ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
సెక్స్ సమయంలో ఇలా మాట్లాడితే చాలు.. మూడ్ రెట్టింపవుతుంది..!

సెక్స్ సమయంలో ఇలా మాట్లాడితే చాలు.. మూడ్ రెట్టింపవుతుంది..!

సెక్స్‌లో (sex) ప్రతి జంట పాల్గొంటున్నా.. కొందరు మాత్రమే అందులో పూర్తి ఆనందాన్ని పొందగలుగుతారు. ఇక వారి సెక్స్ జీవితాన్ని ఇంత అందంగా.. ఆనందంగా మార్చేదేంటో తెలుసా? అదే డర్టీ టాక్. అవును.. సెక్స్‌లో పాల్గొంటున్న సమయంలో మీ మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ చెప్పి.. మీ భాగస్వామి మూడ్‌ని (mood) మరింత పెంచేయవచ్చు. చిత్రమేంటంటే, ఇలాంటి కొంటె మాటలను తన చెవిలో చెబితే.. తనలో నిజంగానే ఎంతో మార్పు కనిపిస్తుంది.

పైగా ఈ మాటలు మీ మూడ్‌ని  కూడా పెంచుతాయి. ఇవి ఇరువురి మధ్య దగ్గరితనాన్ని పెంచడంతో పాటు.. మీ భాగస్వామికి ఆనందాన్ని కూడా అందిస్తాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన మాటల వల్ల.. మీ ఇద్దరి మధ్య బంధం మరింత పటిష్టమవుతుంది. అందుకే మీరు డర్టీ టాక్‌ను ఓసారి ట్రై చేసి చూడండి. 

1. తన పేరుతో పిలవండి..

మీ భాగస్వామి పేరును రొమాంటిక్‌గా పిలవడం కంటే.. మరో ఆనందం ఇంకొకటి లేదు. ఈ పద్ధతిని అందరిలాగే మీ భాగస్వామి కూడా ఇష్టపడతారు. అయితే మామూలుగా పిలవడానికి.. రొమాంటిక్‌గా పిలవడానికి చాలా తేడా ఉంటుంది. మీ ఇద్దరూ రొమాంటిక్‌గా ఏవైనా ముద్దు పేర్లు పెట్టుకొని.. వాటితో పిలుచుకుంటే ఇంకా బెటర్. 

2. దేవుడా.. ఇది నాకు చాలా నచ్చేసింది..

తను మీకు నచ్చిన పని చేస్తుంటే.. దాన్ని కొనసాగించేలా ప్రోత్సాహాన్ని అందించే మాటలను మాట్లాడుతూ ఉండండి. దాని వల్ల మీ భాగస్వామి మూడ్ మరింత పెరుగుతుంది. మీకు నచ్చిన పనిని తను మరింత తరచుగా చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే చేసే పని కూడా మీకు నచ్చుతుందా లేదా..? అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. 

ADVERTISEMENT

3. ఇంకాస్త గట్టిగా..

కొన్నిసార్లు అమ్మాయి కూడా సున్నితంగా కాకుండా.. కాస్త రఫ్‌గా ఉండాలని కోరుకుంటుంది. మీరూ అలా కోరుకునే వారిలో ఒకరైతే.. ఇలా చెప్పి చూడండి. కొందరు అబ్బాయిలు.. రఫ్‌గా ఉండేవారిని మరింత ఇష్టపడతారు. మీకు ఇలా ఉండడమే ఇష్టమని తెలిసి వారు ఎంతో ఆనందపడిపోతారు. 

4. అబ్బా.. దీనికోసం నేను రోజు మొత్తం వేచి చూస్తున్నా.. తెలుసా?

రోజంతా గత రాత్రి జరిగిన అద్భుతమైన సెక్స్ గురించి ఆలోచిస్తూ.. ఆ రోజు రాత్రి కూడా అలాంటి అనుభవం కావాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా. అందుకే అలా చెప్పండి.. వారు కూడా రోజంతా ఆలోచించేలా చేయండి. 

5. ఆపకు.. ఇంకాస్త సేపు కొనసాగించు..

మీకు తను చేసే ఏదైనా రొమాంటిక్ పని నచ్చితే.. దాన్ని ఆపకుండా చేసేందుకు ఇలా చెప్పి ప్రయత్నించండి. తను ఆ పనిని తరచూ చేసేందుకు ప్రయత్నిస్తారు. 

6. నువ్వు నా పైన ఉంటే.. నాకు చాలా ఆనందంగా ఉంటుంది.

తను మీ పైన లేదా మీరు తన కౌగిట్లో ఉండడం కంటే.. మీకు మరింత సౌకర్యం మరొకటి ఉంటుందా? మీకు ఆ ఫీలింగ్ అంటే ఎంతో ఇష్టమని తనకు చెప్పడం వల్ల.. తనకూ ఆనందంగా ఉంటుంది.

ADVERTISEMENT

7. ఇప్పుడు నాకు స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తోంది. నువ్వు ఇలా ఎలా చేయగలవు?

ప్రతి ఒక్కరికీ ప్రశంసలు అంటే ఇష్టమే.. మీరు సెక్స్‌లో ఆనందంగా ఫీలవుతున్నారని.. మీ భాగస్వామి తెలుసుకునేలా ఇలా చెప్పి చూడండి. మీ ఆనందం రెట్టింపవ్వకపోతే అడగండి..

8. మీ చేతుల మధ్య, నీ కౌగిట్లో ఉండడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది.

ఈ కౌగిలి మీకు ఎంత సౌకర్యాన్ని అందిస్తుందో.. మీ మాటల్లో చెప్పేందుకు ప్రయత్నించండి.

9. నువ్వు నాకు చాలా చాలా మూడ్ తెప్పిస్తున్నావు..

ఇలా చిన్న మాట చెబితే చాలు.. తన మూడ్ కూడా పెరుగుతుంది. రోజంతా ఈ మాటను గుర్తు చేసుకుంటూ మీ భాగస్వామి ఆనందంగా ఉండగలుగుతారు.

10. నాకు సూపర్ ఆనందాన్ని అందించడం నీ వల్లే అవుతుంది.

ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని చాలా పెంచుతుంది. వారికి తమపై నమ్మకం లేకపోయినా.. మీ మాటలు విని వారు ఇంకా రొమాంటిక్‌గా మారే వీలుంటుంది. దాంతో మీ సెక్స్ అనుభవం మరింత ఆనందంగా మారుతుంది.

ADVERTISEMENT

11. ఈ వ్యూ నాకెంతో నచ్చేసింది..

తనని నగ్నంగా చూస్తున్నప్పుడు.. తన కౌగిట్లో ఉన్నప్పుడు.. ఆ గుండెలపై వాలినప్పుడు.. ఆ ఫీలింగ్ గురించి మీరు చెబుతూ ఇలాంటి మాటలు పంచుకోవచ్చు.

12. నన్ను దగ్గరికి తీసుకో..

ఇద్దరు వ్యక్తులు ఎంత దగ్గరగా ఉంటే.. వారి మధ్య ఆనందం అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే  తనని దగ్గరకి తీసుకొని ముద్దులు పెట్టమని అడిగేందుకు మాత్రం అస్సలు సిగ్గుపడకండి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT
04 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT