలోచించాలి కదా మరి.
- ఎవరితోనైనా వాగ్వివాదానికి దిగినప్పుడు లేదా వారి అభిప్రాయాలతో ఏకీభవించని సమయంలో మీరెలా వ్యవహరిస్తారు?
- మీ అకౌంట్ లో చివరిరోజు వరకూ బ్యాలెన్స్ ఉంటుందా? లేదా నెల మొదట్లోనే అయిపోతుందా?
- నేటి రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి?
- డబ్బు ఆదా చేయడానికి నువ్వు పాటించే సీక్రెట్ చిట్కా ఏంటి?
- మన పెళ్లి ఎలా జరగాలనే విషయంలో నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా?
- మన పెళ్లి విషయంలో నీకు భయం కలిగిస్తున్నవేమైనా ఉన్నాయా?
- భవిష్యత్తులో ఇల్లు కొనే లేదా నిర్మించే ఆలోచనలున్నాయా?
- పెళ్లికి సబంధించి నువ్వు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉందా?
- పెంపుడు జంతువులు పెంచుకొనే విషయంలో నీ అభిప్రాయం ఏంటి?
కెరీర్‌కు సంబంధించిన విషయాలూ తెలుసుకోవాలిగా? (Questions About Career)
పరిచయం మొదలైన కొత్తలో మీ ఇద్దరి మధ్య చాలా విషయాల గురించి ప్రస్తావనకు రాదు. మరీ ముఖ్యంగా కెరీర్ సంబంధించిన విషయాల గురించి పెద్దగా మాట్లాడుకొని ఉండరు కదా. కానీ దీని గురించి ఇద్దరూ చర్చించుకోవాల్సిందే. మరి కెరీర్ గురించి మీ బాయ్ ఫ్రెండ్ ని ఎలాంటి ప్రశ్నలడగాలి?
- మీ ఉద్యోగ జీవితంలో మీకు బాగా నచ్చిన విషయం ఏది?
- వచ్చే ఐదేళ్లకు కెరీర్ పరంగా ఎలాంటి ప్లాన్ వేసుకొన్నారు?
- మీ పని వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందా?
- ఆఫీసులో మీకు స్నేహితులు ఎవరైనా ఉన్నారా?
- పని ప్రదేశంలో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉంటుందా?
- నీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా?
- ఉద్యోగం మారేందుకు ఏమైనా ప్రయత్నిస్తున్నావా?
- ఉద్యోగిగా నీ ఎదుగుదల ఎలా ఉండాలని కోరుకొంటున్నావు?
- ప్రమోషన్ గురించి ఏమైనా అంచనాలున్నాయా?
- మీరు పనిచేయాలని భావిస్తున్న డ్రీమ్ కంపెనీ ఏదైనా ఉందా?
- మీరు వ్యాపారం ప్రారంభించే ఆలోచనలున్నాయా? అయితే మీరు ఏ వ్యాపారం చేస్తారు?ః
- పని సాఫీగా జరగడానికి ఎలాంటి వాతావరణంలో మీరు పనిచేయాలని కోరుకొంటారు?
- పని గంటలు ముగిసిన తర్వాత మీ స్నేహితులతో సమయం గడుపుతారా?
- ప్రతి రోజూ ఉదయం ఆఫీసుకి వెళ్లేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తారా? లేకపోతే రోజూ ఏం వెళ్తాంలే అనుకొంటారా?
- మీ మొత్తం కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన ఏదైనా జరిగిందా?
- మీరు చాలా గొప్పగా భావించే స్కిల్ ఏది?
- మీ హాబీని కెరీర్ గా మలుచుకొన్నారా?
- ఈ రంగాన్ని మీరు ఎందుకు ఎంచుకొన్నారు?
- ఈ రంగంలో అడుగు పెట్టకపోతే.. ఏ జాబ్ ఎంచుకొని ఉండేవారు?
- కార్యాలయంలో అసౌకర్యంగా అనిపించిన సందర్భాల్లో మీరు ఏం చేస్తారు?
సెక్సీగా ఈ ప్రశ్నలు కూడా అడిగేయండి? (Sexy Questions)
మీ బాయ్ ఫ్రెండ్‌తో కాస్త హాట్ హాట్ గా సమయం గడపాలనుకొంటున్నారా? అయితే ఆ సమయంలో ఎలాంటి చిలిపి ప్రశ్నలు అడగాలో తెలుసా? అది ఫోర్ ప్లే అయినా.. సెక్స్ విషయంలో మీకున్న ఫాంటసీలైనా.. కాస్త సెక్సీ సెక్సీగా ఈ ప్రశ్నలడిగేయండి.
- ఇప్పటికిప్పుడు నాకు మూడు వరాలివ్వాలని నువ్వనుకొంటే.. ఏమిస్తావు?
- ఏ రకమైన దుస్తుల్లో నువ్వు నన్ను చూడాలనుకొంటున్నావు?
- నా శరీరంలో నీకు బాగా నచ్చిన భాగం ఏది?
- ఆ విషయంలో నీకేమైనా ఊహలున్నాయా?
- తర్వాత సంభోగం ఎక్కడైతే బాగుంటుందని నువ్వనుకొంటున్నావు?
- నీకిష్టమైన భంగిమ ఏది?
- నీకు వెలుతురులో ఇష్టమా? చీకట్లోనా?
- నేను బాగా ముద్దు పెడతానా?
- ఫోర్ ప్లే ఎలా చేద్దామనుకొంటున్నావు?
- సెక్స్ గురించి నీ అభిప్రాయం ఏంటి?
- నాలో నీకు సెక్సీగా కనిపించేది ఏదైనా ఉందా?
- నన్ను ఎలాంటి లో దుస్తుల్లో చూడాలనుకొంటున్నావు?
- నా బ్రాను ఒక చేత్తో విప్పగలవా?
- డర్టీ టాక్స్ నీకిష్టమేనా?
- నేనేం చేస్తే నువ్వు వెంటనే రీచార్జ్ అవుతావు?
- ఏ పొజిషన్ లో సెక్స్ ట్రై చేద్దామనుకొంటున్నావు?
- నేను పైన ఉన్నప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తావా? లేక కింద ఉన్నప్పుడా?
చూశారుగా అమ్మాయిలు అనుబంధంపై నమ్మకం పెంచుకోవడానికి, మీ భాగస్వామి మీతో నిజాయతీగా వ్యవహరిస్తున్నారా? లేదా? అని తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు అడగాలి. అయితే ఇవన్నీ ఒకే సారి కాకుండా.. సందర్భానుసారంగా ఒక్కో ప్రశ్న సంధించండి. అలాగని ఆలస్యం కూడా చేయద్దు. వీలైనంత తొందరగా అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకొనే ప్రయత్నం చేయండి.
ఇవి కూడా చదవండి
ప్రేమ వివాహం.. ప్రేమతో మీకు నేర్పించే విషయాలు ఇవే..
అబ్బాయిలూ.. ప్రేమతో మీ భాగస్వామికి మీరు చేయాల్సిన పనులివే..
లక్ష్యం చేరుకొనే ప్రయాణంలో మనం నేర్చుకొనే విషయాలివే..