కాలేజీలో మొద‌లై.. జీవితాంతం నిలిచిన అంద‌మైన ప్రేమ‌ క‌థ‌లు మీకోసం..!

కాలేజీలో మొద‌లై.. జీవితాంతం నిలిచిన అంద‌మైన ప్రేమ‌ క‌థ‌లు మీకోసం..!

కాలేజీ (college).. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలోనూ ఎప్ప‌టికి మ‌ర్చిపోలేనిది. అక్క‌డ చ‌దువుకున్న రోజులు.. స్నేహితుల‌తో క‌లిసి చేసిన అల్ల‌రి.. చ‌క్క‌టి ప్రేమ‌క‌థ‌లు అంద‌రికీ జీవితాంతం గుర్తుండిపోతాయి. అయితే చాలా కాలేజీ ప్రేమ‌లు చ‌దువు పూర్తి కాగానే బ్రేక‌ప్ అయిపోతే.. కొన్ని మాత్రం పెళ్లికి దారితీసి జీవితాంతం నిలిచిపోతాయి. అలా కాలేజీలో మొద‌లైన కొన్ని అంద‌మైన ప్రేమ క‌థ‌లు(Love stories) మీకోసం..


romance2


1. కాలేజ్ ఫెస్ట్‌లో దొరికిన ప్రేమ


మీలో ఎవ‌రికైనా కాలేజీ పార్టీలో మీకు జీవితాంతం తోడు నిలిచే వ్య‌క్తి దొరికాడా? నా జీవితంలో అలాగే జ‌రిగింది. త‌న‌ని క‌ల‌వ‌డానికి ముందు నాకు ప్రేమ‌న్నా, విధి అన్నా పెద్ద‌గా న‌మ్మకం ఉండేది కాదు. కానీ నా స్నేహితురాలు మాత్రం "మ‌న‌కు జీవితంలో ఏదైనా జ‌ర‌గాల‌ని రాసిపెట్టి ఉంటే అది త‌ప్ప‌క జ‌రుగుతుంది" అని చెబుతుండేది. త‌న‌ని క‌లిసిన త‌ర్వాత ఇవ‌న్నీ నిజ‌మేన‌ని నాకూ న‌మ్మ‌కం క‌లిగింది. మేమిద్ద‌రం ఒకే కాలేజీలో చ‌దువుకుంటున్నా.. గ్రూప్స్ వేరే కాబ‌ట్టి రెండేళ్ల వ‌ర‌కూ అసలు మేం ఒక‌రినొక‌రు చూడ‌డం కూడా జ‌ర‌గ‌లేదు.


కాలేజ్ ఫెస్ట్‌లో క‌లిశాం. త‌ర్వాత ఇద్ద‌రం స్నేహితుల‌య్యాం. చాలాసార్లు అర్ధ‌రాత్రి వ‌రకూ మాట్లాడుకున్నాం. అలా ఓ రోజు ఫోన్ మాట్లాడుతూ ఉన్న‌ప్పుడు నేను త‌న‌ని ప్రేమిస్తున్నా అనిపించింది. కానీ త‌న మ‌న‌సులో ఏముందో నాకు తెలీదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు తెలియ‌కుండా త‌న ఫీలింగ్స్ తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించేదాన్ని. కానీ సాధ్య‌మ‌య్యేది కాదు. ఎంతో బాధ‌నిపించేది. ఇలా కొన్ని నెల‌ల పాటు ఇబ్బంది ప‌డిన త‌ర్వాత.. ఒక‌ రోజు త‌ను న‌న్ను ప్రపోజ్ చేశాడు. ఆ రోజు నేను ఎంతో రిలీఫ్‌గా ఫీల‌య్యాను. ఆ త‌ర్వాత ఐదేళ్ల వ‌ర‌కూ ప్రేమించుకున్న మేం పెళ్లి చేసుకున్నాం. అందుకే నిజ‌మైన ప్రేమ ఉంద‌ని అంద‌రినీ న‌మ్మ‌మ‌ని నా క‌థ‌నే ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తా..


romance3


2. తొలిచూపులోనే మొదలైన ప్రేమ‌..


త‌న పేరు నెమ్మ‌దిగా భ‌యంతో చెబుతున్న‌ప్ప‌డు నేను నా పుస్త‌కంలోంచి త‌ల పైకెత్తి చూశా. సాధార‌ణంగా జూనియ‌ర్స్‌ని ప‌రిచ‌యం చేసుకోవ‌డం అంటే నాకు చాలా బోరింగ్‌గా అనిపించేది. ఎప్పుడూ అవే ప్ర‌శ్న‌లు. అందుకే అందులో పెద్ద‌గా ఆస‌క్తి ఉండేది కాదు. కానీ త‌ను అలా కాదు. త‌ను క‌ళ్లు చిన్న‌విగా చేసి స‌మాధానం చెప్పాడు. అది చూసి నాకు న‌వ్వొచ్చింది. అప్పుడే త‌ను న‌న్ను చూశాడు. నేను వేరే వైపు చూడాల‌నుకున్నా చూడ‌లేక‌పోయా. ఆ ఒక్క నిమిషంలోనే త‌నంటే ఇష్టం ఏర్ప‌డింది.


ఆ త‌ర్వాత ఒక‌రినొక‌రు చూసుకోవ‌డం నుంచి కలిసి కాఫీలు తాగే వ‌ర‌కూ అక్క‌డి నుంచి ఒకే మంచం పంచుకునేవ‌ర‌కూ మా ప్రేమ చేరిపోయింది. మా మ‌న‌సులు ఎంతో గాఢంగా పెన‌వేసుకున్నాయి. మా పెళ్లి రోజు త‌ను న‌న్ను అడిగాడు. "నీకు ఆ మొద‌టి రోజు గుర్తుందా? అని". నేను ఉంద‌ని చెప్పాను. "ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కూ నేను నిన్నే ప్రేమించా. ఇక‌ మీద ప్ర‌తిరోజూ నిన్నే ప్రేమిస్తా.." అంటూ త‌ను ఎంతో అద్భుతంగా నాకు ప్రపోజ్ చేశాడు. ఆ మాట‌లు నా హృద‌యాన్ని హ‌త్తుకున్నాయి. ఆ నిమిషం ప్ర‌పంచంలో ఉన్న ఆనందం మొత్తం నాకే ద‌క్కిన‌ట్లు ఎంతో ఆనందంగా న‌వ్వుతూ ఉండిపోయా. ఆ త‌ర్వాత ఇద్ద‌రం పెళ్లి చేసుకున్నాం. అలా మా ప్రేమ‌క‌థ మ‌ళ్లీ ఓసారి కొత్త‌గా ప్రారంభ‌మైంది.romance4


3. సంతోషాన్ని పంచిన స్వీట్ స‌ర్‌ప్రైజ్‌..


నా బాయ్‌ఫ్రెండ్‌ని స‌ర్‌ప్రైజ్ చేయ‌డానికి నేను వూరు మారి త‌ను చ‌దివే కాలేజీలో సీట్ సంపాదించానంటే మీకు ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. కానీ త‌న‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేందుకు నేను అలా చేశాను. అప్ప‌టికే ఒక సంవ‌త్స‌రం నుంచి మేం ప్రేమించుకుంటున్నాం. ఈ ప‌నితో త‌న‌ని చాలా స‌ర్‌ప్రైజ్ చేయాల‌నుకున్నా. అందుకే నేను త‌న కాలేజీలో చేరుతున్న సంగ‌తి త‌న‌కు చెప్ప‌లేదు. మూడు నెల‌ల పాటు కాలేజీలో చేరేందుకు పూర్తిగా అన్నీ సిద్ధం చేసుకున్నా. కాలేజీలో అడ్మిష‌న్ సాధించ‌డం, హాస్ట‌ల్ వెతుక్కొని అందులో గ‌ది ఎంచుకోవ‌డం వంటివ‌న్నీ చేశాను. అది ఆ కాలేజీలో నా మొద‌టి రోజు. అంత‌కుముందే ఒక‌సారి ఆ కాలేజీకి త‌న‌తో క‌లిసి వెళ్లాను.


కాబ‌ట్టి త‌న క్లాస్‌రూం ఎక్క‌డుందో నాకు బాగా తెలుసు. అందుకే త‌న క్లాస్ రూం ద‌గ్గ‌రికి వెళ్లాను. మా కాలేజీ త‌ర‌గ‌తి గ‌దుల‌కు గ్లాస్ డోర్స్ ఉంటాయి. అందుకే త‌ను త‌న క్లాస్ రూంలోంచి న‌న్ను చూశాడు. న‌న్ను చూసి త‌ను ఎంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం నా దృష్టిని దాటిపోలేదు. ఆ త‌ర్వాత త‌న‌తో మాట్లాడిన‌ప్పుడు న‌న్ను చూడ‌గానే చిన్న‌పిల్లాడిలా లేచి కేరింతలు కొట్టాల‌నిపించింది. కానీ కాలేజీ క‌దా అని చాలా క‌ష్ట‌ప‌డి కంట్రోల్ చేసుకున్నాన‌ని చెప్పాడు. న‌న్ను చూడ‌గానే క్లాస్‌లో ఏదో చెప్పి బ‌య‌ట‌కొచ్చేశాడు.


బ‌య‌ట‌కు రాగానే న‌న్ను గ‌ట్టిగా హ‌త్తుకున్నాడు. అంద‌రూ ఏమ‌నుకుంటారో అని నేను ముందు భ‌య‌ప‌డ్డా. కానీ త‌ను న‌న్ను అలా కౌగిలించుకోవ‌డం చూసి అందరూ ఆనందంతో చప్ప‌ట్లు కొట్టారు. నువ్వు నిజంగానే వ‌చ్చావా? రోజూ క్లాస్ జ‌రిగేట‌ప్పుడు నువ్వు ఇక్క‌డ ఉంటే ఎంత బాగుండు అని వూహించుకునేవాడిని. "అది ఈ రోజు నిజ‌మైంది.." అంటూ న‌న్ను ఇంకాస్త గ‌ట్టిగా హ‌త్తుకున్నాడు. ఆ రోజు త‌న కళ్ల‌లో ఆనంద‌భాష్పాలు త‌న ప్రేమ‌ను నాకు వెల్ల‌డించాయి. ఆ త‌ర్వాత మూడేళ్ల‌కు మేమిద్ద‌రం విడిపోయినా ఆ సంద‌ర్భాన్ని మాత్రం నేను నా జీవితంలోనే మ‌ర్చిపోలేను.


ఇవి కూడా చ‌ద‌వండి.


నిజ‌మైన ప్రేమ‌కు మ‌రుప‌న్న‌దే లేదు.. ప్రేమికులందరూ తప్పక చదవాల్సిన ప్రేమకథ


ప‌చ్చ‌ని కొండ‌ల‌నే.. పెళ్లి వేదిక‌గా చేసుకున్న ప్రేమ జంట‌..!


పాట పాడి స‌ర్‌ప్రైజ్ చేశాడు.. నెచ్చెలి మ‌న‌సు దోచేశాడు..!


Images : Giphy.