ADVERTISEMENT
home / వినోదం
ఈ పాపుల‌ర్ తెలుగు వెబ్ సిరీస్ మీరు చూశారా??

ఈ పాపుల‌ర్ తెలుగు వెబ్ సిరీస్ మీరు చూశారా??

వినోదం (Entertainment) అంటే ఒక‌ప్పుడు రేడియోలు, నాటకాల‌వైపే చూసేవారు. ఆ త‌ర్వాత ఆ జాబితాలో సినిమాలు, టీవీ వ‌చ్చి చేరాయి. ప్ర‌స్తుతం రోజురోజుకీ టెక్నాల‌జీ పెరిగిపోతున్న నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల‌కు వినోదం అందించేందుకు కొత్త కొత్త మార్గాలు కూడా పుట్టుకొస్తున్నాయి. అలా ప్ర‌స్తుతం అంద‌రికీ.. ముఖ్యంగా నేటి యువ‌త‌కు వినోదాల విందును పంచుతున్న‌వే వెబ్ సిరీస్ (Web Series). ఇవి టీవీలో వ‌చ్చే సీరియ‌ల్స్ మాదిరిగానే ఉంటాయి.

కాక‌పోతే మ‌రీ సాగ‌తీత‌, ప్ర‌క‌ట‌నల వూక‌దంపుడు.. ఇవేవీ ఉండ‌వు. ఒక్క మాట‌లో చెప్పాలంటే సినిమానే కొన్ని నిర్దిష్ట‌మైన ఎపిసోడ్లుగా చిత్రీక‌రించిన‌ట్ల‌న్న‌మాట‌! అందుకే ప్ర‌స్తుతం ఇవి సినిమాల‌తో స‌మానంగా రాజ్య‌మేలుతున్నాయి. దీనికి తోడు వ‌య‌సుతో సంబంధం లేకుండా పెరుగుతున్న నెట్ వినియోగ‌దారులు, వారికి మ‌రిన్ని చ‌క్క‌ని ఆఫ‌ర్స్ అందిస్తోన్న నెట్ స‌ర్విస్ ప్రొవైడ‌ర్స్.. మొద‌లైన‌వారు కూడా ప‌రోక్షంగా వీటి పాపులారిటీకి కార‌ణ‌మ‌వుతున్నారు.

ఇక టీవీలో ప్ర‌సార‌మ‌య్యే కార్య‌క్ర‌మాలు మొద‌లుకొని ఈ వెబ్ సిరీస్‌ల వ‌ర‌కు ప్రేక్ష‌కులు కోరుకున్న స‌మ‌యంలో చూసేందుకు వీలుగా ఈరోజుల్లో ఎన్నో యాప్స్ సైతం అందుబాటులో ఉంటున్నాయి. నెట్ ఫ్లిక్స్ (Netflix) , అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), హాట్ స్టార్ (Hot Star), ZEE 5, SUN NEXT, VIU.. మొద‌లైన‌వ‌న్నీ ఈ జాబితాకు చెందిన‌వే! ఇవి కేవ‌లం తెలుగులోనే కాదు.. ప‌లు భాష‌ల్లో రూపొందిన వెబ్ సిరీస్‌ల‌కు సైతం వేదిక‌లుగా మారుతున్నాయి.

అందుకే ప్ర‌స్తుతం సెల‌బ్రిటీలు మొద‌లుకొని సామాన్యుల వ‌ర‌కు ఖాళీ స‌మ‌యంలో ఈ సిరీస్ చూసేందుకు అమితంగా ఆస‌క్తి చూపిస్తున్నారు. క‌థ‌కుడు చెప్పాల‌నుకున్న క‌థ‌లో ఎలాంటి సెన్సార్ చిక్కులు లేక‌పోవ‌డం (అంతర్జాలంలో సెన్సార్ ఉండదు), త‌క్కువ బ‌డ్జెట్‌లోనే చిత్రీక‌రించే సౌల‌భ్యం ఉండ‌డం.. వంటి అంశాలు కూడా ఎక్కువ వెబ్ సిరీస్ రూపొందించేందుకు కార‌ణాలు అవుతున్నాయి. ఇలా భాషాభేదం లేకుండా పాపులారిటీ సంపాదించుకున్న వెబ్ సిరీస్‌‌లో సేక్రేడ్ గేమ్స్ (Sacred Games), మీర్జాపూర్ (Mirzapur), బ్రీత్ (Breathe).. మొద‌లైన‌వి చెప్పుకోవ‌చ్చు.

ADVERTISEMENT

మ‌రి, మ‌న మాతృభాష అయిన తెలుగులో రూపొందించబ‌డి, బాగా ఆద‌ర‌ణ పొందిన కొన్ని వెబ్ సిరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

muddapappu-avakaya-1

* ముద్దపప్పు ఆవకాయ (Muddapappu Aavakaya)

తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెబ్ సిరీస్‌గా ముద్దపప్పు ఆవకాయని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణాలు – ఒకటి టైటిల్ కాగా; మరొకటి మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల (Niharika Konidela) ఇందులో కథానాయిక‌గా న‌టించ‌డం. పెళ్లికి ముందే ప్రేమ‌లో ప‌డే ఓ జంట క‌థే ఈ సిరీస్. ఇందులో నిహారిక‌కు జంట‌గా ప్ర‌తాప్ న‌టించ‌గా; ప‌్ర‌ణీత్ ఈ వెబ్ సిరీస్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌స్తుతం ఆయనే నిహారిక న‌టిస్తోన్న సూర్య‌కాంతం సినిమాకు కూడా ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే నిహారిక కూడా త‌న తండ్రి నాగబాబుతో క‌లిసి నాన్న కూచి అనే మ‌రో వెబ్ సిరీస్‌‌లో నటిస్తోంది. 

ADVERTISEMENT

geetasubramanyam-webseries

* గీతా సుబ్రహ్మణ్యం (Geetha Subramanyam)

సహజీవనం కాన్సెప్ట్‌తో ఆడియన్స్ ముందుకి వచ్చిన గీతా సుబ్రహ్మణ్యం అనే వెబ్ సిరీస్ మంచి ఫాలోయింగ్‌ని కూడా సంపాదించుకోగలిగింది. దర్శిని & మనోజ్ కృష్ణ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ను శ్రీనివాస్ తెరకెక్కించారు. సహజీవనం సమయంలో ఒక జంట ఎదుర్కొనే సమస్యలు, వారి మధ్య వచ్చే అభిప్రాయ భేదాలు.. వంటివి ఈ వెబ్ సిరీస్‌లో చూపించే ప్రయత్నం చేశారు.

pelligola-webseries

ADVERTISEMENT

* పెళ్లి గోల (Pelli Gola)

ప్రముఖ యాంకర్ వర్షిణి, నటుడు అభిజీత్‌లు ప్రధాన పాత్రల్లో న‌టించిన‌ వెబ్ సిరీస్ పెళ్లి గోల. పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకోవడం ఇష్టం లేని ఒక జంట వారి పెళ్లి నుంచి పారిపోయే కథతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ అంద‌రినీ క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి వద్దనుకున్న‌ వీరి మధ్యనే ప్రేమ పుట్టడం అనే ఆసక్తికరమైన‌ అంశాన్ని మనం ఈ వెబ్ సిరీస్ లో చూడవచ్చు.

mahathalli1

*మ‌హాతల్లి (Mahathalli)

ADVERTISEMENT

మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన అమ్మాయిల దైనందిన జీవితంలో ఎదుర‌య్యే సంద‌ర్భాల‌నే క‌థాంశాలుగా మార్చుకొని వీలైనంత ఫ‌న్నీగా వాటిని ప్రేక్ష‌కుల‌కు చూపించే ప్ర‌య‌త్నం చేసిన వెబ్ సిరీస్ మ‌హాతల్లి. జాహ్న‌వి ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించే ఈ సిరీస్‌లో ప్ర‌తి ఎపిసోడ్‌కు క‌థాంశం మారుతూ ఉంటుంది. కానీ కామెడీ మాత్రం ప్రేక్ష‌కుల‌కు బాగా చ‌క్కిలిగింత‌లు పెడుతుంది. అందుకే దీనికి చ‌క్క‌ని ఆద‌ర‌ణ ల‌భించింది.

pilla-pillagadu-1

* పిల్ల – పిల్ల‌గాడు (Pilla pillagadu)

ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో బాగా ఆద‌ర‌ణ పొందిన వెబ్ సిరీస్ అంటే అంద‌రికీ ఠ‌క్కున గుర్తొచ్చే సిరీస్ ఇది. సుమంత్ ప్ర‌భాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ వెబ్ సిరీస్ ఒక అంద‌మైన ప్రేమ క‌థ ఆధారంగా రూపొందింది. ఇది ఎంత‌గా విజ‌యం సాధించిందంటే.. ప్ర‌స్తుతం ఈ సిరీస్‌కు సీక్వెల్ గా పిల్ల పిల్ల‌గాడు సీజ‌న్ 2 కూడా ప్ర‌సార‌మ‌వుతోంది.

ADVERTISEMENT

pilla-1

* పిల్ల (Pilla)

సినీ దర్శకుడు పవన్ సాదినేని తెరకెక్కించిన పిల్ల అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రీ-మ్యారిటల్ ప్రెగ్నెన్సీ కాన్సెప్ట్‌ని చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో నటి ధన్య బాలకృష్ణన్ & అనిరుధ్‌లు మ‌న‌కు ప్రధాన పాత్రల్లో క‌నిపిస్తారు. ఇది ఒక అర్బన్ కామెడీ జోనర్‌లో తీసిన 10 ఎపిసోడ్ల‌ వెబ్ సిరీస్. ప్రధాన పాత్రధారుల నటన ఈ వెబ్ సిరీస్‌కి హైలైట్ అని చెప్పవచ్చు.

posh-poris-1

ADVERTISEMENT

* Posh Poris

సిటీలో ఉండే ముగ్గురు అమ్మాయిల జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన వెబ్ సిరీస్ Posh Poris. అపర్ణ మల్లాది తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో నటి అదితి మైఖల్, హారిక వేదుల & సహజ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. స్వేచ్ఛ‌గా జీవించాలనుకునే వీరి ముగ్గురి జీవితాల్లో జరిగిన సంఘ‌ట‌న‌ల‌ సమాహారమే ఈ Posh Poris వెబ్ సిరీస్.

ఇవే కాదు.. ఎందుకిలా.., మ‌న ముగ్గురి ల‌వ్ స్టోరీ, నేను మీ క‌ళ్యాణ్‌.. మొద‌లైన సిరీస్ కూడా బాగా గుర్తింపు సంపాదించుకున్న‌వే. వెబ్ సిరీస్‌కు క్ర‌మంగా పెరుగుతోన్న ఆద‌ర‌ణ నేప‌థ్యంలో ఎంతో మంది మ‌రిన్ని వెబ్ సిరీస్‌ల‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. రానున్న రోజుల్లో మ‌రిన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ వెబ్ సిరీస్ మ‌న ముందుకు రావాల‌ని కోరుకుందాం..

ఇవి కూడా చ‌ద‌వండి

ADVERTISEMENT

రామ్ చరణ్‌ సరసన “RRR”లో నటించబోయే.. హీరోయిన్ ఈమేనా..?

టాలీవుడ్ మేటి కథానాయికల.. తొలి చిత్రాల ముచ్చట్లు మీకోసం..!

శ్రీదేవి బయోపిక్ పై.. కన్నేసిన రకుల్ ప్రీత్..?

05 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT