ADVERTISEMENT
home / Bollywood
శృతి హాసన్ “లవ్ లైఫ్”కి బ్రేక్ పడిందా..?

శృతి హాసన్ “లవ్ లైఫ్”కి బ్రేక్ పడిందా..?

తన మనసుకి ఏది తోస్తే అది చేసెయ్యడం, తప్పుని తప్పని నిర్మొహమాటంగా చెప్పే నటీమణుల్లో శృతి హాసన్ (shruti haasan) ఒకరు. మరి ఈ అలవాటు తన తండ్రి కమల్ హాసన్ (Kamal Haasan) నుండి వచ్చిందో లేదా తల్లి సారిక (Saarika) నుండి వచ్చిందో తెలియదు కాని.. ఆమెకి మాత్రం ఫైర్ బ్రాండ్ అనే ఒక పేరు మాత్రం చిత్రసీమలో ఉంది.

తాజాగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్త ఒకటి పెను సంచలనం రేపుతోంది. అదేంటంటే – మూడేళ్ళ క్రితం లండన్‌కి చెందిన సింగర్ మైఖేల్ కోర్సెల్‌తో (Michael Corsale)  ఏర్పడిన స్నేహం క్రమక్రమంగా ప్రేమగా మారి.. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్‌పిప్ కూడా కొనసాగిస్తున్నారు.

అయితే తాను ఏదైనా రిలేషన్ షిప్‌లో ఉన్న సమయంలో.. దానిని రహస్యంగా ఉంచడం వంటివి విషయాలు శ్రుతికి నచ్చేవికావు. ఇదే అంశం పై చాలా సార్లు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ..  తాను ప్రేమించే వ్యక్తి గురించి దాచిపెట్టాల్సిన అవసరం తనకు లేదని తెలిపింది.

ఇక వీరిరువురు కలిసి లండన్‌లో (London)  మ్యూజికల్ షోస్ చేయడంతో.. వారిద్దరి ఆమధ్య బంధం మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక గత ఏడాది కమల్ హాసన్ ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి మైఖేల్ కోర్సెల్‌ని శృతి హాసన్ ఆహ్వానించింది. మైఖేల్ కూడా కమల్ హాసన్‌తో సరదాగా మాట్లాడడం ఆ ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచింది. అదే సమయంలో ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ADVERTISEMENT

ఈ తరుణంలో త్వరలోనే వీరిరువురు పెళ్లి చేసుకుంటారు అని.. అందుకనే  శృతి హాసన్ సినిమాలకి కూడా బ్రేక్ ఇచ్చింది అన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదే క్రమంలో కొద్దిసేపటి క్రితమే మైఖేల్ కోర్సెల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపిన ఓ విషయం ప్రస్తుతం మీడియాలో పలు చర్చలకు దారి తీసింది.. “ఈ యంగ్ లేడీ ఎప్పటికీ నాకు మంచి స్నేహితురాలిగానే ఉంటుంది. ఆమె నాకు స్నేహితురాలిగా ఉన్నందుకు నేను సదా కృతజ్ఞతతో ఉంటాను. లవ్ యూ గాళ్” అని ఆ పోస్ట్‌‌లో తెలిపాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కొంపదీసి.. ఈ జంట బ్రేకప్ అయ్యిందా..? అనే సంశయంతో పోస్టులు కూడా పెడుతున్నారు అభిమానులు.

 

ఇక ఈ వార్తని మైఖేల్ కోర్సెల్ సోషల్ మీడియా ద్వారా తెలపకముందే.. అనగా నిన్నే వారిరువురు కలిసి దిగిన  కొన్ని ఫోటోలు మరియు వీడియోలని శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంటు నుండి తీసేసింది! ఈ క్రమంలో వీరి మధ్య ఏం జరిగింది అని పలు ఊహాగానాలు సైతం సోషల్ మీడియాలో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో మైఖేల్ కోర్సెల్ పెట్టిన పోస్ట్‌ అనేక చర్చలకు దారి తీసింది.

అయితే వీరిద్దరూ ఒక అవగాహనతోనే తమ రిలేషన్‌‌షిప్‌కి స్వస్తి పలికారని కొందరు అంటుంటే..  ఎటువంటి గొడవలు లేదా మనస్పర్థలతో విడిపోలేదని మరికొందరు చెప్పడం గమనార్హం. అయితే శృతి హాసన్ నుండి అధికారికంగా ఎలాంటి సమాచారమూ రాలేదు.

ADVERTISEMENT

గత రెండేళ్ళుగా సినిమాలకి దూరంగా ఉన్న శృతి హాసన్. మూడు నాలుగు రోజుల క్రితమే ఒక తమిళ సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపింది. ఆ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సరసన నటించడానికి సైన్ చేసింది.

అయితే బ్రేకప్ (Break Up) నుండి బయటపడడానికి.. మళ్ళీ సినిమాలు చేసేందుకు శృతి హాసన్ ముందుకి రావడం ఎంతో మంచి పరిణామమని ఇప్పటికే ఆమె అభిమానులు కొందరు అంటున్నారు.  జీవితంలో అనుకున్నది, కోరుకున్నది జరగనప్పుడు చింతిస్తూ కూర్చోకుండా ముందుకి సాగాలి అని చెప్పకనే చెప్పింది శృతి హాసన్ అని కూడా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ శృతి హాసన్ లవ్ లైఫ్‌కి సంబంధించిన వార్తలో నిజ నిజాలు ఎంత వరకు ఉన్నాయో తెలుసుకోవాలంటే.. వేచి చూడాల్సిందే..!

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు vs అక్కినేని అఖిల్.. ఈ ఇద్దరిలో రష్మిక ఓటు ఎవరికి?

ADVERTISEMENT

‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ ఎదుర్కొన్న.. #MeToo అనుభవం గురించి మీరు విన్నారా??

అల్లు అర్జున్ – త్రివిక్రమ్‌ల AA19 చిత్రం.. హాలీవుడ్ ఫ్రీ-మేకా?

 

26 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT