Advertisement

Bigg Boss

Bigg Boss Telugu 3 : రవికృష్ణ v/s మహేష్ విట్టా.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

Sandeep ThatlaSandeep Thatla  |  Sep 7, 2019
Bigg Boss Telugu 3 : రవికృష్ణ v/s మహేష్ విట్టా.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

Advertisement

“బిగ్ బాస్ తెలుగు సీజన్ 3″లో (Bigg Boss Telugu) ఏడవ వారం ఈరోజుతో పూర్తవుతుంది. నాగార్జున హోస్ట్‌గా రావడంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులలో మునుపటి ఉత్సాహం కనపడింది. అదే సమయంలో నిన్నటి ఎపిసోడ్‌లో మొత్తం గత వారం ఇంటి సభ్యులు చేసిన తప్పులు.. వారి మధ్య ఏర్పడిన వివాదాల గురించే ఎక్కువగా చర్చించారు.

Bigg Boss Telugu 3: డబుల్ ఎలిమినేషన్‌కి ప్లాన్ చేసిన బిగ్‌బాస్?

ఈ సందర్భంగా అలీ రెజా – పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ – మహేష్ విట్టా, శిల్పా – అలీ రెజా, వరుణ్ సందేశ్ – వితిక.. ఇలా వీరిందరూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఫిర్యాదులను పరిష్కరించే బాధ్యతను ఇంటి కెప్టెన్  బాబా భాస్కర్‌కి పోలీసు పాత్ర ఇచ్చి మరీ అప్పగించారు. అలాగే ఓ పోలీస్ స్టేషన్ కూడా సిద్ధం చేశారు. దానికి “బీబీ పోలీసు స్టేషన్” అని నామకరణం చేశారు. అయితే బాబా భాస్కర్ ఇద్దరు సభ్యుల మధ్య జరిగే వాదనలను అర్ధం చేసుకోలేకపోవడం… ‘దోషి’ అనే మాటని దోసి, దోసె అని పలకడం ద్వారా ఇంటి సభ్యులలో నవ్వులు పూయించారు.

ఇదిలావుండగా.. ఈ ఏడవ వారం నామినేషన్స్‌కి సంబంధించి ఇంటి నుండి బయటకి వెళ్లేందుకు ఎంపికైన అయిదుగురు సభ్యులు – రవికృష్ణ, అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్టా & శ్రీముఖిలలో.. ఒకరిని నిన్న నాగార్జున సేఫ్ చేశారు. అయితే ఆ ప్రక్రియ కోసం ఈ అయిదుగురిని బిగ్ బాస్ యాక్టివిటీ రూమ్‌కి తీసుకువెళ్ళారు. ఆ రూమ్‌లో ఎవరిపైన లైట్ ఆగుతుందో.. ఆ  వ్యక్తి సేఫ్ అవుతారని ప్రకటించారు. ఈ క్రమంలో  రాహుల్ సిప్లిగంజ్ సేఫ్ అయ్యారు. 

ఇక ఈ వారానికి సంబంధించి నలుగురు సభ్యులు ఎలిమినేషన్ రేసులో ఉన్నారు. వారే – అలీ రెజా, మహేష్ విట్టా, రవికృష్ణ & శ్రీముఖి. అయితే వీరిలో కేవలం ఇద్దరు కంటెస్టెంట్స్ పైనే ఎక్కువగా అందరి దృష్టి నెలకొంది. వారే – రవికృష్ణ (Ravikrishna) & మహేష్ విట్టా (Mahesh Vitta). ఎందుకంటే మిగతా ఇద్దరితో పోలిస్తే.. ఈ ఇద్దరి కంటెస్టెంట్స్‌కి బలం తక్కువ. పైగా మిగిలిన ఇద్దరూ కూడా టైటిల్ రేసులో ఉన్న పాపులర్ వ్యక్తులు. ఆ కారణంగా రవికృష్ణ & మహేష్ విట్టాలలో ఎవరో ఒకరు.. ఇంటి నుండి బయటకి వెళతారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

మరి మనం చెప్పుకున్న కారణాలతో ఈ ఇద్దరిలో ఒకరు వెళతారా? లేదా అందరికి షాక్ ఇస్తూ శ్రీముఖి, అలీ రెజాలలో ఒకరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారా అనేది ఈ  రోజు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ ఏమైనా జరగొచ్చు. ఇదే విషయం చాలా సార్లు రుజువైంది. ఏదేమైనా రాత్రి 10 గంటలకు ఈ సస్పెన్స్‌కి తెరపడనుంది.

Bigg Boss Telugu 3: ఇంటి నుండి వచ్చిన ఉత్తరాలు చదివి.. భావోద్వేగానికి గురైన హౌస్‌మేట్స్

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో చాలా ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. పునర్నవి తాను రెండేళ్ళుగా ఒకరిని ప్రేమిస్తుందనే విషయం నిజమా? కాదా? అని తనను అందరి ముందు అడగగా – తాను “అవును” అని చెప్పింది. ఆ సమయంలో రాహుల్ సిప్లిగంజ్‌‌ని చెవులు మూసుకోమని నాగార్జున కోరారు.

అలాగే రాహుల్‌ని కూడా “నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి.. నీకు వయసు తేడా ఎంత ఉండాలని నువ్వు అనుకుంటున్నావు” అని అడగ్గా.. దానికి ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. అయిదు నుండి ఆరేళ్ళ తేడా ఉంటే బాగుంటుందని తెలిపారు. దాంతో రాహుల్‌ కంటే అయిదారేళ్ల తక్కువ వయసు ఉన్న అమ్మాయిలు.. హౌస్‌లో ఎవరున్నారనే అంశం ప్రస్తావనకు వచ్చింది.  దాంతో అందరూ పునర్నవి పేరు చెప్పారు. అలాగే  “అందుకేనా ఈ రూల్” అంటూ నవ్వేశారు.

మొత్తానికి రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిల ట్రాక్.. ఇంటి సభ్యులనే కాకుండా షో చూస్తున్న వీక్షకులని సైతం ఆకట్టుకోవడం విశేషం. మరి వీరిద్దరూ ఇంకెన్ని వారాలు ఇలా అలరిస్తారో మనమూ చూద్దాం..!

Bigg Boss Telugu 3: బిగ్‌బాస్ హౌస్‌లోని వెన్నుపోటుదారుల గురించి తెలుసా..?