ADVERTISEMENT
home / Celebrity Life
రెండోసారి తల్లైన స్నేహ.. తన ఏంజెల్‌కి వెల్ కం చెప్పిన ప్రసన్న

రెండోసారి తల్లైన స్నేహ.. తన ఏంజెల్‌కి వెల్ కం చెప్పిన ప్రసన్న

హీరోయిన్ స్నేహ (sneha) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటించి హోమ్లీ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుందీ అందాల నాయిక. నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహ పెళ్లి జరిగి, తనకో బాబు పుట్టిన తర్వాత హీరోయిన్‌గా చేయడం తగ్గించి.. క్యారెక్టర్ రోల్స్ ఎంచుకుంటోంది. సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ వంటి చిత్రాల్లో  ప్రత్యేకమైన రోల్స్‌లో నటించి ఆకట్టుకుంది.

హీరో హీరోయిన్లతో సమానంగా కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ తానంటే ఏంటో నిరూపిస్తోంది స్నేహ. తెలుగులో వినయ విధేయ రామ చిత్రం తర్వాత మరో చిత్రంలో నటించలేదు స్నేహ. అయితే తాజాగా తమిళంలో పటాస్ అనే చిత్రంలో నటించింది. ఇందులో ధనుష్, మెహరీన్ జంటగా నటించగా.. స్నేహ ఓ ప్రధాన పాత్రలో కనిపించింది. దీనికోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని సినిమాలో స్టంట్స్ చేయడం విశేషం. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. 

ప్రస్తుతం స్నేహ, ప్రసన్న (prasanna) కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. స్నేహ, ప్రసన్న దంపతులకు ఇప్పటికే విహాన్ అనే కొడుకు ఉండగా ఇప్పుడు రెండోసారి తల్లైంది స్నేహ. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఈరోజు (జనవరి 24) న వీరికి ఓ ముద్దులొలికే బుజ్జి పాప పుట్టినట్లు ప్రసన్న తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకూ ప్రతి ఒక్కరూ వీరిపై శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఏంజెల్ వచ్చేసింది… అంటూ గులాబీ రంగు చిన్న చిన్న షూస్‌కి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారాయన. స్నేహ అకౌంట్‌లో కూడా ఇదే మెసేజ్‌ని షేర్ చేసి ఇట్స్ ఎ గర్ల్ (అమ్మాయి పుట్టింది) అంటూ పంచుకోవడం విశేషం. 

బుజ్జి బుజ్జాయిలకు ఉపయోగపడే.. క్యూట్ క్యూట్ గిఫ్ట్స్ ఇవి..(Gift Ideas For Small Babies)

ADVERTISEMENT

నాలుగు నెలల గర్భంతో ఉన్నప్పుడు కూడా ధనుష్ హీరోగా నటించిన పటాస్ సినిమా చిత్రీకరణ సందర్భంగా అడిమురై అనే మార్షల్ ఆర్ట్‌లో శిక్షణ తీసుకుంది స్నేహ. అలాగే కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌లో నటించింది. వైద్యుల సలహా తీసుకొని ఆ యాక్షన్ సీన్లలో నటించిందట స్నేహ. దీనికోసం డాక్టర్, ఆమె భర్త షూటింగ్ సమయంలో తన వెంటే ఉండేవారట. ఓ సీన్‌లో నటించే సమయంలో అయితే.. ఆమెకు ఏం జరుగుతుందో అని చిత్ర యూనిట్ మొత్తం భయపడిందని దర్శకుడు సెంథిల్ వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్‌లో స్నేహ సీమంతం సందర్భంగా తమకు రెండో సంతానం కలగబోతోందని ప్రకటించారీ జంట. వెంటనే అందరూ వారిని శుభాకాంక్షల వర్షంలో ముంచెత్తారు. సీమంతం సమయంలో స్నేహ అద్భుతంగా కనిపించింది. 

అంగరంగవైభవంగా జరిగిన.. నటి స్నేహ శ్రీమంతం విశేషాలు మీకోసం ..!

ఒకే సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన స్నేహ, ప్రసన్న ప్రేమించుకొని 2009 లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2012 మే 11న వారికి మొదటిసారి బాబు విహాన్ పుట్టాడు. ఆ తర్వాత తిరిగి సినిమాల్లో నటించిన స్నేహ.. తన భర్త ప్రసన్నతో కలిసి వివిధ ప్రకటనల్లో కూడా నటించింది. గర్భంతో ఉన్నప్పుడు కూడా సినిమాలలో నటించిన స్నేహ ఇప్పుడు ఎలాంటి చిత్రాల్లో నటిస్తుందో వేచి చూడాల్సిందే. కొత్తగా తల్లిదండ్రులైన ఈ జంటకు మనమూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పేద్దాం.

ADVERTISEMENT

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.                              

24 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT