ADVERTISEMENT
home / Humour
మీరు కూడా టామ్ బాయ్‌లా ఉంటారా? అయితే ఈ లక్షణాలు మీకూ ఉంటాయి

మీరు కూడా టామ్ బాయ్‌లా ఉంటారా? అయితే ఈ లక్షణాలు మీకూ ఉంటాయి

అమ్మాయిలు అందరూ బయటకు వెళితే అద్భుతంగా, అందంగా తయారవ్వాలని అనుకుంటారు. కానీ అందరిలోనూ విభిన్నంగా చేసుకొనే డ్రస్సింగ్ గురించి పెద్దగా పట్టించుకోరు. అమ్మాయిలందరూ చాలా విషయాల్లో ఒకేలా వ్యవహరించినా.. కొన్ని విషయాల్లో మాత్రం కొందరు వేరుగా ఉంటారు. ఈ విషయం వారికి కూడా తెలుసు.  ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు (girl) టామ్ బాయ్‌లా (tomboy) ఉండేందుకే ఇష్టపడుతున్నారు. ఒకవేళ మీరు కూడా టామ్ బాయ్‌లా ఉండేందుకు ఇష్టపడితే ఈ విషయాలు మీకు బాగా అర్థమవుతాయి. మీకూ ఈ లక్షణాలు ఉండే ఉంటాయి. అవేంటంటే..

చిన్న విషయానికే మీకు ఏడుపు వచ్చేస్తుందా? అయితే ఇది మీ కోసమే..

1. ట్రెండ్ గురించి కాదు.. సౌకర్యం గురించి ఆలోచిస్తారు.

మీరు కూడా ట్రెండ్‌లో ఎలాంటి మార్పులు వచ్చినా పెద్దగా పట్టించుకోరా? ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వార్డ్ రోబ్ ముందు గంట సేపు నిల్చొని.. ఆలోచించడం మీకు ఇష్టం ఉండదా? అయితే మీరు టామ్ బాయ్..! మీరు బయటకెళ్లాలంటే జీన్స్, హుడీ, షర్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్యాషన్ అంటే ఈరోజు వచ్చి రేపు వెళ్లిపోయేది కాబట్టి.. మీకు దాని గురించి ఆలోచించే సమయం ఉండదని భావిస్తుంటారు.

ADVERTISEMENT

2. స్కర్ట్స్ కంటే షార్ట్స్‌కే ప్రాధాన్యమిస్తారు.

స్కర్ట్ వేసుకుంటే చాలు.. ఎలా కూర్చోవాలో.. ఏం చేయాలో అని జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండాలి. నిల్చున్నప్పుడు కూడా స్కర్ట్ పైకి వెళ్లకుండా కాపాడుకోవడం చాలా కష్టం. అందుకే మీరు షార్ట్స్ వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. వాటికి జేబులు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ప్రత్యేకంగా వ్యాలెట్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం  ఉండదు.

3. బ్రా నా? వద్దు బాబోయ్..

బ్రా వేసుకొని స్తనాలను ఇబ్బంది పెట్టడం మీకు నచ్చదు. కొన్ని సార్లు మరీ అవసరం అయితే వేసుకుంటారు కానీ.. జైలులో ఉన్నట్లుగా ఫీలవుతారు. అది వేసుకున్నప్పుడు మీకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే మరీ అవసరం అయితే స్పోర్ట్స్ బ్రా ధరిస్తారు. అది తప్ప మిగిలిన బ్రా స్టైల్స్ అన్నీ మీకు.. అవసరం లేని విషయంగానే ఉంటాయి.

4. హై హీల్స్

హై హీల్స్ అంటే ఏ అమ్మాయికి ఇష్టం ఉండదు? చాలామంది అవి వేసుకోవడానికి ఇష్టపడతారు. అమ్మాయిలకు వాటితో ఉన్న బంధం అలాంటిది. వాటినే ప్రేమిస్తారు.. ద్వేషిస్తారు కూడా. కానీ మీకు మాత్రం అవి మీ శత్రువుల్లా కనిపిస్తాయి. అందుకే మీరు స్నీకర్స్ వేసుకోవడానికే ఆసక్తి చూపిస్తారు. వాటి కంటే ప్రపంచంలో మరింత ప్రశాంతత మీకు మరేదీ అందించలేదు. ఎక్కడికి వెళ్లినా వాటిని ధరించే వీలుంటే బాగుంటుందని భావిస్తారు.

ADVERTISEMENT

5. మేకప్.. అవసరమంటారా?

మేకప్ వేసుకోవడం అంటే.. మీకు ప్రపంచంలోనే అత్యంత కష్టమైన విషయంగా కనిపిస్తుంది. మస్కారా కంటి లోపల తగులుతుంది. ఐ లైనర్ చెదిరిపోయి చంద్రముఖి లుక్ అందిస్తుంది. లిప్ స్టిక్ స్మడ్జ్ అవుతుంది. వీటన్నింటికి బదులు లిప్ బామ్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది.

ఇలాంటి ‘కారణం’ చెబితే.. మీకు తప్పనిసరిగా ‘సెలవు’ దొరుకుతుంది..!

6. వీడియో గేమ్స్ అంటే ఎంతిష్టమో..

అమ్మాయిలు ‘నీకు బహుమతి ఏం కావాలంటే..’ అందమైన డ్రస్ లేదా మేకప్ కిట్ లాంటివి అడుగుతారు. కానీ మీరు మాత్రం కొత్త ప్లే స్టేషన్ లేదా ఎక్స్ బాక్స్ వంటివి అడుగుతారు. మీ స్నేహితులతో పాటు గేమ్స్ ఆడేందుకు.. కొన్ని సార్లు ప్లాన్లన్నింటినీ క్యాన్సిల్ చేసుకోవడం చేస్తారు.

ADVERTISEMENT

7. సలాడ్ డిన్నరా? అదెవరు తింటారు?

ఆకులు తినడానికి నేనేం గేదెను కాదు.. అనుకునే రకం మీరు. ఆరోగ్యం కాపాడుకోవడానికి.. సన్నగా ఉండేందుకు అమ్మాయిలందరూ.. సలాడ్ డిన్నర్ తింటుంటే మీరు మాత్రం పిజ్జా, బర్గర్ తింటుంటారు. సలాడ్ తినగానే కడుపు నిండేందుకు నేనేం అంత చిన్న పిల్లను కాదు అనేది మీ ఫీలింగ్ .

8. గట్టిగా నవ్వితేనే ఆనందం..

మీకు ఒకవేళ జోక్ నచ్చితే.. మీ మనసుకు నచ్చినట్లు గట్టిగా నవ్వేస్తారు. నవ్వు ఆపుకోవడం లేదా నెమ్మదిగా నవ్వడం లాంటివి మీకు తెలియని పనులు. గట్టిగా నవ్వడంలోనే మీరు ఆనందాన్ని పొందుతారు.

9. ఎక్కడైనా సరే ఆడేస్తాం. .

ఇంట్లోనే బాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ వంటివి ఆడడం.. గాలి పటాలు ఎగరేయడం.. దాని కోసం పిల్లలతో పాటు పరిగెత్తడం, బోటింగ్, స్నేహితులతో బెట్‌లు కట్టడం వంటివన్నీ లేదా ఇందులో చాలా ఎక్కువ మీకు అలవాటు ఉంటాయి.

ADVERTISEMENT

10. మీకు విమర్శలను తిప్పికొట్టడం తెలుసు..

ఎవరైనా మీపై విమర్శలు చేస్తే వాటిని తిప్పికొట్టడం మీకు తెలుసు. వాటితో పాటు ఎవరైనా మీ స్నేహితులు మీపై జోకులు వేసి నవ్వుతుంటే.. మీరు కూడా వారితో చేరి నవ్వేంత మంచి గుణం మీ సొంతం. మీతో పెట్టుకోవడానికి చాలామంది భయపడతారు.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

16 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT