ADVERTISEMENT
home / Celebrity Life
“లేడీ రౌడీ”గా రష్మిక.. విజయ్ దేవరకొండ కొత్త ప్లాన్..?

“లేడీ రౌడీ”గా రష్మిక.. విజయ్ దేవరకొండ కొత్త ప్లాన్..?

‘గీతగోవిందం’ చిత్రంతో సూపర్ హిట్ పెయిర్‌గా ప్రేక్షకుల మనసులను దోచుకున్న హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన. వీరిద్దరూ కలిసి నటిస్తున్న “డియర్ కామ్రేడ్” (Dear Comrade) చిత్రం కూడా.. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. అయితే విషయం ఏమిటంటే.. ఆ మధ్యకాలంలో విజయ్ “రౌడీ వేర్” అనే సరికొత్త టెక్స్‌టైల్స్ బ్రాండ్‌ను ప్రారంభించారు. దానికి ఆయన విపరీతంగా ప్రమోషన్ కూడా చేస్తున్నారు. తన అభిమానులను కూడా ముద్దుగా ఆయన రౌడీస్ అని పిలుస్తుంటారు.

అయితే ఇప్పుడు కొత్తగా ఈ రౌడీ బ్రాండ్ ఫిమేల్ వెర్షన్‌ను కూడా విజయ దేవరకొండ (Vijay Devarakonda).. లాంచ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ బ్రాండ్ పేరు “లేడీ రౌడీ” అని.. దీనికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక మందానను విజయ్ నియమించనున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు. ఇదే విషయాన్ని ప్రధానంగా తీసుకొని పలు మీడియా సైట్లలో అనేక గాసిప్స్ కూడా వస్తున్నాయి.  

విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్” సినిమా గురించి.. మరిన్ని విషయాలు తెలుసుకుందామా

రౌడీ వేర్ ప్రమోషన్లను ఒకప్పుడు హైదరాబాద్‌లో భీభత్సంగా చేశారు విజయ్ దేవరకొండ. ఎంపిక చేయబడిన తన అభిమానులకు ఈ ప్రమోషన్ ఈవెంటులో ఘనంగా పార్టీ కూడా ఇచ్చారు. అలాగే అర్జున్ రెడ్డి చిత్రానికి గాను తాను దక్కించుకున్న తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డును అదే కార్యక్రమంలో ఆక్షన్‌లో అమ్మకానికి కూడా పెట్టారు. దివి లాబొరేటరీస్ యాజమాన్యం.. రూ.25 లక్షల రూపాయలు వెచ్చించి ఆ ఆక్షన్‌లో ఆ అవార్డును దక్కించుకుంది. అలా వచ్చిన మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు విజయ్. 

ADVERTISEMENT

ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందాన కలిసి నటిస్తున్న “డియర్ కామ్రేడ్” చిత్ర విషయానికి వస్తే.. ఈ నెల 26వ తేదిన ఈ చిత్రం రిలీజ్ కానుంది. భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రంగినేని ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రుతి రామచంద్రన్, జయప్రకాష్, బ్రహ్మాజీ, సుకన్య, రావు రమేష్, అనీష్ కురువిల్లా, రఘుబాబు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం.. ఈ నాలుగు భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల అవుతుంది. 

మన వెండితెర ముద్దుల ‘రౌడీ’ల గురించి.. ఈ విశేషాలు మీకు తెలుసా?

అయితే డియర్ కామ్రేడ్ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అలాంటి వార్తల్లో నిజం లేదని విజయ్ స్వయంగా చెప్పారు. బహుశా.. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే అవకాశాలైతే ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక రష్మికకు కన్నడంలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కనుక, కర్ణాటకలో కూడా ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్‌ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. గతంలో ఈ సినిమా టీమ్ బెంగళూరులో టూర్ కూడా చేసింది.

పుట్టిన రోజు నాడు.. ర‌ష్మిక ఎందుకు అలిగిందో మీకు తెలుసా..?

ADVERTISEMENT

డియర్ కామ్రేడ్ టీమ్ గతంలో చేసిన ప్రమోషన్ కార్యక్రమానికి.. ప్రముఖ కన్నడ హీరో, కేజీఎఫ్ ఫేమ్ యశ్ కూడా హాజరయ్యారు. ఈ చిత్రం కన్నడంలో కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్‌కి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఆరంజ్ మిఠాయ్, ఒరు నాల్ కూతు, రాజా మంత్రి, తొండన్ లాంటి తమిళ చిత్రాలకు చిత్రాలకు సంగీతం సమకూర్చిన జస్టిన్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.   

19 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT