ADVERTISEMENT
home / వినోదం
‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటున్న.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్

‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటున్న.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్

( Sai Dharam Tej to act in “Solo Brathuke So Better” movie )

‘భద్రం భీ కేర్ ఫుల్ బ్రదరూ…

భర్తగ మారకు బ్యాచిలరూ…

షాదీ మాటే వద్దు గురూ…

ADVERTISEMENT

సోలో బ్రతుకే సో బెటరూ…’

1993లో ‘మనీ’ సినిమాలో వచ్చిన ఈ పాట ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఈ పాట వచ్చి మూడు దశాబ్దాలు అవుతున్నా కూడా.. దానికి ఉన్న క్రేజ్ ఏమాత్రం కూడా తగ్గలేదు. ఇప్పటికి కూడా కొత్త పెళ్లికొడుకులను సరదాగా ఏడిపిస్తూ ఈ పాటని పాడుతుంటారు.

‘ప్రతి ప్రేమకథ కంచికి చేరదు’ అని తెలిపే.. ‘పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్‌’ల లవ్ స్టోరీ ..!

అయితే ఇప్పుడు ఆ పాటకి ఉన్న క్రేజ్‌‌ను ఉపయోగించుకుంటూ..  ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే టైటిల్‌తో ఒక సినిమాను ప్రకటించారు. అయితే ఇది ఏదో లోబడ్జెట్ చిత్రం అనుకుంటే పొరపాటే.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది.

ADVERTISEMENT

ఈ రోజే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం ద్వారా సుబ్బు అనే యువ దర్శకుడు సినీ పరిశ్రమకి పరిచయం అవుతున్నాడు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభ నటేష్ నటించడం విశేషం.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి మొదలవుతుందని నిర్మాతలు అంటున్నారు. ఈ చిత్రానిక తమన్ సంగీతం అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటర్‌‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేయడం జరిగింది.

సాయి తేజ్ చేతిలో ఈచిత్రంతో కలిపి ప్రస్తుతం.. రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి దర్శకుడు మారుతితో చేస్తున్న ‘ప్రతిరోజు పండగే’.. మొన్నీమధ్యనే ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరగగా.. త్వరలోనే మరొక కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన.. 50 ఫేమస్ డైలాగ్స్ మీకోసం..!

ADVERTISEMENT

ఇక ఈ దసరా పండుగ సందర్భంగా.. మరికొందరు హీరోలు కూడా తమ సినిమాల ఫస్ట్ లుక్స్‌‌ను అభిమానులతో పంచుకున్నారు . వారే బాలకృష్ణ, వెంకటేష్, నాగ చైతన్య, అల్లు అర్జున్ & మహేష్ బాబు. ఇటీవలే వెంకటేష్ – నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలయింది. ఇందులో హీరోయిన్స్‌గా రాశి ఖన్నా, పాయల్ రాజ్‌లు నటిస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ మరోసారి స్టైలిష్ మాస్ లుక్‌తో  ‘అల వైకుంఠపురం’లో చిత్రం పోస్టర్ విడుదల చేయగా.. మహేష్ బాబు తన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశాడు. ఆ ఫస్ట్ లుక్‌లో హీరో కొండారెడ్డి బురుజు బ్యాగ్రౌండ్‌లో గొడ్డలి పట్టుకున్నట్లు కనిపిస్తారు. బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన మార్క్ యాక్షన్ లుక్‌తో ఒక పోస్టర్ విడుదలయింది. ఆ లుక్‌లో గొడ్డలి చేత పట్టుకుని.. చాలా పవర్ ఫుల్‌గా ఉన్నారు బాలయ్య.

మొత్తానికి ఈ దసరా పండుగను పురస్కరించుకుని.. కొత్త చిత్రాల ఫస్ట్ లుక్స్, టైటిల్ అనౌన్స్‌మెంట్స్ సినీ అభిమానులలో పండుగ జోష్‌ని నింపుతున్నాయి.

Sye Raa Narasimha Reddy Movie Review : ‘సైరా’ చిత్రంలో.. ‘సై.. సైరా’ అనిపించే 9 అంశాలివే       

ADVERTISEMENT

Featured Image: Instagram.com/Jet Panja                                                                                                                                                                             

07 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT