ADVERTISEMENT
home / Celebrity Weddings
అంగరంగ వైభవంగా జరిగిన..  అస్మిత పరిణయం..!

అంగరంగ వైభవంగా జరిగిన.. అస్మిత పరిణయం..!

మేఘసందేశం, పంజరం, పద్మవ్యూహం, ఆకాశగంగ, మనసు మమత, సీతామహాలక్ష్మి లాంటి సీరియల్స్‌తో మంచి పేరు సంపాదించుకున్న సీరియల్ నటి అస్మిత (Asmitha Karnani) వివాహ రిసెప్షన్ శనివారం జరిగింది. చాలా కాలం నుండీ ఆమె ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్‌తో ప్రేమలో ఉన్నారు. ఆయన పేరు సుధీర్.

ఇటీవలే వీరి వివాహం గ్రాండ్‌గా జరగగా.. రిసెప్షన్ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు సీరియల్ నటులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఫంక్షన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 

నటి అస్మిత సీరియల్స్‌లో మాత్రమే కాకుండా.. పలు సినిమాల్లో కూడా నటించారు. అందులో కలెక్టర్ గారి భార్య, అతిథి, మధుమాసం, అప్పుడప్పుడు, మురారి, ఆపదమొక్కులవాడు సినిమాలు ప్రముఖమైనవి. ఇవే కాకుండా పలు కమర్షియల్స్‌లో కూడా ఆమె నటించారు. ఆమె పూర్తి పేరు అస్మిత కర్నానీ.

#నా ప్రేమకథ: బెదిరించారు.. భయపెట్టారు.. అయినా మా ప్రేమను గెలిపించుకున్నాం..!

ADVERTISEMENT

రాజస్థాన్‌‌లో పుట్టి పెరిగిన అస్మిత మాతృ భాష మార్వారీ. అయినా ఆమె తెలుగు బాగానే మాట్లాడుతుంది. ఆమె కుటుంబం తన చిన్నప్పుడు కోల్‌కతా నుండి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యింది. తొలుత తెలుగులో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడ్డానని.. కానీ వేగంగానే భాష మీద పట్టు సాధించానని అస్మిత ఓ ఇంటర్వ్యూలో తెలపడం విశేషం. 

ఈటీవీలో టెలికాస్ట్ అయిన సూపర్ గేమ్ షో.. రియాల్టీ షోతో అస్మిత్ యాంకర్‌గా కూడా మారారు. దాదాపు పది సంవత్సరాలుగా ఆమె టెలివిజన్ రంగంలో కొనసాగడం విశేషం. చాలా బోల్డ్‌గా మాట్లాడతారని కూడా అస్మిత గురించి కొందరు చెబుతుంటారు. పలు మార్లు ఆమె వార్తల్లో నిలిచిన సందర్భాలు ఉన్నాయి.

ఓ సారి అమ్మాయిలను రోడ్డుపై ఏడిపిస్తున్న ఈవ్ టీజర్లకు బుద్ధి చెప్పారామె. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలను తన ఫేస్బుక్‌లో పోస్టు చేసి.. ఆమె షీటీమ్స్‌ను అప్రమత్తం చేశారు. షీటీమ్ కూడా వెంటనే స్పందించి ఆ ఈవ్ టీజర్లను అరెస్టు చేయడం గమనార్హం. 

పాఠ‌శాల నుంచి ప‌రిణ‌యం వ‌ర‌కు.. సాగిన ఈ ప్రేమ‌క‌థ అద్భుతం..!

ADVERTISEMENT

 

ఈ మధ్యకాలంలో Ashtrixx అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా పాపులర్ అయ్యారు అస్మిత. బ్యూటీ, ఫ్యాషన్, వంటలకు సంబంధించిన అనేక వీడియోలను ఆమె ఆ ఛానల్‌‌లో పోస్టు చేస్తున్నారు. ఆ ఛానల్‌కు దాదాపు లక్షకు పైగానే సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అలాగే ఓ బ్లాగర్‌గా, వ్లాగర్‌గా కూడా ఈ మధ్యకాలంలో అస్మిత బాగా సుపరిచితులవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈమెకు ఫాలోవర్లు బాగానే ఉన్నారు. 

సెలబ్రిటీలే సెలబ్రిటీలను వివాహం చేసుకోవడం టాలీవుడ్‌ టీవీ చరిత్రలో కొత్తేమీ కాదు. గతంలో గీతామాధురి – నందు, రాహుల్ రవీంద్రన్ – చిన్మయి, సుమ – రాజీవ్ కనకాల, అంజలి – సంతోష్, నిరుపమ్ – మంజుల, హరిత – జాకీ, ఇంద్రనీల్ – మేఘన, ధనుష్ – కీర్తి, శ్యామల – నరసింహ, శ్రీవాణి – విక్రమాదిత్య.. ఇలా ఎన్నో జంటలను మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అస్మిత, సుధీర్ల జంట కూడా ఈ జాబితాలో చేరడం గమనార్హం. 

ప్రేమ వివాహం.. ప్రేమతో మీకు నేర్పించే విషయాలు ఇవే..

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.                                                                                                    

08 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT