‘నిను వీడని నీడను నేనే’ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన మరో నటి అన్యా సింగ్ (Anya Singh). వెంకటాద్రి టాకీస్ పతాకంపై ఇటీవలే విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన చిత్ర హీరోయిన్.. అన్యా సింగ్ ప్రేక్షకులతో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తొలి రోజు షో చూశాక.. ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించామని తెలిపారామె.
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన… బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్ నటిస్తోందా.
కానీ తనను ఎక్కువమంది ప్రేక్షకులు గుర్తుపట్టలేదని తెలిపారు అన్యా సింగ్. కేవలం ఒక సినిమా మాత్రమే చేయడంతో ప్రేక్షకులు తనను గుర్తుపట్టుండకపోవచ్చని.. కాకపోతే సినిమా గురించి వారు పాజిటివ్‌గా మాట్లాడడం చూసి ఆనందం వేసిందని మాత్రం ఆమె తెలిపారు. దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలుగా తెరకెక్కిన ‘నిను వీడని నీడను నేనే’ చిత్రంలో.. సందీప్ కిషన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే హీరో ప్రభాస్ ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.
టాలీవుడ్ మేటి కథానాయికల.. తొలి చిత్రాల ముచ్చట్లు మీకోసం
బాలీవుడ్‌లో ఖైదీ బ్యాండ్, లెక్స్ టాలియోనిస్ చిత్రాలలో నటించిన అన్యా సింగ్.. తొలి చిత్రంతోనే యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ ద్వారా పరిశ్రమకు పరిచమయ్యారు. తర్వాత అదే బ్యానరుతో మూడు సినిమాలు సైన్ చేశారామె. కానీ ఖైదీ బ్యాండ్ ఫ్లాప్ అవ్వడంతో.. ఆ సినిమాలు పట్టాలెక్కలేదు. ఆదిత్య చోప్రా “ఖైదీ బ్యాండ్” ప్రొడ్యూసర్‌గా ఆ సినిమాకి తొలుత కొత్త హీరోయిన్ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆడిషన్స్ నిర్వహించి.. వందలాది మంది అమ్మాయిలను చూశారు. వారిలో అన్యా సింగ్‌ను ఎంపిక చేశారు.
కార్తిక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన “నిను వీడని నీడను నేనే” చిత్రానికి.. తమన్ సంగీత దర్శకత్వం వహించారు. పీకే వర్మ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకోగా.. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. వెన్నెల కిషోర్, పోసాని, మురళీ శర్మ మొదలైనవారు ఇతర పాత్రలలో నటించారు. అన్యా సింగ్ నటించిన “ఖైదీ బ్యాండ్” సినిమా చూశాక.. ఆమె నటన నచ్చి దర్శకుడు కార్తీక్ రాజ్.. తనను ఈ సినిమాకి హీరోయిన్‌గా బుక్ చేశారట.
రామ్ చరణ్ సరసన “RRR”లో నటించబోయే.. హీరోయిన్ ఈమేనా..?
అయితే తను నటించిన తొలి తెలుగు సినిమా విడుదలయ్యాక.. మార్నింగ్ షో రిపోర్టు విన్నానని.. సినిమా గురించి నెగటివ్ కామెంట్స్ వచ్చాయని.. అవి విన్నాక తానెంతో బాధపడ్డానని తెలిపారు అన్యా. అందుకే వెంటనే తన హోటల్‌కి వెళ్లి ఫోన్ స్విచ్చాఫ్ చేసి నిద్రపోయానని తెలిపారామె. కానీ.. సాయంత్రానికి తన సినిమా హిట్ అయ్యిందని రిపోర్టు వచ్చిందని.. అలాగే నిర్మాతలు తనను సక్సెస్ మీట్‌లో పాల్గొనమని చెప్పినప్పుడు సంతోషించానని తెలిపారు అన్యా సింగ్.
అన్యా సింగ్ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చారట. అంతకు ముందు ఆమె వెడ్డింగ్ ప్లానరుగా కూడా కొన్నాళ్లు పనిచేశారట. అలాగే సైకాలజీ చదువుకున్నారు. ఆమె బాల్యంలో ఎక్కువ శాతం అజ్మీర్, ఢిల్లీ ప్రాంతాల్లోనే గడిచిందట. ఆమె ఎంతో కష్టపడి బాలీవుడ్‌లో తన ప్రతిభను నిరూపించుకోవాలని ప్రయత్నించారు. అయితే ఇదే క్రమంలో ఆమెకు దక్షిణాదిలో.. అదీ తెలుగు సినిమాలో ఛాన్స్ రావడంతో ఇక్కడ కూడా తన లక్ పరీక్షించుకోవాలని భావించడం విశేషం.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది