ADVERTISEMENT
home / సౌందర్యం
పతంజలి ఉత్పత్తులు- వాటి ప్రయోజనాలపై మా సమీక్ష

పతంజలి ఉత్పత్తులు- వాటి ప్రయోజనాలపై మా సమీక్ష

పతంజలి.. బ్యూటీ ఇండస్ట్రీలో పెను మార్పులకు నాంది పలికింది. ప్ర‌కృతి అందించిన ముడిపదార్థాలతో ఆయుర్వేద పద్ధతిలో తయారైన సౌందర్య ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రసాయనాలతో తయారైన బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల వాటి ప్రభావం ఎంతో కొంత మన చర్మం, కురులపై పడే ఉంటుంది. ఇకపై వాటికి దూరంగా ఉండాలనుకొనేవారు పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులను వాడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల చర్మం, కురుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మన డబ్బులు కూడా ఆదా అవుతాయి.

ఆయుర్వేదం అంటే.. (Ayurveda Meaning)

ఆయుర్వేదం అంటే సైన్స్ ఆఫ్ లైఫ్ అని అర్థం. ఆయుర్వేదం మనకు కొత్త కాదు.. వేద కాలం నుంచి ఇది మనదేశంలో అమల్లో ఉంది. సుమారుగా 5,000 ఏళ్ల నుంచి ఈ వైద్య పద్ధతిని పాటిస్తున్నారు. సహజమైన, ప్ర‌కృతి అందించిన ఔషధాలు, మూలికలతో శారీరక, మానసిక అనారోగ్యాలకు ఈ పద్ధతిలో చికిత్స చేస్తారు. ఆయుర్వేదం మూలాలు మనదేశంలోనే ఉన్నప్పటికీ ప్రపంచమంతా దీన్ని పాటించేవారున్నారు. నిజానికి మనకంటే విదేశాల్లో ఉన్నవారే ఆయుర్వేద ఉత్పత్తులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కావాలంటే మీకు తెలిసిన ఎన్నారైలను ఎవరైనా అడగండి. వారు రోజూ తప్పనిసరిగా ఉపయోగించే వాటిలో ఆయుర్వేదానికి సంబంధించినవి కూడా ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్యం కంటే.. ఆయుర్వేదంలోనే మంచి చికిత్స ఉంది. అందుకే దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు.

ఆయుర్వేదం – ఉపయోగాలు

ఆయుర్వేద ఉత్పత్తులు – లాభనష్టాలు

ADVERTISEMENT

పతంజలి ఉత్పత్తుల్లో శ్రేష్ఠమైనవి..

పతంజలి ఉత్పత్తులపై మా రివ్యూ

Treatment-Ayurveda

పంచభూతాలు.. (Five Elements)

నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం వీటిని పంచభూతాలుగా వ్యవహరిస్తాం. వీటి ప్రభావం మానవశరీరంపై ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది. ఇవి శరీరంపై కలిగించే ప్రభావాలను దోషాలుగా పరిగణిస్తారు. వీటి ఆధారంగానే మనిషి ఆరోగ్యాన్ని గుర్తిస్తారు. ఆయుర్వేదం ప్రకారం.. మన ఆరోగ్యంపై మూడు దోషాల ప్రభావం ఉంటుంది. అవే వాత, పిత్త కఫ దోషాలు. ఈ మూడు దోషాలను నివారించడానికి, వచ్చిన తర్వాత తగ్గించడానికి ఆయుర్వేదంలో ఔషధాలున్నాయి. ఇవి మనలోని అంతర్గత శక్తిని పంచభూతాల శక్తికి మధ్య సమన్వయం కుదిరేలా చేసి మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. నిత్య జీవితంలో ఆయుర్వేదాన్ని పాటించడానికి ఎన్నో మార్గాలున్నాయి. సాత్వికాహారం, యోగా, ధ్యానం అలాంటివే. అయితే వీటిని అలవాటు చేసుకొనే క్రమంలో ఆరంభంలో ఇబ్బందిగా అనిపించినప్పటికీ.. ఒక్కసారి అలవాటైతే.. ఆరోగ్యకరమైన జీవనశైలి మీ సొంతమవుతుంది.

ADVERTISEMENT

ఆయుర్వేదం – ఉపయోగాలు (Ayurveda Uses)

ఆయుర్వేద విధానాన్ని అనుసరించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆయుర్వేద వైద్య పద్ధతిలో రోగానికి మూల కారణం గుర్తించి చికిత్స చేస్తారు. ఇద్దరు వ్యక్తులకు ఒకే రకమైన ఇబ్బందితో బాధపడుతున్నప్పటికీ ఇద్దరికీ అందించే ఔషధాలు వేర్వేరుగా ఉంటాయి. ఆయుర్వేద వైద్య విధానం వల్ల మనకు చేకూరే లాభాలు:

  • ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషదాలన్నీ సహజసిద్ధమైనవే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే భయం ఉండదు.
  • సమస్య మూల కారణాన్ని గుర్తించి దానికి చికిత్స అందిస్తుంది. అంటే తాత్కాలిక ఉపశమనం కాకుండా.. దాని నుంచి . 
  • ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని సమర్థంగా తగ్గిస్తుంది.
  • శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
  • ఇన్సోమ్నియా (నిద్రలేమి) సమస్యకు ఆయుర్వేదంలో మంచి వైద్యం ఉంది.
  • వ్యాధులను తగ్గించే క్రమంలో మనల్ని ప్ర‌కృతికి చేరువ చేస్తుంది.
  • వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
  • కొన్ని రకాల వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
  • చర్మం, కురుల అందం, ఆరోగ్యం రెండిటినీ పెంచుతుంది.

దైనందిన జీవితంలో ఆయుర్వేదం (Ayurveda In Everyday Life)

ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకొనేవారికి ఆయుర్వేదం సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఆయుర్వేద ఔషధాలను అందించే సంస్థలు చాలానే ఉన్నాయి. వాటిలో పతంజలి ఉత్పత్తులు ఎక్కువ మంది అభిమానాన్ని చూరగొంటున్నాయి. 2006లో బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేదను ప్రారంభించారు. అనతికాలంలోనే ఈ సంస్థ ఉత్పత్తులు అందరి అభిమానాన్ని చూరగొన్నాయి. దేశీయంగానే కాదు.. అంతర్జాతీయంగానూ పతంజలి ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగింది. బ్యూటీ, స్కిన్ కేర్ ఉత్పత్తుల్లోనూ ఇతర సంస్థలకు గట్టిపోటీగా నిలుస్తోంది. మరో విధంగా చెప్పాలంటే.. ఆహారం నుంచి సౌందర్య పోషణ వరకు దైనందిన జీవితానికి అవసరమైన వాటన్నింటినీ పతంజలి సంస్థ మనకు అందిస్తోంది.

ఆయుర్వేద ఉత్పత్తులు – లాభనష్టాలు (Ayurvedic Products – Advantages)

లాభంనష్టం
హానికరమైన రసాయనాలుండవు.ఎక్కువ కాలం నిల్వ ఉండవు

దుష్ప్రభావాలు ఉండవు.

తక్కువ ఉత్పత్తులే లభిస్తాయి.
సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతాయిరంగు కాస్త భిన్నంగా ఉంటుంది.
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

వీటి వాసన మనకు అంతగా నచ్చకపోవచ్చు.

పతంజలి ఉత్పత్తుల్లో శ్రేష్ఠమైనవి.. (Best Patanjali Products)

పతంజలి సంస్థ దాదాపుగా అన్ని రకాల ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తోంది. స్కిన్ కేర్, హెయిర్ కేర్, హోమ్ కేర్, చైల్డ్ కేర్ ప్రొడక్ట్స్ ను సహజసిద్ధమైన ముడిపదార్థాలతో తయారుచేస్తోంది. బియ్యం, నూనెలు, సబ్బులు, షాంపూ, బిస్కెట్లు, నూడుల్స్, ఫేస్ క్రీంలు పతంజలి ఉత్పత్తులు ఏవైనా సరే తక్కువ ధరకు మనకు లభిస్తాయి. పైగా ఆర్గానిక్ పద్ధతిలో పండిన వాటిని వీటి తయారీకి ఉపయోగిస్తారు. వాటన్నింటిలోనూ శ్రేష్గమైనవి అని చెప్పుకోదగినవి ఉన్నాయి. విభాగాల వారీగా వాటి గురించిన వివరాలు మీకందిస్తున్నాం. దాని ఆధారంగా మీకు నచ్చిన, మీకు సరిపోయే పతంజలి ప్రొడక్ట్స్ (Patanjali products) ఎంచుకొని వాడండి.

పతంజలి స్కిన్ కేర్, బాడీ కేర్ ఉత్పత్తులు (Patanjali Skin Care & Body Care)

ప్ర‌కృతిసిద్ధ‌మైన‌ సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల చర్మానికి ఎలాంటి హానీ జరగదు. మొటిమలు, పొడిచర్మం, నిర్జీవమైనచర్మం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలకు ఆయుర్వేద ఉత్పత్తులను వాడటం ద్వారా చెక్ పెట్టచ్చు.

ADVERTISEMENT

చర్మ సంరక్షణ విషయంలో మేలు చేసే పతంజలి ఉత్పత్తులు:

పతంజలి సౌందర్య అలోవెరా జెల్ కేసర్ చందన్(రూ. 91)

ముడి పదార్థాలు: కుంకుమ పువ్వు(Saffron), కలబంద(Aloe Vera), చందనం(Sandolwood)

ప్ర‌కృతి మనకు ప్రసాదించిన ఔషధ మొక్కల్లో కలబంద ఒకటి. ఇది సౌందర్యాన్ని పెంచడమే కాకుండా.. కొన్ని రకాల చర్మ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. దీన్ని అప్లై చేసుకోవడం ద్వారా చర్మానికి పోషణ అందుతుంది. పైగా చర్మం కోల్పోయిన తేమను తిరిగి పొందుతుంది. దీనిలోని యాంటీ ఇనఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ ఫలితాలను పొందడానికి కలబందను చర్మానికి రాసుకోవడం ఒక్కటే మార్గం కాదు.. దాన్ని కొద్దిమోతాదులో తినడమూ మంచిదే. ఇది ఆరోగ్యపరంగానూ మనకు మేలు చేస్తుంది. పతంజలి అందిస్తోన్న సౌందర్య అలోవెరా జెల్ లో చందనం, కుంకుమ పువ్వు కూడా ఉన్నాయి. కుంకుమపువ్వు మేనిఛాయను మెరుగపడేలా చేస్తుంది. చందనం చర్మంపై ఏర్పడిన ట్యాన్ ను తొలగించి కొత్త మెరుపును అందిస్తుంది. మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలు, పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను నివారిస్తుంది. కలబంద, కుంకుమ పువ్వు, చందనం మేలు కలయికలో తయారైన పతంజలి సౌందర్య జెల్ ఎలాంటి చర్మతత్వం కలిగిన వారైనా ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. రసాయనాల ప్రభావం ఉండదు కాబట్టి రోజులో ఎన్నిసార్లైనా దీన్ని ఉపయోగించవచ్చు.

ADVERTISEMENT

టిప్: సౌందర్యజెల్ ను ఫ్రిజ్ లో పెట్టి ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల చర్మానికి మరింత సాంత్వన కలుగుతుంది. 

పతంజలి లిప్ బామ్ స్ట్రాబెర్రీ(రూ. 25)

ముడి పదార్థాలు: సహజమైన మైనం, విటమిన్ ఇ, స్ట్రాబెర్రీ గుజ్జు

ADVERTISEMENT

పూర్తిగా సహజమైన ఉత్పత్తులతో తయారైన పతంజలి లిప్ బామ్ ఏ రుతువులోనైనా ఉపయోగించవచ్చు. వేడిగా ఉన్న ప్రదేశాల్లో పనిచేసేవారి పెదవులు పొడిగా మారిపోతుంటాయి. లిప్ బామ్ రాసుకొన్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించదు. అదే పతంజలి లిప్ బామ్ ఉపయోగిస్తే.. పెదవులు పొడిగా మారవు. ఫలితంగా అధరాలు సున్నితంగా మారతాయి. కాబట్టి లిప్ స్టిక్ వేసుకొనే ముందు దీన్ని అప్లై చేసుకోవచ్చు.

టిప్ : చేతి గోర్లను ఆనుకొని ఉన్నచర్మం పొడిగా లేదా పొరలుగా ఊడుతుంటే.. అక్కడ ఈ లిప్ బామ్ రాసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

పతంజలి సౌందర్య ఫేస్ వాష్(రూ. 60)

ADVERTISEMENT

ముడి పదార్థాలు: కలబంద, వేప, తులసి, నారింజ తొక్కల పొడి, గ్లిజరిన్, విటమిన్ ఇ.

సాధారణంగా మనం ఉపయోగించే పేష్ వాష్ లో చర్మానికి హాని చేసే రసాయనాలు, డిటర్జెంట్ ఉంటాయి. అందుకే ఎక్కువగా నురుగ వస్తుంటాయి. దీనివల్ల చర్మం పొడిబారిపోవడమే కాకుండా.. చర్మగ్రంథులు ఉత్పత్తి చేసే నూనెలను పూర్తిగా తొలగిస్తాయి. దీనివల్ల చర్మంపై మొటిమలు రావచ్చు. పిగ్మెంటేషన్ సమస్య ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే పతంజలి సౌందర్య ఫేస్ వాష్ ఉపయోగించాల్సిందే. దీనిలో ఉపయోగించిన పదార్థాలు.. చర్మానికి ఎలాంటి హాని చేయకుండా.. చర్మాన్ని శుభ్రం చేస్తాయి. వేప, తులసి లోని గుణాలు చర్మానికి హాని చేసే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీనివల్ల మొటిమలు రాకుండా ఉంటాయి. అలాగే విటమిన్ ఇ, గ్లిజరిన్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి సున్నితంగా మారుస్తాయి. నారింజ తొక్కలోని గుణాలు.. చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి ట్యాన్, డార్క్ స్పాట్స్ తొలగించి ముఖాన్ని మెరిపిస్తుంది.

పతంజలి ఫేస్ ప్యాక్ ముల్తానీ మట్టి(రూ. 89)

ADVERTISEMENT

ముడి పదార్థాలు: కలబంద, ముల్తానీ మట్టి, మిక్స్డ్ క్లే.

మొటిమలు, మచ్చలను తగ్గించి చర్మాన్ని బిగుతుగా, ప్రకాశవంతంగా తయారుచేస్తుంది ముల్తానీ మట్టి. దీన్ని అవసరానికి అనుగుణంగా రోజూ లేదా వారానికి లేదా నిర్ణీత వ్యవధిలో ముఖానికి ప్యాక్ లా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. మృత‌క‌ణాలు, చర్మ రంధ్రాల్లో పేరుకొన్న మురికిని తొలగిస్తుంది. దీనివల్ల చర్మం లోతుగా శుభ్రమై ప్రకాశవంతంగా మారుతుంది. పతంజలి అందించే ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్లో ముల్తానీ మట్టితో పాటు కలబంద, మిక్స్డ్ క్లే కూడా ఉన్నాయి. ఈ మూడింటి కలయిక చర్మాన్నికి మరింత మేలు చేస్తుంది. దీన్ని చర్మానికి మందపాటి పొరలా అప్లై చేసుకొని పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత చర్మాన్ని మృదువుగా మర్దన చెయ్యాలి. పతంజలి ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి రెండు రకాలుగా మేలు జరుగుతుంది. దీనివల్ల చర్మం శుభ్రపడటమే కాకుండా.. రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. దీన్ని వారానికి రెండు సార్లు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

టిప్ : పతంజలి ముల్తానీ మట్టి ఫేస ప్యాక్ ను ఫ్రిజ్ లో ఉంచి వాడటం వల్ల సూర్యరశ్మి తాపానికి గురైన చర్మానికి ఉపశమనం దొరకుతుంది.

ADVERTISEMENT

పతంజలి బాడీ ఉబ్తన్(రూ. 135)

ముడి పదార్థాలు: కందిపప్పు, మినపప్పు, జొన్నలు, బియ్యం, బాదం పొడి, విటమిన్ ఇ.

కొన్నేళ్ల క్రితం వరకు మన దేశంలో సబ్బుకి బదులుగా సున్నిపిండినే ఉపయోగించేవారు. దీనికోసం పప్పులు, బియ్యం పొడిగా చేసి అందులో పసుపు కలిపి ఉపయోగించేవారు. ఇది చర్మాన్ని శుభ్రం చేయడం మాత్రమే కాకుండా.. అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. చర్మంపై మచ్చలు లేకుండా చేసి సున్నితంగా మారుస్తుంది.

పతంజలి అందించే బాడీ ఉబ్తన్ కూడా సున్నిపిండి లాంటిదే. మనం వదిలేసిన సంప్రదాయ పద్ధతిని మళ్లీ మన ముందుకు తీసుకొచ్చింది. పతంజలి ఉబ్తన్ లో పాలు, రోజ్ వాటర్, నిమ్మరసం, వెన్న వంటి వాటిని కలిపి మిశ్రమంగా చేసి చర్మాన్ని బాగా మర్దన చేసుకోవాలి. దీన్ని సబ్బుకి బదులుగా రోజూ ఉపయోగించవచ్చు. పతంజలి ఉబ్తన్ ను ఫేస్ ప్యాక్, బాడీ మాస్క్ గా కూడా ఉపయోగించవచ్చు. పొడిగా ఉన్న చర్మానికి ఉబ్తన్ ను అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత మృదువుగా మర్దన చేసుకొంటూ… గోరువెచ్చని నీటిని ఉపయోగించి ప్యాక్ ను తొలగించాలి.

ADVERTISEMENT

పతంజలి ఉబ్తన్ ను రోజూ ఉపయోగించడం ద్వారా చర్మంపై మురికి, మృత‌క‌ణాలు తొలగిపోతాయి. అలాగే చర్మంపై రోమాల పెరుగుదల తగ్గుతుంది. ముఖ్యంగా పెళ్లి సమయంలో దీన్ని ఉపయోగించడం వల్ల కొత్త మెరుపు మీ సొంతమవుతుంది.

పతంజలి యాంటీ రింకిల్ క్రీం(రూ. 114)

ముడి పదార్థాలు: బాదం నూనె, గోధుమ నూనె, పండ్ల గుజ్జు, కీరా, అలొవెరా ఎస్సెన్స్

ADVERTISEMENT

వయసు పెరిగేకొద్దీ చర్మంపై ముడతలు పడటం సహజం. వాటిని తగ్గించడానికి మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులున్నాయి. మరి పతంజలి రింకిల్ క్రీం ప్రత్యేకత ఏంటి? మిగిలినవన్నీ రసాయన పదార్థాలతో తయారైతే.. పతంజలి రింకిల్ క్రీం మాత్రం.. చర్మానికి మేలు చేసే నూనెలు, పండ్ల గుజ్లు వంటి వాటితో తయారైంది. దీనివల్ల చర్మానికి దుష్ప్రభావాలు కలగవు. పైగా మనం కోరుకొన్న ఫలితం దక్కుతుంది. దీనిలో ఉపయోగించిన పదార్థాలు ముడతలు పడిన చర్మాన్ని తిరిగి బిగుతుగా మారేలా చేస్తాయి. అలాగే సూర్యరశ్మి ప్రభావం వల్ల చర్మంపై పడకుండా కాపాడుతుంది. దీన్నిక్రమం తప్పకుండా ఉపయోగిస్తే.. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.

టిప్: పతంజలి యాంటీ రింకిల్ క్రీంను నైట్ క్రీంగా సైతం ఉపయోగించవచ్చు.

పతంజలి సన్ స్క్రీన్ క్రీం (రూ. 100)

ADVERTISEMENT

ముడి పదార్థాలు: కలబంద, కొబ్బరి నూనె, గోధుమ నూనె, కీరా, మెంతులు, పసుపు

చర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతిరోజూ సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా ఉపయోగించాల్సిందే. అందులోనూ హెర్బల్, ఆయుర్వేద గుణాలున్న సన్ స్కీన్ క్రీం చర్మానికి రాసుకొంటే అటు అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా ఉంటుంది. ఇటు చర్మం అందంగా తయారవుతుంది. పతంజలి సన్ స్క్రీన్ క్రీంలోని పసుపు మేనిఛాయను పెంచుతుంది.

టిప్ : మరింత ప్రయోజనం పొందడానికి పతంజలి సన్ స్క్రీన్ క్రీంను ప్రతి రెండు మూడు గంటలకోసారి అప్లై చేసుకోండి.

ADVERTISEMENT

పతంజలి సౌందర్య కోకో బాడీ బట్టర్ క్రీం(రూ. 490)

ముడి పదార్థాలు: కొకోవా బటర్, షీర్ బటర్, బాదం నూనె, కొబ్బరి నూనె, కమలాఫలం, అవకాడో, కలబంద.

పొడి చర్మం, జిడ్డు చర్మం కలిగినవారికి వాతావరణ మార్పులతో పాటూ కొత్త సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా పొడి చర్మం కలిగినవారిలో కొంతమందికి చర్మం పొడిగా మారడమే కాకుండా పొరలుగా వూడి వస్తూ ఉంటుంది. ఇలాంటి వారికి పతంజలి సౌందర్య కోకో బాడీ బటర్ మంచి ఎంపిక. ఈ క్రీం చర్మంపై పొరలా ఏర్పడి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది ఎలాంటి చర్మతత్వం కలిగినవారైనా దీన్ని ఉపయోగించవచ్చు.

పతంజలి క్రాక్ హీల్ క్రీం(రూ. 60)

ADVERTISEMENT

ముడి పదార్థాలు: 23 రకాల మూలికలు, తైలాలు

సాధారణంగా ముఖం, చేతుల సౌందర్యంపై చూపించిన శ్రద్ధ పాదాలపై చూపించం. చాలామంది పాదాలు పగుళ్లతో ఉంటాయి. పతంజలి క్రాక్ హీల్ క్రీం ఉపయోగిస్తే.. పగుళ్లు తగ్గుముఖం పడతాయి. దీన్ని పాదాలకు రాసుకోవడం ద్వారా అక్కడి చర్మానికి పోషణ అంది సున్నితంగా తయారవుతుంది. ఈ క్రీంను నిద్రపోయే ముందు పాదాలకు రాసుకొని సాక్స్ వేసుకోవాలి. ప్రతి రోజూ ఇలా చేయడం ద్వారా పెడిక్యూర్ చేసుకోవాల్సిన అవసరం తగ్గిపోతుంది.

పతంజలి దివ్య గులాబ్ జల్(రూ. 29)

ముడి పదార్థం: రోజ్ వాటర్

ADVERTISEMENT

సౌందర్య పోషణలో రోజ్ వాటర్ ది ప్రత్యేకమైన స్థానం. దీన్నిఫేస్ ప్యాక్, బాడీ ప్యాక్ లో కచ్చితంగా ఉపయోగిస్తారు. దీన్ని టోనర్ గా, క్లెన్సర్ గా సైతం ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్ చర్మం పొడిబారడం, జిడ్డుబారే సమస్యలకు చక్కటి పరిష్కారం. దీనిలోని హీలింగ్ ప్రోపర్టీస్ వాడిపోయినట్లుగా తయారైన చర్మాన్ని తిరిగి ఫ్రెష్ గా మారుస్తాయి. రోజ్ వాటర్ గురించి మీకో విషయం తెలుసా? దీన్ని ఐ డ్రాప్స్ గా కూడా ఉపయోగించవచ్చు.

పతంజలి పీడాంతక్ ఆయిల్(రూ. 62)

ముడి పదార్థాలు: వెల్లుల్లి నూనె, కాసరతీగ నూనె, గుగ్గులు, అర్క పత్ర, నిర్గుండి, దివ్యధార, నొప్పిని తగ్గించే ఇతర నూనెలు

మీరేదైనా నొప్పలతో బాధపడుతున్నట్లయితే పతంజలి పీడాంతక్ ఆయిల్ తో మర్దన చేసుకొంటే చాలా తక్కువ సమయంలో ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పలు, ఆర్థరైటిస్, ఆస్టియోపొరోసిస్, స్పాండిలైటి్స్, గౌట్ వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ నూనె చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది. నొప్పిగా ఉన్న ప్రాంతంలో ఈ నూనెతో మర్దన చేసి వేడి నీటిలో ముంచిన వస్త్రాన్ని ఉంచితే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ADVERTISEMENT

పతంజలి అడ్వాన్స్డ్ దంత కాంతి మంజన్ (రూ. 250)

ముడి పదార్థాలు: వేప, వజ్రదంతి, కరక్కాయ, పుదీనా, లవంగం, పసుపు, తుమ్మ, పిప్పలు, యష్ఠి మధుకం, సైంధవ లవణం, యాలకులు, ఇతర వనమూలికలు.

టూత్ పేస్ట్ కి పూర్తి ఆయుర్వేద రూపమే ఈ పతంజలి అడ్వాన్స్డ్ దంతకాంతి మంజన్. దీనిలో సుమారుగా 26 రకాల ఔషధాలు, మూలికలతో దీన్ని తయారుచేశారు. ఇది దంతాలను శుభ్రం చేయడమే కాకుండా.. నోటిని ఫ్రెష్ గా ఉంచుతుంది. చిగుళ్లవాపు, పంటి నొప్పి, చిగుళ్ల నుంచి రక్తం రావడం, నోటి నుంచి దుర్వాసన రావడం వంటి సమస్యలతో ఉన్నవారికి ఈ టూత్ పేస్ట్ మంచి ఫలితాన్నిస్తుంది. 

హోం కేర్ పతంజలి ఉత్పత్తులు (Home Care Products)

ఇంటిని శుభ్రం చేయడానికి హానికారకమైన రసాయనాలతో తయారైన ఉత్పత్తులను వదిలి సహజమైన వాటిని ఎంచుకోవాలనుకొనేవారికి పతంజలి ఉత్పత్తులు చక్కటి ప్రత్యామ్నాయం. డిష్ వాష్ జెల్, డిటర్జెంట్, టాయిలెట్ క్లీనర్, ఇలా ఇంటిని శుభ్రంగా ఉంచడానికి అవసరమైన ఉత్పత్తులన్నింటినీ పతంజలి అందిస్తోంది.

ADVERTISEMENT

పతంజలి హెర్బల్ వాష్ డిటర్జెంట్ పౌడర్(రూ. 150)

ముడి పదార్థాలు: గులాబీ, వేప, నిమ్మ, డిటర్జెంట్ బేస్

గులాబీ, నిమ్మ గుణాలతో తక్కువ ఖర్చుతోనే మనకు డిటర్జెంట్ పౌడర్ ను అందుబాటులోకి తెచ్చింది పతంజలి. ఈ పౌడర్ ను వాషింగ్ మెషీన్ లో కూడా ఉపయోగించవచ్చు.

పతంజలి అలొవెరా హ్యాండ్ వాష్ (రూ. 57)

ADVERTISEMENT

ముడి పదార్థాలు: కలబంద, హ్యాండ్ వాష్ బేస్

రసాయనాలతో తయారైన హ్యాండ్ వాష్ ని చేతులను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తే.. అవి మన శరీరంలోకి చేరే అవకాశం ఉంది. ఇవి మన ఆరోగ్యానికి ప్రమాదాన్నితెచ్చిపెట్టవచ్చు. కాబట్టి హ్యాండ్ వాష్ సహజసిద్ధమైనదైతే మన ఆరోగ్యానికి మంచిది. దానికోసం పతంజలి అలొవెరా హ్యాండ్ వాష్ చక్కటి ఎంపిక.

పతంజలి ప్రిస్టీన్ కిచెన్ క్లీనర్(రూ. 85)

కిచెన్ లో అన్ని చోట్లా శుభ్రం చేయడానికి పతంజలి కిచెన్ క్లీనర్ బాగా ఉపయోగపడుతుంది. ఇది కార్నర్ లో, కౌంటర్ టాప్ లో పేరుకొన్న జిడ్డు, మురికిని చాలా సులభంగా వదలగొడుతుంది. ఇది బాత్రూం గోడలపై ఏర్పడిన నీటి మరకలను సైతం వదలగొడుతుంది.

ADVERTISEMENT

హెయిర్ కేర్ పతంజలి ఉత్పత్తులు (Hair Care Products)

జుట్టు, స్కాల్ఫ్ సంబంధిత సమస్యలను పతంజలి హెయిర్ కేర్ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా తగ్గించుకోవచ్చు. వీటి తయారీకి ఆర్గానిక్ పద్ధతిలో పండినవాటినే ఉపయోగిస్తారు. కాబట్టి రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభవాలు ఎదరవ్వవు. పైగా అందమైన కురులు మీ సొంతమవుతాయి.

పతంజలి కేష్ కాంతి ఆయిల్(రూ. 130)

ముడి పదార్థాలు: గుంటగలగర, బ్రహ్మి, ఉసిరి, గోరింట, వేపాకు, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, గోధుమ నూనె, సన్ ఫ్లవర్ నూనె, నాగ కేసరము, మందారం, జుట్టును దృఢంగా చేసే ఇతర మూలికలు.

జుట్టు రాలిపోవడం, జుట్టు తెల్లబడటం, చుండ్రు, ఇతర స్కాల్ఫ్ సంబందిత సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఉపయోగిస్తే.. ప్రయోజనం కనిపిస్తుంది. పతంజలి కేష్ కాంతి హెయిర్ ఆయిల్ కురులకు లోతైన పోషణ ఇచ్చి కుదుళ్ల నుంచి దృఢంగా అయ్యేలా చేస్తుంది. మాడుపై ఏవైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉంటే అవి కూడా తగ్గుముఖం పడతాయి.

ADVERTISEMENT

పతంజలి కేష్ కాంతి రీటా(రూ. 84)

ముడి పదార్థాలు: గోరింట, షీకాకాయ, కుంకుళ్లు, పసుపు, వేప, కలబంద, మొదలైనవి.

సహజసిద్ధమైన పదార్థాలతో తయారైన ఈ షాంపూ ఉపయోగించడం వల్ల జుట్టు శుభ్రపడుతుంది. దీనిలోని పసుపు, వేప.. చుండ్రు సమస్యను తగ్గిస్తాయి. కలబంద జుట్టుకి పోషణ ఇచ్చి మాయిశ్చరైజ్ చేస్తుంది. షీకాకాయ, కుంకుళ్లు జుట్టుని శుభ్రపరుస్తాయి.

పతంజలి ఉత్పత్తులపై మా రివ్యూ (Our Reviews Of Patanjali Products)

పూర్తిగా వనమూలికలతో తయారవుతూ.. తక్కువ ధరకే లభ్యమవుతున్న పతంజలి ఉత్పత్తులను స్వయంగా ఉపయోగించి వాటి గురించి మీకు చెప్పాలని భావించాం. అందుకే 11 రకాల ఉత్పత్తులను మేం కొనుగోలు చేసి అవెలా ఉన్నాయో మీతో పంచుకోవాలనుకొంటున్నాం. వాటి ఆధారంగా మీరు పతంజలి ఉత్పత్తులు కొనుగోలు చేసే విషయంలో నిర్ణయం తీసుకోండి.

ADVERTISEMENT

అలొవెరా కాంతి సోప్ (Aloha Light Soap)

గత వారం రోజులుగా నేను ఈ సోప్ ను ఉపయోగిస్తున్నాను. దీనిలో అలొవెరా ఉండటం వల్ల చర్మం సున్నితంగా తయారవడమే కాకుండా కూలింగ్ ఎఫెక్ట్ దొరుకుతుందని నేను భావించాను. కానీ పూర్తి భిన్నంగా ఫలితాలున్నాయి. సబ్బు ఉపయోగించిన తర్వాత నా చర్మం పొడిగా మారిపోయింది. 

ధర : 5 సబ్బులు రూ. 65.

– ప్రదిప్త సర్కార్, మేనేజింగ్ ఎడిటర్.

ADVERTISEMENT

కేష్ కాంతి నేచురల్ షాంపూ (Cache Light Natural Shampoo)

సహజసిద్ధమైన పదార్థాలతో తయారైన ఈ షాంపూ నిర్జీవంగా మారిన నా జుట్టుకి తిరిగి జీవం పోసింది. దీన్న ఉపయోగించడం మొదలు పెట్టిన తర్వాత చుండ్రు సమస్య తగ్గుముఖం పట్టింది.

– షారోన్ అల్ఫాన్సో, లైఫ్ స్టయిల్ & బ్యూటీ రైటర్

ఒత్తుగా ఉన్న నా జుట్టుని శుభ్రం చేయడంతో ఈ షాంపూ విఫలమైందనే చెప్పాలి. ఒకటికి రెండు సార్లు ఈ షాంపూని ఉపయోగించినా.. జిడ్డు వదల్లేదనే చెప్పాలి.

ADVERTISEMENT

– నేహా గుప్త, సీనియర్ లైఫ్ స్టైల్ రైటర్

పతంజలి కేష్ కాంతి షాంపూ ప్రభావవంతంగా పనిచేస్తుందనే నేను భావిస్తున్నాను. ఇది నా జుట్టును బాగా శుభ్రం చేయడమే కాకుడా కండిషనింగ్ కూడా చేస్తుంది. పొడి జుట్టుతో ఉన్నవారికి నేను ఈ షాంపూని రికమెండ్ చేస్తాను.

– సాకేత్ జైన్, లీడ్ ఆండ్రాయిడ్ ఇంజనీర్

పతంజలి షాంపూని నెల రోజుల పాటు నేను వాడాను. కొన్ని సందర్భాల్లో జుట్టు బౌన్సీగా ఉంటే.. మరికొన్ని సందర్భాల్లో జుట్టు డ్రైగా మారింది. చివరిగా ఈ షాంపూ పనిచేయలేదనే చెబుతాను.

ADVERTISEMENT

– అపూర్వ గుప్త, ఎడిటోరియల్ కో ఆర్డినేటర్

అలోవెరా జెల్ (Aloe Vera Gel)

నెల రోజులుగా నేను అలోవెరా జెల్ ఉపయోగిస్తున్నాను. దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టిన తర్వాత నా చర్మంపై మొటిమలు పెరగడం ప్రారంభించాయి. నా చర్మం ఇంకా  జిడ్డుగా మారడం నేను గమనించాను. ఈ జెల్ అనుకొన్న ఫలితాన్నివ్వలేదు.

– సొనాలీ పవార్, ఎడిటోరియల్ కోఆర్డినేటర్

ADVERTISEMENT

మాయిశ్చరైజర్ క్రీం (Moisturizer Cream)

ఈ క్రీం బాగానే పనిచేస్తుందని చెబుతాను. దీని పరిమళం నన్ను ఆకట్టుకొంటోంది. ఇది చాలా సులభంగా చర్మంపై పరచుకొంటోంది. తక్కువ మొత్తంలో రాసుకొన్నా చర్మం మృదువుగా అనిపిస్తోంది.

– మానికా పరేషార్, లైఫ్ స్టైల్ రైటర్, కాపీ ఎడిటర్.

ఈ మాయిశ్చరైజర్ క్రీం నాకు బాగా నచ్చింది. నా చర్మాన్ని చక్కగా మాయిశ్చరైజ్ చేస్తుంది. ముఖంపై మొటిమలు కూడా తగ్గడం ప్రారంభించాయి. దీన్ని నేను ఉదయం రాసుకొంటాను. ఆపై మరోసారి అప్లై చే సుకోవాల్సిన అవసరం రావడం లేదు. దీని సువాసన కూడా నాకు నచ్చింది.

ADVERTISEMENT

– స్నేహ మనంధర్, లైఫ్ స్టైల్ రైటర్.

హెర్బల్ కాజల్ (Herbal Kajal)

ఈ కాజల్ లో ఉన్న ఒకే ఒక్క మంచి విషయం ఏంటంటే దీని రంగు. అది మినహా.. దీనిలో చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఇది అప్లై చేసుకొన్న కాసేపటికే పాక్కుపోయినట్లుగా తయారవుతోంది. పది మార్కుల్లో ఈ కాటుకకి నేను సున్నా మార్కులు వేస్తాను.

– సన్యా జైన్, బ్యూటీ రైటర్, కాపీ ఎడిటర్.

ADVERTISEMENT

హనీ ఆరెంజ్ ఫేస్ వాష్ (Honey Orange Face Wash)

ఈ ఫేస్ వాష్ నారింజ సువాసనతో ఆహ్లాదంగా మారుతోంది. చర్మాన్ని చక్కగా శుభ్రం చేస్తోంది. అయితే జిడ్డు చర్మం కలిగినవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నాది పొడి చర్మం. ఈ ఫేష్ వాష్ ఉపయోగించడం వల్ల అది ఇంకా పొడిగా మారుతోంది.

– సాన్యా జైన్, బ్యూటీరైటర్, కాపీ ఎడిటర్.

నా చర్మం వేసవిలో జిడ్డుగా.. శీతాకాలంలో పొడిగా మారిపోతుంటుంది. హనీ ఆరెంజ్ ఫేస్ వాష్ నేను ప్రయత్నించాను. ఇది నేను కోరుకొన్న ఫలితాన్నిచ్చింది. నా స్కిన్ ఇప్పుడు న్యూట్రల్ గా మారింది.

ADVERTISEMENT

– స్నేహ మనంధర్, లైఫ్ స్టయిల్ రైటర్

గులాబ్ జల్ (Gulab Jal)

పతంజలి గులాబ్ జల్ ను నేను రెగ్యులర్ గా ఉపయోగిస్తాను. టోనర్ గా, పేస్ ప్యాక్ ల్లోనూ వాడతాను. నా చర్మం సున్నితంగా ఉండటంతో పాటు బాగా జిడ్డుగానూ ఉంటుంది. రోజ్ వాటర్, పతంజలి అలోవెరా మింట్ ఫేస్ వాష్ నా సమస్యను తగ్గించాయి.

–  గరిమా సింగ్, హిందీ రైటర్

ADVERTISEMENT

కేష్ కాంతి రీటా షాంపూ (Cache Light Rita Shampoo)

ఈ షాంపూ పండ్ల పరిమళాన్ని వెదజల్లుతున్నప్పటికీ.. రెగ్యులర్ గా నేను ఉపయోగించే షాంపూ కంటే ఎక్కువ నురగను ఇస్తోంది. ఇది జుట్టును బాగానే శుభ్రం చేసినప్పటికీ.. ఈ షాంపూ వల్ల అదనపు ప్రయోజనాలను నేను పొందలేకపోయాను. అంతేకాదు ఈ షాంపూలో డైజోలిడినిల్ యూరియా ఉన్నట్టు గుర్తించాను. అయితే దీనివల్ల నా జుట్టు ఎలాంటి ప్రభావానికి గురవుతుందనే దానిపై నాకు అంతగా అవగాహన లేదు.

– మానికా పరేషార్, బ్యూటీ రైటర్, కాపీ ఎడిటర్

డైజోలిడినిల్ యూరియా.. ఫార్మాల్డిహైడ్ కలిగి ఉంటుంది. దీన్ని చాలా కాస్మెటిక్స్ లో ఉపయోగిస్తారు. దాని వల్ల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఎక్కువ.

ADVERTISEMENT

సౌందర్య మైసూర్ సూపర్ శాండిల్ బాడీ క్లెన్సర్ (Cosmetic Mysore Super Sandal Body Clenzure)

ఇంత సువాసన వెదజల్లే సబ్బుని నేను ఇంతవరకు చూడలేదు. వాడలేదు. దీన్ని ఉపయోగించిన తర్వాత నా శరీరం సువాసనభరితంగా మారిపోతుంది. దీనివల్ల నా చర్మం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కి గురి కాలేదు. కానీ ఇందులో ఎంత మొత్తంలో కలబంద, చందనం ఉపయోగించారనేదే నాకు ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే వాటికి సంబంధించిన వివరాలేమీ ప్యాక్ పై లేవు.

– ఇషిత శర్మ, లైఫ్ స్టయిల్ రైటర్.

ఆప్రికాట్ ఫేస్ స్క్రబ్ (Apricot Face Scrub)

ADVERTISEMENT

సాధారణంగా నేను ఏ ఫేస్ స్క్రబ్ ఉపయోగించినా.. వారం రోజుల కంటే ఎక్కువ ఉపయోగించను. ఎందుకంటే అవి ఉపయోగించినప్పుడు చర్మం మంటగా అనిపిస్తూ ఉంటుంది. కానీ పతంజలి ఆప్రికాట్ ఫేస్ స్క్రబ్ దీనికి మినహాయింపు. చాలా మైల్డ్ గా ఉన్న ఈ స్క్రబ్ చర్మంపై మురికిని సమర్థవంతంగా తొలగిస్తుంది. అలాగే దీనిలోని స్క్రబ్ బీడ్స్ వైట్/బ్లాక్ హెడ్స్ ని తొలగిస్తాయి. ఇది చాలా మంచి ఉత్పత్తే కానీ.. మళ్లీ కొని వాడాల్సినంత గొప్పదేమీ కాదని నా అభిప్రాయం.

– మనస్వీ జైట్లీ , వెడ్డింగ్ రైటర్

స్ట్రాబెర్రీ లిప్ బామ్ (Strawberry Lip Bum)

నా పెదవులు తరచూ పొడిగా మారి పగిలిపోతుంటాయి. పతంజలి స్ట్రాబెర్రీ లిప్ బామ్ వాటిని చక్కగా మాయిశ్చరైజ్ చేసింది. అయితే ఇది చాలా పలచగా ఉంది. దీన్ని స్ట్రాబెర్రీ లిప్ బామ్ గా మార్కెటింగ్ చేశారు. కానీ ముడి పదార్థాల్లో స్ట్రాబెర్రీ ఉపయోగించలేదు. స్ట్రాబెర్రీ ఫ్రాగ్రెన్స్ మాత్రమే ఉపయోగించారు. ఆర్గానిక్, నేచురల్ ఉత్పత్తులను అందిస్తున్నామని బ్రాండింగ్ చేసుకొన్న సంస్థ నుంచి ఇలాంటి లిప్ బామ్ రావడం నాకు నచ్చలేదు.

ADVERTISEMENT

– సాన్యా జైన్, బ్యూటీ రైటర్, కాపీ ఎడిటర్

చివరిగా మా మాట.. (Finally Our Word)

మార్కెట్లో దొరికే ఇతర ఉత్పత్తుల మాదిరిగానే.. పతంజలి ఉత్పత్తుల కూడా మీ చర్మం, జుట్టు స్వభావం ఆధారంగానే ఫలితాన్నిస్తాయి. ఒకరికి నచ్చిన ఉత్పత్తి మరొకరికి నచ్చకపోవచ్చు. అందుకే వీటిని మీ చర్మానికి తగ్గట్టుగా పనిచేస్తాయో లేదో మీరే ఒకసారి పరీక్షించి చూసుకోండి. అలాగే ఉపయోగించిన వెంటనే ఫలితాలు వచ్చేస్తాయని ఎదురుచూడకండి.

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

 పతంజలి ఉత్పత్తుల నుండి ఆంగ్లంలో చదవండి

పతంజలి కాకుండా.. ఇతర ఆయుర్వేద ఉత్పత్తుల గురించి ఆంగ్లంలో చదవండి

పతంజలి ఉత్పత్తలు పై సమీక్షను ఆంగ్లంలో చదవండి

09 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT