ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
కోడిపిల్ల‌ను బ‌తికించాల‌ని.. హాస్పిట‌ల్‌కి తీసుకెళ్లిన చిన్నారి..!

కోడిపిల్ల‌ను బ‌తికించాల‌ని.. హాస్పిట‌ల్‌కి తీసుకెళ్లిన చిన్నారి..!

నాగ‌రిక‌త పెరుగుతున్న కొద్దీ మ‌నం మ‌న‌సు లేని మ‌నుషుల్లా మారిపోతున్నాం అనేందుకు రోజూ కొన్ని వేల నిద‌ర్శ‌నాలు క‌నిపిస్తూనే ఉంటాయి. సాటి మ‌నుషుల‌ను గౌర‌వించ‌లేక‌పోతున్న‌ ఈ రోజుల్లో జంతువుల‌ను ఎంత‌మంది ప‌ట్టించుకుంటారు చెప్పండి? జంతువుల‌ను హింసించేవారు మ‌న చుట్టుప‌క్క‌ల ఎంతోమంది క‌నిపిస్తునే ఉంటారు. ఒక‌రు కుక్క‌లను ఇష్ట‌మొచ్చినట్లు కొడితే.. మ‌రొక‌రు ప‌క్షుల‌ను హింసిస్తూ ఉంటారు. కానీ అవి కూడా మ‌న‌లాంటి జీవాలే అని.. వాటిని ప్రేమించాల‌ని మాత్రం మ‌ర్చిపోతుంటారు. ఈ రోజు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారిన ఈ క‌థ‌నం మాత్రం మూగ‌జీవాల‌పై ప్రేమను చూపించాల‌ని మ‌నంద‌రికీ చాటి చెబుతోంది.

అవును.. మిజోరాంకి చెందిన ఓ బుజ్జాయి.. నిండా ఐదారేళ్లు ఉంటాయో.. లేదో త‌న అమాయ‌క‌పు చేష్ట‌ల‌తో పెద్ద పెద్ద‌వాళ్ల‌ను కూడా సిగ్గుప‌డేలా చేశాడు. మ‌న‌సు ఉండాలే కానీ.. జంతువుల‌ను ప్రేమించ‌డానికి వ‌య‌సుతో ఏ మాత్రం సంబంధం లేద‌ని నిరూపించాడీ పిల్లాడు. మిజోరాంలోని సాయిరాంగ్‌కి చెందిన ఈ అబ్బాయి (kid)  సైకిల్‌పై వెళ్తుంటే.. ప‌క్కింటివారికి చెందిన ఓ కోడిపిల్ల(chick) అత‌డి సైకిల్ కింద ప‌డింద‌ట‌.

దీంతో తాను పొదుపు చేసుకున్న డ‌బ్బుతో దానికి చికిత్స చేయించాల‌నుకున్నాడీ పిల్లాడు. దీని కోసం తాను ఎప్ప‌టినుంచో పొదుపు చేసుకుంటున్న డ‌బ్బు (రూ.10) తీసుకొని హాస్పిట‌ల్‌కి వెళ్లాడు. ఒక చేతితో కోడిపిల్ల‌ను.. మ‌రో చేతితో ప‌ది రూపాయల నోటును ప‌ట్టుకొని హాస్పిట‌ల్‌కి వెళ్లిన ఈ పిల్లాడిని అక్క‌డున్న ఎవ‌రో ఒక వ్య‌క్తి చూసి.. ఆ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయ‌డంతో ఈ అబ్బాయి ఫేమ‌స్‌గా మారిపోయాడు.

ఈ క‌థ‌నాన్ని షేర్ చేసిన సంగా అనే షిల్లాంగ్‌కి చెందిన వ్య‌క్తి దీని గురించి వివ‌రిస్తూ.. ” ఈ పిల్లాడు సైకిల్ న‌డుపుతుంటే అనుకోకుండా ప‌క్కింటివారి కోడిపిల్ల చ‌క్రాల కింద ప‌డిపోయింద‌ట‌. దాని ప‌రిస్థితి చూసిన ఈ అబ్బాయి మ‌న‌సు చ‌లించి వెంట‌నే దానికి త‌న ద‌గ్గ‌రున్న ప‌ది రూపాయల‌తో చికిత్స చేయించడానికి హాస్పిట‌ల్‌కి తీసుకొచ్చాడ‌ట‌. ఇది చూసి నాకు న‌వ్వాలో.. ఏడ‌వాలో అర్థం కావ‌ట్లేదు..” అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంట‌ల్లోనే అది వైర‌ల్‌గా మార‌డం విశేషం. ఈ అబ్బాయికి చెందిన వివ‌రాలేమీ తెలియ‌క‌పోయినా త‌ను మూగ జీవాల‌పై చూపిన జాలికి అంద‌రూ ఈ అబ్బాయిని మెచ్చుకున్నారు.

ADVERTISEMENT

ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారిన త‌ర్వాత.. ఆ  అబ్బాయి పేరు డెరెక్ ఛెత్రి లాల్‌ఛ‌నిమాగా తెలిసింది. ఆ అబ్బాయి తండ్రి ధీర‌జ్ ఛెత్రి దీని గురించి మాట్లాడుతూ..

“సాయంత్రం సైకిల్ తొక్కుతుంటే అనుకోకుండా ఓ కోడిపిల్ల త‌న సైకిల్ చ‌క్రం కింద ప‌డిపోయి మ‌ర‌ణించింది. కానీ ఈ సంగ‌తి అర్థం కాక హాస్పిట‌ల్‌కి వెళ్లి దానికి చికిత్స చేయించాల‌నుకున్నాడు మా అబ్బాయి. అక్క‌డి వాళ్లు దానికి వైద్యం చేయకపోవడంతో.. నా వద్దకు ఏడుస్తూ వ‌చ్చి వాపోయాడు. తాను ప‌ది రూపాయలు తీసుకెళ్లాడని.. కానీ చికిత్స చేయ‌డం కుద‌ర‌దని చెప్పి ఒక ఫోటో తీసుకొని పంపించారని తెలిపాడు. వంద రూపాయలు ఇస్తే మరల చికిత్స చేయిస్తానని అన్నాడు. కానీ ఆ కోడిపిల్ల చనిపోయిందని చెప్పాను. ఎవరు ఎంత డబ్బు తీసుకెళ్లినా దానిని బాగు చేయలేరని చెప్పాను. అది విని తను ఎంతో బాధపడ్డాడని ఆ అబ్బాయి తండ్రి చెప్పడం గమనార్హం.ధీర‌జ్ ఛెత్రి మిజోరాం పోలీస్ విభాగంలో ప‌నిచేస్తున్నారు.      

ఈ అబ్బాయి చేసిన ప‌నిలో మాన‌వ‌త్వం ఉందంటూ అంద‌రూ త‌న‌ని పొగడడం విశేషం. అంతేకాదు.. ఈ పోస్ట్ షేర్ చేసిన కొన్ని గంట‌ల్లోనే ల‌క్ష‌కు పైగా లైక్స్‌, డెబ్భైవేల‌కు పైగా షేర్స్ రావ‌డం గ‌మ‌నార్హం. ఈ బుడ‌త‌డు అమాయ‌క‌త్వంతో చేసిన ప‌ని ఎంతోమంది మ‌న‌సుల‌ను హ‌త్తుకుంది. త‌మ భావాల‌ను చాలామంది కామెంట్ల ద్వారా వెల్ల‌డించారు. ఈ చిన్న‌బాబు ఎంతోమంది పెద్ద‌వాళ్ల కంటే మెచ్యూర్డ్‌గా ఆలోచించాడు అని ఒక యూజ‌ర్ కామెంట్ చేస్తే.. పెద్ద‌వాళ్లు ఈ బుడ‌త‌డు చూపించిన దానిలో స‌గం బాధ్య‌త చూపినా ఎంతో బాగుంటుంది అని మ‌రొక యూజ‌ర్ కామెంట్ చేశారు. 

వేగంగా వెళ్తూ ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌వుతూ.. ప్ర‌మాదానికి గురై.. గాయ‌ప‌డి ర‌క్త‌పు మ‌డుగులో కొట్టుమిట్టాడుతున్న మ‌నుషుల‌ను కూడా చూసీ చూడ‌న‌ట్లు పోతున్న మ‌న‌సు లేని మ‌నుషులున్న ఈ స‌మాజంలో ఈ అబ్బాయి చేసిన ప‌ని ఎంతో ప్ర‌శంస‌నీయం.

ADVERTISEMENT

ఇవి కూడా చ‌ద‌వండి.

రెండు గ‌ర్భాశ‌యాల‌తో.. నెల వ్య‌వ‌ధిలో ముగ్గురికి జ‌న్మ‌నిచ్చిందీ త‌ల్లి..!

టాలెంట్ల పుట్ట జివా ధోనీ.. ఆరు భాష‌ల్లో ఎంత ముద్దుగా మాట్లాడుతోందో చూడండి..!

బిడ్డ‌ను ఎయిర్‌పోర్ట్‌లో మ‌ర్చిపోయి ఫ్లైట్ ఎక్కిందో త‌ల్లి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..!

ADVERTISEMENT
03 Apr 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT