ADVERTISEMENT
home / ఫ్యాషన్
ఈ బీటౌన్ కలర్ కాంబినేషన్స్‌లో.. మీరు అందంగా మెరిసిపోతారు

ఈ బీటౌన్ కలర్ కాంబినేషన్స్‌లో.. మీరు అందంగా మెరిసిపోతారు

కొత్త సంవత్సరం మొదలైంది. కనుక అంతా కొత్త కొత్తగా, ఫ్రెష్‌గా అనిపిస్తూ ఉంటుంది కదా… అలాగే నూతనోత్సాహం కూడా ఉప్పొంగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మన డ్రెస్సింగ్ స్టైల్ కూడా రొటీన్‌గా కాకుండా..కాస్త భిన్నంగా ఉంటే బాగుంటుంది కదా..! అందుకే మేం కొన్ని కలర్ కాంబినేషన్స్ (Color Combinations) మీ ముందుకు తీసుకొస్తున్నాం. బాలీవుడ్ భామలు ధరించి మెప్పించిన ఈ రంగుల కలయిక మోడరన్ దుస్తులకు.. క్లాసిక్ లుక్ అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కలర్ కాంబినేషన్స్‌ను మనకు పరిచయం చేసిన ఈ బీ టౌన్ స్టార్స్‌కి మనం థాంక్స్ చెప్పాల్సిందే.

1. పచ్చ + నీలం

1-color-combinations-bollywood-deepikapadukone

Source: Shaleena Nathani Instagram

ADVERTISEMENT

ఆకుపచ్చ, నీలం రంగుల్లోని దుస్తులు ధరించినప్పుడు కూల్‌గా కనిపిస్తాం. మరి ఆ రెండు రంగులు కాంబినేషన్‌గా ధరిస్తే.. ఇంకా కూల్‌గా కనిపిస్తాం. కావాలంటే దీపికా పదుకొణెను చూడండి.. బ్లూ జీన్స్, గ్రీన్ టీషర్ట్‌తో ఎంతో అందంగా కనిపిస్తోంది.

2. పర్పుల్ + నేవీ బ్లూ

2-color-combinations-bollywood-anushkasharma

Source: Allia Al Rufai Instagram

ADVERTISEMENT

లేత పర్పుల్ రంగు టాప్, దానికి మ్యాచింగ్‌గా ధరించిన నేవీ బ్లూ ప్యాంట్‌లో అనుష్కశర్మ ఎంతో అందంగా మెరిసిపోతోంది కదా..! అసలు ఏ కాంబినేషన్ అయినా ఆమెకు చక్కగా సూటవుతుంది. ఆమెకే కాదు.. ఈ కాంబినేషన్ మనకూ బాగుంటుంది.

3. బ్రైట్ బ్లూ + నేవీ బ్లూ

3-color-combinations-bollywood-sonamkapoor

Source: Rhea Kapoor Instagram

ADVERTISEMENT

బాలీవుడ్‌లో మోస్ట్ స్టైలిష్ సెలబ్రిటీగా పేరు తెచ్చుకొంది సోనమ్. ఒకే రంగులోని రెండు రకాల షేడ్స్‌తో మ్యాజిక్ చేయచ్చని నిరూపించింది సోనమ్.

4. బ్లాక్ + కలర్డ్ మెటాలిక్

4-color-combinations-bollywood-saraalikhan

Source: Sara Ali Khan Instagram

ADVERTISEMENT

ఎన్ని ఫ్యాషన్ ట్రెండ్స్ మారినా నలుపు రంగు దుస్తులు మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీనే. దాన్ని ఏ రంగుకైనా మ్యాచింగ్‌గా వేసుకోవచ్చు. కలర్డ్ మెటాలిక్ బోటమ్ పై బ్లాక్ టాప్ ధరించింది సారా అలీ ఖాన్. పార్టీలకు వెళ్లేటప్పుడు ఈ కలర్ కాంబినేషన్ చక్కటి ఎంపిక.

5. లేత గోధుమ + ఖాకీ

5-color-combinations-bollywood-kanganaranaut

Source: Team Kangana Ranaut Instagram

ADVERTISEMENT

కంగన నటిగానే కాదు.. ఫ్యాషన్‌ను ఫాలో అవ్వడంలోనూ బెస్టే అని చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి.. లేత గోధుమ, ఖాకీ రంగుల కాంబినేషన్‌లో ఎంత అందంగా మెరిసిపోతోందో..!

6. పసుపు + నీలం

6-color-combinations-bollywood-Peecee

Source: Priyanka Chopra Instagram

ADVERTISEMENT

ప్రకాశవంతంగా కనిపించే పసుపుని.. కూల్‌గా కనిపించే నీలం రంగుతో మ్యాచ్ చేసి ట్రెండీగా కనిపిస్తోంది ప్రియాంక చోప్రా. మీరు కూడా ఈ కాంబినేషన్‌ను ఓసారి ప్రయత్నించండి.

7. బ్లాక్ + గ్రే

7-color-combinations-bollywood-sanyamalhotra

Source: Sanya Malhotra Instagram

ADVERTISEMENT

ఈ రెండు రంగుల కాంబినేషన్‌ను క్రేజీ కాంబినేషన్ అని చెప్పుకోవాలి. ఈ రంగుల కలయికలో రూపొందించిన దుస్తులు మీకు సరికొత్త స్టయిల్‌ను అందిస్తాయి. దీన్ని మనకు నిజమేనని చెబుతోంది దంగల్ స్టార్ సాన్యా మల్హోత్రా.

8. ఎరుపు + నీలం

8-color-combinations-bollywood-aayushmankhurana

Source: Isha Bhansali Instagram

ADVERTISEMENT

ముదురు ఎరుపు రంగు టీ షర్ట్‌కి మ్యాచింగ్‌గా లేత నీలం రంగు జీన్స్‌ని ధరించిన ఆయుష్మాన్ ఖురానా.. అమ్మాయిల మనసుల్ని కట్టిపడేశాడు. ఈ కాంబినేషన్ మనం కూడా ప్రయత్నించవచ్చు.

9. బ్రౌన్ + గ్రే

9-color-combinations-bollywood-rajkumarrao

Source: Isha Bhansali Instagram

ADVERTISEMENT

డీసెంట్ లుక్ కావాలని కోరుకొనే వారికి సరిపోయే కలర్ కాంబినేషన్ ఇది. ఈ రెండు రంగులను పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవాలి.

మరింకెందుకు ఆలస్యం.. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఎంచుకోండి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి

బాలీవుడ్ భామలు ధరించిన.. ఈ బ్లౌజ్ డిజైన్లు మనకూ బాగుంటాయి

నుపుర్ కనోయ్ – సారా అలీ ఖాన్ మెచ్చిన డిజైనర్.. ఆమె డిజైన్లు మనకూ నచ్చుతాయి

ఈ 9 రకాల బ్లాక్ ఫ్యాషన్ ఐటమ్స్.. ప్రతి అమ్మాయి వార్డ్ రోబ్ లో ఉండాల్సిందే..

ADVERTISEMENT

 

02 Jan 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT