Lifestyle

కొన్ని ప్రేమ బంధాలు.. ఎందుకు విఫలం అవుతున్నాయో తెలుసా? – Reasons For Failure Of Long Distance Relationship

Lakshmi SudhaLakshmi Sudha  |  Jan 8, 2019
కొన్ని ప్రేమ బంధాలు.. ఎందుకు విఫలం అవుతున్నాయో తెలుసా? – Reasons For Failure Of Long Distance Relationship

సుదూర ప్రేమబంధాల్లో (long distance relationships) ఉండేవారు.. అనగా ఉద్యోగ నిమిత్తం ఒకరికొకరు దూరంగా ఉండే ప్రేమికులకు అప్పుడప్పుడు రాజీ పడలేని పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. అయినా ఆ బంధాలను వారు కొనసాగిస్తూ ఉంటారు. సాధారణంగా ఎవరైనా తాము.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశం వస్తే.. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. కాని ఇలాంటి సందర్భంలో కూడా.. మనుషుల మధ్య దూరం పెరిగినా.. మనసులు మరింత దగ్గరవుతాయనే ఉద్దేశంతోనే వారు, ఒకరిని విడిచి మరొకరు దూరంగా వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి వారి మధ్య అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుందా? ప్రాక్టికల్‌గా చూస్తే అది సాధ్యం కాకపోవచ్చు. అందుకే సుదూర ప్రేమ బంధాన్ని కొనసాగించేవారిని కాస్త హెచ్చరిస్తున్నాం.

కొన్ని ప్రేమ బంధాలు.. ఎందుకు విఫలం అవుతున్నాయో తెలుసా? (Reasons For The Failure Of Long Distance Relationship) 

ఏ బంధమైనా కొనసాగాలంటే.. భావవ్యక్తీకరణ (communication) చాలా ముఖ్యం. అప్పుడే అది మరింత బలంగా మారుతుంది. మనసుకి నచ్చిన వ్యక్తి నుంచి ఉదయాన్నే “గుడ్ మార్నింగ్ మెసేజ్” వస్తే అది చాలా సంతోషాన్నిస్తుంది. వారి నుంచి అందుకొనే ప్రతి మెసేజ్ మీపై వారికున్న ప్రేమను తెలియజేస్తుంది.

కానీ రోజంతా ఇలా టెక్ట్స్ మెసెజ్‌ల ద్వారానే మాట్లాడుకోవాల్సి వస్తే..? కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత రోజూ ఇలా చెయ్యాల్సి రావడం విసుగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే.. మీరు చేయాల్సిన పనులు మీకూ ఉంటాయి. అందులోనూ బిజీగా ఉన్న సమయంలో చేస్తున్న వర్క్ పక్కన పెట్టి మెసేజ్ చేయలేం. సుదూర ప్రేమ బంధంలో ఉన్నవారు ఎదుర్కొనే మొదటి సమస్య ఇది. కొన్నిసార్లు ఫోన్ చేయడానికి సమయం కుదరక వాయిస్ మెసేజ్ ఇచ్చే సందర్భాలూ ఉంటాయి.

Also Read: ఒక అమ్మాయి ఆకట్టుకోవడానికి 16 చిట్కాలు (Tips To Impress A Girl)

1-long-distance-relationship

సుదూర ప్రేమ బంధంలో ఉన్నవారికి ఎదురయ్యే మరో సమస్య తరచూ కలుసుకోలేకపోవడం. ప్రేమిస్తున్న వ్యక్తి వేరే దేశంలో ఉన్నప్పుడు ఇద్దరూ కలుసుకొనే క్షణం కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిందే. అధికంగా ఉండే ప్రయాణ ఖర్చులు భరించాలంటే ఎవరికైనా ఆర్థికంగా భారమే కదా. రోజూ స్కైప్,ఫేస్బుక్, వాట్సాప్ ఇలా వీడియో కాల్స్‌లో మాట్లాడుకోవచ్చు కదా.. అని మీరనచ్చు. కానీ మీరిద్దరూ ఒకరిని ఒకరు హత్తుకొని కబుర్లు చెప్పుకొన్నప్పుడు కలిగిన భావం ఇలా వీడియోకాల్స్‌లో మాట్లాడుకొన్నప్పడు ఎప్పుడైనా కలిగిందా?

ప్రేమ బంధం నిలబడటానికి భౌతిక స్పర్శ చాలా అవసరం. బైక్ పై లాంగ్ డ్రైవ్‌కి వెళ్లడం, ముద్దు పెట్టుకోవడం, శారీరకంగా కలవడం వంటివి మీ మధ్య ఉన్న ప్రేమని పదింతలు పెంచుతాయి. దీనికి కారణమైన శారీరక స్పర్శ. ఫోన్ సెక్స్, సెక్స్టింగ్ వంటివి తాత్కాలిక ఆనందాన్ని కలిగించవచ్చేమో.. కానీ పూర్తి ఆనందాన్నివ్వలేవు.

ఇద్దరూ కలిసి లేట్ నైట్ లాంగ్ డ్రైవ్‌కి వెళ్లినప్పుడు కలిగే ఆనందం ఒంటరిగా ఎన్ని ఐస్ క్రీంలు తింటే వస్తుంది? కొన్నిసార్లు మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి మీ బాయ్ ఫ్రెండ్ వేరేగా ఎంజాయ్ చేస్తున్నాడని మీకనిపించవచ్చు. మీ ఆలోచన ఇదే అయితే.. అది తప్పు. అక్కడ అతడు స్నేహితులతో ట్రిప్‌కి వెళితే.. ఇక్కడ మీరు సినిమాకి వెళుతుంటారు. 

ప్రస్తుతం మన తరం ప్రేమ బంధం నిలబెట్టుకోవడంలో విఫలం అవుతోంది. ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉన్నప్పటికీ మన ముందు తరాల వారు ఆ బంధాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధించారు. ఇప్పటి తరం వారు ఎందుకు దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు? ఈ తరం ప్రతి చిన్న విషయ ానికి టెక్నాలజీపైనే ఆధారపడుతోంది. బంధం నిలుపుకోవడానికి కూడా దీనిపైనే ఆధారపడితే ఆ ప్రేమ తన సహజత్వాన్ని కోల్పోతుంది. అందుకే నేటితరం ప్రేమ బంధాలు ఎక్కువ కాలం నిలవలేకపోతున్నాయి.

ప్రేమ విషయంల ో మీకున్న సందేహాలు తీర్చుకోవడానికి క్రిస్ బెల్, కేట్ బ్రౌర్ బెల్ రాసిన The Long-Distance Relationship Survival Guide(రూ. 655) పుస్తకం చదవండి. అలాగే గ్రెగరీ గల్డనర్ రాసిన Long Distance Relationships: The Complete Guide (రూ. 4,039) లోనూ మీ సందేహాలకు సమాధానాలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

అబ్బాయిలూ.. ప్రేమతో మీ భాగస్వామికి మీరు చేయాల్సిన పనులివే..

ప్రేమ వివాహం.. ప్రేమతో మీకు నేర్పించే విషయాలు ఇవే..

సెల్ఫ్ లవ్ : మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి ఈ పనులు చేయాల్సిందే