నెలసరి(Periods) అనగానే కడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్, రక్తపు ధారలు.. ఇవన్నీ మనకు అంటే ఆడవాళ్లకు (Women) మాత్రమే సంబంధించిన సమస్యలు.. మగాళ్లకు ఇవి పెద్దగా అర్థం కావు కూడా..! అయితే ఈ నెలసరిని ఎంతగా తిట్టుకున్నా.. మనం ఆడవాళ్లుగా ఉండేందుకు అది ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే ఆ రక్తస్రావాన్ని చూసి మనం స్త్రీలుగా ఎంతగానో గర్వపడాలి. అయితే మీకెప్పుడైనా అబ్బాయిలకు నెలసరి వస్తే ఎలా ఉంటుంది అని అనుమానం వచ్చిందా? ఒకవేళ మీరు ఎప్పుడూ ఆలోచించకపోతే ఈ కథనాన్ని చదివేయండి. రెడిట్‌లో కొందరు అబ్బాయిలు మగవాళ్లకు నెలసరి వస్తే ఎలా ఉంటుందో చెప్పారు. ఆ ఆలోచనలు చాలా హాస్యభరితంగా ఉండడం విశేషం.
1. యుద్ధం గురించి ఇతడికి బాగా తెలుసు..
Cannibalcodeofethics అనే వ్యక్తి ప్రపంచ యుద్ధాలు ఇతర విషయాల గురించి కాకుండా టాంపూన్ల కోసం, శానిటరీ ప్యాడ్ల కోసం జరుగుతాయని వెల్లడించాడు.
టాంపూన్ల కోసం పెట్టే పోటీ ఆధారంగా ఓ స్పోర్ట్స్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పమని wewat13 అనే వ్యక్తి కామెంట్ చేయడం విశేషం.
2. ఎంత అసహజంగా ఉంటుందో కాస్త గట్టిగానే చెప్పాడు..
PM-SOME-TITS అనే వ్యక్తి ఒక కామిక్‌ని పోస్ట్ చేసి అదెలా ఉంటుందో వూహించుకునేలా చేశాడు. ఇది చాలా చెత్తగా ఉన్నా.. అసలు నిజాన్ని చెబుతోంది.
3. ఇతడికి బాత్రూంల గురించే ఆలోచనంతా..
33papers అనే వ్యక్తి యూరినల్స్ ఇంకా చాలా దారుణంగా తయారవుతాయి. అంటూ సమాధానమిచ్చాడు. నిజమే.. మగవాళ్లకు పిరియడ్స్ వస్తే యూరినల్స్‌ని ఉపయోగించడం ఎలాగో మరి..
4. ఈ వ్యక్తికి కేవలం తన వీర్యం గురించే ఆలోచనట..
Gumbyrocks అనే వ్యక్తి వీర్యం గురించే ఆలోచిస్తున్నాడు. మగవారికి రక్తస్రావం జరుగుతూ ఉండి.. వీర్యం విడుదల కాకపోతే ప్రపంచం అక్కడితో ఆగిపోతుందని చెప్పాడీ వ్యక్తి.
5, ఇతడికి నెలసరిలో ఉండే కష్టం అస్సలు తెలీదు..
VanDriver1 అనే వ్యక్తికి అసలు నెలసరిలో మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో అస్సలు తెలీదు అనుకుంటా.. వారు ఎదుర్కొనే నొప్పి, పీఎంఎస్ వంటివన్నీ వారు చెప్పే కల్పనలే అనుకున్న ఈ వ్యక్తి మేం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోం.. ఆడవాళ్లలా అంతలా ఏడవం కూడా.. అని సమాధానమిచ్చాడు.
6. ఈ అమ్మాయి సమాధానం ఎంతో సూపర్..
అతడు చెప్పిన సమాధానంతో కోపగించుకున్న Halloysite అనే ఓ అమ్మాయి అతనికి చక్కగా సమాధానం ఇచ్చింది. చాలామంది మగవాళ్లు జీవితంలో చాలా చిన్న చిన్న విషయాలకే ఏడుస్తూ ఉంటారు. కొందరు జలుబుతో ముక్కు మూసుకుపోతేనే పెద్ద డ్రామా క్రియేట్ చేస్తుంటారు. ఇంక నెలసరి వస్తే ఏడవకుండా ఉంటారా? అంటూ చక్కటి సమాధానం ఇచ్చింది.
అమ్మాయిలూ ఇప్పుడు మీకు తెలిసిందిగా.. నెలసరి మనకే ఉండే ప్రత్యేకమైన వరం. దీన్ని దేవుడు అబ్బాయిలకు అందించినా వారు దాన్ని మనలా భరించలేరు. అందుకే మనకున్న ఈ ప్రత్యేకతను ఆనందంగా స్వీకరిద్దాం.
రెడిట్‌లో వీరు కొనసాగించిన ఈ చర్చను పూర్తిగా ఇక్కడ చదవండి.
ఇంతటి అద్భుతమైన POPxo అందించే యాప్‌ని మీరు ఇంకా డౌన్‌లోడ్ చేసుకోలేదా? అయితే వెంటనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ లలో డౌన్‌లోడ్ చేసుకోండి.
అద్భుతమైన వార్త.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చక్కటి మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మరెన్నో ఇక్కడ 25 శాతం డిస్కౌంట్‌తోనే లభిస్తున్నాయి. POPXOFIRST అనే కూపన్ కోడ్‌ని ఉపయోగించండి. దీంతో మహిళలకు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.
ఇవి కూడా చదవండి.
బ్రేకప్ అయినా వాలెంటైన్స్ డే.. ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు..!
బాధను పంచుకుందాం.. క్యాన్సర్‌ని దూరం చేసేలా ప్రోత్సహిద్దాం..
కాలేజీలో మొదలై.. జీవితాంతం నిలిచిన అందమైన ప్రేమ కథలు మీకోసం..!
Images : Giphy and Tumbler