నా దగ్గర అంత డబ్బు లేదు: శ్రీదేవి కుమార్తె జాన్వి ఆసక్తికర వ్యాఖ్యలు

నా దగ్గర అంత డబ్బు లేదు:  శ్రీదేవి కుమార్తె జాన్వి ఆసక్తికర వ్యాఖ్యలు

రోజూ కొత్త దుస్తులు వేసుకోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. వేసుకున్న అవుట్ ఫిట్ మళ్లీ వేసుకోకుండా ఎప్పుడూ కొత్తవాటిని ప్రయత్నించే జీవితం ఉండాలని ఆశించని వారు ఎవరుంటారు చెప్పండి? కానీ అలా రోజుకో కొత్త డ్రస్.. అవీ ఫ్యాషనబుల్ దుస్తులు కొనుక్కోవాలంటే ఎంత డబ్బు కావాలి.. అందుకే మనలో చాలామంది వేసుకున్న దుస్తులనే మళ్లీ మళ్లీ వేసుకుంటూ ఉంటారు.


సెలబ్రిటీలు కూడా తరచూ కాకపోయినా.. అప్పుడప్పుడూ తమ డ్రస్‌ని రిపీట్ (Repeating) చేయడం మనం చూస్తుంటాం. కానీ ఇలా డ్రస్ రిపీట్ చేయడం తప్పు అన్నట్లుగా మాట్లాడితే ఎలా అనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి సందర్భాలు మనకు తక్కువగానే ఎదురవుతాయి.


మహా అయితే మన డ్రస్‌ని పై నుంచి కింద వరకూ చూసి.. 'కభీ ఖుషీ కబీ ఘమ్ చిత్రంలో పూ.. లాగా ఫీలయిపోతూ మొన్న కూడా నువ్వు ఇదే డ్రస్ వేసుకున్నట్లున్నావు కదా..' అని అనే సందర్భాలు మాత్రం మనం చూస్తాం. కానీ అదే మన కథానాయికలైతే.. వారు వేసే ప్రతి అడుగునీ మీడియా గమనిస్తుంది.


జిమ్‌కి వెళ్లినా, స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లినా.. ట్రిప్‌లకు వెళ్లినా.. ఎక్కడికి వెళ్లినా ఈ మూడో కన్ను వారిని ఫాలో అవుతూనే ఉంటుంది. అలా వారి ఫ్యాషన్ సెన్స్ గురించి కూడా కామెంట్ చేసేవారు చాలామందే ఉంటారు. తాజాగా తనపై వచ్చిన అలాంటి కామెంట్లకు చక్కటి సమాధానాన్ని అందించింది బబ్లీ గర్ల్ జాన్వీ కపూర్ (Janhvi kapoor).


janvi


తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న జాన్వి.. అంతకుముందు ధరించిన ఓ డ్రస్ ధరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే కాదు.. జిమ్‌కి వెళ్లినప్పుడు లేదా సరదాగా బయటకు వెళ్లినప్పుడు కూడా జాన్వి తన అవుట్ ఫిట్స్ గురించి పెద్దగా శ్రద్ధ వహించదని.. వేసుకున్నవే మళ్లీ వేసుకుంటుందని చాలామంది ఆమెపై విమర్శలు గుప్పించారు. సెలబ్రిటీలంటేనే ధనవంతులు కాబట్టి.. రోజూ కొత్త డిజైనర్ దుస్తులు ధరించాల్సి ఉంటుందని చెబుతూ జాన్విని చాలామంది ట్రోల్ చేశారు. వీటన్నింటికీ తాజాగా ఓ టాక్ షో వేదికగా సమాధానం చెప్పింది జాన్వి. ఒక్క మాటతోనే అందరి నోళ్లూ మూయించింది.


ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా ష్రాఫ్ అద్జానియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఫీట్ అప్ విత్ స్టార్స్ షోలో పాల్గొంది జాన్వి. సెలబ్రిటీలు వారి ఇంట్లో ఎలా ఉంటారు. వారి వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అని చూపించే షోగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ షోలో తన దుస్తులు రిపీట్ చేయడం గురించి అనిత అడగ్గా.. జాన్వి చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. "నేను ప్రతిరోజూ కొత్త డిజైనర్ దుస్తులు ధరించేంతగా.. విలాసవంతమైన జీవితం జీవించేంతగా డబ్బేమీ సంపాదించలేదు. అందుకే నా దుస్తులను రిపీట్ చేస్తున్నా.." అంటూ ఒక్కమాటతో సమాధానం చెప్పేసింది.
 

 

 


View this post on Instagram


 

 

Pomegranate constellations ✨


A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

అంతేకాదు.. దుస్తులు, ఆభరణాల విషయంలో తనూ సాధారణ అమ్మాయినే అని చెబుతూ.. జైపూర్‌లో  షాపింగ్ చేసిన సందర్భం గురించి చెప్పుకొచ్చింది. "జైపూర్‌లోని జోహ్రీ బజార్ మార్కెట్లో షాపింగ్ చేశాను. పన్నెండు వేలు బిల్లు అయింది. నేనూ సాధారణ అమ్మాయిల్లాగే షాపు వాడితో బేరం ఆడాను. కాస్త తక్కువకు కూడా సంపాదించాను అనుకోండి. ఆ తర్వాత షాపు వాడు అక్కడ మార్కెట్లో లభించే కుల్ఫీలు, సమోసాలతో విందు ఏర్పాటు చేశారు.." అంటూ చెప్పుకొచ్చింది.


సాధారణంగా సెలబ్రిటీలైనా కాకపోయినా.. అవుట్ ఫిట్స్ విషయంలో చాలామంది మనల్ని జడ్జ్ చేస్తుండడం మనమూ గమనించవచ్చు. అలాంటివాళ్లకు జాన్వి ఇచ్చిన ఈ సమాధానం చెంపపెట్టులాంటిదని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు ఎంత సంపాదించినా వారిపై ఆధారపడకుండా తన ఖర్చులకు, తన దుస్తులకు తన సంపాదన మాత్రమే ఉపయోగించుకోవాలనే జాన్వి ఆలోచనా తీరు కూడా నేటితరం అమ్మాయిలకు స్ఫూర్తి అని చెప్పచ్చు.


ఇవి కూడా చదవండి.


RRR సినిమా కోసం.. తెలుగు భాషతో కుస్తీ పడుతున్న బాలీవుడ్ భామ..!


పుట్టిన రోజు నాడు.. ర‌ష్మిక ఎందుకు అలిగిందో మీకు తెలుసా..?


వ‌చ్చే తొమ్మిది నెల‌ల‌ వ‌ర‌కూ ఇంతే.. అంటోన్న‌ ప‌రిణీతి చోప్రా..!