రహస్య వివాహం చేసుకున్న.. "గ్రీకువీరుడు" హీరోయిన్ పూజా బాత్రా ..!

రహస్య వివాహం చేసుకున్న.. "గ్రీకువీరుడు" హీరోయిన్ పూజా బాత్రా ..!

సిసింద్రీ, గ్రీకువీరుడు మొదలైన తెలుగు సినిమాల్లో నటించిన బొంబాయి భామ పూజా బాత్రా (Pooja Batra) గుర్తున్నారా..? పలు తమిళ, తెలుగు చిత్రాలతో పాటు బాలీవుడ్ చిత్రాలలో నటించిన ఈమె.. 1993లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని కూడా కైవసం చేసుకుంది. కమల్ హాసన్ నటించిన "క్షత్రియ పుత్రుడు" చిత్రాన్ని.. హిందీలో రీమేక్ చేయగా.. అందులో ఆమె పోషించిన పాత్రకు గాను స్క్రీన్ అవార్డు కూడా గెలుచుకుంది. నాలుగు పదులు వయసు దాటిన ఈమె.. ఇటీవలే రహస్యంగా పెళ్లి చేసుకుంది.

తన సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నానని.. తర్వాతలోనే తన మ్యారేజ్‌ను కూడా రిజిస్టర్ చేయిస్తానని తెలిపిందామె. వివరాల్లోకి వెళితే.. గత అయిదు నెలల నుండి నవాబ్ షా అనే నటుడితో డేటింగ్‌లో ఉందామె. జులై 4వ తేదిన ఢిల్లీలో వీరిద్దరూ సీక్రట్ వెడ్డింగ్ చేసుకున్నారు. వివాహమయ్యాక.. ఈ వార్త నిజమేనని పూజా కూడా పలు పత్రికలకు తెలపడం గమనార్హం. ఆర్య సమాజ్ వేదికగా తామిరువురం వివాహం చేసుకున్నామని.. ఆ విధంగా ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నామని పూజా తెలిపింది. 

ప్రేమ వివాహం.. ప్రేమతో మీకు నేర్పించే విషయాలు ఇవే..

అయితే పూజాకి ఇదే తొలి వివాహం కాదు. గతంలో ఆమె సోనూ అహ్లువాలియా అనే ఆర్థోపెడిక్ సర్జన్‌ని వివాహమాడింది. 2002లో వారి పెళ్లి జరిగింది. కానీ కొన్ని అభిప్రాయ భేదాల వల్ల ఈ జంట 2011లో విడిపోయారు. ప్రస్తుతం నవాబ్ షాని రెండవ వివాహం చేసుకుంది పూజ. లిరిల్ యాడ్ ద్వారా పూజా అప్పట్లో.. దేశమంతా ఫేమస్ అయ్యారు. ఆమె తల్లి నీలమ్ బాత్రా కూడా మోడలింగ్ రంగంలో  నిష్ణాతులు. 1971లో జరిగిన మిస్ ఇండియా పోటీలలో ఆమె కూడా పాల్గొన్నారు. 

 

విరాసత్, భాయ్, సాజిష్, హసీనా మాన్ జాయేగీ, నాయక్, తలాష్, పర్వానా, మిర్రర్ గేమ్, తాజ్ మహల్, ఫర్జ్ మొదలైన సినిమాలు పూజాకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. 18 ఏళ్ల వయసులోనే మిస్ ఏషియా పసిఫిక్ పోటీల్లో పాల్గొన్న ఆమె.. అక్కడ థర్డ్ రన్నరప్‌గా నిలిచింది. స్కూలులో చదువుతున్న రోజుల్లో పూజా మంచి అథ్లెట్ కూడా. ఆమె బాల్యంలో ఎక్కువ భాగం లుథియానాలోనే గడిచింది. పూణెలోని సింబయోసిస్ ఇనిస్టిట్యూట్ నుండి ఎంబీఏ డిగ్రీ కూడా పూజ పొందడం విశేషం. 

పెళ్లికి సిద్ధమయ్యేందుకు.. ఈ వధువులిచ్చే సలహాలు ఎంతో తోడ్పడతాయి..!

ఇక పూజ ప్రస్తుతం పెళ్లి చేసుకున్న వ్యక్తి నవాబ్ షా విషయానికి వస్తే.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా హిందీ సినిమా ఆడియన్స్‌కు ఆయన బాగా సుపరిచితుడు. బాగ్ మిల్కా బాగ్ చిత్రంలో పాకిస్తాన్ అథ్లెట్ కోచ్‌గా నటించిన నవాబ్ అంతకు క్రితం.. కార్టూస్, సర్ఫరోష్, డాన్ 2 లాంటి చిత్రాలలో కూడా నటించారు. ఇటీవలే టైగర్ జిందా హై. దిల్ వాలే, హమ్ షకల్స్ లాంటి చిత్రాలలో కూడా నటించారు. వెబ్ సిరీస్ 'సేక్రెడ్ గేమ్స్' తనకు ఎంతగనో పేరు తీసుకొని వచ్చింది. 

అంబానీ ఇంట పెళ్లికి.. ఆకాశం దిగి వచ్చి మబ్బుల పందిరేసింది...!

దేవీపుత్రుడు, డిక్టేటర్ లాంటి తెలుగు చిత్రాలలో కూడా నటించారు నవాబ్ షా. అలాగే గజేంద్ర, బోస్, యాన్, దర్బార్ లాంటి తమిళ చిత్రాలలో కూడా పలు పాత్రలు పోషించారు. దూరదర్శన్‌లో అనేక సంవత్సరాలు హిట్ సీరియల్‌గా నడిచిన 'శక్తిమాన్'లో నవాబ్ పోషించిన ప్రొఫెసర్ జేజే పాత్ర కూడా అప్పట్లో మంచి ప్రశంసలను పొందింది. ఇటీవలే "కోటిగుబ్బ" అనే కన్నడ చిత్రంలో కూడా నటించారు నవాబ్ షా.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది