ADVERTISEMENT
home / Celebrity Life
“నటనే కాదు.. ఫైట్స్ కూడా ఇరగదీసేస్తాం” అని నిరూపించిన అందాల భామలు

“నటనే కాదు.. ఫైట్స్ కూడా ఇరగదీసేస్తాం” అని నిరూపించిన అందాల భామలు

(Telugu actresses who proved themselves in action roles)

సాధారణంగా యాక్షన్ మూవీలో కళ్లు చెదిరే విధంగా ఫైట్స్ ఉండడం సహజమే. అయితే ఫైట్స్ అనగానే ఒకప్పుడు కేవలం కథానాయకుడు మాత్రమే చేసేవాడు. కానీ కథాపరంగా డిమాండ్ వస్తే.. తాము సైతం ఫైట్స్ చేసేందుకు సిద్ధమని.. ఆ విధంగానూ వెండితెరపై తమ సత్తా చూపగలమని అంటున్నారు నేటితరం కథానాయికలు. ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్‌తో రూపొంది.. ప్రేక్షకులకు కనువిందు చేసే విధంగా యాక్షన్ సీక్వెన్స్‌లు కలిగున్న చిత్రం.. ప్రభాస్, శ్రద్ధాకపూర్ నటించిన ‘సాహో’.

ఇందులో ప్రభాస్ మాత్రమే కాదు.. శ్రద్ధాకపూర్ కూడా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. అయితే వెండితెరపై అందం, అభినయంతో పాటు.. తమ ఫైటింగ్ సత్తాను కూడా రుచిచూపించిన కథానాయికల జాబితాలో శ్రద్ధా మొదటి హీరోయిన్ ఏమీ కాదు. ఈమె కంటే ముందు ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. ఇంతకీ వారు ఎవరు? వారు ఏ చిత్రాల్లో యాక్షన్ సన్నివేశాల్లో నటించారో మనమూ  చూద్దాం.

దేశాంతర వివాహాలు చేసుకున్న.. మన క‌థానాయిక‌లు వీరే..!

ADVERTISEMENT

శ్రద్ధాకపూర్

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దిశగా అడుగులు వేసిన కథానాయికల జాబితాలో తాజాగా చేరిన ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్. టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సాహో’ చిత్రంలో కథానాయికగా నటించిన శ్రద్ధ.. కొన్ని సన్నివేశాల్లో ఫైటింగ్ కూడా చేసిందట. చక్కని ఆత్మవిశ్వాసంతో ప్రభాస్‌కు దీటుగా నటించిందని.. చిత్రసీమలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అవి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాయో తెలియాలంటే.. ఆగస్టు 30 వరకు వేచి చూడాల్సిందే.

అనుష్క

ADVERTISEMENT

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌‌లో ఒకరిగా స్థానం సంపాదించుకున్న అనుష్క సైతం.. వెండితెరపై తన పోరాట పటిమను ప్రేక్షకులకు రుచి చూపించిన కథానాయికల జాబితాలో ఉంది. అయితే ఇది బాహుబలి చిత్రంతోనే సాధ్యమైందని మీరనుకుంటే పొరపడినట్లే. దీని కంటే ముందు సూపర్, బిల్లా.. వంటి చిత్రాల్లో సైతం ఈ అమ్మడు తన యాక్షన్ మూవ్స్‌తో అందరినీ ఆకట్టుకుంది.

తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా సైతం వెండితెరపై తన పోరాట ప్రతిభను ప్రదర్శించిన.. కథానాయికల జాబితాలో స్థానం సంపాదించుకున్న హీరోయినే. బాహుబలి చిత్రంలో కత్తియుద్ధంతో పాటు.. కొన్ని పోరాట సన్నివేశాల్లోనూ చక్కగా నటించింది. అలాగే ఇటీవలే విడుదలైన సైరా చిత్రంలోనూ ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించింది. 

ADVERTISEMENT

నటనతోనే కాదు.. పాటతోనూ మెప్పించిన కథానాయికలు వీరే..!

సమంత

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత అందంగా ఉండడమే కాదు.. అంతే అద్భుతంగా నటిస్తుందని మనందరికీ తెలుసు. మరి, ఈ అందాల భామ ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది?? అందులోనూ కర్రసాము వంటి విద్యను ప్రదర్శిస్తే.. చూసినవారంతా వహ్వా.. అనాల్సిందే. సీమరాజా చిత్రంలో కర్రసాము టీచర్‌గా విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు.. విలనిజం  పండించిన సిమ్రన్‌తో చిన్న పోరాటం కూడా చేసింది సమంత.

ADVERTISEMENT

టాలీవుడ్ టాప్ 10.. లేడీ కమెడియన్స్ వీరే

నయనతార

లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్న కథానాయిక నయనతార. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ.. ఈమె తన సత్తా చాటుతున్న విషయం మనందరికీ విదితమే. అయితే తమిళంలో రూపొందిన బిల్లా చిత్రంతో పాటు.. ఇటీవలే తెలుగులో విడుదలైన ‘అంజలి సీబీఐ’ సినిమాలో కూడా తనలోని యాక్షన్ ప్రతిభను అందరికీ రుచి చూపించి.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

ADVERTISEMENT

 

మాళవికా నాయర్

కళ్యాణ వైభోగం, ఎవడే సుబ్రహ్మణ్యం.. వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ మాళవికా నాయర్. చక్కని నటనతో పాటు.. కథపరంగా అవసరమైతే ఫైట్ చేసేందుకు కూడా ఈ అమ్మడు వెనకాడదు. ఇందుకు కళ్యాణ వైభోగం చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ప్రత్యక్ష ఉదాహరణ.

వీరే కాదు.. తెలుగు చిత్రాల్లో వెండితెరపై పోరాట సన్నివేశాల్లో నటించిన భామల్లో కార్తికా నాయర్, విజయశాంతి, వాణీ విశ్వనాథ్, సుహాసిని మొదలైనవారు కూడా ఉన్నారు. ఇక బాలీవుడ్ విషయానికొస్తే..

ADVERTISEMENT

తాప్సీ

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దిశగా అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ.. తాను ఎంపిక చేసుకునే ప్రతి పాత్రతోనూ తన సత్తా చాటుతోంది. తెలుగులో విడుదలైన నీవెవరో, హిందీలో విడుదలైన బేబీ.. వంటి చిత్రాలలో తనలోని యాక్షన్ మూవ్స్‌ని ప్రేక్షకులకి పరిచయం చేసింది.

వీరే కాదు.. తెలుగు చిత్రాల్లో వెండితెరపై పోరాట సన్నివేశాల్లో నటించిన భామల్లో కార్తికా నాయర్, విజయశాంతి, వాణీ విశ్వనాథ్, సుహాసిని మొదలైనవారు కూడా ఉన్నారు. ఇక బాలీవుడ్ విషయానికొస్తే..

ADVERTISEMENT

సోనాక్షి సిన్హా..

బాలీవుడ్‌లో యాక్షన్ సన్నివేశాలనగానే.. అందరికీ ముందుగా గుర్తుకొచ్చే కథానాయిక సోనాక్షి సిన్హా. ఈ అమ్మడు నటించిన అకిరా, ఫోర్స్ 2 చిత్రాల్లో ఎంత చక్కగా యాక్షన్ మూవ్స్ చేసిందో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 

బిపాసా బసు..

ADVERTISEMENT

బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసా బసు సైతం వెండితెరపై పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. ధూమ్ సిరీస్‌లో ఈ అమ్మడు నటించిన సన్నివేశాలు చూశామంటే.. ఫిదా అవ్వని వారంటూ ఎవరూ ఉండరు.

వీరితో పాటు ఐశ్వర్యారాయ్ బచ్చన్ (ధూమ్ సిరీస్), ప్రియాంక చోప్రా (గంగాజల్), రాణీ ముఖర్జీ (మర్దానీ), కంగనా రనౌత్ (క్రిష్ 3), కత్రినా కైఫ్ (ఏక్ థా టైగర్), దీపికా పదుకొణె (చాందనీ చౌక్ టు చైనా) మొదలైనవారు ఈ జాబితాలోని వారే. 

10 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT