జొమాటో ట్విట్టర్‌లో.. ఎందుకు ట్రెండ్ అవుతోందో మీకు తెలుసా?

జొమాటో ట్విట్టర్‌లో.. ఎందుకు ట్రెండ్ అవుతోందో మీకు తెలుసా?

ఉదయం నుంచి అర్థరాత్రి వరకూ.. మనకు ఎప్పుడు ఆకలైనా.. ఇంట్లో వండడానికి బద్ధకమేసినా ముందుగా గుర్తొచ్చేవి ఫుడ్ డెలివరీ యాప్స్. అందులోనూ జొమాటో (zomato) అయితే మరీనూ.. 30 నుంచి 40 శాతం వరకూ డిస్కౌంట్లు అందిస్తూ ఫుడ్‌ని మన చెంతకు చేరుస్తుంది. కాబట్టి ఈ యాప్ చాలామందికి ఇష్టంగా మారిపోయింది.

ముఖ్యంగా ఫుడ్ లవర్స్‌కి.. ఫుడ్‌కి మధ్యలో ఓ చక్కటి బంధం ఉందని చెప్పచ్చు. కానీ అంత అద్భుతమైన బంధం మధ్యలోనూ మతాన్ని తీసుకొచ్చి వాదోపవాదాలు సాగిస్తుంటే బాధనిపిస్తుంది కదూ.. ప్రస్తుతం ట్విట్టర్ (Twitter) లో కొనసాగుతోన్న వార్ చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తోంది.

అసలేం జరిగిందంటే.. పుణెకి చెందిన అమిత్ శుక్లా జొమాటో నుంచి ఆహారం ఆర్డర్ చేస్తే తనకు ముస్లిం రైడర్‌ని కేటాయించారని ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేశారు. అయితే జొమాటో ఆయన డబ్బు తిరిగి చెల్లించేందుకు ఒప్పుకోకపోవడంతో.. ఆయన తన అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ "నేను ఇప్పుడు ఈ యాప్‌ని అన్ ఇన్ స్టాల్ చేస్తున్నా" అని చెప్పడం గమనార్హం.

అయితే కేవలం రైడర్ ముస్లిం అన్న కారణంతో ఆహారాన్ని తీసుకోవడం మానేసిన ఆ వ్యక్తిని చాలామంది ట్విట్టర్ వేదికగా విమర్శించారు. అన్ సెక్యులర్ అంటూ చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి ట్వీట్లను ఓసారి గమనిస్తే..

Twitter
Twitter
Twitter

"జొమాటో నుంచి ఇప్పుడే ఒక ఆర్డర్‌ని క్యాన్సిల్ చేశాను. వాళ్లు నాకు నాన్ హిందూ రైడర్‌ని కేటాయించారు. రైడర్‌ని మార్చమని నేను కోరాను. అలా చేయడం కుదరదని.. క్యాన్సిల్ చేస్తే డబ్బు తిరిగి ఇవ్వడం కుదరదని చెప్పారు. నేను మీ డెలివరీ తీసుకోవాలని.. నన్ను బలవంతం చేయలేరు. నాకు డబ్బులు అవసరం లేదు. క్యాన్సిల్ చేసేయండి అని చెప్పాను. జొమాటో మనకు నచ్చని వ్యక్తుల నుంచి డెలివరీ తీసుకోవాలని బలవంతం చేస్తుంది. మనం వద్దనుకుంటే.. డబ్బు రిటర్న్ కూడా ఇవ్వడం లేదు. అందుకే నేను ఈ యాప్ అన్ ఇన్‌స్టాల్ చేస్తున్నా. మిగిలిన విషయం నా లాయర్స్ మాట్లాడతారు" అంటూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని కూడా పోస్ట్ చేశారు.

Twitter
Twitter

దీనికి జొమాటో ఇచ్చిన సమాధానం ట్విట్టర్‌లో చాలామంది మనసులను గెలచుకుంది. "ఫుడ్ అనేది ఏ మతానికి చెందినది కాదు.. అదే ఓ మతం" అంటూ ట్వీట్ చేసింది. దీన్ని రీట్వీట్ చేస్తూ జొమాటో సంస్థ యజమాని దీపిందర్ గోయల్ కూడా ట్వీట్ చేయడం విశేషం.

"భారత్ అంతా ఒక్కటే అన్న భావనకు మేం కట్టుబడి ఉన్నాం. మేం ఎంతో గర్విస్తున్నాం కూడా. మా భాగస్వాములు, వినియోగదారుల విభిన్నమైన సంస్క్రతులను మేం గౌరవిస్తున్నాం. మా విలువలకు ఇబ్బంది కలిగించే వ్యక్తులను, వారి నుంచి అందే బిజినెస్‌ని కోల్పోవడానికి మేం ఏమాత్రం బాధపడం" అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈబర్ ఈట్స్ కూడా జొమాటో ట్వీట్ని రీ ట్వీట్ చేస్తూ "మేం కూడా మీతో అంగీకరిస్తున్నాం" అంటూ ట్వీట్ చేసింది.

దీనిపై కొందరు ట్విట్టర్ యూజర్లు.. జొమాటో చర్యను అభినందిస్తూ ఆ యూజర్ పై విమర్శలు చేయడం విశేషం.

Twitter
Twitter
Twitter

అయితే మరికొందరు మాత్రం "ఆహారానికి ఎలాంటి మతమూ లేకపోతే.. కేవలం హలాల్ చేసిన మాంసాహారాన్ని మాత్రమే అమ్మడం ఎందుకు" అంటూ ప్రశ్నిస్తున్నారు. జొమాటో హిందువులకు ఒకలా.. ముస్లింలకు మరోలా సమాధానం ఇస్తోందని మండిపడుతూ.. ఇలాంటి చర్యలు చేపట్టిన జొమాటోని, దానికి సపోర్ట్ చేసిన వూబర్ ఈట్స్ సంస్థని బాయ్ కాట్ చేయాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

దీనికి సమాధానంగా జొమాటో మరోసారి స్పందించింది. హలాల్ చేసిన మాంసం అనేది కేవలం రెస్టారెంట్లు అందించే ఒక రకమైన ఆహారం అని.. దానితో పాటు నవరాత్రి ఫుడ్, వీగన్ ఫుడ్, జైన్ ఫుడ్ వంటి ట్యాగ్స్ కూడా రెస్టారెంట్లు పెట్టాలని కోరితే తాము డిస్ ప్లే చేస్తామని.. తాము ఆహార భద్రత చూసే ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ మాత్రమే చూస్తామని.. మిగిలినవన్నీ రెస్టారెంట్లపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది.

Twitter
Twitter
ట్విట్టర్‌లో వైరల్‌గా మారిన జేసీబీ.. ఎందుకో తెలుసా?

అయినా ఆగకుండా చాలామంది #boycottzomato, #BoycottUberEats అంటూ ట్వీట్స్ చేయడం గమనార్హం. సెక్యులర్ దేశంగా పేర్కొనే మన దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం.. మతం ఆధారంగా ఇలా వ్యవహరించడం సరైనదేనంటారా?

దీని గురించి ఓ ప్రముఖ న్యూస్ పోర్టల్‌తో అమిత్ శుక్లా మాట్లాడుతూ.. "మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ అందిస్తోంది. ఇది శ్రావణ మాసం కాబట్టి రైడర్‌ని మార్చమని కోరాను. ఇప్పటి నుంచి నేను జొమాటోలో ఏ ఆర్డర్ చేయను. నేను డబ్బులు కట్టి ఆర్డర్ తీసుకుంటున్నా.. కాబట్టి ఎలాంటి రైడర్ కావాలో కోరుకునే హక్కు నాకు ఉంటుంది. నాకు నాన్ హిందూ రైడర్‌ని కేటాయించినందుకు ఆర్డర్‌ని క్యాన్సిల్ చేయమని చెప్పాను" అంటూ స్పందించడం విశేషం. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని.. సెక్యులర్‌గా స్పందించింది జొమాటో.

 

ఓ స్విగ్గీ కథ: చెన్నైలో ఫుడ్ ఆర్డర్ కోసం.. డెలివరీ బాయ్ రాజస్థాన్ ఎందుకెళ్లాడు?

ఇదే కాదు.. గతంలోనూ చాలా విషయాల్లో అందరికీ గుర్తుండిపోయే స్టేట్ మెంట్స్ చేసింది జొమాటో. నీటి పొదుపు గురించి ట్వీట్స్ చేస్తూ.. "నీళ్లు లేకపోతే పానీ పురీ కేవలం పూరీ మాత్రమే అవుతుంది. నీరు లేకపోతే టీ ఎలా తాగుతారు?" అంటూ ట్వీట్స్ చేయడం విశేషం. ఇవేకాదు.. వరదల బారిన పడిన వారికి ఆహారాన్ని అందించేందుకు కూడా ఈ యాప్ ప్రత్యేక ఏర్పాటు చేయడం విశేషం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ టీ షర్ట్స్. ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఈ ఫన్నీ ఫీలింగ్స్.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక.. మీకూ వచ్చాయా..?