పుట్టిన రోజు నాడు.. ర‌ష్మిక ఎందుకు అలిగిందో మీకు తెలుసా..?

పుట్టిన రోజు నాడు.. ర‌ష్మిక ఎందుకు అలిగిందో మీకు తెలుసా..?

ర‌ష్మిక మంధ‌న‌ (Rashmika mandanna).. వ‌రుస సినిమాల‌తో ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో టాప్ హీరోయిన్‌గా మారేందుకు కృషి చేస్తోందీ అందాల కథానాయిక‌. క‌న్న‌డంలో చ‌క్క‌టి ప్ర‌తిభ క‌న‌బ‌రిచి టాప్ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీ.. తెలుగులోనూ ఛ‌లో, గీత గోవిందం సినిమాల‌తో త‌న‌కంటూ మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు విజ‌య దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలోనూ రూపొందిస్తున్న డియ‌ర్ కామ్రేడ్ చిత్రంలో న‌టించ‌డం ద్వారా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌ గుర్తింపు సాధించుకోవాల‌నుకుంటోంది.


ఈ రోజు (ఏప్రిల్ 5) ర‌ష్మిక పుట్టిన రోజు సంద‌ర్భంగా డియ‌ర్ కామ్రేడ్ చిత్ర బృందం.. ఆమె స్నేహితుడు విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay devarakonda) ఆమెకు ఓ స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఆ స‌ర్‌ప్రైజ్ కోసం అభిమానుల‌తో పాటు ర‌ష్మిక కూడా వేచిచూడ‌డం విశేషం. కానీ త‌న‌కు అందించిన స‌ర్‌ప్రైజ్ చూసి ర‌ష్మిక కోపం తెచ్చుకుంది. అలిగింది. దీంతో సినిమా బృందంతో పాటు విజ‌య్‌కి కూడా.. ఆమెని బ‌తిమాల‌క త‌ప్ప‌లేదు.


DlQoKo9VAAAeSFi


వివ‌రాల్లోకి వెళ్తే.. శుక్ర‌వారం ర‌ష్మిక పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమెకు ఓ ప్ర‌త్యేక‌మైన బ‌హుమ‌తిని అందించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది డియ‌ర్ కామ్రేడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. విజ‌య్‌ దేవ‌ర‌కొండ అకౌంట్‌లో ఆమెకు ఈ స‌ర్‌ప్రైజ్ అందుతుంద‌ని చెప్పింది. దీనికి ర‌ష్మిక "అరె, నా పుట్టిన‌రోజుకి నా కోసం ఇచ్చే బ‌హుమ‌తి ఏంటో క‌నీసం నాకైనా చెప్పొచ్చు క‌దా.. ప్లీజ్" అంటూ అభ్య‌ర్థించింది. కానీ చిత్ర బృందం మాత్రం మ‌రికొన్ని గంట‌ల పాటు ఆగ‌మ‌నే సమాధానం ఇచ్చింది.ఇంత బిల్డ‌ప్ ఇచ్చిన త‌ర్వాత అదేంటో అని అంద‌రిలోనూ ఆతృత పెరిగిపోతుంది క‌దా.. ఈ ఉద‌యం ర‌ష్మిక పుట్టిన‌రోజు ప్ర‌త్యేకం అంటూ ఫ్యాన్స్ త‌యారుచేసిన స్పూఫ్ వీడియో పోస్ట్ చేశాడు విజ‌య్‌. ఇదే త‌న స‌ర్‌ప్రైజ్ అనుకున్న ర‌ష్మిక చిత్ర బృందంపై అస‌హ‌నం చూపించి.. వారిపై అలిగింద‌ట‌.


ఓ ఫ్యాన్ త‌న‌ని ముద్దు పెడుతున్న‌ట్లుగా ఉన్న ఆ స్పూఫ్ వీడియోని చూసి.. "అస‌లు ఏమ‌నుకుంటున్నారు మీరు.. ఒక్క నిమిషం నాకు, నా ఫ్యాన్స్‌కి హార్ట్ ఎటాక్ తెప్పించేశారు. ఇలాంటి స్పూఫ్ వీడియోని విజ‌య్ పోస్ట్ చేసి న‌న్ను ఏడిపిస్తానంటే మీరెలా ఒప్పుకున్నారు?" అంటూ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌ని, ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మని అడిగింది ర‌ష్మిక..


దీనికి కొన్ని నిమిషాల్లోనే స‌మాధానం ఇచ్చేశాడు విజ‌య్‌.. "సారీ లిల్లీ (డియ‌ర్ కామ్రేడ్ చిత్రంలో ర‌ష్మిక పేరు ఇది). మ‌మ్మ‌ల్ని క్ష‌మించు. మాపై అల‌గ‌కు. మేం జోక్ చేశామంతే.. నువ్వే మా సెట్స్‌ని ఆనందంతో నింపేసే వ్య‌క్తివి. నీ పెర్ఫార్మెన్స్‌తోనే కాదు.. నీ న‌వ్వుతోనూ సెట్స్‌లో ఆనందాన్ని నింపుతావు. అందుకే నీ కోసం ఈ పోస్ట‌ర్‌.. అంతేకాదు.. ఈ నెల 8న విడుద‌ల కాబోతున్న పాట కూడా నీకే అంకితం చేస్తున్నాం.." అంటూ ట్వీట్ చేశాడు. దీనికి ర‌ష్మిక కూడా "దేవుడా.. ఎట్ట‌కేల‌కి దీన్ని విడుద‌ల చేశావు. ఈ నెల 8 కోసం వేచిచూస్తున్నా.. అయినా అన్ని రోజులు వేచిచూడాలా? క‌నీసం న‌న్నైనా ఆ పాట విన‌నివ్వ‌చ్చు క‌దా.." అంటూ స‌మాధాన‌మిచ్చింది. ఈ ఫ‌న్నీ ప్రాంక్‌.. ర‌ష్మిక, విజ‌య్‌ల ఫ‌న్నీ ట్వీట్ల యుద్ధం.. ఉద‌యాన్నే అభిమానుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తింది.


D3XGpKzUEAEBxgj


ట్వీట్ల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఈ పోస్టర్‌లో అద్భుతంగా క‌నిపించింది ర‌ష్మిక‌. బ్యాట్ ప‌ట్టుకొని సీరియ‌స్‌గా కొట్టేందుకు ర‌డీ అయిన పోజులో ఉన్న ఆమెను చూస్తుంటే అభిమానులంతా సినిమాలో త‌న పాత్ర ఎలా ఉంటుందా? అని ఆలోచించేలా చేస్తోందీ పోస్ట‌ర్‌.


D3W kKFWAAAcFX-


మ‌రోవైపు ర‌ష్మిక న‌టిస్తోన్న మ‌రో చిత్రానికి సంబంధించి కూడా పోస్ట‌ర్ విడుద‌ల కావ‌డం విశేషం. ర‌ష్మిక‌, నితిన్‌లు జంట‌గా న‌టిస్తోన్న భీష్మ చిత్ర ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ర‌ష్మిక‌కి సంబంధించిన పెయింటింగ్‌తో కూడిన పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. తాజాగా నితిన్ పుట్టిన‌రోజుకి కూడా ఇలాంటిదే పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌డం విశేషం. ఈ పోస్టర్ చూసి కూడా త‌నదైన రీతిలో స్పందించింది ర‌ష్మిక‌.


"నేను ఈ రోజు కొత్త కొత్తవి చూస్తున్నా. అవ‌న్నీ నాకు బాగా న‌చ్చుతున్నాయి. నాకు కొత్త‌గా శుభాకాంక్ష‌లు చెప్పిన వెంకీ కుడుముల గారికి ధ‌న్య‌వాదాలు. మ‌రి, నితిన్‌.. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మీ విషెస్ నాకు ఎందుకు క‌నిపించట్లేదు.." అని జోక్ వేస్తూ.. నాకోసం కూడా ఇలాంటిది చేయ‌డం నాకు ఎంతో ఆనందాన్ని అందిస్తోంది అంటూ ట్వీట్ చేసింది ర‌ష్మిక‌.


ఈ అందాల భామ ఈ రెండు చిత్రాల‌తో పాటు త‌మిళంలోనూ త‌న మొద‌టి సినిమాలో న‌టిస్తోంది. కార్తీ స‌ర‌స‌న బ‌క్య‌రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌కుడిగా రూపొందుతున్న సినిమాతో త‌మిళంలో అడుగుపెడుతోన్న ర‌ష్మిక.. ఆ త‌ర్వాత విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో శివ‌కార్తికేయ‌న్ న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ సినిమాలో కూడా క‌థానాయిక‌గా క‌నిపించ‌నుంది.


ఈ అందాల తార‌కి మ‌న‌మూ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెప్పేద్దామా మ‌రి..


ఇవి కూడా చ‌ద‌వండి.


మ‌జిలీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చై-సామ్ ఆడిన ఈ గేమ్స్ చూశారా?


న‌య‌న‌తార ఒక్క‌రే కాదు.. వీరంతా డ్యుయెల్‌ రోల్స్ లో అద‌ర‌గొట్టిన వారే..!


ఈ మోడ్ర‌న్ సీతతో అంత వీజీ కాదండోయ్‌..ఎందుకంటే త‌ను శూర్ఫ‌ణ‌క లాంటిది!