ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
సెక్స్ తర్వాత ఈ మాటలు చెబితే.. మీరిద్దరూ మరింత దగ్గరవుతారట..!

సెక్స్ తర్వాత ఈ మాటలు చెబితే.. మీరిద్దరూ మరింత దగ్గరవుతారట..!

సెక్స్ (sex) అనేది కేవలం రెండు తనువులు ఒక్కటవ్వడం మాత్రమే కాదు.. అది రెండు మనసుల మధ్య పెనవేసుకుపోయే బంధానికి సాక్ష్యం. ఓ వ్యక్తి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటూ.. ప్రపంచంలోని ప్రేమనంతా తన కౌగిట్లో నింపి మీకు అందిస్తున్నాడంటే అంత కంటే అదృష్టం మరొకటి ఉండదు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండేందుకు శారీరక సంబంధం అవసరం అయినా.. అది ముఖ్యమైనది కాదు.

ఇద్దరి మధ్య ప్రేమ ఉంటేనే బంధం నిలబడుతుంది. ఒకరి విలువ మరొకరు తెలుసుకొని.. వారిని ప్రశంసిస్తూ.. వారంటే మీకెంతో ఇష్టం అని.. మీ జీవితంలో వారు ఉండడం వల్ల.. మీరు ఎంతో సంతోషాన్ని పొందుతున్నారని.. ఇలాంటి పదాలను అప్పుడప్పుడూ వాడడం వల్ల ఎదుటివారి మనసును సంతోషపెట్టవచ్చు.

వారి ప్రేమను మరింత పెంచవచ్చు. మీ బంధాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు. ఇది ఎప్పుడో ఒకసారి మాత్రమే కాదు.. వారు చేసే అన్ని పనుల్లోనూ.. వారిని ప్రశంసించడం ఓ అలవాటు చేసుకోవాలి. ఈ అన్ని పనుల్లో సెక్స్ కూడా ఒకటి. కాబట్టి అద్భుతమైన సెక్స్ అనుభవం తర్వాత.. మీ భాగస్వామిని ప్రశంసిస్తూ కొన్ని మాటలు చెప్పడం వల్ల వారు ఆనందించడమే కాదు.. మీకు ప్రతి రాత్రి ఆనందమయంగా మారుతుంది. ఇంతకీ సెక్స్ తర్వాత వారితో చెప్పాల్సిన ఆ మాటలేంటో తెలుసా?

ADVERTISEMENT

1. నువ్వు నా పక్కనుండడం నా అదృష్టం. నిన్ను పొందడంతో నా జీవితం మారిపోయింది.

2. నేను ఏం చేస్తే ఆనందంగా ఉంటానో.. నీకు పూర్తిగా తెలుసు.

3. నువ్వు నన్ను మరింత హాట్‌గా మారుస్తున్నావ్.. నీ చూపులు నన్ను మరింత సెగలెక్కిస్తున్నాయి. 

4. నేను నిన్ను చాలా మిస్సయ్యాను.. మనిద్దరం ఇలా ఎప్పటికీ కలిసి ఉంటే ఎంత బాగుంటుందో.. 

ADVERTISEMENT

5. నువ్వు నన్ను చాలా క్రేజీగా మారుస్తున్నావు..

6. వావ్.. ఇది చాలా అద్భుతమైన అనుభవం.. ఇలాగే రోజూ ఉంటే ఎంత బాగుంటుందో.. 

7. నీ కళ్లు ఎంతో అందంగా, చాలా బాగుంటాయి. అందులోకి చూస్తూ రోజంతా ఉండిపోవచ్చు.

ADVERTISEMENT

8. నువ్వు ఎలా ఇంత సెక్సీగా తయారయ్యావ్? నాక్కూడా నీ సీక్రెట్ చెప్పకూడదూ?

9. నువ్వు నన్ను అలా చూడకు. అలా చూస్తే గుండె గట్టిగా కొట్టుకుంటుంది.

10. నువ్వు ఇన్ని విషయాలు అసలు ఎక్కడ నేర్చుకున్నావ్?

ADVERTISEMENT

11. నిన్ను కౌగిలించుకోవడం కంటే.. ఈ లోకంలో అద్భుతమైనది మరొకటి లేదు.

12. ఈ రోజు నిజంగా ఇది కావాలనిపించింది. నువ్వు నా మనసును అలా చదివేశావేమో అనిపించింది తెలుసా?

13. నువ్వు నిజంగా చాలా చాలా అద్భుతం. నీలాంటి వ్యక్తిని భాగస్వామిగా పొందిన నేనెంతో లక్కీ 

14. నువ్వు నా మెడపై ముద్దు పెడుతుంటే.. అది నాకు ఎంతో ఇష్టం.

ADVERTISEMENT

15. ఇలా నీ పక్కన పడుకుంటే.. నిర్వాణం సాధించినంత ప్రశాంతంగా ఉంది.

16. నీలాంటి వ్యక్తిని నేను మరొకరిని ఇప్పటివరకూ చూడలేదు. నువ్వెందుకింత స్పెషల్?

17. నాకు ఈ అనుభవం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో.. నీకూ అంతే ఆనందాన్ని ఇచ్చిందనుకుంటున్నా.

ADVERTISEMENT

18. నన్ను ఇలాగే పట్టుకొని ఉండిపో.. నువ్వు హత్తుకుంటే చాలా బాగుంటుంది.

19. నీలో నాకు నచ్చని అంశం అంటూ ఏదీ లేదు తెలుసా?

20. నువ్వు నన్ను నేను చాలా అద్భుతంగా, అందంగా ఫీలయ్యేలా చేస్తావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. 

ADVERTISEMENT

21. నువ్వు నన్ను పట్టుకొని చేసే.. ప్రతి పనీ నాకెంతో ఇష్టం.

22. ఇప్పటి నుంచి ప్రతి రాత్రి ఇలాగే ఆనందాన్ని పొందగలిగితే ఎంత బాగుంటుంది కదా..

23. ఇంత అద్భుతమైన సమయాన్ని.. నాకు అందించినందుకు థ్యాంక్స్.

24. నువ్వు నీ ప్రేమతో నన్ను చెడగొడుతున్నావ్.

ADVERTISEMENT

25. ఐ లవ్ యూ.. నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నా.. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

13 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT