ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
మీకు జిలేబీలు అంటే ఇష్టమా..? అయితే ఈ టాప్ 10 వెరైటీలు ట్రై చేయండి

మీకు జిలేబీలు అంటే ఇష్టమా..? అయితే ఈ టాప్ 10 వెరైటీలు ట్రై చేయండి

(Top Ten Varieties of Jalebi)

మీకు జిలేబీలంటే అమితమైన ఇష్టమా..? మీకు నచ్చిన తీపి వంటకాలలో జిలేబీలకు ప్రత్యేకమైన స్థానం ఉందా..? అయితే ఓ విషయం. సాధారణంగా జిలేబీ అంటే కేవలం పంచదార లేదా బెల్లంతో మాత్రమే చేసే రెగ్యులర్ వంటకం అనుకుంటే పొరపాటు. ఇందులో కూడా రకరకాల ఫ్లేవర్లు, వెరైటీలు ఉన్నాయట. అందులో టాప్ 10 ఈ రోజు ప్రత్యేకం

జిలేబీ (రెగ్యులర్) – మైదా, బేసిన్, బేకింగ్ సోడా మొదలైనవి మిక్స్ చేసి నూనెలో ప్రై చేసి.. పాకంలో వేయించే ఈ రెగ్యులర్ జిలేబీ మన పట్టణాలలో, పల్లెలలో దొరుకుతుంది. పసుపు పచ్చ రంగులో చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది అప్పుడప్పుడు వివిధ సైజులలో కూడా అందుబాటులో ఉంటుంది. 

జాంగ్రీ – చాలామంది జాంగ్రీని వేరే వంటకం అనుకుంటారు. కానీ ఇది కూడా జిలేబీ జాతికి చెందిన వంటకమే. కానీ ఇందులో మైదా బదులు మినపప్పు, బియ్యపు పిండి, పంచదార, నెయ్యి వాడతారు. అదొక్కటే తేడా. ఉత్తరాది నుండి అరువు తెచ్చుకున్న దక్షిణాది వంటకం.. జిలేబీ స్థాయిని దాటి మరీ బాగా పాపులర్ అయ్యింది. 

ADVERTISEMENT

పన్నీర్ జిలేబీ – దీనికే చనార్ జిలాపీ అనే పేరు కూడా ఉంది. బెంగాల్ ప్రాంతంలో లభించే వంటకం ఇది. మనం సాధారణంగా వాడే మైదా, మినపప్పుకి బదులు వీరు జిలేబీ తయారు చేయడానికి స్వచ్ఛమైన ఆవు పాలతో చేసిన పన్నీర్ వాడతారట. అదొక్కటే తేడా. కానీ రుచిపరంగా ఇది చాలా బాగుంటుందని అంటారు. 

రబ్డీ జిలేబీ – ఉత్తరాదిలో కొన్ని ఫంక్షన్లలో ఈ రబ్డీ జిలేబీని సర్వ్ చేస్తుంటారు. వేడి వేడి జిలేబీలను.. పాలతో చేసిన రబ్డీలో నానబెట్టి ఉంచుతారు. దాంతో జిలేబీకి ఒక స్పెషల్ రుచి వస్తుందట. 

లుఖ్మాంజీ వారి జిలేబీ – ఈ జిలేబీ మీకు ప్రపంచంలో కేవలం ఒకే ఒక్క షాపులో లభిస్తుంది. ఆ షాపు పేరే ముంబయిలో మహ్మద్ అలీ రోడ్డులో ఉన్న లుఖ్మాంజీ మిఠాయివాలా. కింగ్ సైజ్ జిలేబీలను అమ్మడంలో వీరు నిపుణులు. ఒక పెద్ద సైజు పిజ్జా ఆకారంలో ఉండే ఈ జిలేబీ ఒక్కటి రూ.80 నుండి రూ.100 వరకూ ఉంటుందట.  

కోయా జిలేబీ – దీనినే మావా జిలేబీ అని కూడా అంటారు. ఇది మధ్యప్రదేశ్‌లో బాగా ఫేమస్. బాగా మరిగించిన పాలలో మైదా పిండి కలిపి ఈ జిలేబీని తయారుచేస్తారు. గులాబీ జామూన్ మాదిరిగా బాగా ఎరుపు లేదా నల్లని రంగు వచ్చే వరకూ వేయిస్తారు. 

ADVERTISEMENT

బద్ధకస్తులు అయితే.. ఈ చిట్కాలతో భలే ప్రయోజనాలు పొందవచ్చు..!

యాపిల్ జిలేబీ – యాపిల్ పండ్లను ముక్కలు ముక్కలుగా కోసి… ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి బాగా రుబ్బాక.. పంచదార పాకంతో కలిపి మిశ్రమంగా చేస్తారు. ఆ మిశ్రమాన్ని జిలేబీలు చేయడానికి వాడతారు. ఇదో ప్రయోగాత్మక జిలేబీ. మాస్టర్ చెఫ్ సంజీవ్ కపూర్ లాంటి వారు ఈ జిలేబీకి ఒక పాపులారిటీని తీసుకొచ్చారు. 

ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే.. మీరే కిచెన్ క్వీన్ ..!

కాజూ జిలేబీ – మైదా లేదా మినపప్పుని వాడేబదులు పూర్తిగా జీడిపప్పునే జిలేబీ వాడడానికి ఉపయోగిస్తే.. ఎలా ఉంటుందో ఆలోచించండి. చాలా విచిత్రంగా ఉంది కదా. నమ్కీన్స్‌తో పాటు ఈ జిలేబీని తీసుకుంటే.. భలే ఉంటుందట. 

ADVERTISEMENT

డ్రై ఫ్రూట్ జిలేజీ – ఈ మధ్యకాలంలో పండగ సీజన్లు వస్తే చాలు.. స్వీట్ షాపులవాళ్లు అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి ప్రయోగంలో ఒకటే ఈ డ్రై ఫ్రూట్ జిలేబీ. 

భోజ‌న‌ప్రియులైనా.. వంట రాక‌పోతే ఎలా ఉంటుందో మీకు తెలుసా?

ఇంకెన్నో రకాలు – మాస్టర్ చెఫ్ లాంటి ప్రోగ్రామ్స్ వచ్చాక.. వంటలలో ప్రయోగాలు ఎక్కువయ్యాయి. వివిధ వంటకాలను వివిధ రకాలుగా చేయడం అలవాటు చేసుకోవడం మొదలుపెట్టారు చెఫ్స్. అందుకు ఈ జిలేబీ కూడా ఏమీ అతీతం కాదు. గుమ్మడికాయతో హల్వా చేయడం చూశాం గానీ.. మీకో విషయం తెలుసా.. జిలేబీ కూడా చేయవచ్చట. అలాగే ద్రాక్ష రసంతో చేసే జిలేబీ, కోవా జిలేబీ, కిస్ మిస్ జిలేబీ… ఇలా చాలా అందుబాటులోకి వచ్చేశాయి. 

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి… అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి

ADVERTISEMENT
13 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT