అన్యోన్య దాంపత్యానికి కేరాఫ్ అడ్రస్.. "దేవదాస్ - లక్ష్మీదేవి కనకాల" ..!

అన్యోన్య దాంపత్యానికి కేరాఫ్ అడ్రస్.. "దేవదాస్ - లక్ష్మీదేవి కనకాల" ..!

ఆలుమగలైనా.. కొన్ని విషయాల్లో వీరు ఇద్దరూ ఇద్దరే. తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Tollywood) తొలితరం హీరో, హీరోయిన్లకు నటనలో శిక్షణ ఇచ్చిన ఘనత వారిది. సినిమాలు, సీరియల్స్‌లో విభిన్న పాత్రలు పోషించిన ఈ జంట.. ఎందరికో ఆదర్శంగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు.

దశాబ్ద కాలం వారు తెలుగు సినీ పరిశ్రమకు ఎందరో నటులను అందించారు. ఉత్తమ గురువులగానూ నిలిచారు. తమ నటనా వారసత్వాన్ని తమ పిల్లలకూ అందించారు. వారే దేవదాస్ కనకాల.. ఆయన ధర్మపత్ని లక్ష్మీదేవి. 

కొంత కాలం క్రితం లక్ష్మీదేవి కనకాల గుండె సంబంధిత వ్యాధితో పరమపదించగా.. ఇటీవలే దేవదాస్ కనకాల (Devadas Kanakala) కూడా స్వర్గస్తులయ్యారు. కానీ వారు చిత్రసీమకు చేసిన సేవ మాత్రం అపారమన్నది సత్యం. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి.. కామెడీ స్టార్ అల్లరి నరేష్ వరకూ అందరూ వీరి శిష్యులే. 

రజనీకాంత్‌, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, రాంకీ, రఘువరన్, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌ పాండ్యన్‌.. ఇలా వీరి వద్ద శిక్షణను పొందిన వారి లిస్టు చాలా పెద్దదే. దేవదాస్, లక్ష్మీదేవిల కుమారుడు రాజీవ్ కనకాల ప్రస్తుతం మంచి నటుడిగా చిత్ర సీమలో పేరు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే కోడలు సుమ సెలబ్రిటీ యాంకర్‌గా సుపరిచితురాలు. 

మాట‌ల్లోనే కాదు.. మ‌న‌సులోనూ సుమ క‌న‌కాల మాణిక్య‌మే..!

మీకో విషయం తెలుసా? దేవదాస్, లక్ష్మీదేవి కనకాల.. వీరిద్దరిదీ ప్రేమ వివాహం.  ఆమె ఆయనకంటే ఆరేళ్లు పెద్దది. పైగా కులాంతర వివాహం. ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. అయినా పోరాడి మరీ.. కుటుంబీకులను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. లక్ష్మీదేవి గొప్ప నాట్యకారిణి. ఆమెను దేవదాస్ దగ్గరుండి ప్రోత్సహించారు. తర్వాత ఆమె మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌‌లో నటన శిక్షకురాలిగా చేరారు. చిరంజీవి లాంటి నటులు ఆమెను "సరస్వతమ్మ" అని సంబోధించేవారట. అంటే.. సాక్షాత్తు ఆ సరస్వతీ మాతే తమకు పాఠాలు చెబుతుందని భావించేవారట. 

 

 

 

ఇక దేవదాస్ కనకాల విషయానికి వస్తే.. పూణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణను పూర్తిచేసుకొని వచ్చిన తొలి తరం తెలుగు వ్యక్తులలో ఆయన కూడా ఒకరు. అక్కడ శిక్షణను పూర్తి చేశాక.. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో కూడా  అధ్యాపకునిగా సేవలను అందించారు. తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల విభాగంలో కూడా కొన్నాళ్లు.. సేవలను అందించారు. విశాఖపట్నం ఏవీఎన్ కాలేజీలోనే ఆయన తన డిగ్రీని పూర్తిచేశారు. 

నటనతోనే కాదు.. పాటతోనూ మెప్పించిన కథానాయికలు వీరే

దేవదాస్, లక్ష్మీదేవి దంపతులు ప్రారంభించిన యాక్టింగ్ స్కూలు.. ఆ కాలంలో హైదరాబాదులో చాన్నాళ్లు నడిచింది. 1990ల్లో మూతబడింది. అయితే యాక్టింగ్ స్కూలు మూతబడినా... ఔత్సాహిక కళాకారులకు ఈ దంపతులు తమకు సమయం ఉన్నప్పుడల్లా.. శిక్షణను ఇస్తుండేవారు. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుండేవారు. ప్రేమబంధం, పోలీస్ లాకప్ లాంటి సినిమాల్లో లక్ష్మీదేవి నటించారు. అయితే సినిమాల కంటే సీరియల్సే ఆమెకు ఎక్కువ పేరు తీసుకువచ్చాయి. పలు టెలిఫిలిమ్స్‌లో కూడా ఆమె నటించారు. 

టాలీవుడ్ టాప్ 10.. లేడీ కమెడియన్స్ వీరే

యానాంలో పుట్టి పెరిగిన దేవదాస్ కనకాల.. ఆ తర్వాత అనేక ప్రాంతాలు తిరిగారు. కళాకారుడిగా తన భార్యతో కలిసి ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. బతికిన రోజులన్నీ వారు కళాకారులుగానే బతికారు. "చలి చీమలు" అనే గొప్ప సామాజిక చిత్రానికి దర్శకత్వం వహించిన ఘనత కూడా దేవదాస్ కనకాలదే. 1978లో విడుదలైన ఆ చిత్రం ఉత్తమ చిత్రంగా నంది అవార్డును కూడా అందుకుంది. 

ఏదేమైనా.. కళారంగానికి ఈ దంపతులు చేసిన సేవ మరువలేనిది అనడంలో సందేహం లేదు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.