టాలెంట్ల పుట్ట జివా ధోనీ.. ఆరు భాష‌ల్లో ఎంత ముద్దుగా మాట్లాడుతోందో చూడండి..!

టాలెంట్ల పుట్ట జివా ధోనీ.. ఆరు భాష‌ల్లో ఎంత ముద్దుగా మాట్లాడుతోందో చూడండి..!

మ‌న దేశంలో ఎక్కువ పాపులారిటీ ఉన్న బుడ‌త‌ల్లో ముందు వ‌రుస‌లో ఉంటుంది భార‌త క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ (Mahendra singh dhoni) గారాల ప‌ట్టి జివా ధోనీ (ziva dhoni). ఈ తండ్రీకూతుళ్ల పెయిర్ వీడియో విడుద‌లైందంటే ల‌క్ష‌ల్లో వ్యూస్‌, లైక్స్ రావాల్సిందే.. అంత‌గా అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది జివా.


నాలుగేళ్ల వ‌య‌సున్న ఈ చిన్నారి టాలెంట్ గురించి చెప్పాలంటే మాట‌లు స‌రిపోవు. అంత‌గా అంద‌రినీ త‌న టాలెంట్ల‌తో ఆక‌ట్టుకుంటుంది జివా. గ‌తంలో ఓసారి ఆమె మ‌ల‌యాళంలో పాడిన శ్రీ కృష్ణ స్తోత్రం విని కేర‌ళ‌లోని ఓ దేవాల‌యం స‌భ్యులు ఆమెను కేర‌ళ‌కు ర‌మ్మ‌ని ఆహ్వానం పంపించిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం ఇదొక్క‌టే కాదు.. ఆ త‌ర్వాత కూడా చాలాసార్లు జివా మ‌లయాళంలో పాట‌లు పాడి ఆక‌ట్టుకుంది.


47248492 380546782692614 3414502505542389839 n


జివా పుట్టిన‌ప్పుడు ధోనీ త‌న‌తో లేడు. ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న ధోనీ కూతురిని కొన్ని నెల‌ల త‌ర్వాత మాత్ర‌మే చూడ‌గ‌లిగాడు. అప్ప‌టి నుంచి త‌న కూతురితో క‌లిసి గ‌డిపిన ప్ర‌తి క్ష‌ణం ఎన్నో అనుభూతులు పంచుకునేలా చేయాల‌న్న‌ది ధోనీ ఆశ‌. అందుకే త‌న కూతురితో గ‌డిపిన క్ష‌ణాల‌కు సంబంధించిన వీడియోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటాడు.


వీరిద్ద‌రి వీడియోల‌ను మాత్ర‌మే కాదు.. జివా త‌న టాలెంట్‌ని ప్ర‌ద‌ర్శిస్తున్న వీడియోలు, ముద్దుముద్దుగా మాట్లాడుతూ, ప‌నులు చేస్తూ ఉన్న వీడియోల‌న్నింటినీ పోస్ట్ చేస్తూ ఉంటుంది అమ్మ సాక్షి. దీని కోసం త‌న అకౌంట్‌ని ఉప‌యోగించ‌డం మాత్ర‌మే కాదు.. జివా ధోనీకి ప్ర‌త్యేకంగా ఓ అకౌంట్‌ని కూడా ఏర్పాటు చేసి ఆ అకౌంట్ ద్వారా ఈ వీడియోల‌ను పోస్ట్ చేస్తూ ఉంటుంది.
 

 

 


View this post on Instagram


 

 

 

A post shared by M S Dhoni (@mahi7781) on
అలా తాజాగా ధోనీ పోస్ట్ చేసిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెటిజ‌న్లంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ధోనీ "ఎలా ఉన్నావు" అని జివాని ఆరు భాష‌ల్లో అడుగుతుంటే.. దానికి ఏమాత్రం ఆలోచించ‌కుండా ఆయా భాష‌ల్లోనే ట‌క‌ట‌కా స‌మాధానాలు చెప్పింది జివా. ఇలాంటి వీడియో పోస్ట్ చేయ‌డం ఇది మొద‌టిసారి కాదు.


గ‌తంలోనూ త‌మిళం, గుజ‌రాతీల్లో మాట్లాడిన ఓ వీడియోను పోస్ట్ చేసిన ధోనీ తాజా వీడియోలో త‌మిళం, గుజ‌రాతీతో పాటు ఉర్దూ, బెంగాలీ, పంజాబీ, బోజ్‌పురీ భాష‌ల్లో "ఎలా ఉన్నావు" అని అడిగి.. దానికి జివా చెప్పిన స‌మాధానాల‌ను విని తానే ఆశ్చ‌ర్య‌పోయాడు. ఈ వీడియో నెటిజ‌న్లంద‌రినీ జివాకి ఫ్యాన్స్‌గా మార్చేస్తోంది. ఆ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.
 

 

 


View this post on Instagram


 

 

🥦🥬


A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on
ఇదే కాదు.. తాజాగా జివా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సాక్షి పోస్ట్ చేసిన వీడియో చూస్తే మీకు న‌వ్వాగ‌దు. త‌న బొమ్మ యూనికార్న్‌కి కూర‌గాయ‌లు తినిపిస్తూ, అవి ఆరోగ్యానికి ఎంతో మంచివ‌ని జివా చెబుతున్న వీడియో ఇది. అంతేకాదు.. రాత్రి త్వ‌ర‌గా ప‌డుకొని ఉద‌యాన్నే లేవాల‌ని కూడా త‌న బొమ్మ‌కి నేర్పిస్తోంది జివా. ఇంగ్లిష్‌, హిందీలో అన‌ర్గ‌ళంగా మాట్లాడే జివా స్కిల్స్ చూసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.
 

 

 


View this post on Instagram


 

 

Round round Roti !


A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

కేవ‌లం మాట‌లు, పాట‌లే కాదు.. గుండ్ర‌ని రొట్టెలు చేయ‌డం కూడా జివాకి వ‌చ్చ‌ట‌. ఓసారి తను రోటీ చేస్తున్న ఈ వీడియోని మీరూ చూడండి..
 

 

 


View this post on Instagram


 

 

#firsttimeplank #mommyspartnerincrime


A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on
జివా వ్యాయామం కూడా చేస్తుంది. తను ప్లాంక్ వేస్తున్న ఈ వీడియో చూస్తే త‌ను వేసే విధానానికి మీకు న‌వ్వాగ‌దు..
 

 

 


View this post on Instagram


 

 

Dances better than the father atleast


A post shared by M S Dhoni (@mahi7781) on
ఈ వీడియోలో జివా ఎంత బాగా డ్యాన్స్ చేస్తోందో చూడండి. కాస్త స్క్రోల్ చేస్తే చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకి త‌న‌దైన రీతితో విషెస్ చెబుతున్న జివాని చూడొచ్చు.
 

 

 


View this post on Instagram


 

 

Attack on besan ka laddoo


A post shared by M S Dhoni (@mahi7781) on
ధోనీ, జివాల ల‌డ్డూ ఫైట్ చూస్తారా? ఒకే బేస‌న్ ల‌డ్డూ కోసం ఇద్ద‌రూ పోటీప‌డి మ‌రీ తింటున్నారీ తండ్రీ కూతుళ్లు.
 

 

 


View this post on Instagram


 

 

As a kid whenever v got sand this was one thing v would do for sure


A post shared by M S Dhoni (@mahi7781) on
ఇసుక‌లో ఆడ‌డం అంటే ఈ తండ్రీకూతుళ్ల‌కి ఎంతో ఇష్టం. కొన్ని నెల‌ల క్రితం ఇద్ద‌రూ క‌లిసి ఇసుక‌లో ఆడుకున్న వీడియోను ధోనీ పోస్ట్ చేశాడు. దాన్ని కూడా చూసేయండి.


ఇవి కూడా చ‌ద‌వండి.


క్యూట్ కౌబాయ్ తైమూర్‌.. జంతువులంటే ఈ స్టార్‌కిడ్‌కి ఎంత ప్రేమో..!


త‌మ త‌ల్లిదండ్రుల కంటే.. ఈ బుజ్జాయిలు భ‌లే ఫేమ‌స్‌ తెలుసా..!


ఆరాధ్య ముద్దులొలికే ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!