home / Family
అమ్మా.. నా జీవితం నాశనం చేసినందుకు థ్యాంక్స్: సినీనటి సంగీత

అమ్మా.. నా జీవితం నాశనం చేసినందుకు థ్యాంక్స్: సినీనటి సంగీత

ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. అంటూ ఖడ్గం సినిమాలో సంగీత (Sangeetha) నటిస్తే అభిమానులంతా ఈలలు వేసి ఆమెను అభిమాన తారగా అందలానికి ఎక్కించారు. తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో నటించి రెండు దశాబ్దాల పాటు అగ్ర కథానాయికగా కొనసాగింది సంగీత. అయితే ఖడ్గం చిత్రంలో చూపించినట్లు నిజ జీవితంలోనూ సినిమా అవకాశాల కోసం తన తల్లి సంగీత జీవితాన్ని పణంగా పెట్టిందా? తాజాగా సంగీత పోస్ట్ చేసిన లేఖను (Letter) చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.

గత వారం నటి సంగీత తల్లి భానుమతి తన కూతురు తనని ఇంటి నుంచి బయటకు గెంటేసి.. ఓల్డేజ్ హోమ్‌లో చేర్పించాలని చూస్తోందని.. తనకు రక్షణ కల్పించమని చెన్నై మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కోలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

 

రెండు దశాబ్దాల పాటు అగ్ర కథానాయికగా కొనసాగి ప్రస్తుతం ప్రముఖ గాయకుడు క్రిష్‌ని పెళ్లాడిన సంగీతపై ఇలాంటి ఫిర్యాదు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పోలీసుల కథనం ప్రకారం ప్రస్తుతం ఆమె తల్లి ఉంటోన్న ఇల్లు సంగీత పేరు మీదే ఉందట. దీన్ని తన తల్లి ఎక్కడ సోదరులకు రాసిస్తుందో అని.. సంగీత ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తోందని ఆమె తల్లి ఫిర్యాదు చేసిందట.

ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే అసలు నిజాలను వెల్లడిస్తూ సంగీత ట్విట్టర్‌లో ఓ బహిరంగ లేఖను పోస్ట్ చేసి తన జీవితం గురించి అందరికీ చెప్పింది. ఈ లేఖ చూస్తుంటే సొంత కుటుంబ సభ్యులే ఇలా చేయగలరా? అనిపించడం ఖాయం..అంతేకాదు.. సినిమా ఇండస్ట్రీలో చీకటి కోణం కూడా ఉంటుందని అర్థమవుతుంది. ఇంతకీ తన తల్లికి రాసిన ఈ లేఖలో సంగీత ఏం పంచుకుందంటే..

C6YqhaYWUAE-Ixj 536538 448769

డియర్ అమ్మ, నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చినందుకు నీకు ధన్యవాదాలు. పదమూడేళ్ల వయసులోనే నన్ను స్కూల్‌కి పంపించడం ఆపేసి.. నాతో పని చేయించినందుకు నీకు ధన్యవాదాలు. నా సంపాదన నాకు కాకుండా చేసి.. బ్లాంక్ చెక్స్ పై సంతకాలు చేయించుకున్నందుకు నీకు థ్యాంక్స్.

అసలు జీవితంలో ఒక్కసారి కూడా పని చేయని, మద్యం, డ్రగ్స్‌కి బానిసలైన నీ కొడుకుల సుఖం కోసం నన్ను ఉపయోగించుకున్నందుకు నీకు థ్యాంక్స్. మీ నిర్ణయాలను ఒప్పుకోకపోతే నా సొంత ఇంట్లోనే నన్ను ఒంటరిని, బందీని చేసినందుకు నీకు ధన్యవాదాలు. నాకై నేను కోరుకొని ఒక వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని అడిగి మీతో గొడవ పెట్టుకునే వరకూ నా పెళ్లి గురించి ఆలోచించనందుకు నీకు థ్యాంక్స్.

“పెళ్లి తర్వాత కూడా నా భర్తను తరచూ డిస్ట్రబ్ చేస్తూ నా కుటుంబంలో శాంతి లేకుండా చేసినందుకు నీకు థ్యాంక్స్. ఒక తల్లి ఎలా ఉండకూడదో నాకు చూపించినందుకు నీకు ధన్యవాదాలు. ఆఖరిగా.. తాజాగా నువ్వు చేసిన తప్పుడు ఆరోపణలు, నిందలకు నీకు ధన్యవాదాలు. ఎందుకంటే తెలిసో తెలియకో నువ్వు చేసిన ఈ పనులు నన్నో తెలివి తక్కువ అమ్మాయి నుండి పోరాడే వ్యక్తిగా మార్చాయి. నేను ఇప్పుడు ఓ స్ట్రాంగ్, మెచ్యూర్ వుమన్‌గా మారాను.. నన్నిలా మార్చినందుకు నీకు ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటా. ఏదో ఒక రోజు నీ ఈగోని నువ్వు పక్కన పెట్టి ఆలోచించి నన్ను చూసి తప్పక గర్వపడతావు” అంటూ తన తల్లి కి లేఖ రాసింది సంగీత.

DqCgi5eU8AAcvdR 5792726

ఈ లేఖను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ షఆనందంలో, బాధలో నాకు తోడు నిలిచిన నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఇక సినిమాల్లోకి రావాలనుకునేవారికి.. నటిగా మారడం అస్సలు సులభం కాదు. అది చాలా కష్టం” అంటూ రాసింది సంగీత. ఈ లేఖను రీట్వీట్ చేసిన ఆమె భర్త క్రిష్ “నువ్వు ఎంతటి బాధను అనుభవిస్తున్నావో.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు. నువ్వు నీ కుటుంబానికి ఏం చేశావో కూడా నాకు తెలుసు. అందుకే నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటా” అంటూ చెప్పడం విశేషం.

CNKEFsOUkAAsCkx

పెళ్లయ్యాక అడపాదడపా చిన్న చిన్న గెస్ట్ రోల్స్లో మాత్రమే కనిపించిన సంగీత తాజాగా.. తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ నటించిన తమిళారసన్ అనే సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించనుందట ఈ అందాల రాశి. ఇందులో విజయ్ సరసన రమ్య నంబీసన్ కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమా గురించి ఆమె ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

ఈ సందర్భంగా తన కెరీర్ గురించి మాట్లాడుతూ..ఇంతకుముందు నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ అవేవీ నాకు పెద్దగా నచ్చలేదు. కానీ బాబూ యోగేశ్వరన్ నాకు ఈ సినిమా కథ చెప్పినప్పుడు అందులో నా పాత్ర చాలా ఛాలెంజింగ్ గా.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలా అనిపించింది. ఇందులో ఓ పెద్ద హాస్పిటల్ నడిపిస్తున్న డాక్టర్ గా కనిపిస్తాను. సినిమాలో నా పాత్ర చాలా కీలకమైనది. అందుకే ఈ సినిమా కథను ఒప్పుకున్నా అంటూ వివరించింది.

2009లో ప్రముఖ గాయకుడు క్రిష్‌ని పెళ్లాడిన సంగీత.. 2012లో శివియా అనే పాపకి జన్మనిచ్చింది.

ఇవి కూడా చదవండి.

నా దగ్గర అంత డబ్బు లేదు: శ్రీదేవి కుమార్తె జాన్వి ఆసక్తికర వ్యాఖ్యలు

అమ్మతనంలోని అనుభూతే వేరు.. నేను తల్లిని కాబోతున్నా: అమీ జాక్సన్

రెండు గ‌ర్భాశ‌యాల‌తో.. నెల వ్య‌వ‌ధిలో ముగ్గురికి జ‌న్మ‌నిచ్చిందీ త‌ల్లి..!

16 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this