ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఈ తొలి వార్షికోత్స‌వ రొమాన్స్ ముచ్చ‌ట్లు.. ఆలుమ‌గ‌ల‌కు ప్ర‌త్యేకం..!

ఈ తొలి వార్షికోత్స‌వ రొమాన్స్ ముచ్చ‌ట్లు.. ఆలుమ‌గ‌ల‌కు ప్ర‌త్యేకం..!

ప్ర‌తిఒక్క‌రి జీవితంలోనూ పెళ్లి ఎంత మ‌ధుర‌మైన ఘ‌ట్ట‌మో.. ఆ త‌ర్వాత తొలిసారి వ‌చ్చే వివాహ వార్షికోత్స‌వాన్ని (Wedding anniversary) కూడా అంతే ప్ర‌త్యేకంగా భావిస్తారు. అందుకే ప్ర‌తి జంట ఈ సంద‌ర్భాన్ని త‌మ‌కు న‌చ్చిన విధంగా గ‌డపాల‌ని భావిస్తారు.

కొంద‌రు డిజిటల్ డిటాక్సిఫికేష‌న్ పాటిస్తూ పచ్చ‌ని ప్ర‌కృతి ఒడిలో సేద‌తీరుతూ ఒక‌రి సాన్నిహిత్యంలో మ‌రొక‌రు గ‌డిపితే; ఇంకొంద‌రు కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌కు పార్టీ ఇస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇలా ఎవ‌రికి న‌చ్చిన రీతిలో వారు తొలి పెళ్లి రోజుని సెల‌బ్రేట్ చేసుకుంటూ మ‌ధుర జ్ఞాప‌కాల‌ను పోగేసుకుంటూ ఉంటారు. అలా తొలి వివాహ వార్షికోత్సవం సంద‌ర్భంగా కొన్ని జంట‌లు పోగుచేసుకున్న జ్ఞాప‌కాల దొంత‌ర్లలో నుంచి కొన్ని రొమాంటిక్ సంఘ‌ట‌న‌లు మీ కోసం..kiss1

1. బంగారంలాంటి ఆనందం..

ఆరోజు మా పెళ్లిరోజు(Wedding anniversary). ఆయ‌న ఎప్ప‌టినుంచో బంగారు క‌ఫ్లింక్స్‌ కావాల‌ని కోరుకుంటున్నారు. అందుకే వాటిని త‌న‌కు బ‌హుమ‌తిగా ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నా. ఇద్ద‌రం ఆరోజు ఇంట్లోనే ఉండి రుచిక‌రమైన భోజ‌నం సిద్ధం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఆ రోజు భోజ‌నం త‌ర్వాత‌ నేనిచ్చిన గిఫ్ట్ బాక్స్ తెర‌చి ఆ క‌ఫ్లింక్స్‌ని చూడ‌గానే ఆయ‌న ఫీలింగ్ మాట‌ల్లో చెప్ప‌లేనిది. ఆ బ‌హుమ‌తి చూసిన త‌ర్వాత ఆయ‌న న‌న్ను ద‌గ్గ‌ర‌కు తీసుకొని హ‌త్తుకున్నారు. బెడ్‌రూంలో నాకోసం ఓ బ‌హుమ‌తి వేచి చూస్తోంద‌ని చెప్పి లోప‌లికి తీసుకెళ్లారు.

అక్క‌డ లైట్ వేయ‌గానే బెడ్ మీద ఎర్ర గులాబీ రేకుల‌పై ప‌ర‌చిన బంగారు రంగు లేస్ లోదుస్తులు కనిపించాయి. నేను వెంట‌నే వాటిని మార్చుకున్నా. ఇద్ద‌రం ఒక‌రినొక‌రం ముద్దుల్లో ముంచెత్తుకుంటూ బెడ్‌పై వాలిపోయాం. పెదాల‌పై, మెడ‌పై ముద్దులు పెట్టుకుంటూ ఇద్ద‌రం బాగా రొమాన్స్ (Romance) చేశాం. ఆ రోజు రాత్రి వ‌ర‌కూ అలాగే రొమాన్స్ చేస్తూ ఉండిపోయాం. మ‌రుస‌టి రోజు ఉద‌యం చాలా ఆల‌స్యంగా నిద్ర‌లేచాను. నిద్ర లేవ‌గానే మా వారి కౌగిలిలో మ‌రోసారి మునిగిపోయా.

kiss2

2.చిన్న గొడ‌వ త‌ర్వాత‌..

మా పెళ్ల‌యిన త‌ర్వాత సంవ‌త్స‌ర‌మంతా ఆనందంగా సాగింది. ఆ రోజు మా పెళ్లిరోజ‌ని ఉద‌యాన్నే ఎంతో ఆనందంగా నిద్ర‌లేచాను. కానీ ఆయ‌న మ‌ర్చిపోయి ఆఫీస్‌కి వెళ్లిపోయారు. నాకు చాలా కోపం వ‌చ్చింది. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ చాలా కోపంగా గ‌డిచింది. ఆయ‌న ఇంటికొచ్చాక గొడ‌వ‌పెట్టుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నా. కానీ ఆయ‌న సాయంత్రం వ‌చ్చాక.. త‌లుపు తీసి పూర్తిగా ఆశ్చ‌ర్య‌పోయా. సంతోషంతో ఎగిరి గంతేయాల‌నిపించేంత ఆనందంగా అనిపించింది.

త‌లుపు తెర‌వ‌గానే ఆయ‌న త‌న మోకాళ్ల‌పై కూర్చొని చేతిలో ఉంగ‌రం ప‌ట్టుకొని “నువ్వు ఏదైనా చెప్ప‌డానికి ముందు నేను నీకో విష‌యం చెప్పాలి. నువ్వు ఎప్పుడూ నా ప‌క్క‌నే ఉండాలి. నేను భ‌విష్య‌త్తులో మ‌న ముఖ్య‌మైన రోజుల‌ను మ‌ర్చిపోయిన‌ప్పుడు కూడా నాతో ఇలాగే సంతోషంగా ఉండాలి. జీవితాంతం నువ్వు నా ప‌క్క‌నుండాల‌ని నా ఆశ‌..” అంటూ న‌న్ను ప్ర‌పోజ్ చేశారు. అంతేకాదు.. నాకెంతో ఇష్ట‌మైన విధంగా న‌వ్వుతూ న‌న్ను త‌న చేతుల‌తో ఎత్తుకున్నారు. నేను త‌న పెదాల‌పై ముద్దు పెట్టాను. త‌న మైకంలో మునిగిపోయి నాకు తెలియ‌కుండానే మా వారి చొక్కా బ‌ట‌న్స్ విప్ప‌డం ప్రారంభించాను. ఆరోజు రాత్రి ఇంట్లోని ప్ర‌తి గ‌దిలోనూ మేమిద్ద‌రం రొమాన్స్ చేశాం..

ADVERTISEMENT

kiss 3

3. పార్టీలో రొమాన్స్‌

రోజూ ఉండే ఆఫీస్‌, ఇత‌ర బాధ్య‌త‌ల‌కు దూరంగా మా పెళ్లిరోజును భిన్నంగా జ‌రుపుకోవాల‌ని నేను, మా ఆయ‌న ముందే నిర్ణ‌యించుకున్నాం. ఎప్పుడూ జీవించే లైఫ్‌స్టైల్‌కి ఆ రోజు బ్రేక్ ఇవ్వాల‌ని అనుకున్నాం. అందుకే మా ఇంటికి దూరంగా ఎక్క‌డికైనా వెళ్లి ఆ రోజు ఆనందంగా జ‌రుపుకోవాల‌ని భావించాం. కానీ కుటుంబ‌ స‌భ్యుల ఒత్తిడి మేర‌కు ఆ రోజు ఇంట్లోనే ఉండాల్సి వ‌చ్చింది. అంతేకాదు.. బంధువులంద‌రికీ హోట‌ల్‌లో పార్టీ కూడా ఇవ్వాల్సి వ‌చ్చింది. ఇది నాకు అస్స‌లు న‌చ్చ‌క‌పోయినా మా జీవితంలోని ఆ ప్ర‌త్యేక‌మైన రోజును ఇలాంటి ఫీలింగ్స్‌తో పాడుచేయకూడ‌ద‌ని మౌనంగా ఉన్నాను. పార్టీని ఆనందంగా జ‌రుపుకోవ‌డానికి ప్ర‌య‌త్నించా.

పార్టీలో భాగంగా గెస్ట్‌ల‌తో పాటు మేమిద్ద‌రం కూడా డ్యాన్స్ చేస్తున్నాం. అయితే మ‌ధ్య‌లోనే మా ఆయ‌న న‌న్ను ప‌క్క‌కు తీసుకొచ్చారు. అక్క‌డున్న బాత్‌రూం లోప‌లికి తీసుకెళ్లి న‌న్ను ముద్దుల‌తో ముంచెత్తారు. ఎవ‌రైనా అక్క‌డికి వ‌స్తారేమో.. లేక బంధుమిత్రుల్లో ఎవ‌రైనా మేము పార్టీలో లేమ‌న్న విష‌యం గుర్తు ప‌ట్టేస్తారేమోన‌ని నేను భ‌య‌ప‌డ్డా. అందుకే అక్క‌డినుంచి వెళ్లిపోదాం అని ఆయ‌న‌ను తొంద‌ర‌పెట్టాను.

అయితే ఆయ‌న పార్టీ కావాలంటే త‌ర్వాత కూడా చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం నాకు బంధుమిత్రుల గురించి ఏమాత్రం ఆలోచ‌న లేదు. నా మ‌న‌సులో నీతో ఈరోజును ప్ర‌త్యేకంగా గ‌డ‌పాల‌నే ఆశ ఉంది.. అంటూ న‌న్ను క‌న్విన్స్ చేశారు. దీంతో అక్క‌డే ముద్దుల్లో మునిగిపోయాం. నా జీవితంలో నేను ఎక్కువ‌గా ఆనందించిన క్షణం అదే.. అంద‌రికంటే నేనే ముఖ్య‌మ‌ని చెప్పి.. ఎక్క‌డున్నాం అని కూడా గ‌మ‌నించ‌కుండా ఆయ‌న నాపై చూపిన ప్రేమ‌కు నేను ఆయ‌న ఒడిలో క‌రిగిపోయా.

ఈ ట్రావెల్ రొమాన్స్ స్టోరీలు.. ప్రేమికులకు, ఆలుమగలకు ప్రత్యేకం..!

ADVERTISEMENT

సెక్స్టింగ్: లైంగిక జీవితాన్ని హాట్ హాట్‌గా మార్చే.. రొమాంటిక్ సందేశాలు..!

లిఫ్ట్‌లో అధర చుంబనం.. ఎలివేటర్ కిస్సింగ్ స్టోరీస్ మీ కోసం..

07 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT