ADVERTISEMENT
home / వినోదం
మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ట్రైలర్ లో.. మీకు ‘సై.. సైరా’ అనిపించే 7 అంశాలు ..!

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ట్రైలర్ లో.. మీకు ‘సై.. సైరా’ అనిపించే 7 అంశాలు ..!

(Megastar Chiranjeevi starrer ‘Sye Raa Trailer’ Talk)

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్ర లేటెస్ట్ విశేషాల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానుల దాహార్తిని తీరుస్తూ.. కొద్ది క్షణాల క్రితమే ‘సైరా’ సినిమా అధికారిక ట్రైలర్ విడుదలైంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది? సైరా ట్రైలర్‌లో చిరంజీవి ఎలా కనిపిస్తున్నాడు? ఇందులో మెగా అభిమానులు కోరుకున్న అంశాలు ఉన్నాయా..? లేదా..? మొదలైన విషయాలను మనమూ తెలుసుకుందాం..!

ముందుగా ‘సైరా ట్రైలర్’ చూడండి

 

ADVERTISEMENT

భారత జాతికి జై… అంటూ మొదలైన ఈ సైరా ట్రైలర్‌లో ఆసక్తికర అంశాలు ఏంటంటే …

* నీటిలో తపస్సు

నీరు ప్రవహిస్తుండగా.. శివుని విగ్రహం ముంగిట కూర్చుని.. హీరో తపస్సు చేసుకుంటున్న సన్నివేశం ఈ ట్రైలర్ మొత్తానికే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సన్నివేశం కోసం ముంబైలోని ఓ భారీ స్విమ్మింగ్ పూల్‌లో షూటింగ్ చేయడం జరిగిందట. అలాగే అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం.. ప్రత్యేకంగా తయారుచేసిన కెమెరాల సహాయంతో చిత్రీకరణ చేశారట. ఈ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా మారింది.

* చిరంజీవి పలికే సంభాషణలు

ADVERTISEMENT

సాయి మాధవ్ బుఱ్ఱా రాసిన పవర్ ఫుల్ డైలాగ్స్.. ఈ సినిమాకే హైలైట్ అని చెప్పచ్చు. ముఖ్యంగా ‘ఎందుకు కట్టాలిరా శిస్తు..’ అనే డైలాగ్ థియేటర్స్‌లో అభిమానుల చేత విజిల్స్ వేయించడం పక్కా అని చెప్పచ్చు. 

మెగాస్టార్ చిరంజీవి “సైరా నరసింహా రెడ్డి” మేకింగ్ వీడియోలో.. హైలైట్స్ ఇవే..!

* పోరాట సన్నివేశాలు

ఆరు పదుల వయసులో కూడా చిరంజీవి పోరాట సన్నివేశాల్లో.. ఎంతో సునాయాసంగా నటించగలిగారు. ప్రధానంగా యుద్ధ సన్నివేశాల్లో ఆయన శరీర కదలికలు అమోఘమనే చెప్పాలి. ఇక హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ – గ్రెగ్ పావెల్, లీ విటేకర్‌లు.. అలాగే మన ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్స్ రామ్ – లక్ష్మణ్‌లు మెగాస్టార్ చిరంజీవితో చేయించిన స్టంట్స్ కచ్చితంగా ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.

ADVERTISEMENT

* భారీ తారాగణం

ఈ ట్రైలర్‌లో మరో ప్రధాన ఆకర్షణ – భారీ తారాగణం. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా, నిహారిక కొణిదెల. ఇలా దాదాపు సినిమాలోని అన్ని ప్రధాన పాత్రల్లో ప్రముఖ నటులు నటించేసరికి.. ఈ చిత్రానికి తెలియకుండానే ఒక భారీ ఇమేజ్ వచ్చేసింది. పైగా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ కూడా ఈ సినిమాకి మరొక ప్రధాన ఆకర్షణ.

* భారీ సెట్స్

ఇక అప్పటి కాలపు సన్నివేశాలు తీయడానికి ఈ భారీ సెట్స్ వేయడం జరిగింది. అలాగే యుద్ధ సన్నివేశాలు.. కోటల నిర్మాణం లాంటి అంశాలపై దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కూడా అవగతమవుతోంది. రాజీవన్ అందించిన ప్రొడక్షన్ డిజైన్స్.. ఈ చిత్రానికి మరొక హైలైట్ అని చెప్పొచ్చు.

ADVERTISEMENT

* వందలమందితో సన్నివేశాలు

ఇక ఈ ట్రైలర్‌ని మనం చూస్తే, వందలమందితో చిత్రీకరించిన పాటలు, సన్నివేశాలు సినిమా రేంజ్‌ని మరింత పెంచాయి. ఈ మెగా సినిమా కోసం భారీ తారాగణంతో పాటుగా.. వందలమంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నాయట. 

* కోర్టు సన్నివేశం

ఇక ట్రైలర్ చివరలో మనకి కనిపించే కోర్టు సన్నివేశం ఆసక్తికరంగా సాగింది. ఆ సన్నివేశంలో చిరంజీవి నటన అద్భుతంగా ఉండబోతుంది అని మాత్రం చెప్పవచ్చు.

ADVERTISEMENT

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ – మెగా బిజినెస్ ఉమన్ ఉపాసనల.. ప్రేమ బంధం గురించి తెలుసుకుందామా?

ఇవి కాకుండా మెగాస్టార్ ఈ ట్రైలర్‌‌లో పలికిన కొన్ని సంభాషణలు –

* స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు

* నా భరతమాత గడ్డ పై నిలబడి హెచ్చరిస్తున్నా… నా దేశం వదిలి వెళ్లిపోండి … లేదా యుద్ధమే!!

ADVERTISEMENT

* చివరి కొోరిక ఏమైనా ఉంటే టెల్ మీ నౌ – ‘గెటౌట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్’

ఈ ట్రైలర్ చూసాక నిర్మాతగా రామ్ చరణ్.. దర్శకుడిగా సురేందర్ రెడ్డి తమ శక్తిమేర ఈ సినిమా కోసం పనిచేసినట్టుగా అర్ధమవుతుంది. అలాగే ఈ చిత్రం వచ్చే నెల 2 తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. మెగా అభిమానులలో సంతోషాన్ని నింపుతుందని కూడా చెప్పుకోవచ్చు.

‘అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిల’ ప్రేమకథ.. సినిమా కథని మరిపించేలా ఉంటుంది తెలుసా…!

18 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT