ADVERTISEMENT
home / Celebrity Life
బాహుబలి కంటే పెద్ద సినిమాగా.. దాన్ని రూపొందించాలనుకుంటున్నాం : రానా

బాహుబలి కంటే పెద్ద సినిమాగా.. దాన్ని రూపొందించాలనుకుంటున్నాం : రానా

రానా దగ్గుబాటి (rana daggubati).. ‘లీడర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఓ గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో.. హిందీలోనూ కొన్ని సినిమాల్లో నటించాడు. దమ్ మారో దమ్, ఘాజీ చిత్రాలతో బాలీవుడ్‌లోనూ పేరు సంపాదించాడు. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులను కైవసం చేసుకున్న బాహుబలి (bahubali) సిరీస్ సినిమాలు రానా రేంజ్‌ను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా ‘రానా’ నటన.. తన ప్రతిభ గురించి ప్రపంచానికి చాటింది. ‘బాహుబలి’ తర్వాత  ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ సినిమాలో నటించిన రానా.. హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా విడుదలైన ‘హౌజ్ ఫుల్ 4’ సినిమాలో కూడా ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించారు. ఇప్పుడు హిందీలో ‘భుజ్ ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాతో పాటు ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’ చిత్రాల్లో నటిస్తున్నాడు రానా.

‘బాహుబలి’ చిత్రం పూర్తవ్వగానే తండ్రి సురేష్ బాబు నిర్మాతగా.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ సినిమా రూపొందిస్తామని రానా ప్రకటించిన విషయం తెలిసిందే. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా గురించి.. తాజాగా కొన్ని వివరాలు వెల్లడించాడు రానా. ‘హిరణ్యకశ్యప’గా (hiranyakashyapa)  పేరొందిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించనున్నారట. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను.. వీరు పక్కన పెట్టేశారని.. ఇక ఈ సినిమా రూపొందదని ఆ మధ్యకాలంలో కొన్ని వార్తలొచ్చాయి.

దీన్ని ఖండిస్తూ ఈ సినిమా ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వడానికి గల కారణాన్ని వెల్లడించాడు రానా. ‘సినిమా విడుదలలో ఆలస్యమేమీ లేదు. కానీ ఈ  సినిమా కోసం వీలైనంతగా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించాలనుకుంటున్నాం. అందుకే షూటింగ్ ఆలస్యం అవుతోంది’ అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో మనం వీడియో గేమ్స్‌లో చూసినట్లుగా వర్చువల్ రియాల్టీ సెట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ టెక్నాలజీతో షూటింగ్ ప్రారంభం కాకుండానే.. చాలా మేరకు సినిమా చూసే వీలుంటుంది.

ADVERTISEMENT

మన దేశంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించే సినిమా ఇదే మొదటిదట. ‘మేం ఓ త్రీడీ స్కానింగ్ కంపెనీతో కలిసి పనిచేయనున్నాం. ఇది మెడికల్ టెక్నాలజీ రంగంలో ఇప్పటివరకూ సేవలు అందించింది. వారి స్కాన్స్ సినిమా స్టూడియోలో తీసే స్కాన్స్ కంటే బాగున్నాయని మాకు అనిపించింది. అందుకే ఆ సంస్థతో కలిసి పనిచేయబోతున్నాం.

ఇక సినిమా షూటింగ్‌కి ముందే.. మేం చేయాల్సిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంది. దీనికోసం మరికాస్త సమయం పడుతుంది. అందుకే ఈ సినిమా మొదలవ్వడానికి.. మరో ఎనిమిది నెలలు పడుతుంది. ఈ సినిమా ‘బాహుబలి’ కంటే పెద్ద సినిమాగా మారాలి. దానికంటే అద్భుతంగా మార్చేందుకే.. మేం ఇంత ఆలస్యమైనా దానిపై పని చేస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు రానా.

ADVERTISEMENT

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ దేశంలోనే అతి పెద్ద సినిమాగా పేరు గాంచింది. కేవలం కథ, కథనం మాత్రమే కాదు.. నటన, టెక్నాలజీ పరంగా కూడా ఈ సినిమా అతి పెద్దదిగా పేరు గాంచింది. మరి, బాహుబలిని మించిన సినిమాగా ఈ ‘హిరణ్యకశ్యప’ రూపొందుతుందంటే.. ఆ సినిమా ఎలా ఉండబోతోందన్నది వేచిచూసి తెలుసుకోవాల్సిందే. ఇక తాజాగా ‘వెంకీ మామ’ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న రానా.. ఇప్పుడు తన తాతయ్య రామానాయుడు ఉంటే సురేష్ బాబు, వెంకటేష్, నాగ చైతన్యల సక్సెస్ పట్ల సంతోషంగా ఉన్నా.. తనని తిట్టేవారని చెప్పుకొచ్చారు.

‘చైతన్య నాకంటే చిన్నవాడైనా.. నాకంటే ముందు కాలేజీ పూర్తి చేశాడు. నాకంటే ముందు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు బాబాయితో కూడా నాకంటే ముందుగానే సినిమా చేశాడు. తాతయ్య ఉంటే నేను ఎందుకు చేయలేదని నన్ను తిట్టేవారు’ అని చెప్పాడు రానా. భవిష్యత్తులో తాను కూడా వారితో కలిసి సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు రానా. మరి, వీరందరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు రూపొందుతుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచిచూస్తున్నారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT
12 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT