ADVERTISEMENT
home / Celebrity Life
“వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే” సందర్భంగా.. ఈ తెలుగు సినిమాలు తప్పక చూడండి..!

“వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే” సందర్భంగా.. ఈ తెలుగు సినిమాలు తప్పక చూడండి..!

ప్రతి సంవత్సరం ఆగస్టు 21వ తేదిన “వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే”ని (World Senior Citizens Day) ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ఒక ఆనవాయతీగా వస్తోంది. నాటి యువతే నేటి సీనియర్ సిటిజన్స్ (Senior Citizens) అని.. వారు కూడా దేశాల అభ్యున్నతిలో ఘనమైన పాత్రని పోషించారని పేర్కొంటూ.. వారికంటూ ఒక రోజుని ఐక్యరాజసమితి కేటాయించడం జరిగింది.

1990 డిసెంబర్ 14వ తేదీన, యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ.. సీనియర్ సిటిజన్స్ సమస్యలను గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించేందుకు, అలాగే వారిలో స్ఫూర్తిని నింపేందుకు తొలిసారిగా ఒక ప్రకటనను చేసింది. అప్పటి నుండి ఆగష్టు 21 తేదిన  “సీనియర్ సిటిజన్స్ డే”ని యునైటెడ్ నేషన్స్ సభ్య దేశాలు జరుపుకుంటున్నాయి.

ఈ రోజున వార్ధక్యంలో వచ్చే సమస్యలను చర్చించడంతో పాటు.. వృద్ధులలో స్ఫూర్తిని నింపడానికి ఏం చేయాలన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అలాగే తమ జీవిత చరమాంకంలో వృద్ధులు.. వారి కుటుంబసభ్యుల నుండి నిజంగానే ప్రేమానురాగాలు పొందుతున్నారా.. లేదా? అల్జీమర్స్ లాంటి సమస్యలను ఎలా అధిగమించాలి..? మొదలైన అంశాలపై చర్చిస్తారు. 

మెగాస్టార్ చిరంజీవి “సైరా నరసింహా రెడ్డి” హైలైట్స్ ఇవే..!

ADVERTISEMENT

వార్థక్యం అంటే శాపం కాదని.. అది కూడా ఒక వరమే అని.. వృద్ధాప్యంలో కూడా నలుగురికీ స్ఫూర్తిని కలిగించే పనులు చేయవచ్చని చెబుతూ.. అటువంటి కథలను సినిమాలుగా తెరకెక్కించిన సందర్భాలు కూడా ఉన్నాయి. “వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే” సందర్భంగా.. అటువంటి టాప్ 10 తెలుగు సినిమాలు (Telugu Films).. వాటి వివరాలు మీకోసం ప్రత్యేకం

 

* సంసారం ఒక చదరంగం

నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను.. ఈ చిత్రంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ సినిమా కథ రిటైర్డ్ గుమాస్తా అప్పల నర్సయ్య (గొల్లపూడి మారుతీ రావు) చుట్టూ తిరుగుతుంది. తన పిల్లల కోసం వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకొని.. ఆ తర్వాత కొడుకుకి బాకీ తీర్చడం కోసం నైట్ వాచ్‌మన్ పనిచేసే అప్పల నర్సయ్య పాత్ర.. మధ్య తరగతి కుటుంబాల్లో వార్థక్యం వచ్చాక సీనియర్ సిటిజన్స్ పడే అగచాట్లకు సంకేతం. వయసు మీద పడ్డా కూడా.. ఇచ్చిన మాట తప్పకుండా వ్యవహరించిన ఈ పాత్ర ఒక రకంగా స్ఫూర్తిదాయకమైనదే. ఈ చిత్రాన్ని 1987లో ఏ.వి.యం వారు నిర్మించగా… ఎస్పీ ముత్తురామన్ దర్శకత్వం వహించారు.

ADVERTISEMENT

* అమ్మ రాజీనామా

ఇంటిల్లిపాదికి ఎటువంటి ఇబ్బంది, బాధ లేకుండా చేస్తూ.. సంసారాన్ని ఓ పద్దతిగా నడిపించే తల్లికి విసుగొచ్చి తన  స్థానానికి రాజీనామా చేస్తే ఏమవుతుంది..? ఇదే ఇతివృత్తంతో ఈ సినిమా కథ నడుస్తుంది. అప్పట్లో ఈ చిత్రం  సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో టైటిల్ పాత్రని ఊర్వశి శారద పోషిస్తే, దర్శకరత్న దాసరి నారాయణ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సగటు తల్లుల మనోగతానికి అద్దం పట్టే ఈ చిత్రం నిజంగా స్ఫూర్తివంతమైనదే. 

* ఖైదీ నెం 150

తమ ఊరిలోని భూగర్భ జలాలని అక్రమంగా ఉపయోగించుకోవడమే కాకుండా.. తమ భూములని కూడా లాక్కున్న ఒక అంతర్జాతీయ కంపెని భాగోతాన్ని బయటపెట్టడానికి.. ఆ ఊరిలోని కొందరు వృద్ధులు ప్రాణత్యాగం చేసుకుంటారు. వారు ప్రాణత్యాగం చేసుకున్నప్పుడు షూట్ చేసిన వీడియో.. ఆ అక్రమాన్ని వెలుగులోకి తీసుకొచ్చేలా చేస్తుంది. దీంతో వారు పోరాటం చేస్తారు. 

ADVERTISEMENT

వారి పోరాటాన్ని ముందుండి నడిపించే వ్యక్తిగా .. ఈ చిత్రంలో మనకు మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారు. అలాగే సినిమా క్లైమాక్స్‌లో కూడా వృద్ధులు చేసే సాహసం వల్లే.. ఒక చిన్న పోరాటం.. ఓ పెద్ద ఉద్యమంగా మారుతుంది. ఈ చిత్రం పేరు “ఖైదీ నెం 150”. ఈ సినిమాకి  వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు.

* మామగారు

దాసరి నారాయణరావు తన స్వీయ దర్శకత్వంలోనే కాకుండా.. ఇతర దర్శకుల చిత్రాల్లో కూడా మంచి పాత్రలు వేశారు. అందులో ఒకటి మామగారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో దాసరి ఒక అమాయకుడైన మామగారి పాత్రలో కనిపిస్తారు. తన అల్లుడి పట్ల అమితమైన ప్రేమానురాగాలతో ఉండే ఆయన.. ఒకానొక సందర్భంలో ఆ అల్లుడి చేతే అవమానానికి గురైతే.. ప్రాణాలు విడిచే పాత్ర ఇది. ఈ సెంటిమెంట్ చిత్రం 1991లో విడుదలై సూపర్ హిట్ అయింది.

బిగ్‌బాస్ తెలుగు యాంకర్ నాగార్జున చేతిలో ఉన్న.. పండు (కోతి) బొమ్మ మీకు కావాలా?

ADVERTISEMENT

* సీతారామయ్య గారి మనవరాలు (Seetarammayyagari Manavaralu)

ఒక తాతయ్య & మనవరాలి మధ్య ఉండే బంధాన్ని అత్యద్భుతంగా చూపించిన చిత్రం సీతారామయ్య గారి మనవరాలు. ఈ చిత్రంలో సీతారామయ్యగా అక్కినేని నాగేశ్వరరావు నటిస్తే, మనవరాలు సీత పాత్రలో మీన మెరిసింది. క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. అందరి మన్ననలతో పాటుగా అవార్డులు సైతం సొంతం చేసుకుంది.

* సూరిగాడు

“సూరిగాడు” చిత్రంలో కొడుకు పట్టించుకోని తల్లిదండ్రుల పాత్రలలో దాసరి నారాయణరావు & సుజాత మనకి కనిపిస్తారు. అయితే కన్న కొడుకు పట్టించుకోకపోతే.. అదే కొడుకుపై కేసు పెట్టి గెలిచిన ఒక స్ఫూర్తిదాయకమైన పాత్రలో ఈ చిత్రంలో దాసరి మనకు కనిపించడం విశేషం. మంచి భావోద్వేగాలతో మిళితమైన కథగా ఈ చిత్రాన్ని అభివర్ణించవచ్చు. 

ADVERTISEMENT

* మిథునం

60 ఏళ్ళు పై బడిన ఓ వృద్ధ జంట, తమ ఊరిలో హాయిగా జీవిస్తూ ఉంటారు. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగే వారి జీవన విధానం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆలుమగల దాంపత్యంలో ప్రేమానురాగాలకు పెద్దపీట వేస్తూ.. దానికి వయసుతో సంబంధం లేదని చెబుతుంది “మిథునం”. ఈ సినిమాకి ఎన్నో ప్రశంసలు కూడా దక్కాయి. ఈ  చిత్రంలో బాలసుబ్రమణ్యం & లక్ష్మిలు ప్రధాన పాత్రలు పోషించారు. 

* అమ్మమ్మగారిల్లు

ఓ అమ్మమ్మ, ఆమె మనవడి మధ్య ఉండే అనుబంధాన్ని చాలా చక్కగా చూపించిన చిత్రం “అమ్మమ్మగారిల్లు”. తెలుగింటి సంప్రదాయాలు, కట్టుబాట్లను గురించి ఎంతో బాగా వివరించిన చిత్రం ఇది. ఇందులో అమ్మమ్మ పాత్రలో సుమిత్ర నటించగా.. మనవడి పాత్రలో నాగశౌర్య నటించడం విశేషం. గత ఏడాది విడుదలైన ఈ చిత్రంలో భావోద్వేగభరితమైన సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి.

ADVERTISEMENT

* బామ్మ మాట బంగారు బాట

అలనాటి మేటి నటి భానుమతి టైటిల్ పాత్ర పోషించిన చిత్రం “బామ్మ మాట.. బంగారు బాట”. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ పాట అప్పటికి & ఇప్పటికి చాలా ఫేమస్ అనే చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో భానుమతి, రాజేంద్రప్రసాద్‌‌ల మధ్య వచ్చే హాస్యపు సన్నివేశాలు.. ఇప్పుడు చూసినా సరే నవ్వించక మానవు.

* శతమానం భవతి (Shatamanam Bhavathi)

వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రులని చూడటానికి, వారితో గడపటానికి విదేశాల్లో ఉండే పిల్లలు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా రావాలనే.. ఒక అంతర్లీనమైన సందేశంతో రూపొందిన చిత్రం “శతమానం భవతి”. తన పిల్లలకు హితబోధ చేసేందుకు.. వారికి బాధ్యతలను గుర్తుచేసేందుకు.. ఓ తండ్రి పంపించిన ఓ చిత్రమైన ఈమెయిల్ ఎలాంటి పాత్రను పోషించిందనేది చిత్రకథ. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. ఈ చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది. అలాగే 2017లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో ఇది కూడా ఒకటి.

ADVERTISEMENT

పైన పేర్కొన్న ఈ 10 చిత్రాలు… సమాజంలో మనకు కనిపించే సీనియర్ సిటిజన్ జీవితాలను ఇతివృత్తాలుగా  తీసుకొని రూపొందించినవే. పైన చెప్పిన వాటిల్లో మీరు ఏదైనా చూడకపోయి ఉంటే, వెంటనే చూసెయ్యండి.

ప్రియమైన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? అయితే ఈ మెసేజెస్ మీకోసమే…

19 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT