ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
సెక్స్ గురించి ఈ వివరాలు మీకు ఎవరూ చెప్పరు.. అవేంటంటే..

సెక్స్ గురించి ఈ వివరాలు మీకు ఎవరూ చెప్పరు.. అవేంటంటే..

మన దేశంలో సెక్స్ (sex)అనగానే అదేదో పెద్ద మాట్లాడకూడదని మాటగా భావిస్తారు. కానీ సెక్స్ లో పాల్గొనేవారు.. దాని గురించి ఆలోచించేవాళ్లు చాలామందే ఉంటారు. అయితే మీకు సెక్స్ గురించి ఏ వివరాలు తెలియకపోతే దాని గురించి మీకెంతో సన్నిహితులైన స్నేహితులను (friends) అడిగినా వారు దాని గురించి మీతో పెద్దగా మాట్లాడరు. సెక్స్ గురించి మన దగ్గర ఉన్న అపోహలు అలాంటిది. ప్రతివారు దాన్ని బహిరంగంగా మాట్లాడకూడని విషయంగానే భావిస్తున్నారు. కేవలం భార్యాభర్తలు, ప్రేమికులు తప్ప దీని గురించి ఓపెన్ గా చర్చించుకునేవారు తక్కువేనని చెప్పుకోవాలి. మరి, మీకు సెక్స్ గురించి అస్సలు తెలియకపోతే మీ స్నేహితులు కూడా మీకు చెప్పని ఈ సీక్రెట్లు తెలుసుకోండి.

1. సెక్స్ తర్వాత ఓరల్?

ఓరల్ సెక్స్ చాలామందికి ఇష్టమైన అంశం. కానీ ఒకవేళ మీకు మీ భాగస్వామి కి సెక్స్ పూర్తయ్యాక ఓరల్ సెక్స్ చేయాలనిపిస్తే ముందుగా ఓసారి శుభ్రం చేసుకోవడం మంచిది. లేదంటే మీరు ఉపయోగించిన లూబ్రికెంట్లు, కండోమ్ ల వాసనతో పాటు సెక్స్ సమయంలో విడుదలయ్యే ద్రవాలనే మీరు మొదట చూస్తారు. కాబట్టి శుభ్రంగా కడిగిన తర్వాత తిరిగి మరోసారి సెక్స్ చేయడం లేదా ఓరల్ సెక్స్ చేయడం మంచిది.

2. అబ్బా.. బద్ధకం..

సెక్స్ తర్వాత చాలామంది చాలా బద్ధకంగా ఫీలవుతూ ఉంటారు. చాలామంది సెక్స్ తర్వాత దుస్తులు వేసుకోవడానికి కూడా బద్ధకిస్తూ ఉంటారు. లో దుస్తులు మాత్రమే వేసుకొని నిద్రపోయే వాళ్లు చాలామందే.

ADVERTISEMENT

3. ఎప్పుడూ సంతోషం కాదు..

సెక్స్ ఒక్కోసారి ఒక్కో అనుభూతిని అందిస్తుంది. సింపుల్ గా చెప్పుకోవాలంటే సెక్స్ ఎప్పుడూ ఆనందంగానే ఉండదు. కొన్ని సార్లు పెళ్లయ్యాక కొన్నేళ్లకు అదో అలవాటుగా మారిపోతుంది. రొటీన్ గా మారుతుంది. కొన్నిసార్లు మిమ్మల్ని ఒత్తిడి నుంచి బయట పడేసి రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. కొన్నిసార్లు బోరింగ్ గా కూడా అనిపిస్తుంది.

4. పొజిషన్స్ లో..

మీరు ఏ సెక్స్ పొజిషన్ లో పాల్గొన్నా.. మీరు పైన ఉన్నా లేక వెనుక నుంచి అయినా మీ మోకాళ్లపై మాత్రం ఒత్తిడి తప్పక పడుతుంది. అయితే ఇది మీ మోకాళ్లకు ఇబ్బంది కలిగించదు. ఇది మీ కండరాలను బలంగా మారుస్తుంది.

5. సర్ ప్రైజెస్ ఉంటాయి..

బయట ఎలా వ్యవహరిస్తారో చూసి వారు బెడ్ రూం లో ఎలా ఉంటారని ఊహించడం చాలా కష్టం. బయట చాలా డామినేటింగ్ గా వ్యవహరించేవారు సెక్స్ లో పాల్గొనేటప్పుడు సిగ్గుపడుతూ ఉండిపోవచ్చు. బయట చాలా కామ్ గా ఉండేవారు బెడ్ రూం లో చాలా యాక్టివ్ గా ఉండే అవకాశం కూడా లేకపోలేదు.

ADVERTISEMENT

6. అందరితో వద్దు..

సెక్స్ జీవితం అన్నది కేవలం మీ పర్సనల్ మాత్రమే.. అందులో కొన్ని విషయాలైతే మరీ పర్సనల్ గా కాస్త వింతగా కూడా ఉంటాయి. ఈ విషయాలు మీరు మీ భాగస్వామి తో తప్ప మరొకరితో పంచుకోవడానికి వీలుండదు. పంచుకోవడం కూడా సరికాదు.

7. ఆర్జాజమ్ ఎలాగంటే..

కొంతమందికి కొన్ని పొజిషన్లలో ఎక్కువ మూడ్ వస్తుంది. ఆర్గాజమ్ సొంతమై ఆనందం పొందుతారు. కొందరు మాత్రం సెక్స్ లో కొన్నేళ్ల నుంచీ పాల్గొంటున్నా సరే.. ఎప్పుడూ ఆనందాన్ని పొందలేకపోతారు. ఇది ప్రతి వ్యక్తికీ వేర్వేరుగా ఉంటుంది. అయితే మీ భాగస్వామితో మాట్లాడి మీకు ఎలా అయితే ఆనందం దొరుకుతుందో చెప్పడం వల్ల మీ సెక్స్ జీవితం ఆనందంగా మారుతుంది. ఒకవేళ అది మీక్కూడా తెలియకపోతే కొత్త ప్రయోగాలు చేసి ఎందులో ఆనందం అనిపిస్తుందో తెలసుకోవడం వల్ల సెక్స్ జీవితం సరికొత్తగా మారుతుంది.

8. ఆ శబ్దాల గురించి ఆలోచించొద్దు..

సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు సాధారణంగా కొన్ని శబ్దాలు అవుతుండడం సహజం. సెక్స్ అంటేనే ఆ అనుకోని శబ్దాల సమ్మేళనం. అదే నిజమని గుర్తించి దాన్ని ఎంజాయ్ చేయడం లేదా పట్టించుకోకపోవడం వల్ల సెక్స్ లో మరింత ఆనందం మీ సొంతం అవుతుంది.

ADVERTISEMENT

9. అది మీ ఛాయిస్

మీ ఇంట్లో సెక్స్ ఎక్కడ చేయాలన్నది మీ మూడ్.. మీ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బెడ్ రూం లో బెడ్ పై లేదా హాల్లో సోఫా పై, బాత్రూంలో షవర్ కింద.. ఇలా మీకు నచ్చిన దగ్గర చేయచ్చు. దానివల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

10. కేవలం మీ ఇష్టం మాత్రమే..

ఒకవేళ మీ భాగస్వామి మీ కంటే ఎక్కువగా ప్రయోగాలు ఇష్టపడితే.. మీరు, మీ భాగస్వామి ఇద్దరూ కలిసి మీ బెడ్ రూం లో ఎలా ఉండాలో నిర్ణయించుకోవచ్చు. కొత్త విషయాలు తెలుసుకోవడం ప్రయత్నించడంలో తప్పేమీ లేదు కాబట్టి మీరూ ప్రయోగాలు చేయాలో వద్దో నిర్ణయించుకోండి. అది మీ ఇష్టం పై ఆధారపడి ఉంటుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

15 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT