టాలీవుడ్ " మల్లీశ్వరి".. బాలీవుడ్ "స్టార్ హీరోయిన్" కత్రినా బర్త్‌డే స్పెషల్ ..!

టాలీవుడ్ " మల్లీశ్వరి"..  బాలీవుడ్ "స్టార్ హీరోయిన్" కత్రినా బర్త్‌డే స్పెషల్ ..!

కత్రినా కైఫ్ (katrina kaif)  ప్రసుత్తం బాలీవుడ్ టాప్ కథానాయికల్లో ఒకరు. తన కెరీర్‌ తొలినాళ్లలో మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి తెలుగు సినిమాల్లో నటించిన ఆమె ఆ తర్వాత.. హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్‌గా ఎదిగింది. నమస్తే లండన్, పార్టనర్, వెల్‌కమ్, రేస్, న్యూయార్క్, జిందగీ నా మిలేగీ దొబాారా, ఏక్ థా టైగర్ లాంటి చిత్రాలు ఆమెకు హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని కట్టబెట్టాయి. ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా తన గురించి ఈ కథనం ప్రత్యేకం.

మీకో విషయం తెలుసా..! కత్రినా కైఫ్‌కి తొలుత హిందీ వచ్చేది కాదట. ఆమె తల్లి ఓ ఇంగ్లీష్ మహిళ. తండ్రి కాశ్మీరీ. చిన్నప్పటి నుండీ ఆమె హాంగ్‌కాంగ్‌లోనే పుట్టి పెరిగారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చాకే పూర్తి స్థాయిలో హిందీ నేర్చుకున్నారు. కత్రినా తండ్రి చిన్నప్పుడే.. ఆమె తల్లితో విడాకులు తీసుకున్నారు. కత్రినాకి ఆరుగురు సోదరీమణులు ఉన్నారు. అందులో కత్రినా మార్గంలో నడిచి యాక్టింగ్, మోడలింగ్ వైపు అడుగులు వేసింది కేవలం ఇసబెల్లా ఒక్కరే. 

మహేష్ బాబుతో 'స్పై' థ్రిల్లర్ చేయాలని ఉంది: హాలీవుడ్ స్టార్ బిల్ డ్యూక్

కత్రినా కైఫ్ తాను తెలుగులో నటించిన "మల్లీశ్వరి" చిత్రానికి తీసుకున్న పారితోషికం అక్షరాలా రూ.75 లక్షలు. అప్పట్లో తెలుగులో ఆ స్థాయి పారితోషికం తీసుకున్న తొలి హీరోయిన్ ఆమే కావడం విశేషం. హిందీలో ఆమె నటించిన "మైనే ప్యార్ క్యో కియా" సినిమా విడుదల అయ్యాక.. ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమె ఖాతాలో వరుస హిట్లు నమోదయ్యాయి. 'నమస్తే లండన్' చిత్రంలో నటనకు గాను కత్రినా.. ఉత్తమ నటిగా ఐఫా అవార్డు కూడా కైవసం చేసుకుంది.

రామ్ చరణ్‌ సరసన "RRR"లో నటించబోయే.. హీరోయిన్ ఈమేనా..?

 

కత్రినాకి ఆధ్యాత్మిక చింతన కూడా చాలా ఎక్కువ. తన సినిమా విడుదల అవుతుందంటే చాలు.. మౌంట్ మేరీ చర్చికి, అజ్మీర్ దర్గాకి, ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేయడం ఆమెకి అలవాటు. అలాగే తన తల్లి పేరు మీద ఒక స్వచ్ఛంద సేవా సంస్థను కూడా కత్రినా నడుపుతున్నారు. ఆ సంస్థ ద్వారా పేద బాలికలకు విద్యాబోధన చేయడం..  అనాథ పిల్లలను అక్కున చేర్చుకోవడం చేస్తున్నారు. 2011లో సల్మాన్, కత్రినాలు డేటింగ్ చేశారని వార్తలు వచ్చాయి. 

ఈ టాలీవుడ్ బ్యూటీస్.. పెంపుడు జంతువులు అంటే ప్రాణమిస్తారు..

అలాగే కత్రినాకి ఇండియాలో ఎలాంటి ఆస్తులూ లేవట. ముంబయిలోని బాంద్ర ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడే ఆమె నివసిస్తున్నారట. బాలీవుడ్‌లో ఖాన్ త్రయంతో (షారుఖ్, సల్మాన్, అమీర్).. కలిసి నటించిన అతి తక్కువమంది కథానాయికల్లో కత్రినా కూడా ఒకరు. కాజోల్, మాధురీ దీక్షిత్‌లు కత్రినా అమితంగా ప్రేమించే నటీమణులు. సినిమాల్లో సంపాదించిన దానికంటే.. ప్రకటనల ద్వారా కత్రినా ఎక్కువ సంపాదించారట. ఒక్క ప్రకటనకు ఆమె తీసుకొనే సగటు మొత్తం దాదాపు రూ.5 కోట్లు.

కత్రినా కొన్నాళ్లు రణ్‌బీర్ కపూర్‌తో.. డేటింగ్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. కత్రినాని ఆమె అభిమానులు ముద్దుగా క్యాట్ అని పిలుచుకుంటారు. అయితే ఆ పదమంటేనే తనకు అసలు ఇష్టముండదని కత్రినా కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పడం గమనార్హం. కథనాయికగానే కాకుండా.. ఐటమ్ సాంగ్స్ చేయడంలో కూడా కత్రినాది ప్రత్యేకమైన పంథా. ఆమె చేసిన ప్రతీ ఐటమ్ సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్టే. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "సూర్యవంశీ" చిత్రంలో నటిస్తున్నారు కత్రినా.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.